VSV Creations

VSV Creations Vs creations
(1)

https://youtu.be/OZefhq3nzBg
07/05/2021

https://youtu.be/OZefhq3nzBg

డాక్టర్లని ఇప్పటి వరకూ చూడనే లేదు.......శ్రీకాకుళం జిల్లాలోని ఓ కొవిడ్‌ ఆస్పత్రిలో వసతుల లేమిపై వజ్రపుకొత్తూరు డ.....

https://youtu.be/O6IEXusu8C4
03/05/2021

https://youtu.be/O6IEXusu8C4

లాక్ డౌన్ మొదలైంది. # lock down starts # /// VSV Creations.......///అమరావతి : కోవిడ్‌ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకు.....

https://youtu.be/ejXHDcaeyyE
03/05/2021

https://youtu.be/ejXHDcaeyyE

ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్ పరీక్షలు ఎలా రాయాలో మీరే చెప్పండి ????ఈ పరిస్థితుల్లో ఇంటర్ పరీక్షలు ఎలా రా సేది ?? కరో.....

https://youtu.be/uI4XiLJBBDM
03/05/2021

https://youtu.be/uI4XiLJBBDM

ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించిన మంత్రి అనిల్ తనిఖీలు నిర్వహించారు...... రోగులకు సేవలు, కష్టాలు పై ఆరా....... నెల్లూరు జ...

Please subscribe my channel....https://youtu.be/S25YSWEYyDI
13/03/2021

Please subscribe my channel....https://youtu.be/S25YSWEYyDI

ములపేట రాధోచవం..... Please subscribe my channel.......VSV Creations....

https://youtu.be/o9guQ7QJpNQ
01/02/2021

https://youtu.be/o9guQ7QJpNQ

నెల్లూరు వేదాయపాలెం అయ్యప్ప గుడి సెంటర్ దగ్గర లో ఉన్న పరుపుల షాప్ దగ్గం.......Please subscribe my channel.......

Hiiii
21/12/2020

Hiiii

Please subscribe my channelhttps://youtu.be/2HKtaz6nCGo
15/12/2020

Please subscribe my channel
https://youtu.be/2HKtaz6nCGo

సడన్ ప్లాన్ to థర్మల్ పవర్ ప్లాంట్.........Please subscribe my channel.......Vs creations...........

Please subscribe my channelhttps://youtu.be/nDeDn3u-eJ0
12/12/2020

Please subscribe my channel
https://youtu.be/nDeDn3u-eJ0

నెల్లూరు ఆటో నగర్ లో లక్ష రూపాయల చేసే గుట్కా ప్యాకెట్ల స్వాధీనం......నెల్లూరు ఆటో నగర్ లో రెండు ఇళ్లలో అక్రమంగా ని.....

https://youtu.be/FcI1YKf3KnY
11/12/2020

https://youtu.be/FcI1YKf3KnY

టోల్ ప్లాజా గూండాలే నన్ను కొట్టారు.........వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి వివరణ......గుంటూరు జిల్లా కాజా .....

Please subscribe my channel https://youtu.be/YEJIexLu574
11/12/2020

Please subscribe my channel https://youtu.be/YEJIexLu574

మూలపేటలో ఆటో బోల్తా.......మూలపేట నీలగిరిసంగం దగ్గర కూరగాయలు లోడుతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది అదృష్ట....

Please subscribe my channel https://youtu.be/Xp0rxsKMvXs
03/12/2020

Please subscribe my channel https://youtu.be/Xp0rxsKMvXs

మొన్న నెవర్ నేడు బురేవి.......బురేవి తుఫాన్ తో గత రాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షానికి మ...

 #జాగ్రత్త #ఆడపిల్లలున్న_తల్లిదండ్రులార..! ONLY FOR YOU★ మీ ఇంట్లో వయసుకి వచ్చిన ఆడపిల్లలుంటే వారిని ఓ కంట కనిపెట్టండి,న...
28/11/2020

#జాగ్రత్త

#ఆడపిల్లలున్న_తల్లిదండ్రులార..! ONLY FOR YOU

★ మీ ఇంట్లో వయసుకి వచ్చిన ఆడపిల్లలుంటే వారిని ఓ కంట కనిపెట్టండి,
నా కూతురు బంగారం దానికి ఏం తెలియదు అని తల్లిదండ్రులు గుడ్డిగా అనుకోవద్దు..!!

