123Rayachoti

123Rayachoti Not Only Rayachoti news Entire india news Covered

*👉రోడ్డు ప్రమాదంలో సరస్వతిపల్లె కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు మృతి, మృతదేహాలకు నివాళులు అర్పించిన టీటీడ...
26/02/2024

*👉రోడ్డు ప్రమాదంలో సరస్వతిపల్లె కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు మృతి, మృతదేహాలకు నివాళులు అర్పించిన టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు🌷🙏🌹*

సోమవారం మధ్యాహ్నం రామాపురం మండలం బండపల్లి ఐరిస్ గ్రాండ్ హోటల్ సమీపంలో నిలబడి ఉన్న లారీని వెనుక వైపు నుంచి స్కూటర్ ఢీకొని సరస్వతిపల్లె కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెంది రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు గారు చూసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #కొనంపేట #అనంతపురంగంగమ్మ

   #అనంతపురంగంగమ్మ          #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ    #సంబెపల్లి  #కొనంపేట    #సుండుపల్లి
26/02/2024

#అనంతపురంగంగమ్మ #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #కొనంపేట #సుండుపల్లి

*శ్రీ శ్రీ శ్రీ కొత్తపురమ్మ* *దేవస్థానము నందు ధ్వజస్తంభ ప్రతిష్ట* కార్యక్రమంలో పాల్గొన్న!  రామ శ్రీనివాస్ గారుఈ రోజు సోమ...
26/02/2024

*శ్రీ శ్రీ శ్రీ కొత్తపురమ్మ* *దేవస్థానము నందు ధ్వజస్తంభ ప్రతిష్ట* కార్యక్రమంలో పాల్గొన్న! రామ శ్రీనివాస్ గారు

ఈ రోజు సోమవారం ఉదయం 26/02/2024
అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం పెద్ద బలిజపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ కొత్తపురమ్మ ఇరుగులమ్మ మూలకాలయల్లమ్మ దేవస్థానము నందు గ్రామస్థులందరి సహకారంతో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు గ్రామపెద్దలు స్థానిక గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో గణపతిపూజ స్వస్తివాచనము కలశస్థాపన నవగ్రహపూజ గర్తపూజ అమ్మవారికి అభిషేకములు అనంతరం ధ్వజస్తంభాన్ని నిర్మాణ ప్రతిష్టించినారు.
అదేవిధంగా వచ్చిన భక్తాదులందరికి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రామా శ్రీనివాస్ గ్రామపెద్దలు అన్నయ్య గారి సిద్దయ్య రిటైర్డ్ ఎస్సై రెడ్డిచర్ల నాగయ్య మదనమోహన్ అన్నయ్యగారిరవీంద్ర వీర నాగయ్య చంద్ర రెడ్డయ్య శివశంకర్ రవీంద్ర లు ఈశ్వరయ్య సదాశివ నాగేశ్వరలు నాగరాజలు బుపయ్య సుబ్బరామయ్య వెంకటరమణ నితిన్ నరేష్ జయరామ్ లు తదితరులతో పాటు పెద్దబలిజపల్లె గుట్టకాడబలిజపల్లె మలక్కగారిపల్లె ఏటిగడ్డరాచపల్లె తదితర చుట్టుపక్కల గ్రామాల వారు భక్తిశ్రద్ధలతో పెద్ద ఎత్తున హాజరయ్యారు.

