Bukke Dharma Naik IIS

Bukke Dharma Naik IIS Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bukke Dharma Naik IIS, Media/News Company, rayachoti, Rayachoti.

https://youtu.be/WRSa41Pbb_c?feature=shared
02/03/2024

https://youtu.be/WRSa41Pbb_c?feature=shared

Central bureau of communication Field Publicity officer శ్రీ B.ధర్మనాయక్ గారితో పరిచయం.పరిచయకర్త: CH.మోహన్ దాస్ గారు

13/05/2023

అమ్మ’ లేకపోతే జననం లేదు.. ‘అమ్మ’ లేకపోతే గమనం లేదు.. ‘అమ్మ’ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు.. ‘అమ్మ’ లేకపోతే అసలు సృష్టే లేదు.. బిడ్డలకు ఆది గురువై.. సేవాతత్వానికి నిలువెత్తు నిదర్శనమై.. జీవితాంతం పిల్లల సంతోషం కోసం శ్రమించే దేవత అమ్మ.. తల్లులందరికీ అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

పత్రికా ప్రకటన*👉🏻జగనన్న కాలనీలలో లబ్దిదారులందరూ...త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలి**👉🏻లబ్దిదారులకు అవసరమైన సదుపా...
13/05/2023

పత్రికా ప్రకటన

*👉🏻జగనన్న కాలనీలలో లబ్దిదారులందరూ...త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలి*

*👉🏻లబ్దిదారులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలి*

*👉🏻కంటేవారిపల్లి జగనన్న కాలనీ లేవుట్ లో జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్*

*కురబలకోట, మే 13*

*జగనన్న కాలనీలలో లబ్దిదారులందరూ...త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ అన్నారు.*

*శనివారం అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, కంటేవారిపల్లి జగనన్న కాలనీ లేవుట్ లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.*

*కంటేవారిపల్లి జగనన్న కాలనీ లే అవుట్ లో మొత్తం ఎన్ని ఫ్లాట్లు, ఎన్ని ఇల్లు మంజూరు చేశారు వంటి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీలో లబ్దిదారులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. లబ్దిదారులందరని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేర్చి ప్రభుత్వం తరఫున సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు.*

*కలెక్టర్ గారితో పాటు మదనపల్లి ఆర్డీఓ మురళి, ఎంపీడీఓ, తహసీల్దార్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

*----Issued by PRO, Annamayya Dist----*

పత్రికా ప్రకటన*👉🏻ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ లో సాహసక్రీడలు ఏర్పాటుకు చర్యలు తీసుకోండి**👉🏻పర్యాటకులు కోసం ట్ర...
13/05/2023

పత్రికా ప్రకటన

*👉🏻ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ లో సాహసక్రీడలు ఏర్పాటుకు చర్యలు తీసుకోండి*

*👉🏻పర్యాటకులు కోసం ట్రెక్కింగ్‌ తదితర కార్యక్రమాలు*

*👉🏻హార్సిలీహిల్స్‌ ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్*

*హార్సిలీహిల్స్‌, మే 13:-*

*అన్నమయ్య జిల్లాలో ఏకైక పర్యాటక కేంద్రంగా ఆంధ్రా ఊటీగా విరాజిల్లుతున్న హార్సిలీహిల్స్‌ లో సాహసక్రీడలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ ఆదేశించారు.*

*శనివారం ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ ను సందర్శించి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు.*

*ఈ సందర్భంగా ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ లో సాహస క్రీడలు ఏర్పాటుకు అనువుగా ఉందా లేదా అని నిపుణులతో కలిసి పరిశీలించారు. ఏటీవీ వెహికల్స్, రాప్లింగ్, పర్యాటకులు కోసం ట్రెక్కింగ్‌ తదితర కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యచరణ చేయాలని అధికారులను ఆదేశించారు. హార్సిలీహిల్స్‌ మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొండకు వచ్చే పర్యాటకులు విడిది చేయడానికి వీలుగా అనువైన సౌకర్యాలతో పాటు, చిన్న పిల్లలు ఆడుకునేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చే అతిథులకు అందించే సౌకర్యాలు, సేవలు సందర్శకులను ఆకట్టుకునేలా మరింత అభివృద్ధి చేయాలన్నారు.*

*కలెక్టర్ గారితో పాటు మదనపల్లి ఆర్ డిఓ మురళీ, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

*----Issued by PRO, Annamayya District----*

*సక్సెస్ స్టోరీ**అన్నమయ్య జిల్లా**రాయచోటి**తేదీ : 13-05-2023**★ శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు**★ పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర...
13/05/2023

*సక్సెస్ స్టోరీ*

*అన్నమయ్య జిల్లా*
*రాయచోటి*

*తేదీ : 13-05-2023*

*★ శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు*

*★ పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో నాలుగో స్థానంలో అన్నమయ్య జిల్లా*

*★ ఇంతవరకూ 20,946 ఇళ్లు పూర్తి*

*★ వివిధ దశల్లో 52,490 ఇళ్లు*

*★ 502 లేఅవుట్లలో చేపట్టిన నిర్మాణాలు*

*★ రూ.606.01 కోట్ల బిల్లులు చెల్లింపు*

*★ మరింత వేగంగా నిర్మాణాలు చేపట్టడానికి ప్రతి శనివారం ‘హౌసింగ్‌ డే’*

*★ లక్ష్యం నిర్ణయించుకొని వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు*

*రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో పేదల సొంతింటి కల సాకారమవుతోంది. అన్నమయ్య జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలో 502 లేఅవుట్లలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. సొంత స్థలం కలిగిన వారు ప్రభుత్వం సాయంతో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి చేసుకుని సొంతింటికి చేరి తమ కల నేరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 502 లేఅవుట్లుగా చేసి 79,661 మందికి ఇళ్లు మంజూరు చేశారు. అందులో 73,436 మంది లబ్దిదారులు రిజిస్ట్రార్ చేసుకున్నారు. ఇంకా 5898 మంది లబ్దిదారులు రిజిస్ట్రార్ చేసుకోవాల్సి ఉంది. ఇంతవరకు 20,946 వేల ఇళ్లు పూర్తి చేయగా వాటిలో 20,946 వేల వరకు గృహ ప్రవేశాలు జరిగాయి. ఇళ్ల నిర్మాణంలో అన్నమయ్య జిల్లా ఉత్తమ పనితీరుతో రాష్ట్రంలోనే నాలుగవ స్థానంలో నిలుస్తోంది*.

*పుంజుకున్న నిర్మాణాలు...వివిధ దశల్లో 52,490 ఇళ్లు :-*

ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, వాతావరణం కూడా సహకరిస్తుండటంతో ఇళ్ల నిర్మాణాలు పుంజుకున్నాయి. 'నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కరెంటు, నీటిసరఫరా కనెక్షన్లు ఇప్పటికే ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు ఇస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా శ్లాబ్‌, సన్‌డైన్‌, బేసిమెంట్‌ తదితర దశల నిర్మాణాల్లో 52,490 ఇళ్లు ఉన్నాయి. ఎన్.ఎస్ దశలో 938, బిలో బేస్‌మెంట్‌ లెవెల్ 20,294, బేస్‌మెంట్‌ లెవెల్‌ 21,177, ఇళ్లు ఉన్నాయి. రూఫ్‌ లెవెల్లో 6899, స్లాబ్‌ లెవెల్లో 3,182 ఇళ్లు ఉన్నాయి. కలెక్టర్‌ గిరీషా పిఎస్ జిల్లాలోని జగనన్న లేఅవుట్‌లో ఇళ్లు నిర్మాణం వేగంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు హౌసింగ్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలో పెద్ద ఎత్తున గృహప్రవేశలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

*మా జీవితాలకు భరోసా ఇచ్చిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి :-*

నా పేరు షేక్ మహమ్మద్ అలీ రాయచోటి నారాయణరెడ్డి పల్లి జగనన్న లేఅవుట్ కాలనీలో ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశం అయ్యాను. నేను ఇంతకు ముందు రాయచోటిలో అద్దె గది కోసం రూ.5 వేలు చెల్లింపు చేసే వాడిని. ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తమకు ఇచ్చిన ఇంటి స్థలం నేడు లక్షల రూపాయల ఆస్తిగా నిలిచింది. విలువైన స్థలాలను ఉచితంగా అందించి మాలాంటి పేదల జీవితాలకు భరోసా ఇచ్చిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. *-మహమ్మద్ అలీ షేక్, నారాయణరెడ్డి పల్లి జగనన్న లేఅవుట్ కాలనీ రాయచోటి, అన్నమయ్య జిల్లా.*

*అద్దె ఇంటి బాధలు తీరయి :-*

నా పేరు వేమల్ల సుబ్బమ్మ నారాయణరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాలనీ రాయచోటిలో నివాసం ఉంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి సెంటు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ధర పలికే విలువైన స్థలాలను ఉచితంగా అందించారు. మా జీవితాలకు భరోసా ఇచ్చిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. నేను ఇటీవలే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాను. ఇంటి బాధలు తీరుతున్నాయని అద్దె ఇంటి నుంచి సొంతింటికి చేరాను. *-వేమల్ల సుబ్బమ్మ, జగనన్న లేఅవుట్ కాలనీ రాయచోటి, అన్నమయ్య జిల్లా.*

*రోజువారీ లక్ష్యాలు ఇస్తున్నాం :-*

ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. మండలాల వారీగా రోజువారీ లక్ష్యాలను ఇస్తున్నాం. వెనుకబడిన మండలాలపై ప్రత్యేకదృష్టి పెడుతున్నాం. స్వయంగా వెళ్లి నిర్మాణాలు ఆలస్యం అవడానికి కారణమైన సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నాం. హౌసింగ్‌ డే రోజున పథకంతో ముడిపడి ఉన్న అధికారులు రెండు లేఅవుట్‌లు సందర్శించాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. లేఅవుట్లలో మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.*-అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్.*

*----Issued by PRO, Annamayya District----*q

పత్రికా ప్రకటన*👉🏻ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి**👉🏻లే అవుట్ వెళ్లేందుకు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి**👉🏻అధికారులను ...
13/05/2023

పత్రికా ప్రకటన

*👉🏻ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి*

*👉🏻లే అవుట్ వెళ్లేందుకు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి*

*👉🏻అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్*

*బి.కొత్తకోట, మే 13:-*

*నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు.*

*శనివారం బి.కొత్తకోట మండలం కురవానికుంట జగనన్న కాలనీ లేవుట్ ను జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ పరిశీలించారు. లేఅవుట్ లో ఎన్ని ఇల్లు మంజూరు, ఎన్ని ఇళ్లు పూర్తి, ఏ ఏ దశలో ఉన్నాయి తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని పేదల ఇళ్ల కల సాకారం అయ్యేలా మౌలిక వసతులు కల్పించి త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలన్నారు. లేవుట్ వెళ్లేందుకు రోడ్డు బాగా లేకపోవడంతో త్వరగా రోడ్డు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు*.

