Suneel journalist

Suneel journalist Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Suneel journalist, Media/News Company, Nellore.

*N3news.in*రోజ్‌మాండ్ లెక్క‌లు తెల్చ‌డమే-రేప‌టి నుంచి 2వ‌ర‌కు రోజ్‌మాండ్ పోలీసు క‌స్ట‌డి*Subscribe For More Videos*
23/12/2022

*N3news.in*

రోజ్‌మాండ్ లెక్క‌లు తెల్చ‌డమే
-రేప‌టి నుంచి 2వ‌ర‌కు రోజ్‌మాండ్ పోలీసు క‌స్ట‌డి

*Subscribe For More Videos*

రోజ్‌మాండ్ లెక్క‌లు తెల్చ‌డమే-రేప‌టి నుంచి 2వ‌ర‌కు రోజ్‌మాండ్ పోలీసు క‌స్ట‌డి

*N3news.in*తల్లి కళ్లెదుటే కూతురు సజీవ దహనం -ఓ ఇంట్లో అగ్నిప్ర‌మాదం-గ్యాస్‌సిలిండ‌ర్ పేలిందో.. పెట్రోలుకు నిప్పు అంటుకుం...
26/11/2022

*N3news.in*

తల్లి కళ్లెదుటే కూతురు సజీవ దహనం
-ఓ ఇంట్లో అగ్నిప్ర‌మాదం
-గ్యాస్‌సిలిండ‌ర్ పేలిందో.. పెట్రోలుకు నిప్పు అంటుకుందో..
-కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌ట‌న‌

*Subscribe For More Videos*

మ‌హిళ స‌జీవ ద‌హ‌నం-ఓ ఇంట్లో అగ్నిప్ర‌మాదం-గ్యాస్‌సిలిండ‌ర్ పేలిందో.. పెట్రోలుకు నిప్పు అంటుకుందో.. -కోవూరు నియో....

ప్రపంచ విపత్తు
25/10/2022

ప్రపంచ విపత్తు

*N3news.in*మంగుళూరు వద్ద సముద్రంలో మునిగిన పడవ కావలి, అల్లూరు మత్స్యకారులు తృటిలో తప్పించుకున్న కావలి, అల్లూరు మండలాల మత...
08/08/2022

*N3news.in*

మంగుళూరు వద్ద సముద్రంలో మునిగిన పడవ కావలి, అల్లూరు మత్స్యకారులు
తృటిలో తప్పించుకున్న కావలి, అల్లూరు మండలాల మత్స్యకారులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

*For More Videos Subscribe*

https://youtu.be/282XYSiRczQ

మంగుళూరు వద్ద సముద్రంలో మునిగిన పడవ కావలి, అల్లూరు మత్స్యకారులు తృటిలో తప్పించుకున్న కావలి, అల్లూరు మండలాల మత్...

*N3 న్యూస్*నెల్లూరులోనూ  "గోరంట్ల మాధవ్"..!! ఆ నేత  ఎవరు..?*వీడియో కోసం క్రింద లింక్ క్లిక్ చెయ్యండి 👇🏻*https://youtu.be...
05/08/2022

*N3 న్యూస్*

నెల్లూరులోనూ "గోరంట్ల మాధవ్"..!!

ఆ నేత ఎవరు..?

*వీడియో కోసం క్రింద లింక్ క్లిక్ చెయ్యండి 👇🏻*

https://youtu.be/QeRFyDEakik

నెల్లూరు నూ గోరంట్ల మాధవ్ కన్నా ఇంకా గొప్ప కళాకారుడు ఉన్నాడని... త్వరలోనే ఆ కళాకారుడేవరో బయట పెడతామని తెలుగుదేశ....

*N3News.in*నాయుడుపేట మండ‌లంలో వేల బాతులు మృత్యువాత‌..విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని అనుమానం..*Subscribe For More Videos*https:...
05/08/2022

*N3News.in*

నాయుడుపేట మండ‌లంలో వేల బాతులు మృత్యువాత‌..విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని అనుమానం..

*Subscribe For More Videos*

https://youtu.be/5VqUWTDN5w0

తిరుప‌తి జిల్లా నాయుడుపేట మండ‌లంలో వేల బాతులు ఒక్క‌సారిగా మృత్యువాత ప‌డ్డాయి.. పెళ్లకూరు మండలం రావుల పాడు గ్రా...