   #అనంతపురంగంగమ్మ    #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ          #సంబెపల్లి  #కొనంపేట
26/02/2024

#అనంతపురంగంగమ్మ #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #కొనంపేట

19/02/2024

*ప్రధాన ఎన్నికల అధికారి - ఆంధ్రప్రదేశ్*
*భారత ఎన్నికల సంఘం.*

*12-3-2024 = ఎన్నికల నోటిఫికేషన్*

*28-3-2024 = నామినేషన్ ప్రారంభమవుతుంది.*
*19-4-2024 = పోలింగ్ రోజు*

*22-5-2024 = కౌంటింగ్ (ఫలితం)*

*30-5-2024 = కొత్త ప్రభుత్వం.*

19/02/2024

Sivaji maharaj Rally Rayachoty

16/02/2024
16/02/2024

జగనన్న ప్రభుత్వంలో ప్రజల చెంతకే పాలన అందుతోంది.
మిథున్ అన్న మరియు శ్రీకాంత్ అన్న గార్ల కృషితో రాయచోటి నియోజక వర్గంలో 73 గ్రామ సచివాలయాలు,73 రైతు భరోసా కేంద్రాలు,60 విలేజ్ క్లినిక్ లు నిర్మించడం జరుగుతోంది. ఇందులో పది శాతం మాత్రమే నిర్మాణాలు పెండింగ్ లొ ఉన్నవి, అవి కూడా త్వరగా పూర్తి చేయడం జరుగుతుంది . ఇది కాదా అభివృద్ధి అంటే... శాశ్విత కార్యాలయాల నిర్మాణాలతో పల్లెల రూపురేఖలు మారాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు...
ఈ విధంగా గతంలో టి డి పి వారు ఎందుకు చేయలేకపోయారో?


#అనంతపురంగంగమ్మ #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #కొనంపేట

*రాయచోటి పట్టణ అభివృద్ధి, సుందరీకరణే ధ్యేయం...**కొత్తపేట రామాపురం అభివృద్ధికి కృషి...**రూ 79.19 లక్షల నిధులతో రాయచోటి పట...
13/02/2024

*రాయచోటి పట్టణ అభివృద్ధి, సుందరీకరణే ధ్యేయం...*

*కొత్తపేట రామాపురం అభివృద్ధికి కృషి...*

*రూ 79.19 లక్షల నిధులతో రాయచోటి పట్టణంలోని కొత్తపేట రామాపురంలోని నాయీ బ్రాహ్మణ కాలనీ, సత్యనారాయణ పురంలలో నిర్మాణాలు పూర్తి చేసిన 5 సిమెంట్ రోడ్ల ప్రారంభం లోనూ, 2 సిమెంట్ రోడ్ల కు భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి*

రాయచోటి పట్టణ అభివృద్ధి, సుందరీకరణే ధ్యేయమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని కొత్తపేట రామాపురంలోని నాయీ బ్రాహ్మణ కాలనీ, సత్యనారాయణ పురంలలో రూ 79.19 లక్షల గడప గడపకు మన ప్రభుత్వం , 15 వ ఆర్థిక సంఘ నిధులుతో నిర్మాణాలు పూర్తి చేసిన 5 సిమెంట్ రోడ్ల ప్రారంభంలోనూ, 2 సిమెంట్ రోడ్ల కు భూమి పూజా కార్యక్రమ శిలాఫలక ఆవిష్కరణలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి, కౌన్సిలర్ నాగంజలి భాస్కర్ తదితరులతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.జన సందోహం మధ్య, పండుగ వాతావరణంలో అభివృద్ధి పనుల ప్రారంబోత్సవాలను శ్రీకాంత్ రెడ్డి నిర్వహించారు.ఈ సంధర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలోఅర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
వందపడకల ఆసుపత్రి, 4 అర్బన్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్ స్టాండ్ విస్తరణ, డైట్ మున్సిపల్ పార్క్, రైతు బజార్, క్రికెట్ స్టేడియం, నగరవనం,శిల్పారామం తదితర అభివృద్ధి కార్యక్రమాలును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.రహదారుల అభివృద్ధి,పట్టణ సుందరీకరణ తదితరఅభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
సీఎం జగన్ 99 శాతానికి పైగా హామీలను నెరవేర్చి ఆదర్శ సీఎం గా ప్రజల మన్ననలును పొందారన్నారు.జిల్లా కేంద్రం ఏర్పాటుతో పట్టణ రూపురేఖలు మారాయన్నారు.కొత్తపేట రామాపురం అభివృద్ధికి మరింత తోడ్పాటు అందిస్తున్నామన్నారు.

