04/11/2024
*IMPORTANT*
*స్క్రోలింగ్/ప్రెస్*
*3.11.2024 - రాయచోటి, అన్నమయ్య జిల్లా*
*జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేయాలి: రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి*
*ఆదివారం ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో... రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం*
*ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్ కుమార్ రెడ్డి, షాజహాన్ భాష, అరవ శ్రీధర్, ఆకేపాటి అమర్నాథరెడ్డి, జేసి ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్వో మధుసూదన్ రావు, ఆర్డీఓలు శ్రీనివాస్, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.*
*ఈ సమీక్ష సమావేశంలో రెవిన్యూ, పిజిఆర్ఎస్, సామాజిక పింఛన్లు, పౌరసరఫరాలు-దీపం 2, అన్నా క్యాంటీన్లు, ఉచిత ఇసుక విధానం అమలు, రోడ్లు భవనాలు, రవాణా, వ్యవసాయ అనుబంధ శాఖలు, వైద్య ఆరోగ్యం, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, ఎంజిఎన్ఆర్ఇజిఎస్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్తు, గృహ నిర్మాణం, ఐసిడిఎస్, స్కిల్ డెవలప్మెంట్, గ్రామ వార్డు సచివాలయాలు, సంక్షేమం తదితర అంశాలపై చర్చించనున్నారు.*
*సమగ్ర అభివృద్ధి సాధనకు కృషి చేద్దాం*
*జిల్లా సమీక్షా కమిటీ సమావేశం ప్రారంభంలో జిల్లా కలెక్టరు శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ... నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం ఇంఛార్జి మంత్రి గారి అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరుగుతోందన్నారు. జిల్లా మంత్రివర్యులు గారితోపాటు శాసనసభ్యులు, ఎంఎల్సీలు అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకున్న చర్యల కార్యాచరణ నివేదికను సభ్యులకు అందజేశామన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో అందరం కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
*జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి*
సమావేశం ప్రారంభంలో జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ... గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, నాతోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, అన్నమయ్య జిల్లా అధికారులకు, మీడియా మిత్రులకు, అందరికీ నా నమస్కారాలు.
> గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లాకు నన్ను ఇన్చార్జి మంత్రిగా నియమించడం జరిగింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పై 32 వేల కీర్తనలు రచించిన అన్నమాచార్యులు జన్మించిన ఈ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నన్ను నియమించినందుకు చాలా ఆనంద పడుతున్నాను, అదే సమయంలో ముఖ్యమంత్రివర్యులు నా మీద పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది.
> అన్నమయ్య జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగు స్థానాలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడంలో అన్నమయ్య జిల్లా కీలకపాత్ర పోషించింది.
> అందుకు అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
> అన్నమయ్య జిల్లాకు నేను రావడం ఇదే మొదటిసారి అయినప్పటికీ నేను, నా మంత్రివర్గ కార్యాలయ సిబ్బంది సహాయంతో, అన్నమయ్య జిల్లాలోని ఎన్డీఏ కూటమి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ మరియు కార్యకర్తలతో ఎప్పటికప్పుడు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తూనే ఉన్నాను.
>మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన భూ కుంభకోణం, ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ, జాతీయ రహదారుల పనులు, ఉచిత ఇసుక విధానం, ఇతర సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, కార్యకర్తల సమస్యలు.... వీటన్నిటిపై ఎప్పటికప్పుడు నేను సమీక్షిస్తూనే ఉన్నాను.
> ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ విషయానికి వస్తే అన్నమయ్య జిల్లా మొదటి మూడు స్థానాలలో నిలుస్తోంది. జిల్లాను ముందు వరసలో నిలబెట్టిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గారికి మరియు జిల్లా యంత్రంగానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
> అదేవిధంగా పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి పెట్టి స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అవార్డులను పొందిన విషయం మనకు అందరికీ తెలిసిందే.
> అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047కు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ అభిప్రాయాల సేకరణ చేపట్టిన విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే.
> ఇన్ని మంచి కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా జిల్లాను ముందుకు నడిపిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గారికి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు.
> ఉచిత ఇసుక పాలసీ జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని తెలుస్తోంది.
> అలాగే జిల్లాలో పలుచోట్ల అన్నా క్యాంటీన్లను జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.
> రెండు రోజుల క్రితమే జిల్లాలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలైన దీపం 2.0, మిషన్ పాట్ హెూల్ ఫ్రీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.
> దీపం 2 పథకం ద్వారా జిల్లాలోని ఎంతోమంది మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాను.
