Rayachoti Annamayya District

Rayachoti Annamayya District news

Please share
07/07/2023

Please share

*పత్రికా ప్రకటన**స్పందన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి...* *అర్జీలకు నాణ్యమైన పరిస్కారం చూపాలి...* *ఎస్ఎల్ఎ పరిధిలోని ...
18/04/2022

*పత్రికా ప్రకటన*

*స్పందన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి...*

*అర్జీలకు నాణ్యమైన పరిస్కారం చూపాలి...*

*ఎస్ఎల్ఎ పరిధిలోని అర్జీలను రేపటిలోగా పరిష్కరించాలి....*

*జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్...*

రాయచోటి,ఏప్రిల్ 18:-

స్పందన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్లోని విసి హాల్ నందు స్పందన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, కలెక్టరేట్ పరిపాలనాదికారి బాలకృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ గిరీష్ పిఎస్ మాట్లాడుతూ...ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా స్పందన అర్జీలను వేగంగా పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలన్నారు. పరిష్కరించిన అర్జీలకు సంబంధించి క్లియర్ గా ఎండార్స్ మెంట్ ఇవ్వాలన్నారు. ఒకవేళ పరిష్కరించలేకపోతే ఏ కారణం వల్ల పరిష్కరించలేదో కూడా అర్థమయ్యే విధంగా నిర్ణీత సమయంలోగా అర్జీదారులకు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు శనివారం లోపల క్లియర్ చేయాలన్నారు. బియాండ్ ఎస్ఎల్ఎ అర్జీలను రేపటిలోగా పరిష్కరించాలని సూచించారు. సమస్య పరిష్కారం కాకపోతే ఎందువల్ల సమస్య పరిష్కారం చేయలేకపోయామన్న వివరాలు అర్జీ దారునికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా తెలపాలన్నారు.

జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు వెంటనే ఈ ఆఫీస్ ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా ఈ ఆఫీసులోనే ఫైల్స్ తమకు పంపాలన్నారు. ఈ ఆఫీస్ ఓపెన్ చేయకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి... ఆయా శాఖల అడ్రస్, అధికారులు పేర్లు, ఫోన్ నెంబర్లు, సిబ్బంది వివరాలు వెంటనే సిపిఓకు పంపాలని సూచించారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి ఉదయం 9.00 గంటలకు హెచ్ ఓ డి లు అందరూ తప్పక హాజరు కావాలన్నారు.

అనంతరం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, జేసి తమీమ్ అన్సారియాలు వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి.. వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

*స్పందన కార్యక్రమంలో కొన్ని సమస్యలు...*

లక్కిరెడ్డిపల్లె మండలం, పాలెం గొల్లపల్లెకు చెందిన పి.గంగాదేవి తమకు ఇంటి స్థలం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.

రాయచోటి మండలం, మాసాపేటకు చెందిన ఎం. బావాజీ తనకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ కావాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.

కలికిరి మండలం, కలికిరి పల్లెకు చెందిన పి. రమణమ్మ తమ ఇల్లు ఇతరులు ఆక్రమించుకున్నారని ఇందుకు సంబంధించి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.

వీరబల్లి మండలం, వంగిమల్ల గ్రామానికి చెందిన కే.శారదమ్మ తమకు పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
--------------------/////----------------
*డిపిఆర్ఓ, సమాచార పౌర సంబంధాల శాఖ, అన్నమయ్య జిల్లా వారిచే జారీ చేయబడినది*

18/04/2022
💁 రిజిస్ట్రేషన్ స్టాంప్ డాక్యుమెంట్ డౌన్లోడ్ 👉 హౌస్ & ల్యాండ్ సంబంధించి  రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్  డౌన్లోడ్ చేయడం ఎలా?👉...
15/04/2022

💁 రిజిస్ట్రేషన్ స్టాంప్ డాక్యుమెంట్ డౌన్లోడ్

👉 హౌస్ & ల్యాండ్ సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేయడం ఎలా?

👉 పబ్లిక్ ఆన్లైన్ సర్వీస్ ఎటువంటి చార్జెస్ లేకుండానే{house &land} రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పొందడం ఎలా?

👉 పై వాటికి సంబంధించిన ఈ క్రింది వీడియో చూడగలరు
👇👇

https://youtu.be/GomxUgbwYSM

https://youtu.be/GomxUgbwYSM

👆👆
━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info

*పత్రికా ప్రకటన* *ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి..సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా చేయాలి* *వేగవతంగా పథకాల అమలు పరచాల...
11/04/2022

*పత్రికా ప్రకటన*

*ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి..సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా చేయాలి*

*వేగవతంగా పథకాల అమలు పరచాలి.*

*100% లక్ష్యాలను సాధించాలి*

*స్పందన అర్జీ లపై నిర్లక్ష్యం వహించరాదు....*

*ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపిడిఓలకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్....*

రాయచోటి, ఏప్రిల్ 11:- పాలన వికేంద్రీకరణతోనే ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా.. పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దశ్యంతో నూతన జిల్లాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా నూతనంగా ఏర్పడింది. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా వేగవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గిరిషా పీఎస్ అధికారులను ఆదేశించారు.

స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ పేర్కొన్నారు...

సోమవారం కలెక్టరేట్లోని వి సి హాల్ నందు జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి స్పందన పెండింగ్ అర్జీలు, గ్రామ, వార్డు సచివాలయాల అర్జీలు, జగనన్న విద్య దీవెన, జగనన్న తోడు, ఈబిసి నేస్తం, చేదోడు, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, అంశాలపై రాయచోటి, రాజంపేట, మదనపల్లె డివిజన్ల ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపిడివోలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి పథకాల అమలులో అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ మాట్లాడుతూ.... ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలను అమలు చేయడంలో తాసిల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కీలక పాత్ర వహించాలన్నారు. అన్నమయ్య నూతన జిల్లాలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కేటాయించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలన్నారు.