*వీధులలో పర్యటించి.. సమస్యలపై ఆరా తీసి...*

కొత్తపేట రామాపురంలోని నాయీ బ్రాహ్మణ కాలనీ, చౌడేశ్వరి సంఘం వీధులు, సరస్వతి నగర్,గరుడాద్రి వీధి,ఎం ధర్మారెడ్డి వీధి,సి ఐ రోడ్డు ,చర్చి వీధులలో శ్రీకాంత్ రెడ్డి పర్యటించి ప్రజా సమస్యలపై శ్రీకాంత్ రెడ్డి ఆరా తీశారు.త్రాగునీరు తదితర సమస్యల నడిగి తెలుసుకున్నారు. వీధులలో సుందరంగా రహదారులు నిర్మించడమై ప్రజలు,మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

*రమా సహిత సత్య నారాయణ స్వామి ఆలయంలో శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు...*

నాయీ బ్రాహ్మణ కాలనీలోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు అందించారు.

*ఎంఎల్ఏ కు ఘన స్వాగతం...*
సిసి రోడ్ల ప్రారంభ కార్యక్రమాలకు విచ్చేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కి మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పెద్దఎత్తున మహిళలు ఘన స్వాగతాలు పలికి గజమాల,దుస్సాలువతో సత్కరించారు.
#అనంతపురంగంగమ్మ #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #కొనంపేట

*కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి..**పది మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన   రూ 16.48 లక్షలు విలువ...
13/02/2024

*కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి..*

*పది మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన రూ 16.48 లక్షలు విలువ చేసే చెక్కులను అందచేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి*

బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిది కొండంత అండగా నిలుస్తోందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో పది మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన రూ 16.48 లక్షలు విలువ చేసే చెక్కులను ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి శ్రీకాంత్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థికంగా చితికిపోయినవారికి ఆ ఇంటి పెద్దకొడుకుగా సీఎం జగన్ కొండంత అండగా నిలుస్తున్నారన్నారు.బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది ఆర్థిక భరోసానిలుస్తుందన్నారు.

*మండలాల వారీగా లబ్దిదారుల వివరాలు...*

*మున్సిపాలిటీ...*
రాయచోటి పట్టణంలోని నాదనా స్ట్రీట్ కు చెందిన షేక్ రఫీవున్నీసా కు రూ 50 వేలు,
చౌడేశ్వరి దేవాలయ ప్రాంతానికి చెందిన ముద్దిసేట్టి జ్ఞానేశ్వరకు రూ 23 వేలు,
*లక్కిరెడ్డిపల్లె:*
ఓల్డ్ మసీదు దగ్గర వుండే షేక్ జబ్బిజాన్ కు రూ 1 లక్ష,
*రామాపురం:*
సుద్దమల్ల గ్రామం ఓబుల్ రెడ్డి గారిపల్లెకు చెందిన పల్లా నాగలక్ష్మమ్మకు రూ 65 వేలు,
గోపగుడిపల్లెకు చెందిన చాకిబండ భాస్కర్ కు రూ 1.50 లక్షలు
*రాయచోటి రూరల్*
ఎగువ అబ్బవరం కమ్మపల్లెకు చెందిన గండే లక్ష్మీ నరసమ్మకు రూ 3.20 లక్షలు,
*గాలివీడు:*
నూలివీడు గ్రామం ఆవులరెడ్డిగారిపల్లెకు చెందిన చింతంరెడ్డి లావణ్యకు రూ 3.40 లక్షలు,అరవీడు గ్రామం ఎల్లంపల్లెకు చెందిన దేవరింటి రాజేశ్వరమ్మకు రూ 1 లక్ష,
*సంబేపల్లె*:
మోటకట్ల గ్రామం చెరువుక్రింద పల్లెకు చెందిన కస్తూరికి రూ 3 లక్షలు, రౌతుకుంట గ్రామం వంగిమల్లవాండ్లపల్లె కు చెందిన నాగూరి అనీషకు రూ2 లక్షలు విలువ చేసే చెక్కులను శ్రీకాంత్ రెడ్డి అందచేశారు.