బ్రేకింగ్ న్యూస్--కృష్ణపట్నం పోర్ట్ దగ్గరలోని ఇమామీ ఆగ్రో టెక్ ఆయిల్ కంపెనీలో వెలువడ్డ విషవాయువులు. 8 మందికి తీవ్ర అస్వస...
30/06/2022

బ్రేకింగ్ న్యూస్
--
కృష్ణపట్నం పోర్ట్ దగ్గరలోని ఇమామీ ఆగ్రో టెక్ ఆయిల్ కంపెనీలో వెలువడ్డ విషవాయువులు.
8 మందికి తీవ్ర అస్వస్థత
--
Pls like and share
https://www.facebook.com/104974455560714/posts/125218386869654/

Big Breaking
ఇమామీ ఆగ్రో టెక్ లో వెలువడ్డ విషవాయువులు!!
- 8మంది కి తీవ్ర అస్వస్థ
-నెల్లూరు GGH కి తరలింపు
--
N3- న్యూస్
--
నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం పోర్టు వ‌ద్ద ఉన్న ఇమామీ ఆగ్రో టెక్ కంపెనీలో గురువారం సాయంత్రం విష‌వాయువులు వెలువ‌డ్డాయి. విషవాయువులు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. ఒక్క‌సారిగా ఈ విష‌వాయువులు వ్యాపించ‌డంతో స్థానిక‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌వాయువుల‌ ప్ర‌భావంతో 8 మంది తీవ్ర అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు. వారిని వెంట‌నే చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింది ? ఏ విష‌వాయువులు వ్యాపించాయి ? ఎంతమంది ఈ ప్రభావానికి గురయ్యారు ? వారెక్కడివారు ? అనేది తెలియాల్సివుంది. అయితే ఈ విషయాన్ని ఆ కంపెనీ నిర్వాహకులు, స్థానిక పోలీసులు, కొందరు రాజకీయ నేతలు బయటకు రానీయకుండా జాగ్రత్త పెడుతూండటం విశేషం.
--
-సునీల్. ఆర్

https://www.facebook.com/104974455560714/posts/123554113702748/
26/06/2022

https://www.facebook.com/104974455560714/posts/123554113702748/

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ
ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు అప్డేట్...............................................
నాలుగో రౌండ్ ఫలితాల వివరాలు :
వైయస్సార్ సిపి అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి : 21043
బిజెపి అభ్యర్థి శ్రీ భరత్ కుమార్ : 3658
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :683
నోటా : 699

నాలుగో రౌండ్ (4 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 17385 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు........................
N3 న్యూస్
--

10/06/2022

కావలి MLA కుమారుని వివాహ రిసెప్షన్ కి వలంటీర్ల తో పిలుపులకు ఓ అధికారిణి ఆదేశాలు.
----
Pls like and share
--
https://fb.watch/dzd-nfmuWZ/

02/06/2022

వాళ్ళు మా అభిమానులు కాదు
- నాగబాబు
Pls like and share
https://fb.watch/doFa4l5agQ/

నెల్లూరు సిటీ ఆనం కేPls like and sharehttps://www.facebook.com/104974455560714/posts/113839258007567/
01/06/2022

నెల్లూరు సిటీ ఆనం కే
Pls like and share
https://www.facebook.com/104974455560714/posts/113839258007567/

*నెల్లూరులో వలసలు ఖాయం..!!*
- *సిటీ టీడీపీ అభ్యర్థిగా ఆనం..??*
- *కోటంరెడ్డి పరిస్థితి ఏంటీ..?
---
N3-న్యూస్
--
జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మరిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుండటంతో ఒక గూటి పక్షులు మరో గూటికి మారినట్లు కొందరు తమ స్వార్ధం కోసం, అధికారం కోసం పార్టీలు మరెందుకు సిద్ధమయ్యారు. ఇందులో ముఖ్యంగా ఆనం కుటుంబం. ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్య రెడ్డితో ఇది ప్రారంభం అయినట్లు కనిపిస్తోంది.