✦ ఒకప్పటి కాలం నాటి ఈడుకొచ్చిన ఆడ పిల్లలకు ఇళ్ళే లోకం!
కాని నేటి కాలం ఆడ పిల్లల చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే అదే లోకం..!!

★ మన అమ్మాయిలు మంచి వారే కావచ్చు,
కాని అవధులు లేని ఇంటర్నెట్ ప్రపంచం మన అమ్మాయిలను తప్పు తోవ పట్టించడానికి సంసిద్దంగా ఉంది..!!

★ ఏదో టైం పాస్ కి టిక్ టాకులు చూస్తున్నారో,వెర్రిగా టిక్ టాకు వీడియోలు చేస్తున్నారో అనే విషయం కూడా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు..!!

★ కొందరి తల్లిదండ్రులకైతే వారి పిల్లలు సోషల్ మీడియా అప్ప్స్ లాంటి మాధ్యమాల్లో ఎంత అసభ్యంగా వీడియోలు చేస్తున్నారో తెలుసుకునే పరిస్థితుల్లో కూడా లేరు,
సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే ఆన్ లైన్ ప్రేమలు మొదలయ్యేది..
ఎందరో ఆడపిల్లల జీవితాలు నాశనమయ్యేది..!!

★ ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళ కూతురికి స్మార్ట్ ఫోన్ ఉన్నట్టయితే వారితో స్నేహంగా ఉంటూనే వారి మొబైల్లో ఎలాంటి యాప్స్ ఉన్నాయ్??
ఫేస్ బుక్,వాట్సప్ లాంటివి ఉన్నాయా??
ఉంటే వారి లిస్టేంటి??
వాట్సపుల్లో ఆడవారి పేరు ఉండి చాటింగ్ క్లియర్ లాంటివి చేస్తున్నారా???
లాంటి విషయాలు అప్పుడప్పుడు గమనిస్తుండాలి..

★ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పెళ్ళి అయిందని తెలుసుకోక ప్రేమ మైకంలో అతనితో లేచిపోయే వరకు కూడా తెలియదు..!!

ఇంట్లో ఉన్న ఇరవై ఐదు లక్షల బంగారంతో ఆ అబ్బాయితో లేచిపోయాక మోసపోయానని గ్రహించింది..
కసాయి వాడి చేతిలో చిక్కిన మేక తప్పించుకోకుండా ఆ కసాయి వాని కత్తికి బలైనట్టే...!

ఇ అమ్మాయి వాడి చెర నుండి తప్పించుకోబోయి వాడి కత్తికి బలైంది..!!

★ అందుకే చేతులు కాలక ముందే చేతిలో ఆకులు పట్టుకోవాలనేది!
తరువాతేం చేసినా అంతా వృథానే..!!

★ అందుకే ఇంట్లో వయసుకొచ్చిన అమ్మాయిలతో వారి తల్లిదండ్రులు అనుమానంతో కాక స్నేహ పూర్వకంగా ఇలాంటి విషయాలను తెలియజేసి,సోషల్ మీడియాలో ఆధ్యాత్మికమైన వీడియోలు,అలాగే విఙ్నానాన్ని పెంచేవి చూపడానికి సహాయం చేయాలి..!!

★ అప్పుడే వారు నిజాలు గ్రహించి లవ్ జిహాది లాంటి ఉచ్చులో పడరు..!!

★ ఇటీవలకాలంలో తెలుగు రాష్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఘటనలు,అలాగే రెండుకుటుంబాలలో తీరని విషాదం మిల్చిన ఘటనలు మనందరికీ గుర్తుండే వుంటుంది.!!

★ ఒక అమృత లాగ భర్తను,తండ్రిని కోల్పోరు..!!
ఒక అవంతీ లాగ తన భర్త హేమంత్ ని కొల్పోరూ..
ఇదంతా అర్థం చేసుకుంటారని,,నామనవిని....

Subscribe the channel https://youtu.be/eDhUGbUaeBI
26/11/2020

Subscribe the channel https://youtu.be/eDhUGbUaeBI

నెల్లూరు to పెంచలకోన వాటర్ ఫాల్స్..... नेल्लोर से पेंखलाकोना पानी गिरता है ..... Nellore to tirumala https://youtu.be/ee7dSpnLSZg

Subscribe  https://youtu.be/LcceZ3Tfvn4
15/11/2020

Subscribe https://youtu.be/LcceZ3Tfvn4

దీపావళి శుభాకాంక్షలు......... Happy Diwali.......Vs creations.

