Mana Rayachoti

Mana Rayachoti RAYACHOTI & ANNAMAYYA DIRSTRICT NEWS AND AROUND THE GLOBE

Tirumala Hills ,Tirupati, Andhra Pradesh India
21/12/2024

Tirumala Hills ,Tirupati, Andhra Pradesh India

*RSS చీఫ్ మోహన్ భగవత్ మరో కపట నాటకం..*
21/12/2024

*RSS చీఫ్ మోహన్ భగవత్ మరో కపట నాటకం..*

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలుDec 19, 2024,పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలుఆంధ్రప్రదేశ్ : పెన్షన్ల లబ్ధిదారు...
21/12/2024

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Dec 19, 2024,

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ : పెన్షన్ల లబ్ధిదారులకు నోటీసుల జారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అర్హత లేని వారిని గుర్తించి, నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని సెర్చ్ సీఈవో కలెక్టర్లను మంగళవారం ఆదేశించారు. తాజాగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పెన్షన్ తీసుకునే అనర్హులకు నోటీసులు జారీ చేయవద్దని SMSల ద్వారా సూచించారు. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం దీనిపై మరేదైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి.

20/12/2024
*అన్నమయ్య జిల్లా* *రాయచోటి: డ్రిప్ పైపుల కోసం దరఖాస్తులు ఆహ్వానం* అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి డ్రిప్ పైపుల కో...
20/12/2024

*అన్నమయ్య జిల్లా*

*రాయచోటి: డ్రిప్ పైపుల కోసం దరఖాస్తులు ఆహ్వానం*

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి డ్రిప్ పైపుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారిని వనిత భాయ్ పేర్కొన్నారు. జిల్లాలో అత్యధికంగా రైతులు పండ్ల తోటలు సాగుచేస్తూ ఉంటారని తెలిపారు. డ్రిప్ పథకాన్ని పొంది ఏడు సంవత్సరాల పూర్తయిన రైతులు దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. తుంపర సేద్యం(స్పింకర్లు) పరికరాలు పొందవచ్చు అని అన్నారు.

కడపబద్వేలు గౌరీ సాయి వైన్స్ వద్ద మద్యంబాబుల వీరంగం...నడిరోడ్డుపైనే బాహాబాహీకి దిగిన మందుబాబులు...ఒకరిపై ఒకరు రాళ్లు & కత...
20/12/2024

కడప

బద్వేలు గౌరీ సాయి వైన్స్ వద్ద మద్యంబాబుల వీరంగం...

నడిరోడ్డుపైనే బాహాబాహీకి దిగిన మందుబాబులు...

ఒకరిపై ఒకరు రాళ్లు & కత్తితో దాడి...

ఇద్దరికి తీవ్ర గాయాలు...

కడప రిమ్స్ కు తరలింపు...

*అపరిచిత వ్యక్తులు &ఫోన్ నెంబర్ల నుండి కాల్స్ చేసి PHONE PAY గూగుల్ PAY చేయమని అడిగితే   మున్సిపల్ సేవలకు &బకాయిల అమౌంట్...
20/12/2024

*అపరిచిత వ్యక్తులు &ఫోన్ నెంబర్ల నుండి కాల్స్ చేసి PHONE PAY గూగుల్ PAY చేయమని అడిగితే మున్సిపల్ సేవలకు &బకాయిల అమౌంట్ పంపి మోసపోవద్దు*

*మున్సిపల్ కార్యాలయ గ్రౌండ్ ప్లోర్ పన్నుల వసూళ్ళ కేంద్రం & వార్డు సచివాలయ కార్యాలయం నందు లేదా మున్సిపల్ సిబ్బంది వారి ద్వారా మరియు CDMA వెబ్ సైట్ ద్వారా మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఫీజు,ఇంటి మరియు నీటి పన్నుల బకాయిలు చెల్లించి తగిన రసీదులు పొందండి*

*రాయచోటి మున్సిపల్ కమీషనర్ వాసుబాబు*.......