*కలెక్టర్ గారితో పాటు మదనపల్లి ఆర్ డిఓ మురళి, హౌసింగ్, రెవెన్యూ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.*

*చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం - రైతన్నలో  వెళ్లివిరిసిన ఆనందం....*  *......మనోభావాలు.....**చాలా ఇబ్బందులు పడ్...
12/05/2023

*చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం - రైతన్నలో వెళ్లివిరిసిన ఆనందం....*

*......మనోభావాలు.....*

*చాలా ఇబ్బందులు పడ్డా :-*

నా పేరు బొజ్జ చంగల్ రెడ్డి, రాయచోటి మండలం, బోట్ల చెరువు గ్రామంలో నివసిస్తున్నాను. మా ఊర్లో సర్వేనెంబర్ 62.ఏ1లో 70 సెంట్ల భూమి చుక్కల భూముల పడింది. దీంతో ఏళ్ల తరబడి చాలా ఇబ్బందులు పడ్డా. జగనన్న మా పాలిట దేవుడు లాగా చుక్కల భూమికి శాశ్వత పరిష్కారం చూపడం నా కుటుంబం అంతా జగనన్నకు రుణపడి ఉంది.*-బొజ్జ చంగల్ రెడ్డి, బోట్ల చెరువు గ్రామం, రాయచోటి మండలం, అన్నమయ్య జిల్లా.*

*చాలా ఆనందంగా ఉంది :-*

మా ఊర్లో సర్వేనెంబర్ 62.ఏ1లో 1.07 సెంట్ల భూమి చుక్కల భూముల పడింది. మా భూములన్నీ ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ ప్రతి రైతన్న కుటుంబానికి మేలు జరగాలని, వారి ఆస్థిపై పూర్తి హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్కారం చూపారు. చాలా ఆనందంగా ఉంది. *-బి. నారాయణ రెడ్డి, బోట్ల చెరువు గ్రామం, రాయచోటి మండలం, అన్నమయ్య జిల్లా.*

*ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు :-*

వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో చుక్కల భూముల సమస్యలున్న రైతులను ఆదుకుంటారని చెప్పారు. నాకు గ్రామంలో సర్వేనెంబర్ 347/1 లో విస్తీర్ణం 0.15 సెంట్ల భూమి చుక్కల భూమి కలదు. ఈ రోజు చుక్కల భూమికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న శాశ్వత పరిష్కారం చూపారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ సమస్య పరిష్కారం కావడం చాలా సంతోషం ఉంది. *-పాఠాన్ రెహమత్ బీ, సిబ్యాల గ్రామం, రాయచోటి మండలం, అన్నమయ్య జిల్లా.*

*మా ఆస్థిపై పూర్తి హక్కులు :-*

చుక్కల భూములు వల్ల సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా ఆ భూములు అనుభవిస్తున్నా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక, సర్వ హక్కులు లేక ఇబ్బంది పడుతున్న దుస్థితి. మా గ్రామంలో ఉన్న 27 సెంట్లు భూమిని ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పరిష్కారం చెప్పారు. మా ఆస్థిపై పూర్తి హక్కులు వచ్చాయి. ఈ భూములను సర్వ హక్కులతో క్రయ విక్రయాలకు, రుణాలు పొందడానికి, తనఖా పెట్టుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కల్పించింది. *-చిన్నక్క, మాధవరం గ్రామం, రాయచోటి మండలం, అన్నమయ్య జిల్లా.*

*----Issued by PRO, Annamayya District----*

పత్రికా ప్రకటన*👉🏻జిల్లా వ్యాప్తంగా 30,525 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ 28,882.29 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణహక్కు**👉🏻...
12/05/2023

పత్రికా ప్రకటన

*👉🏻జిల్లా వ్యాప్తంగా 30,525 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ 28,882.29 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణహక్కు*

*👉🏻చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం*

*👉🏻జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్*

*రాయచోటి, మే 12:-*

జిల్లా వ్యాప్తంగా 30,525 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ 28,882.29 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ తెలిపారు.

శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు కావలి వేదిక నుంచి దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడుతూ.. చుక్కల భూముల చిక్కులకు జగనన్న ప్రభుత్వం శాశ్వత పరిష్కారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ 2,06,171 ఎకరాల చుక్కల భూములకు..సంపూర్ణహక్కును అందించే బహత్కర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నుంచి జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్, డిఆర్ ఓ సత్యనారాయణ, రాయచోటి ఆర్ డిఓ రంగస్వామి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అన్నమయ్య జిల్లాలో చుక్కల భూములకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 30,525 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ 28,882.29 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణహక్కుతో రూ.579.832 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన భూములకు పూర్తి హక్కులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడుతూ...చుక్కల భూముల చిక్కులకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించి రైతన్నలకు సర్వ హక్కులూ కల్పించిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ భూములను సర్వ హక్కులతో క్రయ విక్రయాలకు, రుణాలు పొందడానికి, తనఖా పెట్టుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కల్పించిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సర్వ హక్కులు కూడా లభించేలా నిషేధిత భూముల జాబితా నుండి తొలగింపు జరిగిందన్నారు.