Subscribe :https://youtu.be/lzPI416IBBw
13/11/2020

Subscribe :
https://youtu.be/lzPI416IBBw

నెల్లూరు లో వర్షాల వాళ్ళ నీటి ప్రవాహం............. Vs creations

అమ్మా, నాన్నా.. మేం పోతున్నాం........ గుంటూరు : క్రికెట్‌ బెట్టింగ్‌ కారణంగా ఓ యువకుడు ప్రాణం కోల్పోగా.. మరో వ్యక్తి పరి...
11/11/2020

అమ్మా, నాన్నా.. మేం పోతున్నాం........

గుంటూరు : క్రికెట్‌ బెట్టింగ్‌ కారణంగా ఓ యువకుడు ప్రాణం కోల్పోగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర సురేష్‌, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరూ క్రికెట్‌ బెట్టింగ్‌లో లక్షల రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్‌ నిర్వాహకుడికి రూ. 30వేలు చెల్లించగా.. మరో రూ.80 వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో బాకీలు తీర్చలేక మనస్తాపంతో బెల్లంకొండ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.అంతేగాక తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని గుంటూరు ప్రైవేటు అస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్‌ మృతి చెందగా, కొమురయ్య పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెల్లంకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

విషాదం: ప్రేమికులిద్దరూ మృతి........... వికారాబాద్‌: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట కథ విషాదాంతం...
05/11/2020

విషాదం: ప్రేమికులిద్దరూ మృతి...........

వికారాబాద్‌: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. ప్రేమికులిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగిపోయారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కీర్తన (16), బాలరాజ్ (22) కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం ఇరువురి ఇళ్లల్లో తెలిసిపోయింది. దీంతో భయాందోళన చెందిన ప్రేమికులు పురుగుల మందు తాగారు. కీర్తన అక్కడిక్కడే మృతి చెందగా.. హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో బాల్‌రాజ్‌ ప్రాణాలు విడిచాడు.

ఆవు దూడపై అత్యాచారం......... హైదరాబాద్‌ : మూగ జీవిపై అఘాయిత్యానికి పాల్పడి జైలు పాలయ్యాడో కామాంధుడు. ఈ సంఘటన హైదరాబాద్లో...
03/11/2020

ఆవు దూడపై అత్యాచారం.........

హైదరాబాద్‌ : మూగ జీవిపై అఘాయిత్యానికి పాల్పడి జైలు పాలయ్యాడో కామాంధుడు. ఈ సంఘటన హైదరాబాద్లోని సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్‌ వర్మ అనే వ్యక్తి ఎల్బీనగర్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఆవు దూడపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సరూర్‌ నగర్‌ పోలీసులు సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడ్ని రిమాండ్‌కు తరలించారు.

టిప్పర్‌ను ఢీకొన్న స్మగ్లర్ల వాహనం........ *మంటలు చెలరేగి నలుగురు కూలీల సజీవ దహనం*చికిత్స పొందుతూ మరొకరు మృతి*మృతులంతా త...
03/11/2020

టిప్పర్‌ను ఢీకొన్న స్మగ్లర్ల వాహనం........

*మంటలు చెలరేగి నలుగురు కూలీల సజీవ దహనం

*చికిత్స పొందుతూ మరొకరు మృతి

*మృతులంతా తమిళనాడు వాసులే

*దగ్ధమైన స్కార్పియో వాహనంలో ఎర్ర చందనం దుంగలు.

వల్లూరు (వైఎస్సార్‌ జిల్లా): వైఎస్సార్‌ జిల్లా కడప–తాడిపత్రి ప్రధాన రహదారిపై వల్లూరు మండల పరిధిలోని గోటూరు, తోల్లగంగనపల్లె బస్‌స్టాప్‌ల మధ్య సోమవారం వేకువజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంకరను అన్‌లోడ్‌ చేసిన టిప్పర్‌ వేకువజామున 3.15 గంటల సమయంలో కడప వైపు వెళ్లేందుకు ప్రధాన రహదారిపైకి ఎక్కుతుండగా అనంతపురం వైపు ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్న స్కార్పియో వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాని వెనుకే వస్తున్న మరో కారు సైతం వీటిని ఢీకొంది. దీంతో టిప్పర్‌ డీజిల్‌ ట్యాంక్‌ ధ్వంసమై మంటలు చెలరేగాయి.ఈ దుర్ఘటనలో స్కార్పియో వాహనంలోని ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠాకు చెందిన కూలీల్లో నలుగురు సజీవ దహనం కాగా.. అందులో ఉన్న ఎర్ర చందనం దుంగలు కాలిపోయాయి. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మూర్తి అనే మరో కూలీ మృతి చెందాడు. ప్రాథమిక ఆధారాలను బట్టి సజీవ దహనమైన వారిలో ముగ్గురు తమిళనాడుకు చెందిన రాజన్, సందిరన్, రామచంద్రన్‌గా తెలుస్తోంది. మృతుల్లో మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో టిప్పర్, స్కార్పియోతో పాటు మరో కారు కూడా కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌ డ్రైవర్‌ కిందకు దూకి అపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదానికి గురైన మరో కారు ఎవరిది, అందులో ప్రయాణిస్తున్న వారు ఏమయ్యారనేది ఇంకా తెలియరాలేదు. అరుదైన ఎర్ర చందనం చెట్లు కడప, రాజంపేట, ప్రొద్దుటూరు డివిజన్ల పరిధిలో దాదాపు 3.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఈ మూడు డివిజన్ల పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 13 చెక్‌ పోస్టులు నడుస్తున్నాయి. గతంలో కడప డివిజన్‌లోని సిద్ధవటం, రాయచోటి, వేంపల్లె, భాకరాపేట ప్రాంతాల నుంచి ఎర్ర చందనం ఎక్కువగా స్మగ్లింగ్‌ అయ్యేది. ఆ తరువాత సద్దుమణిగినా.. ఈ ఘటనతో స్మగ్లర్ల ఉనికి మరోసారి వెలుగులోకి వచ్చింది.

03/11/2020

కుటుంబంలో చిచ్చు రేపిన కలహాలు.......

వరంగల్‌: కలహాలు ఓ కుటుంబంలో చిచ్చురేపాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి ఆత్మహత్యకు కారణమయ్యాయి. వ్యవసాయ భూమి విషయంలో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన తమ్ముడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, విషయం తెలిసిన సోదరి సైతం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండలం నక్కలపెల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మహ్మద్‌ రబ్బానీ (43), సైదాబీ అక్కా తమ్ముళ్లు. ఒకే ఊళ్లో వేర్వేరుగా ఉంటున్న వీరి మధ్య కొంతకాలంగా వ్యవసాయ భూమి విషయమై గొడవలు జరుగుతున్నాయి.ఆదివారం కూడా గ్రామ పెద్దల ఎదుట ఇదే విషయమై పంచాయితీ జరగగా, 2 కుటుంబాలు మరోసారి గొడవ పడ్డాయి. ఈ క్రమంలో అక్క సైదాబీ.. రబ్బానీని దుర్భాషలాడింది. దీంతో మనస్తాపానికి గురైన రబ్బానీ, అతని కుమార్తె మొహిరున్నీసా (22) గడ్డి మందు తాగారు. వీరిద్దరిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం రబ్బానీ మృతి చెందాడు. మొహరున్నీసా పరిస్థితి విషమంగా ఉంది. అయితే, రబ్బానీ మృతి వార్త తెలియగానే సైదాబీ సైతం ఇంట్లో ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి పరిశీలించగా, అప్పటికే ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఏరియా ఆసుపత్రిలో దారుణం.......వనస్థలిపురం(హైదరాబాద్‌): నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఓ శిశువు మృతి కలకలం...
03/11/2020

ఏరియా ఆసుపత్రిలో దారుణం.......

వనస్థలిపురం(హైదరాబాద్‌): నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఓ శిశువు మృతి కలకలం రేపింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయాడంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల మండలం నల్లచెరువుకు చెందిన ఊట శేఖర్, ప్రసన్న దంపతులు మీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. ప్రసన్న మొదటి కాన్పు నిమిత్తం మూడు రోజుల కిందట వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చేరింది. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రసవమై మగ శిశువు జన్మించాడు. బాలుడిని డ్యూటీలో ఉన్న డాక్టర్‌ విజయలక్ష్మి తలకిందులుగా చేసి వీపుపై తడుతుండగా కిందపడి చనిపోయినట్లు అక్కడే ఉన్న బాలుని అమ్మమ్మ మార్తమ్మ పేర్కొన్నారు.అయితే చిన్నారి మృతి చెందిన విషయం చెప్పకుండా వెంటనే నీలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని డాక్టర్‌ తమపై ఒత్తిడి తెచ్చినట్లు బంధువులు ఆరోపించారు. కాగా వైద్యురాలు విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ హరిప్రియ మాట్లాడుతూ బాబు కిందపడలేదన్నారు. నెలలు నిండకపోవడం, బలహీనంగా ఉండి, చలనం లేకపోవడంతోనే నీలోఫర్‌కు రిఫర్‌ చేశామని చెప్పారు.బాలుని తలపై గాయం ఉందని, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందడంతో పోలీసులు చేరు కుని ఘర్షణ నివారించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని మీర్‌పేట కార్పొరేటర్‌ రాజ్‌కుమార్, తదితరులు డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వైద్యురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బంధువులు తెలిపారు.