*ముఖ్యమంత్రి జగన్ సహకారాన్ని మరువలేం...*

*సీఎం సహాయనిధి అందుకున్న లబ్ధిదారుల కృతజ్ఞతలు*

ముఖ్యమంత్రి జగన్ సహకారాన్ని మరువలేమని సీఎం సహాయనిది చెక్కులు అందుకున్న లబ్ధిదారులు పేర్కొన్నారు. తమకు ఆరోగ్యాలు బాగలేక ,వైద్యానికి అప్పులు చేసి ఖర్చులు పెట్టుకుని ఆర్థికంగాఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆదుకున్నారన్నారు. తమకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్, ఎంతో సహకరించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డిలకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు #అనంతపురంగంగమ్మ #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ

*ఆనందోత్సాహంలో మండిపల్లి అభిమానులు...*అన్నమయ్య జిల్లా  రాయచోటి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా స్వర్గీయ మాజీ ఎమ్మె...
13/02/2024

*ఆనందోత్సాహంలో మండిపల్లి అభిమానులు...*

అన్నమయ్య జిల్లా రాయచోటి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి కుమారుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఖరారు చేసినట్లు తెదేపా అధిష్ఠానం నుండి ఫోన్ ద్వారా సమాచారం వచ్చినట్లు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచర వర్గానికి తెలియజేశారు.దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు రాయచోటి పట్టణంలో మండిపల్లి భవన్ భారీగా చేరుకొని బాణాసంచాలు పేలుస్తూ సంబరాలు జరుపుకొన్నారు.మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 2014 లో జై సమైక్య ఆంధ్ర పార్టీ తరపున ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి.పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతూ 2019 ఎన్నికలలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలిపించేందుకు కృషి చేశారు.ఆ తర్వాత ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అంతర్గత విభేదాలు కారణంగా వైసిపి నుండి బయటకి రావడం జరిగింది.ఆ తర్వత పరోక్షంగా టిడిపి లో ఆయన ప్రస్థానం ను ప్రారంభించారు.మదనపల్లె మిని మహానాడులో కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్ర బాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు.అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు చురుకుగా పాల్గొంటూ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చారు.టికెట్ కోసం నలుగురు మధ్య తీవ్రంగా పోటీ ఉన్నప్పటికీ గత కొన్ని రోజులుగా కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీ అభ్యర్థి అనే జోరుగా ప్రచారం కూడా జరిగింది.అయితే ఈ దినం టిడిపి పెద్దలు పార్టీ కార్యాలయం నుంచి మండిపల్లికి సమాచారం వచ్చిందని ఆయన అభిమానులు స్ధానిక మండిపల్లి భవన్ వద్దకు చేరుకొని సంబరాలు జరుపుకొన్నారు. #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #అనంతపురంగంగమ్మ #కొనంపేట

11/02/2024

జగనన్న ప్రభుత్వంలోమిథున్ అన్న మరియు శ్రీకాంత్ అన్న గారి కృషితో అన్నమయ్య జిల్లా సాధనతోపాటి రాయచోటి లొ కలెక్టరేట్ కార్యాలయం , SP ఆఫీస్, పోలీస్ ఫెరెడ్ గ్రౌండ్, DSP ఆఫీస్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను నిర్మాణం చేసుకోవడం జరిగింది...జిల్లాను సాధించి ఓ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము..


#లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #అనంతపురంగంగమ్మ #కొనంపేట

*అన్నమయ్య జిల్లా :-*ఫాస్ట్ న్యూస్ రాయచోటి :-*కృత్రిమ ఎరువులతో పండించిన పంటలను అతి తక్కువ ధరలకే ప్రజలకు అందిస్తున్న... రై...
10/02/2024

*అన్నమయ్య జిల్లా :-

*ఫాస్ట్ న్యూస్ రాయచోటి :-

*కృత్రిమ ఎరువులతో పండించిన పంటలను అతి తక్కువ ధరలకే ప్రజలకు అందిస్తున్న... రైతు జోగి భాస్కర్*

*అన్నమయ్య జిల్లా రాయచోటి- సుండుపల్లె మార్గం మధ్యలో గల సిబ్యాల గ్రామంలో రైతు జోగి భాస్కర్ కి చెరువు కట్టపై తనకు గల పొలంలో కేవలం కృత్రిమ ఎరువులతో ఆకుకూరలు, కూరగాయలు పండిస్తు రోడ్డు ప్రక్కనే అమ్ముతున్నారు.
ఈ విషయం నందు రైతు మాట్లాడుతూ కెమికల్స్ తో పండించిన కూరగాయలు తినడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందువల్ల తాను కృత్రిమ ఎరువులతో పంటలను పండిస్తున్నానని వారు తెలిపారు.
ఇలా తాను పండించిన పంటను ప్రతిరోజు ఉదయం 6:00 నుంచి సాయంకాలం 6:00 వరకు తన పొలం వద్దనే అతి తక్కువ ధరలకు ప్రజలకు అమ్ముతున్నానని వారు తెలిపారు. #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #అనంతపురంగంగమ్మ #కొనంపేట

10/02/2024

లక్కీరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా శ్రీశ్రీశ్రీ అనంతపుర గంగమ్మ తల్లీ ఆలయంల్లో అమావాస్య సందర్భంగా గుమ్మడికాయ దిష్టి తీయడం జరిగినది ఈ కార్యక్రమంల్లో తుమ్మల నవీన్ కుమార్ జగిలి ప్రవీణ్ అంతర గణేష్ కుమార్ జగిలి సతీష్ ఆదిమూలం రెడ్డి శేఖర్ యాదవ్ పూజారి #సంబెపల్లి #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #అనంతపురంగంగమ్మ #కొనంపేట

10/02/2024

శ్రీశ్రీశ్రీ అనంతపురం గంగమ్మ తల్లి చేపించినవారు గంగి నాయుడు లక్కీరెడ్డిపల్లి గాలి మిషన్ రాజశేఖర్ రెడ్డి ఎలక్ట్రిషన్ జిగిలి అరుణ మురికి నాటి సంతోష్ కుమారి ఆదిమూలం రెడ్డి శేఖర్ యాదవ్ పూజారి #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #అనంతపురంగంగమ్మ #సంబెపల్లి #కొనంపేట

09/02/2024

జగనన్న ప్రభుత్వంలో మిథున్ అన్న మరియు శ్రీకాంత్ అన్న గారి కృషితో మధ్యతరగతి ప్రజలకు, చిరుద్యోగులకు, సామాన్యులకు వరం MIG లేఔట్ జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ను అభివృద్ధి చేయడం జరిగింది,

లే ఔట్ కు మరింత శోభను పెంచేలా రూ 10 కోట్లతో రహదారి నిర్మాణాలు పూర్తి అయ్యాయి ,మౌలిక వసతులు పనులు జరుగుతున్నాయి


#అనంతపురంగంగమ్మ #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #కొనంపేట

05/02/2024

TTC KIDS 🧒 PLAY GROUND RAYACHOTY

04/02/2024

TTC GROUND LIVE

*గాడివాలా యాప్ లోగో ఆవిష్కరణ* మండల కేంద్రమైన సుండుపల్లె లోని మానవతా సంస్థ చైర్మన్ మిన్నం రెడ్డి గంగిరెడ్డి, యర్రపు రెడ్డ...
03/02/2024

*గాడివాలా యాప్ లోగో ఆవిష్కరణ*

మండల కేంద్రమైన సుండుపల్లె లోని మానవతా సంస్థ చైర్మన్ మిన్నం రెడ్డి గంగిరెడ్డి, యర్రపు రెడ్డి అజయ్ కుమార్ రెడ్డి లతో కలిసి గాడీవాలా యాప్ లోగో ను యాప్ నిర్వహకులు శేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాప్ నిర్వహకులు శేఖర్ మాట్లాడుతూ గాడివాలా యాప్ లో వాహనదారులు తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని,దాని ద్వారా వాహన దారులు అధిక ప్రయోజనాలు పొందుత రాన్నారు.