*----Issued by PRO, Annamayya District----*

పత్రికా ప్రకటన*👉🏻'జగనన్నకు చెబుదాం'తో మరింత బాధ్యత**👉🏻వినతులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడమే 'జగనన్నకు చెబుదాం' కార్...
10/05/2023

పత్రికా ప్రకటన

*👉🏻'జగనన్నకు చెబుదాం'తో మరింత బాధ్యత*

*👉🏻వినతులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడమే 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమ ప్రధాన లక్ష్యం*

*👉🏻1902కి వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యం*

*👉🏻ప్రత్యేక పర్యవేక్షణ కోసం డిస్ట్రిక్ట్ ఆడిట్ టీమ్, పీఎంయు యూనిట్ ల ఏర్పాటు*

*👉🏻ఎస్ఎంఎస్ ద్వారా స్పందన అర్జీ స్టేటస్ సమాచారం*

*👉🏻జిల్లాలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి*

*👉🏻పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్*

*రాయచోటి, మే 10:-*

'జగనన్నకు చెబుదాం' కార్యక్రమం ద్వారా ప్రజల అర్జీల పరిష్కార విధానంలో మరింత బాధ్యత పెరిగిందని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ తెలిపారు.

బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ లో "జగనన్నకు చెబుదాం" అనే కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్, జిల్లా ఎస్పీ గంగాధరరావు సంయుక్తంగా కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.

*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ మాట్లాడుతూ*....దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం "జగనన్నకు చెబుదాం" అనే మరో కొత్త కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారన్నారు. వినతులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడమే 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమ ప్రధాన లక్ష్యం అన్నారు. జేకేసి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఉండడంతో మరింత బాధ్యతతో పాటుగా జవాబుదారీతనం కూడా పెరిగిందన్నారు. 1902కి వచ్చే ఫిర్యాదుల విషయంలో అత్యంత శ్రద్ధ చూపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. అర్జీల ద్వారా పరిష్కారానికి సాధ్యం కాని సమస్యలను "జగనన్నకు చెబుదాం" కార్యక్రమం ద్వారా 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసి వేగవంతమైన, నాణ్యమైన పరిష్కారాన్ని పొందవచ్చన్నారు. ప్రత్యేకంగా నియమించిన సీనియర్ లెవెల్ ఐఏఎస్ అధికారులు నెలకు రెండు పర్యాయాలు జిల్లాల్లో పర్యటించి ఈ కార్యక్రమం అమలు తీరును పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ వినూత్న ప్రాజెక్టు విధానం ద్వారా నాణ్యమైన, సంతృప్తికరమైన, పారదర్శకమైన పరిష్కారం అందుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా "స్పందన" గ్రీవిన్స్ కార్యక్రమం కంటే బెటర్ గా అర్జీల పరిష్కారం అందుతుందన్నారు. ఇందులో 1902 కాల్స్ స్వీకరణ, ఐవిఆర్ఎస్ ఎస్.ఎం.ఎస్. సందేశంతో.. మల్టిబుల్, ఫీడ్ బ్యాక్, అప్ డేట్ సమాచారం ఎప్పటికప్పుడు.. హెల్ప్ డెస్క్ కంట్రోల్ రూమ్ నుండి అందుతుందన్నారు. ఫోన్ కాల్స్ ద్వారా అందిన ఫిర్యాదులను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీయ పరిశీలనలో.. సీఎంఓ స్థాయి నుండి నేరుగా సచివాలయాల పరిధిలోని ఆయా శాఖల విభాగాల వరకు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో క్షేత్ర స్థాయిలో పరిష్కారాలను చూపడం జరుగుతుందన్నారు.

*"డిస్ట్రిక్ట్ ఆడిట్ టీమ్" :-*

ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచేందుకు గాను.. జిల్లా స్థాయిలో "డిస్ట్రిక్ట్ ఆడిట్ టీమ్" ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ, రాయచోటి ఆర్డిఓ, రాయచోటి ఈఓపీఆర్డి, రాయచోటి డిప్యూటీ తహసిల్దార్ (సివిల్ సప్లై), రాయచోటి ఏరియా హాస్పిటల్ సివిల్ సర్జన్ సభ్యులుగా ఉంటారన్నారు. ఈ టీమ్ ద్వారా.. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను పరిశీలించి, విశ్లేషణ చేయడంతో పాటు..15 రోజులకు ఒకసారి సంబంధిత నివేదికలను తనకు (జిల్లా కలెక్టర్), జిల్లా ఎస్పీకి అందివ్వడం జరుగుతుందన్నారు. తద్వారా ఫిర్యాదుల పరిష్కారం ఎంత మేర జరుగుతుందనేది స్పష్టం అవుతుందన్నారు. ఒకవేళ పరిష్కారం కాకుండానే ఫిర్యాదులను అధికారులు క్లోజ్ చేసినట్లయితే..సంబందిత ఫైల్ ను పై స్థాయి అధికారి తిరిగి ఓపెన్ చేసే రైట్స్ కూడా "డిస్ట్రిక్ట్ ఆడిట్ టీమ్"కు ఉంటుందన్నారు.

*పర్సుయేషన్ మేనేజ్మెంట్ యూనిట్ :-*

డివిజన్ స్థాయిలో అందే ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక పీఎంయును ఏర్పాటుచేసి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జిల్లా స్థాయి ఆడిట్ టీమ్ లాగేపర్సుయేషన్ మేనేజ్మెంట్ యూనిట్ కూడా మండల స్థాయిలో అందే ఫిర్యాదులను డివిజన్ స్థాయిలో.., గ్రామ స్థాయిలో అందే ఫిర్యాదులను మండల స్థాయిలో పరిష్కరించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఇందులో ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్యం, హోమ్ శాఖ, వ్యవసాయ శాఖల అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ యూనిట్ నిరంతరాయ పర్యవేక్షణ ద్వారా.. ఒకే సమస్యను వివిధ శాఖల అధికారుల ప్రమేయంతో పరిష్కార మార్గం దొరుకుతుందన్నారు. ఈ "డిస్ట్రిక్ట్ ఆడిట్ టీమ్", "పర్సుయేషన్ మేనేజ్మెంట్ యూనిట్" ల ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా.. అన్ని శాఖలతో పాటు పోలీసు శాఖ సమన్వయంతో ఫిర్యాదుదారుకు వేగవంతమైన, నాణ్యమైన, పరిష్కారం అందడంతో పాటు.. ఎప్పటికప్పుడు పరిష్కార స్టేటస్ మొబైల్ ఫోన్ కు మెసేజీ ద్వారా అందివ్వడం జరుగుతుందన్నారు. *నిన్నటి రోజు నుంచి 'జగనన్న చెబుదాం' కార్యక్రమానికి 42 ఫిర్యాదులు* అందినట్లు కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.