2019లో వైసీపీ టికెట్ పై వెంకటగిరి MLA గా గెలుపొందిన ఆనం మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం పై, మాజీ మంత్రి అనిల్ పై పరోక్షంగా వ్యతిరేకత ప్రదర్శిస్తూనే ఉన్నారు. విమర్శలు సైతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారుతున్నారని, అందుకే ఈ ఆరోపణలు అనే సందేహం అందరిలో కలిగింది. దీన్ని బలపరిచేలా ఇటీవల ఒంగోలు లో జరిగిన టీడీపీ మహానాడు లో రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్య రెడ్డి లోకేష్ ని కలవడంతో ఆనం పార్టీ మారడం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు.
---
*TD జనార్దన్ ని కలసిన ఆనం*
--
ఇంకో ఆసక్తికరమైన, కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే.. టీడీపీ లో కీలకంగా ఉన్న TD జనార్దన్ రావు ను ఆనం రామనారాయణ రెడ్డి మహానాడు కు రెండు రోజులు ముందుగానే విజయవాడలో రహస్యంగా కలిసినట్లు పక్కా సమాచారం. ఈ విషయాన్ని ఆ పార్టీ లోని పెద్దలే చర్చించుకుంటున్నారు కూడా. అప్పుడే టీడీపీ లో ఆనం కుటుంబం చేరే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. వీరి రహస్య భేటీ క్రమంలోనే కైవల్య లోకేష్ ని కలిసిందని ప్రచారం కూడ జరుగుతోంది. దీన్ని ఆనం కొట్టిపారేసినా, నాకు సంబంధం లేదని తేల్చినా... TD జనార్దన్ ని కలిసింది మాత్రం పక్కా. అంతే కాకుండా కైవల్య రెడ్డి లోకేష్ ని కలిసొచ్చాక నెల్లూరు నగరంలోనే ఉంటోంది. తన తండ్రి నివాసం నుంచే జిల్లా టీడీపీ నేతలను కలుస్తోంది. ఇప్పటికే అనేకమంది ఆమెను టీడీపీ లోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నామని నగర, రూరల్ టీడీపీ నేతలు అంటున్నారు కూడా.. మరి ఇది దేనికి సంకేతం రామనారాయణ రెడ్డి మాత్రం చెప్పగలరు.
---
*సిటీ నుంచి బరిలో ఆనం*
--
ఆనం కుటుంబం కి టీడీపీ సొంత ఇల్లు లాంటిది. వారి రాజకీయ ప్రయోజనాలకోసం పార్టీలు మారినా వచ్చే ఎన్నికలకు మాత్రం వారు సొంత గూటికి చేరుకోవడంతో ఎలాంటి సందేహం లేదంటున్నారు. మొదటి నుంచి వారు టీడీపీ నుంచి మూడు స్థానాలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మాత్రం అధిష్టానం నుంచి స్పష్టత రాలేదు. ఆనం మాత్రం తమ ప్రతిష్టను నిలుపుకునేందుకు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు టీడీపీ పెద్దలు( ఆనం ను వైసీపీ లోకి తీసుకెళుతున్న నేతలు) హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక కైవల్య వచ్చే ఎన్నికలకు ఆత్మకూరు నుంచి పోటీ చేయాలన్న కోరికను వెలుబుచ్చేసింది. ఇక మరో టికెట్టు పైనే ఎలాంటి హామీ లేదు.
---
*పాపం కోటంరెడ్డి*
నెల్లూరు సిటీ నుంచి MLA గా పోటీ చేయాలని, అసెంబ్లీలో "అధ్యక్ష్యా" అనాలన్నది టీడీపీ నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోరిక. అందుకోసం ఆయన చేస్తున్న పోరాటాలు, ఆందోళనలు అన్నీ ఇన్నీ కావు. అటు జగన్, ఇటు అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు చేస్తున్నా... అధిష్టానం మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. ప్రతీ సారి ఎవరో ఒకరు వచ్చి ఆ అవకాశాన్ని తన్నుకు పోతున్నారు. మొదటి నుంచి కోటంరెడ్డి వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం, మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారని చంద్రబాబు కు ఆ పార్టీలోని పెద్దలే మోస్తున్నారు. అంతే కాకుండా నగరంలో సొంత క్యాడర్తో, సొంత అజెండాలో ముందుకెళుతున్నారని కూడా ఆ పార్టీ లోనివారే పార్టలోని పెద్దల వద్ద చెపుతున్నారన్న ఆరోపణలున్నాయి. దాంతో ఈ సారి కూడా ఆనం రూపంలో కోటంరెడ్డికి ఝలక్ ఇచ్చేలా ఉన్నారు. దీంతో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎంటనేది ప్రశ్నఅర్ధకం. మొత్తానికి మరి కొద్ది రోజుల్లో నెల్లూరు నగరం రాజకీయాలు కూడా భలే రంజుగా మారనున్నాయి.
--
- సునీల్. ఆర్
N3- న్యూస్
(కల్తీ లేని వార్తలు - కలకలం రేపే కథనాలు)
అతి త్వరలో మీ ముందుకు
--