నగరాలు,పట్టణాలలో ఓలా, వూబర్ వంటి వాటి ద్వారా వాహన దారులు పొందే ఆదాయం కన్నా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చన్నారు.ఈనెల 14వ తేదిన గాడీ వాలా యాప్ లాంచింగ్ చేస్తామని అప్పటి నుంచి ఆటో,సరుకుల రవాణా వాహనదారులు యాప్ ద్వారా తమ వాహనాలను గాడివాల యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలనీ కోరారు.

గాడివాలా యాప్ ద్వారా ఈ ప్రాంతం లోని వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.మొదట అన్నమయ్య జిల్లాలో పైలట్ గా గాడీవాలా యాప్ లాంచ్ చేసి భవిష్యత్తు లో ఇదే హెడ్ క్వార్టర్ గా పాన్ ఇండియా పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు.

*ఈ యాప్ ను వాహనదారులు, ప్రయాణికులు,రైతులు సద్వినియోగం చేసుకోవాలనీ తెలిపారు.* #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #అనంతపురంగంగమ్మ #కొనంపేట #సుండుపల్లి

*దివ్యాంగుల నేషనల్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయిన లక్కిరెడ్డిపల్లె  మండలం కోనంపేట వాసి కట్టా సుబ్బయ్య*      #అనంతపురంగంగమ్...
02/02/2024

*దివ్యాంగుల నేషనల్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయిన లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేట వాసి కట్టా సుబ్బయ్య* #అనంతపురంగంగమ్మ #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #కొనంపేట

02/02/2024

బండపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో Y ఆదిమూలం రెడ్డి శేఖర్ గంగమ్మ తల్లి ఆలయం పూజారి లక్కీ రెడ్డి పల్లి అన్నమయ్య జిల్లా 2024 February

*అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ న్యూస్*..,త్రాగునీరు లేక ఇబ్బందులు ఎక్కడ వ్యవసాయ పనులు వద్ద నీళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి త...
01/02/2024

*అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ న్యూస్*..,
త్రాగునీరు లేక ఇబ్బందులు ఎక్కడ వ్యవసాయ పనులు వద్ద నీళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి త్రాగునీరు తెచ్చుకొని బ్రతికే ప్రజలు, గడిచిన రాజకీయ పార్టీలు ఆ గ్రామాన్ని పట్టించుకోలేదు, ఈ మద్య జరిగిన గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి, పోలు సుబ్బారెడ్డి గారికి, వారి సమస్య చెప్పడంతో అప్పుడు మాట ఇచ్చారు, ఈ రోజున మల్లెంవాండ్ల పల్లె వాసుల కళ నెరవేరింది, వారి సంతోషానికి అవధులు లేవు..,స్వాతంత్య్రం వచ్చిన తరువాత త్రాగునీరు అందించిన వైసీపీ ప్రభుత్వం స్తానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి,
రాయచోటి రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు & స్టేట్ సివిల్ సప్లై డైరక్టర్ పోలు సుబ్బారెడ్డి, గారికి కృతజ్ఞతలు తెలిపిన మహిళలు, మాధవరం గ్రామం మల్లేంవాండ్ల పల్లె వాసులు.., గత నెలలో బోరు వేయగా 4 ఇంచులు నీళ్ళు పడ్డాయి..,
ఈ రోజున ఉదయం 11.45 నిమిషాలకు ఇంటింటికీ త్రాగునీరు కుళాయిలు ప్రారంభోత్సవంలో పాల్గొన రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు పోలు సుబ్బారెడ్డి, బిసి నాయకులు పల్లపు రమేష్, కనపర్తి హరినాద రెడ్డి.
మల్లెంవాండ్ల పల్లెలో పండుగలా జరుపుకొన్నారు, స్తానిక మహిళలు..,
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దీవాన్, కనపర్తి హరినాద రెడ్డి, మహేష్ నాయుడు, హరిప్రసాద్ నాయుడు, మనోహర నాయుడు, హేమంత్ నాయుడు, ఆనంద నాయుడు, రెడ్డెప్పా, మళ్ళప్ప,
బి.రెడ్డి ప్ప , పెద్ద రెడ్డేప్ప వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #అనంతపురంగంగమ్మ