*15,033 స్పందన అర్జీల పరిష్కారం :*

స్పందన ఫిర్యాదుల కార్యక్రమం ద్వారా అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు 15806 ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందన్నారు. అందులో 15033 ఫిర్యాదులను పరిష్కరించి 96%తో నాణ్యమైన, సంతృప్తికరమైన పరిష్కారాలను అందించి సంబంధిత వివరాలను పోర్టల్ లో పొందుపరచడం జరిగిందన్నారు.

*జిల్లా ఎస్పీ గంగాధర్ రావు మాట్లాడుతూ*.. ప్రజలు తమకు ఎటువంటి సమస్యలు ఎదురైన 1902 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి చెప్పవచ్చునన్నారు. ఇలా నమోదైనా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు. స్పందన కంటే బెటర్ గా అర్జీల పరిష్కారం అందుతుందన్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉంటే 1902 కాల్ కు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. మండల స్థాయిలో ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్యం, హోమ్ శాఖ, వ్యవసాయ శాఖల అధికారులను పీఎంయు యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1902 కాల్ చేసిన ప్రతి ఫిర్యాదు దారికి తన సెల్ ఫోన్ కు పిటిషన్ రిసీవ్ అయినట్లు సమాచారం వెళ్తుందన్నారు. అందువల్ల ఏ స్టేజిలో ఉందో కూడా ఫిర్యాదారుడు తెలుసుకోనే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ సత్యనారాయణ, జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి భరత్ కుమార్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

*----Issued by PRO, Annamayya District----*

*పత్రికా ప్రకటన**వారంలోగా అసైన్మెంట్ భూములు గుర్తింపు వేగంగా పూర్తి చేయాలి**గుర్తించిన భూములకు సంబంధించిన ఫైల్స్ ను వివర...
30/01/2023

*పత్రికా ప్రకటన*

*వారంలోగా అసైన్మెంట్ భూములు గుర్తింపు వేగంగా పూర్తి చేయాలి*

*గుర్తించిన భూములకు సంబంధించిన ఫైల్స్ ను వివరాలతో వెంటనే కలెక్టరేట్ కు పంపాలి*

*రీసర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేయాలి*

రాయచోటి, జనవరి 30:-

రాయచోటి డివిజన్లో వారంలోగా ప్రభుత్వ అసైన్మెంట్ భూములు గుర్తింపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ తాసిల్దార్లను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాయచోటి డివిజన్ కు సంబంధించి అసైన్మెంట్ భూములు, రీ-సర్వే, ఎస్సీ ఎస్టీ కాలనీలలో స్మశాన వాటికలకు స్థలాల గుర్తింపు, క్లరికల్ కరెక్షన్స్ ఆఫ్ మాడ్యుల్స్ డిజిటల్ సిగ్నేచర్ స్టేటస్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయాతో కలిసి ఆర్డీఓ, తహసిల్దార్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... డివిజన్ లోని రామాపురం, గాలివీడు మండలాలలో భూముల గుర్తింపు ప్రగతి బాగుందన్నారు. సంబేపల్లి, ఎల్ ఆర్ పల్లి మండలాలు భూముల గుర్తింపు, ఫైల్స్ రూపొందించే ప్రక్రియ ప్రగతిలో వెనకబడి ఉన్నారని, త్వరితగతిన గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి, ఫైల్స్ సచివాలయానికి సమర్పించాలని ఆయా తసీల్ధార్లను ఆదేశించారు. ఇప్పటివరకు ఎంత భూమిని గుర్తించారు, ఇంకెంత గుర్తించాల్సి ఉంది, మొత్తం ఎన్ని ఫైల్స్ సిద్ధం చేయాలి, ఎన్ని చేశారు, ఇంకను చేయాల్సినవి ఎన్ని తదితర అంశాలలో కలెక్టర్ సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. ఆయా మండలాలలో భూముల గుర్తింపును స్వయంగా పర్యవేక్షణ చేయాలని ఆర్డీఓకు సూచించారు. ప్రభుత్వ భూమి ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని తహసిల్దార్లకు ఉద్భోదించారు. వాగులు, వంకలు, పోరంబోకు స్థలాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మండలంలో గ్రామాల వారీగా.. సర్వేనెంబర్ల వారీగా ప్రభుత్వ భూమిని గుర్తించి నివేదిక పంపాలన్నారు. ఈ విషయంలో అలసత్వం చూపితే సహించేది లేదన్నారు.