> అలాగే గత ప్రభుత్వంలో పాడైపోయిన రోడ్లను మరమ్మత్తులు చేసి గుంతలు లేని రోడ్లను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.
> అన్నమయ్య జిల్లాలో పలు జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి.
> అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే పనులను చేపట్టడం జరిగింది.
> ఈ పనులపై జిల్లా కలెక్టర్ తో సమీక్ష నిర్వహించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను.
> "సంపద సృష్టి" ఈ ప్రభుత్వ లక్ష్యం. సంపద సృష్టి కోసం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ఎంతో అవసరం. అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ గారు పలు చర్యలు తీసుకోవడం జరిగింది. దీనితోపాటు యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఇప్పటికే చాలాసార్లు జాబ్ మేళాలు విజయవంతంగా నిర్వహించారు.
> త్వరలో జిల్లాలో స్కిల్ సెన్సెస్ జరగబోతోంది. స్కిల్ సెన్సెస్ కార్యక్రమం ద్వారా అన్నమయ్య జిల్లాలోని యువతకు నైపుణ్యాన్ని పెంచి, వారికి ఉద్యోగ కల్పనకు బాటలు వేస్తామని తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
> ఇక జిల్లాలోని ముఖ్యమైన సమస్యల విషయానికొస్తే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ భూకుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా గారితో నేను చర్చించడం జరిగింది. దీనిపై త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను.
> ఇతర భూ సమస్యలపై జిల్లాలో పలు రెవెన్యూ సదస్సులను, ఫ్రీ హోల్డ్ భూముల రీ వెరిఫికేషన్ కార్యక్రమాలను, విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
> అలాగే జిల్లాలో చేపట్టిన వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు, విద్య, వైద్యము, ఇలా అన్ని అంశాలపై రాయచోటి ఎమ్మెల్యే మరియు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఇతర ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కూలంకషంగా చర్చించి అన్నమయ్య జిల్లాను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను.
> అన్నమయ్య జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు గాను నాలుగు నియోజకవర్గాలను ఎన్డీఏ కూటమికి అందించిన కార్యకర్తల సంక్షేమము ఈ ప్రభుత్వ ప్రాధాన్యత లలో ముందు వరుసలో ఉంటుంది.
> కార్యకర్తలను కలవడానికి నేనెప్పుడూ ముందుంటాననే విషయం అందరికీ తెలుసు. ఏ విషయంపైనైనా కార్యకర్తలను నా వద్దకు వచ్చి చర్చించవచ్చు.
అందరూ కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు.
*సమావేశంలో మంత్ర మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ*...... ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ నాలుగు నెలల కొద్దికాలంలోనే ఏవైతే ప్రజలకు అందాలో మరియు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో వాడవాడలో ప్రజల వద్దకు వెళ్ళాం. వారందరూ ఇది ఒక మంచి ప్రభుత్వం అని నిరాజనాలు పలికారు. గ్రామసీమల్లో వెలుగులు నింపడానికి పల్లె పండుగ కార్యక్రమంలో రోడ్లు డ్రైనేజీలు త్రాగునీటి సౌకర్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వంద రోజుల్లో చెప్పిన ప్రతి పని చేయడమైంది. జిల్లాలో సుమారు 65 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తున్నాం. మొదటి మంత్రివర్గ సమావేశంలోనే నిరుద్యోగుల కోసం డీఎస్సీ ని ప్రకటించి ప్రజల ప్రభుత్వంగా నిరూపించుకున్నాం. మనకు కరువుతో ఉన్న మండలాల్లో రైతులకు కర్షకులకు ప్రజలకు ఇన్చార్జి మంత్రివర్యులు ఆధ్వర్యంలో పూర్తిగా సహాయ సహకారాలు అందించి ప్రభుత్వ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేయడానికి కృషి చేస్తాం. రాయచోటి నియోజకవర్గం లో వర్షాభావంతో నీటి సమస్యలు ఉన్నాయి. ఆరు మండలాల్లో నీటి సౌకర్యం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ జిల్లాలో టమోటా మామిడి ఎక్కువ. ప్రాసెసింగ్ కౌల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. హార్టికల్చర్ అబ్బుగా చేయడానికి మీ సూచనలు సలహాలు సహకారం కోరుతున్నాను. లోకేష్ బాబు నేతృత్వంలో విద్య ఐటీ రంగాల అభివృద్ధి చెందడంతో పాటు రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
*అనంతరం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని ఇన్చార్జి మంత్రి ప్రారంభించారు.*
-----------------///----------------
*డిపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా*