20/02/2024
*నేడు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ తోఫా లకు నిధులు విడుదల చేస్తున్న సీఎం జగన్...*
*2023 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికి...*
★రాష్ట్రవ్యాప్తంగా10,132జంటలకు రూ 78.53 కోట్లు,
★అన్నమయ్య జిల్లాలో 356జంటలకు: రూ 2.91 కోట్లు,
★రాయచోటి నియోజక వర్గంలో 71 జంటలకు: రూ 57.90లక్షలు లబ్ది
మండలాల వారీగా...
★ *చిన్నమండెం:* జంటలు: 4,లబ్ది: రూ 2,50,000
★ *గాలివీడు:* జంటలు: 13లబ్ది: రూ 11 లక్షలు,
★ *లక్కిరెడ్డిపల్లె* : జంటలు:11 ,లబ్ది: రూ 8,70,000,
★ *రామాపురం:* జంటలు: 8,లబ్ది: రూ6,50,000,
★ *రాయచోటి* : జంటలు: 25,లబ్ది: రూ22.20 లక్షలు,
★ *సంబేపల్లె* : జంటలు:10, లబ్ది: రూ 7 లక్షలు
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఎందుకంటే.. ఇల్లు కట్టడం, పెళ్లి చెయ్యడం.. రెండూ మనుషుల జీవితాల్లో పెద్ద ఘట్టాలు. ఇవి అందరికీ సాధ్యం కావు. చాలా మంది ఈ విషయాల్లో అప్పులపాలవుతారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం వచ్చాక.. YSR కళ్యాణమస్తు, YSR షాదీ తోఫా అనే పథకాలు తెచ్చింది. వీటి ద్వారా లబ్దిదారులకు డబ్బులు ఇస్తోంది. తద్వారా అప్పులు చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్న పేదలు.. ఈ డబ్బుతో అప్పులు తీర్చుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. అంతేకాదు పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు కొన్ని అర్హతలు నిర్ణయించారు. వధూవరులిద్దరు కచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తేనే అర్హులు.
బాల్య వివాహాల నివారణకు పెళ్లి నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధనను అమలు చేస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ఇప్పటి వరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ 427.27 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ 40 వేలే. ఇప్పుడు జగనన్న అందిస్తున్న సాయం రూ.1,00,000 .కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీ,ఎస్ టి లకు చంద్రబాబు అందిస్తామన్న సాయం రూ 75వేలే కాగా, ఇప్పుడు జగనన్న అందిస్తున్న సాయం రూ.1,20,000. ఎస్టీలకు గత ప్రభుత్వం అందిస్తామన్న సాయం రూ 40 వేలే.ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం రూ.1,00,000 అందిస్తోంది.
బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ 35 వేలే.ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వంరూ.50,000 అందిస్తోంది.. కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు గత ప్రభుత్వం అందిస్తామన్న సాయం రూ 50 వేలేకాగా, ఇప్పుడు జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.75,000. మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ 50 వేలే.ఇప్పుడు జగన్ ప్రభుత్వం రూ.1,00,000 అందిస్తోంది. విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ 1 లక్ష కాగా,జగన్ ప్రభుత్వం రూ.1,50,000లు అందిస్తోంది. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం అందిస్తామన్న సాయం రూ 20 వేలే.జగన్
ప్రభుత్వం రూ.40,000లు ఇస్తోంది.
ప్రభుత్వం మొదటి పెళ్లికి మాత్రమే ఈ సాయం అందిస్తోంది.. అయితే భర్త చనిపోయిన వితంతువుకు మాత్రం సాయం అందిస్తున్నారు. నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలు ఉన్నవాళ్లు మాత్రమే ఈ పథకాలకు అర్హులుగా నిర్ణయించారు. అలాగే ఈ పథకానికి సంబంధించి.. మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలు ఉన్నవాళ్లు మాత్రమే అర్హులుగా నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి ఉండకూడదు.
అంతేకాదు విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లలోపు ఉండాలనే నిబంధన ఉంది.. ఐటీ చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కాదు. సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు అనర్హులు.. . ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు ఈ పథకానికి అర్హులు కాదు. కేవలం పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం మినహాయింపు ఉంది. ఈ పథకానికి అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి పెళ్లైన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల్ని పరిశీలించి.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శిస్తారు.
*పేద ఆడపిల్ల కుటుంభాలు కు బాసట వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోపాలు: ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి*
పేద ఆడపిల్ల కుటుంభాలుకు బాసట వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోపాలుగా నిలుస్తాయని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు,ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో జగన్ ప్రభుత్వం ప్రపంచ గుర్తింపు పొందిందన్నారు.మాట తప్పని, మడమ తిప్పని నేతగా ,ప్రజల ఆరాధ్య నాయకుడుగా జగన్ పేరొందాన్నారు.రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందులు ఎన్నో వున్నా ఇచ్చిన హామీలలో ఇప్పటికి 99 శాతానికి పైగా హామీలును నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అమలవుచున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా జగన్ పాలన సాగుతోందన్నారు. అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలను ఇంటికే పంపిస్తున్న ఘనత జగన్ దే నన్నారు. సంక్షేమ పథకాల రారాజుగా సీఎం జగన్ వెలుగొందుతున్నారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
*హర్షం..*
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన,చెప్పని హామీలను అమలు పరిస్తూ పేదలు, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తున్నారంటూ నియోజక వర్గంలోని వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ తోఫా లబ్ది దారులు సీఎం జగన్,ఎంపి మిథున్,ఎంఎల్ఏ శ్రీకాంత్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.