రీసర్వే అంశంలో భాగంగా గ్రామాలలో మాడ్యుల్స్ అన్ని పక్కాగా పూర్తి చేయాలని చెప్పారు. గ్రామాల్లో ఒక మాడ్యూల్, రెండు మాడ్యూల్స్ పెండింగ్ లో ఉన్న వాటి సర్వేను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత తాసిల్దార్లను, రీ సర్వే అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రీసర్వే పూర్తయిన గ్రామాలలో ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులపై దృష్టి పెట్టి మరింత మెరుగ్గా రీ సర్వే పనిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. రీ సర్వేలో సాధారణంగా జాయింట్ ఖాతా, డిస్ప్యూట్స్, ఆక్రమణలు, పొజిషన్ మార్పులలో ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయని వాటిని ప్రత్యేక దృష్టితో పరిశీలించి రైతులతో సంప్రదించి పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే గ్రామాలలో ప్రజలకు సమాచారం తెలియడానికి ముందస్తుగా టామ్ టామ్ చేయాలని, రీ సర్వే బృందం ఒకటి, రెండు రోజులు ఆ గ్రామంలోనే ఉండాలన్నారు. తాసిల్దార్లు, ఆర్డీవోలు వారానికి ఒకరోజు రీసర్వే జరుగుతున్న గ్రామాన్ని తప్పకుండా సందర్శించాలన్నారు. రీ సర్వే గ్రామాలలో సమస్యలు పరిష్కరించుకొని త్వరితగతిన భూహక్కుపత్రాలు పంపిణీ చేయాలని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వే గ్రామాలలో రైతులందరికీ నోటీసులు జారీ చేసి సర్వే పూర్తయిన తర్వాత తప్పకుండా రైతులతో సంతకాలు తీసుకోవాలన్నారు. జిల్లాలో స్మశాన వాటికలు లేని ఎస్సీ ఎస్టీ కాలనీలకు వెంటనే స్మశాన వాటికల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలన్నారు. జిల్లాలోని 288 గ్రామాలలో 181.59 ఎకరాలను గుర్తించడం లక్ష్యం అన్నారు. కనీసం 50 సెంట్ల నుంచి ఒక ఎకరా లోపు స్థలాలను గుర్తించి ఆమోదం కొరకు జిల్లా సచివాలయానికి పంపాలని సూచించారు. ఈ ప్రక్రియను కొన్నిచోట్ల పూర్తి చేశారని, మిగిలిన మండలాలలో కూడా త్వరితగతిన స్థలాల గుర్తింపు పూర్తి చేసి ఆమోదం కొరకు పంపించాలన్నారు. ఆమోదించబడిన స్మశాన వాటికల సర్వే నెంబర్లను ఆన్లైన్ చేసి మండలాల వారీగా అడంగల్ కాపీని జిల్లా కేంద్రానికి పంపించాలని చెప్పారు. అనంతరం క్లరికల్ కరెక్షన్స్ ఆఫ్ మాడ్యుల్స్ - డిజిటల్ సిగ్నేచర్ ప్రగతి పై సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో డిఆర్ఓ సత్యనారాయణ, రాయచోటి ఆర్డీఓ రంగస్వామి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి జయరాజ్, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
--------------------------///////----------------
*డిపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా*

పత్రికా ప్రకటన*👉🏻మ్యుటేషన్స్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి**👉🏻విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సర్వే మీద ప్...
30/01/2023

పత్రికా ప్రకటన

*👉🏻మ్యుటేషన్స్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి*

*👉🏻విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సర్వే మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి*

*👉🏻ఆయుష్మాన్ భారత్ కార్డు పెండింగ్ ఉన్న లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి*

*👉🏻జిజిఎంపీలో మంజూరైన పనుల బిల్ల్స్ ను వెంటనే ఆన్లైన్లో చేయండి*

*👉🏻వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్*

*రాయచోటి, జనవరి 30:-*

*మ్యుటేషన్‌ దరఖాస్తుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా పరిష్కరించాలని ఆర్‌డీఓలు, తహసీల్దార్లను కలెక్టర్ గిరీష పిఎస్ ఆదేశించారు.*

*సోమవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మ్యుటేషన్‌ పెండింగ్‌ దరఖాస్తులతో పాటు ఆయుష్మాన్ భారత్ ఈకేవైసీ, గడప గడపకు మన ప్రభుత్వం పనుల పురోగతి తదితర అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో కలెక్టర్ గిరీష పిఎస్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.*

*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...మ్యుటేషన్ దరఖాస్తుల మీద తహసిల్దార్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మ్యుటేషన్‌ కరెక్షన్‌కు సంబంధించి దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఎలోకి వెళ్లకూడదన్నారు. దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. మ్యుటేషన్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. అన్ని గ్రామాలలో ఫీల్డ్ పీఓఎల్ ఆర్ ఖచ్చితంగా పూర్తి చేయాలన్నారు. 90 రోజుల్లో ఇంటి పట్టాలకు సంబంధించి ప్రాపర్ గా పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయాలి అన్నారు. సిటిజన్ ఔట్రీచ్ 33% చేశారని, వాలంటీర్ల ద్వారా చేయించాలని ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సర్వే 75 శాతం చేశారన్నారు. విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ సంబంధించి సర్వే మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సర్వే వంద శాతం పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని సచివాలయాల్లో సిబ్బంది విధిగా బయోమెట్రిక్‌ 100% తప్పకుండా వేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓలను ఆదేశించారు. జిజిఎంపీలో మంజూరైన పనుల బిల్ల్స్ ను వెంటనే ఆన్లైన్లో చేయండి అని ఎంపీడీఓలను ఆదేశించారు. జిజిఎంపి 9 బిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. 11 పనులు ఇంకా ప్రారంభం కావాల్సిందన్నారు. ఆయుష్మాన్ భారత్ కు పెండింగ్ ఉన్న లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ సంబంధించి రైస్ కార్డ్, హౌస్ సైట్ లపై ప్రత్యేక దృష్టి పెట్టి బియాండ్ ఎస్ఎల్ఎ కి వెళ్లకుండా గడువులోగా పరిష్కరించాలన్నారు.*

*ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డిఆర్ ఓ సత్యనారాయణ, ఆర్డీఓ రంగస్వామి, సిపిఓ కృష్ణా నాయక్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి జయరాజ్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.*

*----Issued by PRO, Annamayya District----*

పత్రికా ప్రకటన*👉🏻మూడో ఏడాది జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి :-**👉🏻రజక...
30/01/2023

పత్రికా ప్రకటన

*👉🏻మూడో ఏడాది జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి :-*

*👉🏻రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు ఆర్థిక సాయం :-*

*👉🏻మూడో ఏడాది జిల్లాలోని 12,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి 12,55,10,000 రూపాయలు జమ :-*

*👉🏻జగనన్న చేదోడు మూడో విడత పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోండి :-*

*👉🏻జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా :-*

*రాయచోటి, జనవరి 30 :-*

*జగనన్న చేదోడు పథకం మూడో ఏడాది కింద అన్నమయ్య జిల్లాలోని 12,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి 12,55,10,000 రూపాయలు జమ చేశామని జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు.*

*సోమవారం పల్నాడు జిల్లా, వినుకొండ నుండి "జగనన్న చేదోడు పథకం" మూడో ఏడాది కింద లబ్దిదారుల ఖాతాలోకి జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.*

*అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీస్ట్రిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సందప్ప, విఎస్ డబ్ల్యూఎస్ ఏఓ మనోహర్ రాజు, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు దీన్నేపాడు రవిరాజు, ఏఎస్ డబ్ల్యూఓ కృష్ణయ్య, అధికారులు, టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, తదితరులు పాల్గొన్నారు.*

*ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ....జగనన్న చేదోడు పథకం ద్వారా రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. ఏటా రూ.10 వేలు చొప్పున అందజేస్తున్నాం అన్నారు. లబ్ధిదారులు తమ ఆదాయ వనరులను పెంచడానికి ఇతర నిత్యావసరాల కొనుగోలు కోసం ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోవాలి అన్నారు. ఇది వారి పెట్టుబడి అవసరాలను తీర్చడానికి కూడా సహాయపడుతుంది అన్నారు. జగనన్న చేదోడు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.*

*అనంతరం జగనన్న చేదోడు పథకం సంబంధించి మూడో ఏడాది జిల్లాలోని 12,551 మందికి 12,55,10,000 రూపాయల సంబంధించిన మెగా చెక్కును జేసి చేతుల మీదగా టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులు లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేశారు.*

*---Issued by PRO, Annamayya District----*

పత్రిక ప్రకటన*గాంధీజీ మార్గం అనుసరణీయం : జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్**రాయచోటి, జనవరి 30:-**జాతిపిత మహాత్మ గాంధీ చూపిన మా...
30/01/2023

పత్రిక ప్రకటన

*గాంధీజీ మార్గం అనుసరణీయం : జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్*

*రాయచోటి, జనవరి 30:-*

*జాతిపిత మహాత్మ గాంధీ చూపిన మార్గాన్ని మనమందరం అనుసరించాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ అన్నారు.*

*సోమవారం కలెక్టరేట్ సమీపంలోని మహాత్మ గాంధీ విగ్రహనికి జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డిఆర్ ఓ సత్యనారాయణ, కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.*

*జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... భారత దేశ్ స్వాతంత్ర్యానికి పోరాడిన గొప్ప వ్యక్తి గాంధీజీ అన్నారు. సత్యం, అహింస గాంధీజీ నమ్మే సిద్ధాంతలు అయితే, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలు అన్నారు. నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేస్తూ, అన్ని కులాలు, మతాలు ఒకటి అని వాటి చెప్పిన మహానుభావుడన్నారు.*

*ఈ కార్యక్రమంలో రాయచోటి తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి, కలెక్టరేటులోని అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.*

*-----Issued by PRO, Annamayya District-----*

పత్రికా ప్రకటన*👉🏻ఆసక్తిగా సాగిన కలెక్టర్‌ వర్సెస్‌ ఎస్పీ జట్ల మధ్య క్రికెట్**👉🏻టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కలెక్టర్ ...
29/01/2023

పత్రికా ప్రకటన

*👉🏻ఆసక్తిగా సాగిన కలెక్టర్‌ వర్సెస్‌ ఎస్పీ జట్ల మధ్య క్రికెట్*

*👉🏻టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కలెక్టర్ టీం*

*👉🏻20 ఒవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసిన కలేక్టర్ టీం*

*👉🏻174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ లోకి దిగిన ఎస్పీ టీం*

*👉🏻4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు సాధించి 13 రన్ ల తేడాతో ఒటమిని చవిచూసిన ఎస్పీ టీం*

*👉🏻బ్యాటింగ్‌ చేసి ఆకట్టుకున్న కలెక్టర్, ఎస్పీ*

*👉🏻విజేతగా కలెక్టరేట్‌ జట్టు*

*👉🏻క్రీడలతో మానసిక ఒత్తిడి తగ్గి, శారీరక ధృడత్వం పెరుగుతుంది : జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్*

*రాయచోటి, జనవరి 29:-*

*క్రీడలతో మానసిక ఒత్తిడి తగ్గి, శారీరక ధృడత్వం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ తెలిపారు.*