హైదరాబాద్‌: పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ సెక...
03/11/2020

హైదరాబాద్‌: పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ చదివే విద్యార్థులకు ఇంటర్‌ విద్యాబోధనతో పాటు పోలీసుశాఖలో ఉద్యోగం సంపాధించేందుకు అవసరమైన అంశాల్లోనూ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు పోలీసుశాఖతో ఇంటర్మీడియట్‌ బోర్డు ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటర్మీడియట్‌ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠ్యాంశాల బోధనతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన జనరల్‌ నాలెడ్జ్, రీజనింగ్, ఇతర అంశాలతో పాటు రన్నింగ్, జంపింగ్‌ వంటి శారీరక ధృడత్వం వంటి అంశాలపై కూడా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు నగరంలోని ఏడు ఇంటర్మీడియట్‌ కాలేజీలను ఎంపిక చేసిందిప్రస్తుతం ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విభాగాల్లో విద్యార్థులను ఎంపిక చేసి, సామాజిక సేవా కార్యక్రమాలు, మానసిక, శారీరక క్రమశిక్షణ అంశాల్లో శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పోలీసు విభాగంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. తద్వారా విద్యార్థులు చిన్నతనంలో పక్కదారి పట్టకుండా ఉండటంతో పాటు పోలీసు వ్యవస్థపై అవగాహన ఏర్పడి, అటు వైపు ఆకర్షితులవుతారు. అంతేకాదు భవిష్యత్తులో ఆ శాఖలో ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉందని హైదరాబాద్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిని జయప్రదబాయి అభిప్రాయపడ్డారు. అంతేకాదు పోటీ పరీక్షల కోసం ప్రైవేట్‌ ఇనిస్టిట్యూషన్లను ఆశ్రయించాల్సిన అవసరం కూడా ఆయా విద్యార్థులకు ఉండదని ప్రకటించారు. ఆసక్తిగల అభ్యర్థులు శిక్షణ కోసం ఎంపిక చేసిన ఆయా కాలేజీల్లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉందని ఆమె సూ చించారు.

శిక్షణ కోసం ఎంపిక చేసిన కాలేజీలు ఇవే...

*గన్‌ఫౌండ్రీ అలియా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ
*ప్రభుత్వ మహబూబియా బాలికల కళాశాల
*మలక్‌పేట్‌ న్యూ జూనియర్‌ కాలేజీ
*నాంపల్లి ఎంఏఎం జూనియర్‌ కాలేజీ
*కాచిగూడ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ
*ఫలక్‌నుమా బోయ్స్‌ జూనియర్‌ కాలేజీ
*మారేడ్‌పల్లి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీ

హైదరాబాద్ : భాగ్యనగరంలో నాలాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. తెరుచుకుని ఉన్న నాలా మనుషులను మిగేస...
03/11/2020

హైదరాబాద్ : భాగ్యనగరంలో నాలాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. తెరుచుకుని ఉన్న నాలా మనుషులను మిగేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో అధికారులు నిర్లక్ష్యం మరో మహిళను బలితీసుంది. ఉదయం నడకకు వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడిన సరోజ శవమై తేలారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. సరూర్ నగర్ చెరువు కింద ఉన్న శారదా నగర్ కి చెందిన సరోజ తెల్లవారుజామున ఉదయం ఆరుగంటల సమయంలో ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హుటాహుటిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ను, పోలీసులను, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు.అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె మృతి చెందారు. చైతన్యపురిలోని హనుమాన్‌నగర్ నాలలో మృతదేహం లభ్యంమైంది. మృతదేహాన్ని వెలికితీసిన సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవల హైదరాబాద్‌ నగరంలో భారీగా వర్షాలు కురవడంతో నాలాలు ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. ఇక తాజా ఘటన నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు వరుసగా సంభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Address

Mulapet
Nellore
524003

Alerts

Be the first to know and let us send you an email when VSV Creations posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VSV Creations:

Share