కొంతమంది సైబర్ నేరగాళ్ళు &అపరిచితులు పట్టణంలోని పలువురు వ్యాపారులకు మున్సిపల్ కమీషనర్ పేరుతో ఫోన్ చేసి మీ ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసిందని,ఫోన్ పే,గూగుల్ పే చేసి రెన్యువల్ చేసుకోవాలని మభ్యపెడుతునట్లు ఫిర్యాదులు అందాయని,కాబట్టి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రైవేట్ వ్యక్తులకు &అపరిచిత వ్యక్తులకు మున్సిపల్ సేవలకు &బకాయిల అమౌంట్ పంపి మోసపోవద్దని కమీషనర్ వాసుబాబు సూచించారు.
ఇప్పటికే కొందరికి ఈ క్రింది నెంబర్ (+91 62817 96199)నుండి కాల్స్ వచ్చినట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు.
దీనిపై రేపు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

* పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయ గ్రౌండ్ ప్లోర్ పన్నుల వసూళ్ళ కేంద్రం & వార్డు సచివాలయ కార్యాలయం నందు లేదా మున్సిపల్ సిబ్బంది వారి ద్వారా మరియు CDMA వెబ్ సైట్ ద్వారా మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఫీజు,ఇంటి మరియు నీటి పన్నుల బకాయిలు చెల్లించి తగిన రసీదులు పొందాలని సూచించారు.

మందిర్-మ‌సీదు వివాదాలు ఇక చాలు: భాగ‌వ‌త్
20/12/2024

మందిర్-మ‌సీదు వివాదాలు ఇక చాలు: భాగ‌వ‌త్

అన్నమయ్య జిల్లాపుల్లంపేట అటవీ ప్రాంతం అనంతసముద్రం బోటు మీద పల్లెలో పోలీసుల దాడిలో ఎర్రచందనం స్వాధీనం...రాజంపేట రూరల్ పోల...
20/12/2024

అన్నమయ్య జిల్లా

పుల్లంపేట అటవీ ప్రాంతం అనంతసముద్రం బోటు మీద పల్లెలో పోలీసుల దాడిలో ఎర్రచందనం స్వాధీనం...

రాజంపేట రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ యన్ . సుధాకర్ బాబు మీడియా సమావేశం లో వివరాలు వెల్లడి....

ఐదు మంది కూలీలు అరెస్టు,15 ఎర్రచందనం దుంగలు,రెండు బైక్ లు స్వాధీనం...

రిమాండ్ కు తరలిస్తునట్లు వెల్లడి....

ప్రకటన....
20/12/2024

ప్రకటన....

*ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు*అమరావతి :ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాల...
20/12/2024

*ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు*

అమరావతి :

ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకు రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖపై బుధవారం ఆమె సమీక్షించారు. “అంగన్వాడీ పిల్లలు సాధించిన పురోగతిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ప్రతినెల 5వ తేదీన ఈసీసీఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ప్రత్యేక డ్రైవ్ల ద్వారా 371మంది పిల్లల్ని కార్మికవృత్తి నుంచి విముక్తి కల్పించాం”అని తెలిపారు.

*కానిస్టేబుల్ వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యాయత్నం*  *ఓ అమ్మాయి నుంచి బంగారం తీసుకెళ్లావని బెదిరింపులు*  *కానిస్టే...
20/12/2024

*కానిస్టేబుల్ వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యాయత్నం*

*ఓ అమ్మాయి నుంచి బంగారం తీసుకెళ్లావని బెదిరింపులు*

*కానిస్టేబుల్ ఇంటికెళ్లి మళ్లీ విద్యార్థిని కొట్టినట్లు బంధువులు ఆరోపణ*

*విద్యార్ధి మనస్థాపం చెంది గుళికల మందు సేవించి ఆత్మహత్యాయత్నం*

*రాయచోటిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు*

*పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు నిర్ధారణ*

*హుటా హుటినా తిరుపతి సంకల్ప ఆసుపత్రికి తరలింపు*

రాయచోటి...

రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ధర్మా వేధింపులు తాళలేక విద్యార్ధి రామాంజనేయులు గుళికల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం నాడు చోటు చేసుకుంది. విద్యార్ధి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి మండలం మాధవరం గ్రామం కంచరపల్లె కాలనీకి చెందిన కలవపల్లి రామాంజనేయులు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ప్రధమ సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులు జీవనాధారం నిమిత్తం కువైట్ కు వెళ్లినారు. గురువారం కానిస్టేబుల్ ధర్మా మాధవరం గ్రామం కంచరపల్లెకు వచ్చి రామంజనేయులను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి ఓ అమ్మాయి నుంచి బంగారం తీసుకొచ్చావని నానా దుర్భాషలాడినట్లు బంధువులు తెలిపారు. సార్ నాకు ఏమి తెలియదు అని చెప్పిన కూడా కానిస్టేబుల్ ధర్మా వినకుండా కొట్టినట్లు తెలిపారు. వెంటనే రామాంజనేయులు మనస్థాపానికి గురై ఇంటిలోనికి వెళ్లి గుళికల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. వెంటనే బంధువులు రాయచాటిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి సీరియస్ గా ఉందని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పారు. ఈ విషయమై రాయచోటి అర్బన్ సిఐ చంద్రశేఖర్ ను వివరణ కోరగా ఆ విషయం నాకు తెలియదని, ఎటువంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. ఈ విషయమై కానిస్టేబుల్ పై జిల్లా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.

20/12/2024

*అమరావతి :*

పుష్ప సినిమా తరహాలో అల్లూరి జిల్లా గొలుగొండలో 450 కేజీల గంజాయి పట్టివేత.

వ్యాన్ పై కప్పులో టార్పన్లలో గుట్టుగా గంజాయి ప్యాక్ చేసిన స్మగ్లర్లు...

*పరిటాల రవి హత్యకేసులో నిందితులు విడుదల*➤ పరిటాల రవి హత్య కేసులో  కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ముద్దాయిలు..➤ నారాయణ ...
20/12/2024

*పరిటాల రవి హత్యకేసులో నిందితులు విడుదల*

➤ పరిటాల రవి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ముద్దాయిలు..

➤ నారాయణ రెడ్డి(ఏ3), రేఖమయ్య(ఏ4), బజన రంగనాయకులు(ఏ5), వడ్డే కొండ(ఏ6), ఓబిరెడ్డి(ఏ8)లకు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు..

*పోలీస్ కానిస్టేబుల్ బెదిరించడంతో పురుగుల మందు తాగిన యువకుడు...**రాయచోటి అర్బన్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న ఓ పోల...
20/12/2024

*పోలీస్ కానిస్టేబుల్ బెదిరించడంతో పురుగుల మందు తాగిన యువకుడు...*

*రాయచోటి అర్బన్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్,మాధవరం కంచరపల్లి కి చెందిన యువకుడిని ఇంటికి వెళ్లి బెదిరించడంతో,పురుగుల మందు తాగిన యువకుడు...*

*సదరు పోలీస్ కానిస్టేబుల్ ఒక బయటి పంచాయతీ విషయమై,యువకుడిని బెదిరించినట్టు సమాచారం...*

*యువకుడ్ని బట్టు వీధిలోని నారాయణరెడ్డి ఆసుపత్రి నందు చేర్పించగా, యువకుడి పరిస్థితి విషమం కావడంతో తిరుపతి సిమ్స్ ఆసుపత్రి నందు, చేర్పించినట్లు సమాచారం...*

*ఈ విషయంపై జిల్లా పోలీసు అధికారి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం...*

Address

Rayachoti
516269

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Rayachoti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana Rayachoti:

Videos

Share