*కలెక్టర్‌ వర్సెస్‌ ఎస్పీ జట్ల మధ్య ఆదివారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పోలీస్ పెరేడ్ మైదానంలో క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది.*

*ఈ సందర్భంగా కలెక్టర్ టీంకు కలెక్టర్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా ఎస్పీ టీమ్‌కు సంబంధించి ఎస్పీ కెప్టెన్‌గా వ్యవహరించారు. టాస్‌ గెలిచిన కలెక్టర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ క్రికెట్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా కొనసాగింది. మొదటగా కలెక్టర్‌ టీం బ్యాటింగ్‌ చేసింది. కలెక్టర్‌ టీం 20 ఒవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 రన్‌లను సాధించింది. ఇందులో కలెక్టర్ బ్యాటింగ్ చేసి 10 రన్ లు కొట్టి క్రీడాకారులను ఆకట్టుకున్నారు. అలాగే 12 బంతుల్లో కలెక్టర్ గన్మెన్ శ్రీనివాసులు 34 పరుగులు చేయడం గమనర్హం.*

*ఆ తర్వాత 174 పరుగుల చేసింగ్‌ స్కోరుతో ఆటను ప్రారంభించిన ఎస్పి టీమ్‌ 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు సాధించి 13 రన్ ల తేడాతో ఒటమిని చవిచూసింది. ఇందులో ఎస్పీ బ్యాటింగ్ చేసి 23 రన్ లు కొట్టి క్రీడాకారులను ఆకట్టుకున్నారు. అత్యధికంగా ఎస్పీ గన్మెన్ నాగ శివ 55 రన్ లు కొట్టాడు. ఆట సమయంలో బౌలింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ ఆధ్వర్యంలో అత్యంత రసవత్తరంగా మారింది. 13 రన్నుల తేడాతో కలెక్టర్‌ టీం గెలుపొందింది. ఎస్పీ టీమ్ పై గెలుపొందిన కలెక్టర్ టీం ను ఎస్పీ అభినందించారు.*

*ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టర్ వర్సెస్ ఎస్పీ టీం మధ్య క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిత్యం ప్రజాసేవలో ఉండే అధికారులకు, పోలీసులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, క్రికెట్ పోటీలు నిర్వహించడానికి ఎస్పీ ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. చాలా చక్కగా మైదానాన్ని ఎస్పీ తయారు చేయించారన్నారు. అప్పుడప్పుడు క్రికెట్ ఆడటం వల్ల శారీరక దారుఢ్యం పెంపొందించుకోవచ్చు అన్నారు.*

*ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డాక్టర్ రాజ్ కమల్, రాయచోటి ఆర్డిఓ రంగస్వామి, కలెక్టరేట్, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.*

*----Issued by PRO, Annamayya District----*

పత్రికా ప్రకటన*👉🏻కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు నిర్ణీత కాలంలో జారీ చేయాలి**👉🏻సచివాలయాల్లో ప్రజల నుంచి సర్వీస్‌ రిక్వెస్టుల...
28/01/2023

పత్రికా ప్రకటన

*👉🏻కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు నిర్ణీత కాలంలో జారీ చేయాలి*

*👉🏻సచివాలయాల్లో ప్రజల నుంచి సర్వీస్‌ రిక్వెస్టులు పెరగాలి*

*👉🏻ప్రభుత్వ సేవలను ప్రజలకు నిర్దేశించిన సమయంలో అందించాలి*

*👉🏻సచివాలయ సిబ్బందికి ఆదేశించిన కలెక్టర్ గిరీష పిఎస్*

*రాయచోటి, జనవరి 28:-*

*కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు నిర్ణీత కాలంలో జారీ చేయాలని కలెక్టర్ గిరీష పిఎస్ సచివాలయ సిబ్బందికి ఆదేశించారు.*

*శనివారం మధ్యాహ్నం రాయచోటి మండలం, చెన్నముక్కపల్లి -2 గ్రామ సచివాలయంను కలెక్టర్ గిరీష పిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రగతి నివేదికలను, హాజరు పట్టీలను కలెక్టర్ పరిశీలించారు.*

*సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...సచివాలయాల్లో ప్రజల నుంచి సర్వీస్‌ రిక్వెస్టులు పెరిగేలా చూడాలని, అన్ని రకాల సేవలు సులభతర రీతిలో అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి ఇక్కడ అందే సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు నిర్ణీత కాలంలో జారీ చేయాలని చెప్పారు. అయిష్మన్ భారత్ పెండింగ్ లేకుండా చూడలన్నారు. సచివాలయ సిబ్బంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో వుండి, ప్రజలు సంతృప్తి చెందేలా మెరుగైన సేవలు అందించాలన్నారు. సచివాలయానికి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సచివాలయ సిబ్బంది ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, ప్రజల నుంచి అందిన అర్జీలు నిర్ణీత గడువులోగా పరిష్కరించి బియాండ్‌ ఎస్‌.ఎల్‌.ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు. సచివాలయ పరిధిలో ప్రతి రోజు ఎన్ని అర్జీలు వస్తున్నాయి, వచ్చిన అర్జీల్లో ఎన్ని పరిష్కరించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ పౌర సేవలను విస్తతంగా అమలు చేసి ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు.*

*ఈ తనిఖీలో రాయచోటి తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, సచివాలయ సిబ్బంది కలరు.*

*---Issued by PRO, Annamayya District----*

Address

Rayachoti
Rayachoti
516268

Website

Alerts

Be the first to know and let us send you an email when Bukke Dharma Naik IIS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share