*భైరవ స్వామి దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం...**రూ 20 లక్షల గడప గడప కు మన ప్రభుత్వంనిధులుతో పూర్తి చ...
01/02/2024

*భైరవ స్వామి దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం...*

*రూ 20 లక్షల గడప గడప కు మన ప్రభుత్వంనిధులుతో పూర్తి చేసిన సిమెంట్ రోడ్డు ప్రారంభంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి*

భైరవ స్వామి దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి రూరల్
మండలం లోని యండపల్లె సమీపంలోని భైరవ స్వామి దేవస్థానం నకు ఆర్ కె టి రోడ్డు నుంచి రూ 20 లక్షల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో నిర్మాణాలు పూర్తిచేసిన సిమెంట్ రోడ్డు ప్రారంభంలోస్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు వైస్సార్సీపీ ఐటీవింగ్ కార్యదర్శి బుడ్డా ధర్మారెడ్డి లతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఎంఎల్ఏ కు తొలుత కార్యక్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికి ,ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహింపచేసి,తీర్థ ప్రసాదాలు అందచేసి,చిత్రపటం అందించి దుస్సాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భైరవస్వామి దేవస్థానం రోజురోజుకూ అభివృద్ధి చెందుచుండడం హర్షణీయమన్నారు.20 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖ పరిధిలోకి కూడా చేర్చడం పనులు కూడా జరుగుతున్నాయి. ఆలయ అభివృద్ధికి తన సహకారాన్ని ఎల్లవేళలా అందిస్తానన్నారు.

రాయచోటి వైస్ ఎంపిపి జయపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు డా సత్యనారాయణ రెడ్డి, కౌన్సిలర్ ఆనంద రెడ్డి,
సర్పంచులు శంకరయ్య, దివాన్,నాగేశ్వర రావు, తిరుపాల్ నాయుడు, ఎంపీటిసి లు రామ్మోహన్ నాయుడు,విశ్వనాధ రెడ్డి,మాజీ ఎంపిటిసి మాధవరం రమేష్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి,మాజీ సర్పంచ్ ఖాదర్ వలీ,శ్రీనివాసులు రెడ్డి,హరినాధ రెడ్డి,ఎర్ర బయన్న, నల్ల బయన్న తదితరులు పాల్గొన్నారు. #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి #అనంతపురంగంగమ్మ

*నూతన జిల్లా కలెక్టర్  అభిశిక్త్ కిషోర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి*    రాయచోటి అన్నమయ్య జిల్ల...
31/01/2024

*నూతన జిల్లా కలెక్టర్ అభిశిక్త్ కిషోర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి*

రాయచోటి అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.అభిశిక్త్ కిషోర్ ను ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కలెక్టర్ ను కలిశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రజలకు అందించే విషయంలో తాము పూర్తిగా సహకారం అందిస్తామని, రాయచోటి నియోజక వర్గంతో పాటు జిల్లా అభివృద్ధిని సమిష్టి కృషితో సాదిద్దామని నూతన కలెక్టర్ కు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారు ఇరువురు కలిసి చర్చించారు. #అనంతపురంగంగమ్మ #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి

 #అత్యవసర_పరిస్థితుల_రక్తదానం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం రాజుల కాలనీకి చెందిన సమీవుల్లా డెంగ్యూ ఫీవర్ తో శ్రీ వెంకటే...
31/01/2024

#అత్యవసర_పరిస్థితుల_రక్తదానం
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం రాజుల కాలనీకి చెందిన సమీవుల్లా డెంగ్యూ ఫీవర్ తో శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చెరగా అత్యవసరంగా (B+Ve) ప్లేట్లెట్స్ అత్యవసరమని డాక్టర్స్ పేషంట్ వారికి తెలియజేయగా వారు హీబా బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదించగా తరుణ్ అనే యువకుడి చేత శ్రీ దీప బ్లడ్ బ్యాంకు నందు (B+Ve) రక్తదానం చేయించిన హీబా ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు మయాన మహమ్మద్ అలీ ఖాన్,
ఈ కార్యక్రమంలో సమీర్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది చంద్రహాస్, సులోచనమ్మ, తదితరులు పాల్గొన్నారు. #అనంతపురంగంగమ్మ #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి

*అన్నమయ్య జిల్లా*గాలివీడు మండలం కమాలమర్రి గ్రామంల మినీ అంగ్వాడీ కేంద్రం లో నాలుగు ఏళ్ల చిన్నారిపై అత్యాచారం పాల్పడిన వృద...
30/01/2024

*అన్నమయ్య జిల్లా*

గాలివీడు మండలం కమాలమర్రి గ్రామంల మినీ అంగ్వాడీ కేంద్రం లో నాలుగు ఏళ్ల చిన్నారిపై అత్యాచారం పాల్పడిన వృద్దుడు కొఱ్ఱపోతుల రెడ్డేయ్య (55)..

రెడ్డయ్య అంగన్వాడి టీచర్ సుబ్బలక్ష్మి కి బావ..

చిన్నారిని చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు.
అంగన్వాడి టీచర్ నిర్లక్ష్యం వల్లే ఆ పాపకు అన్యాయం జరిగిందంటున్న తల్లిదండ్రులు...

రేప్,ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

పోలీసు అదుపులో నిందితుడు రెడ్డెయ్య..

అంగన్వాడి టీచర్ సుబ్బలక్ష్మి పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని లక్కిరెడ్డిపల్లి సిడిపివో పద్మావతమ్మ... #అనంతపురంగంగమ్మ #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #సంబెపల్లి

*అన్నమయ్య జిల్లా...**గాలివీడు మండలం కమలామర్రిలోని పెద్దపల్లి గ్రామంలో అఘాయిత్యం...**అంగన్వాడీ కేంద్రం లోనే నాలుగేళ్ల చిన...
30/01/2024

*అన్నమయ్య జిల్లా...*

*గాలివీడు మండలం కమలామర్రిలోని పెద్దపల్లి గ్రామంలో అఘాయిత్యం...*

*అంగన్వాడీ కేంద్రం లోనే నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి...*

*కాసేపు ఇక్కడ ఉండు ఇంటికి వెళ్లి వస్తా అంటూ బావ రెడ్డెప్ప (55) కు చెప్పి వెళ్లిన విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ...*

*అదును చూసుకొని బాలిక పై లైంగిక దాడికి పాల్పడ్డ రెడ్డెప్ప...*

*బడి నుండి ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడం తో పోలీసులకు ఫిర్యాదు...*

*వైద్య పరీక్షల నిమ్మితం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బాలికను తీసుకోచ్చిన కుటుంబ సభ్యులు...*

*తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మానభంగం, ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుని కొరకు గాలింపు చర్యలు చేపట్టామని వివరాలు వెల్లడించిన డి ఎస్ పి మహబూబ్ భాష...* #సంబెపల్లి #లక్కీరెడ్డిపల్లిగంగమ్మ #అనంతపురంగంగమ్మ

Address

Rayachoti
Rayachoti

Telephone

+918639347143

Website

Alerts

Be the first to know and let us send you an email when 123Rayachoti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share