https://www.facebook.com/104974455560714/posts/110364631688363/
28/05/2022

https://www.facebook.com/104974455560714/posts/110364631688363/

Big Breaking News
లోకేష్ ను కలసిన ఆనం కైవల్య రెడ్డి..!!
- టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం ఐనట్లేనా..?
- ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతోనేనా..?
- లోకేష్ ని కలవడంలో ఆనం వ్యూహం ఏంటి.
- జిల్లా రాజకీయాల్లో మారనున్న రాజకీయం
- మాజీ మంత్రి అనిల్ చెప్పింది నిజమేనా..?
- మంత్రి కాకాణి ఏం సమాధానం చెప్తారు.
- ఇదే ఇప్పుడు ఆసక్తికర అంశం
----
N3 న్యూస్
--
గత కొద్దిరోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ఒకరిమీద ఒకరు ఆరోపణలు, విమర్శలు.. వేధింపులు, ఒకరే లక్ష్యం గా వ్యూహాలు.., ప్రత్యర్థులతో లోపాయకారి ఒప్పందాల తో తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు వంటి ఘటనలతో ఈ వేసవిలో రాజకీయాలు సెగలు రగిలిస్తున్నాయి. ఈ నేపధ్యంలో శనివారం వెంకటగిరి MLA ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్య రెడ్డి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని ఒంగోలు లో కలవడం, ఆయన్ను అభినందించడం, శాలువా, పుష్పగుచ్చం తో సత్కరించటం పలు సందేహాలకు అవకాశం కల్పిస్తుంది. ఆమె తండ్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ శాసన సభ్యులుగా ఉండడం.. ప్రత్యక్ష రాజకీయాల్లో కైవల్య అడుగుపెడుతోంది అనే ప్రచారం జరుగుతుండటంతో పాటు వచ్చే ఎన్నికల్లోపు ఆనం వారు వైసీపీకి గుడ్ బై చెబుతారన్న చర్చ జరుగుతున్న ఈ నేపధ్యంలో ఆమె లోకేష్ ని కలవడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు మారుతున్నాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కైవల్య రెడ్డి లోకేష్ ని కలవడం పక్కా వ్యూహం తోనే జరిగిందని.. ఇటువంటి సాహసం ఆమె తన తండ్రికి తెలియకుండా చేయదని, ఇది ఆనం ఆదేశాలతోనే జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఏది నిజమో ఆనం నోరు విప్పితేనే స్పష్టత వస్తుందని అంటున్నవారూ లేకపోలేదు.
---
అనిల్ చెప్పింది నిజమేనా..?
మంత్రివర్గ విస్తరణ తర్వాత జిల్లా రాజకీయాల్లో అనేక మార్పులు సంభవించాయి. ఈ క్రమంలోనే గత మూడేళ్ళుగా కాస్త మౌనంగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కసారిగా స్వరం పెంచారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై పరోక్ష యుద్దానికే దిగారు. కొన్ని చోట్ల పలు ఆరోపణలు కూడా చేసారు. ఫ్లెక్సీ ల ఏర్పాటు విషయంలో నగరంలో కొన్ని ఆంక్షలున్నా... మంత్రి కాకాణి కోసం ఆనం వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను తొలగించడంపై కూడా ఆనం కుటుంబ నేతలు నగర mla పై దోషణలకు కూడా దిగారు. ఈ క్రమంలో నూ అనిల్ స్పందించారు. ఆనం ఏ పార్టీలో ఉంటారు..? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ప్రకటించాలని బహిరంగంగా.. మీడియా సాక్షిగా సవాల్ కూడా విసిరారు. దానికి ఆనం కుటుంబం నుంచి మౌనం. ఈ నేపథ్యంలో ఆనం కైవల్య ఒంగోలులో నారా లోకేష్ ని కలవడం చర్చనీయాంశంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చూపుగా ఆమె ద్వారా మార్గం సుమగం చేసుకుంటున్నారా..? అనే సందేహం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా అనిల్ చెప్పినట్లు ఆనం కుటుంబం పార్టీ మారేందుకే సిద్ధం అయ్యిందా అని చర్చ జరుగుతోంది.
--
మంత్రి కాకాణి ఏం చెబుతారు
గత కొన్నేళ్లుగా ఆనం, కాకాణి కుటుంబాల మధ్య సఖ్యత లేని విషయం తెలిసిందే. అయితే గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యాక జిల్లాలో ఆనం కుటుంబం ఎంతో ఆనందించింది. ఆయనకు ఘాన స్వాగతం కూడా పలికారు. ఆత్మీయ సదస్సు లో సైతం ఆనం మాజీ మంత్రి పై, ఇరిగేషన్, రైతాంగం, ప్రాజెక్టులపై ఆరోపణలు కూడా చేశారు. ఇది కొంత కాకాణి కి ఇబ్బంది కలిగించినా... ఆనం ను వారించలేకపోయారు. దాంతో పథకం ప్రకారం ఇలా చేస్తున్నారా..? మాజీ మంత్రిని ఒంటరిని చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా..? అనే అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లో, జిల్లా ప్రజల్లో వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో అనిల్ ని, కాకాణి ని స్వయంగా CM పిలిపించి మాట్లాడారు కూడా.. అప్పటి నుంచి సమస్య కొంత సద్ధిమణిగినా.. ఆనం కుటుంబం మాత్రం రగిలిపోతుంది. ఆ సామాజికవర్గం అంతా కలసి బీసీ నేత అయిన మాజీ మంత్రిని ఒంటరిని చేయాలన్న కుట్ర జరుగుతున్నట్లు ఆ సామాజికవర్గం, నగర ప్రజల్లో కూడా చర్చ జరిగింది. మంత్రి గోవర్ధన్ రెడ్డి ఆనం ను వెనకేసుకొస్తున్నారని అనుకుంటున్న క్రమంలో.. ఆనం కుమార్తె లోకేష్ ను కలవడం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేగుతోంది. దీనికి మంత్రి ఏం చెబుతారో అని కూడా అంతా ఎదురు చూస్తున్నారు.
ఏది ఏమైనా... ఆనం కైవల్య ద్వారా టీడీపీ లో చేరికకు ఆనం కుటుంబం మార్గం వేస్తోందా అని జిల్లాలో సరికొత్త చర్చకు దారితీస్తోంది.
--
లోకేష్ ని కలవడం తన వ్యక్తిగతం: ఆనం