మొదటగా స్పందన అర్జీ లపై సమీక్షిస్తూ... ప్రతి సోమవారం నిర్వహించే స్పందన, గ్రామ వార్డు సచివాలయాలలో అందిన ప్రజల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపి పరిష్కరించాలన్నారు.
స్పందనకు సంబంధించి సోమవారం వచ్చిన అర్జీలను శనివారం లోపల క్లియర్ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితులలో ఒక అర్జీ కూడా బియాండ్ ఎస్ఎల్ఎ లోకి వెళ్ళడానికి వీలు లేదన్నారు. అధికారులు ప్రతి రోజూ ఒక గంట సమయాన్ని స్పందన అర్జీల పరిష్కారానికి కేటాయించాలన్నారు. ప్రతి కార్యాలయంలో టెక్నికల్ పరంగా మంచి అనుభవజ్ఞులైన వ్యక్తులు ఉంటారని వారి ద్వారా టెక్నికల్ సమస్యలను పరిష్కరించుకోవా లన్నారు. అన్నమయ్య జిల్లాలో టెక్నికల్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయడం జరిగిందని మండలాల వారీగా ఎవరికి టెక్నికల్ సమస్యలు వచ్చినా వెంటనే వాట్సాప్ గ్రూప్ నందు తమ సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవచ్చన్నారు.

స్పందన, గ్రామ, వార్డు సచివాలయాల అర్జీలు బియాండ్ ఎస్ ఎల్ ఎ లోకి వెళ్లకుండా 48 గంటలలోపే క్లియర్ చేయాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల అర్జీలను డిపార్ట్మెంటల్ వైజ్ గా పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఎస్ఎల్ఏ పరిధిలో ఉన్న అర్జీలను నేటి నుంచి వచ్చే సోమవారం జరిగే రివ్యూ నాటికి ఒక్క సమస్య కూడా పెండింగ్లో లేకుండా క్లియర్ చేసి సమావేశానికి హాజరు కావాలన్నారు.

ప్రతి మండలంలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు సమన్వయంతో పనిచేయాలని గ్రామ వార్డు సచివాలయ సమస్యలపై ఎంపీడీవోలు తరచు పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎంపీడీఓలకు సిబ్బంది కొరత లేదని తమ పరిధిలో జరిగే అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో జగనన్న విద్యా దీవెన, ఈబీసీ నేస్తం, చేదోడు, జగనన్న తోడు ఫేస్ -2 లోన్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ లు వెంటనే క్లియర్ చేయాలన్నారు.

హౌసింగ్ సమీక్ష లో భాగంగా... కొత్తగా మంజూరైన ఇళ్ల రిజిస్ట్రేషన్ ల కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. హౌసింగ్ ఏఈ, డీఈ లకు ఇచ్చిన వీక్లీ టార్గెట్ పూర్తి చేయాలన్నారు. ఆర్ డబ్ల్యు ఎస్ కు సంబందించి ప్రస్తుత వేసవి కాలంలో గ్రామాలలో మంచినీటి సమస్య తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మండలాల వారీగా ఎన్ని హ్యాబిటేషన్ ఉన్నాయి, ఎన్ని బోర్ వెల్స్, ఎన్ని మంచినీటి స్కీమ్స్ పనిచేస్తున్నాయి, ఎన్ని గ్రామాలకు నీటిని రవాణా చేయాల్సి వస్తుంది లాంటి వివరాలను ఎంపీడీవోలు పక్కాగా తెలుసుకొని ఆ మేరకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలలో కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో రాయచోటి, రాజంపేట, మదనపల్లె ఆర్డిఓలు రంగస్వామి, కోదండరామిరెడ్డి, మురళి, అర్డబ్ల్యుఎస్ ఎస్ఇ వీరన్న, కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, హౌసింగ్, అర్డబ్ల్యుఎస్ డీఈలు, ఏఈ తదితరులు పాల్గొన్నారు.
----------------//////------------
*డిపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా వారిచే జారీ.*

09/04/2022
*పత్రికా ప్రకటన....**ఈ నెల 11న సోమవారం (11-04-22) ప్రజాఫిర్యాదుల స్వీకరణ "స్పందన"  కార్యక్రమం**అన్నమయ్య జిల్లా రాయచోటి క...
09/04/2022

*పత్రికా ప్రకటన....*

*ఈ నెల 11న సోమవారం (11-04-22) ప్రజాఫిర్యాదుల స్వీకరణ "స్పందన" కార్యక్రమం*

*అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ విసి హాలులో స్పందన కార్యక్రమం *

**అధికారులతో సహా ప్రతి ఒక్కరూ కొవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి*

* *జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్*

రాయచోటి, ఏప్రిల్ 09: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ నెల11న సోమవారం (11-04-22) "స్పందన" అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని రాయచోటి జిల్లా కేంద్రం కలెక్టరేట్ వీసీ హాలులో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. ముఖ్యంగా.. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే స్పందనకు రాగలరని తెలిపారు. అధికారులతో సహా ప్రతి ఒక్కరూ కొవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
----------------------////------------------
*డిపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా వారిచే జారీ చేయబడినది.*

Address

Rayachoti
516269

Website

Alerts

Be the first to know and let us send you an email when Rayachoti Annamayya District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share