అయితే ఇదే విషయంపై ఆనం రామనారాయణ రెడ్డిని మీడియా వివరణ కోరితే... తన కుమార్తె కైవల్య రెడ్డి చిన్న పిల్ల కాదని తనకు ఏది మంచో.. ఏది చేడో తెలుసునని, లోకేష్ ని ఎందుకు కలసిందో అది తన వ్యక్తిగతం అని, తనకు సంబంధం లేదని, ఆ విషయాన్ని ఆమెనే అడగండి అంటూ... సమాధానం దటవేసి వెళ్లిపోవడం విశేషం.
---
సునీల్, ఆర్
Coming soon
N 3 - News
--

12/05/2022

Wanted... Wanted... Wanted
---
"విజేత మీడియా అండ్ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్" ఆధ్వర్యంలో.. జిల్లా కేంద్రంగా త్వరలో ప్రారంభం కానున్న మా, మన "N3 న్యూస్ ఛానెల్" లో వివిధ సెగ్మెంట్ లలో ప్రతిభ గల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రిపోర్టర్లు, యాడ్స్ ఎగ్జిక్యూటివ్ లు, యాంకర్లు, న్యూస్ రీడర్లు, వీడియో ఎడిటర్లు, స్క్రిప్ట్ రైటర్లు, వీడియో గ్రాఫర్లు కావలెను. ప్రతిభనుబట్టి వేతనం ఉంటుంది.
సం. 9885184753, +919032638542
మీ.. సునీల్

10/04/2022

N3 NEWS - SRI RAMANAVAMI WISHES 2022

09/04/2022

పబ్ జీ కి బానిసైన ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై..
చికిత్స పొందుతూ కూడా ఎలా తయారయ్యాడో చూడండి. ప్రస్తుతం ఇతడి పరిస్థితి, మానసిక స్థితి ప్రమాదంలో ఉందని అంటున్నారు వైద్యులు. తల్లీదండ్రుల్లారా జాగ్రత్త. మీ పిల్లలు సెల్ ఫోన్లలో ఏం గేమ్ లు ఆడుతున్నారు. వారి ప్రవర్తన ఎలా ఉందో గమనించండి. లేదంటే ప్రమాదమే.

జగనన్న స్మార్ట్ సిటీ మార్గదర్శకాలు విడుదలఎంఐజీ-1  గృహం 5.87 లక్షలుజమ్మలపాలెం లో 97.16 ఎకరాల్లో స్మార్ట్ సిటీ అభివృద్ధి జ...
08/02/2022

జగనన్న స్మార్ట్ సిటీ మార్గదర్శకాలు విడుదల

ఎంఐజీ-1 గృహం 5.87 లక్షలు

జమ్మలపాలెం లో 97.16 ఎకరాల్లో స్మార్ట్ సిటీ అభివృద్ధి

జిల్లా కలెక్టర్ చక్రధర బాబు

మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మిస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లలో ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపుల గురించి నూతన మార్గదర్శకాలు విడుదల అయ్యాయని జిల్లా కలెక్టర్ కె .వి .ఎన్ .చక్రధర్ బాబు తెలిపారు.

మధ్యతరగతి వర్గాల ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మౌలిక వసతులతో కూడిన టౌన్ షిప్ లను అభివృద్ధి చేస్తున్నదని, అందులో భాగంగా నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) పరిధిలో మొదటి దశలో కావలికి దగ్గరలోని జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామంలో 97.16 ఎకరాల విస్తీర్ణంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టనున్నట్టుగా కలెక్టర్ తెలిపారు. ఏపి రెరా చట్టంలోని నిబంధనల కనుగుణంగా, డి టి సి పి అప్రూవల్ తో ఈ లేఅవుట్ ను అభివృద్ధి చేస్తున్నట్లుగా కలెక్టర్ వివరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ టౌన్ షిప్ లో రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్లాటు అమ్మకం ధరపై 20 శాతం సబ్సిడీతో 10 శాతం ప్లాట్లు ప్రత్యేకంగా రిజర్వు చేయడం జరిగిందన్నారు. మూడు రకాలుగా నిర్మిస్తున్న ఈ గృహాలలో మొదటి క్యాటగిరి ప్లాట్ (MIG-1) 147 చదరపు గజాల విస్తీర్ణం, రెండవ క్యాటగిరి ప్లాట్ (MIG-2 ) 200 చదరపు గజాల విస్తీర్ణం, మూడవ క్యాటగిరి ప్లాట్ (MIG-3) 240 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడతామన్నారు.

అదేవిధంగా MIG-1 కింద నిర్మిస్తున్న 373 ప్లాట్లలో 37 ప్లాట్లు, MIG-2 కింద నిర్మిస్తున్న 178 ప్లాట్లలో 18 ప్లాట్లు, MIG-3 కింద నిర్మిస్తున్న 407 ప్లాట్లలో 41ప్లాట్లు ప్రత్యేకంగా ప్రభుత్వోద్యోగులకు కేటాయించటం జరిగిందన్నారు. ఒక్కో చదరపు గజం ధర 4999 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు MIG-1 గృహం 20 శాతం సబ్సిడీ తో కేవలం రు. 5, 87,882/- లకు, MIG-2 గృహం రు. 7,99,840/- లకు , MIG-3 గృహం రు. 9,59,808/- లకు లభిస్తుందన్నారు. కావున జిల్లా లోని ప్రభుత్వోద్యోగులు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సొంత ఇంటిదారులు కావాలని కలెక్టర్ కోరారు.
- సునీల్

కలెక్టర్ మేడమ్ మీరు మేకప్ ఎందుకు వేసుకోరు ...?  మలప్పురం జిల్లా కలెక్టర్ మిస్ రాణి సోయామోయి కళాశాల విద్యార్థులతో సంభాషిస...
27/01/2022

కలెక్టర్ మేడమ్ మీరు మేకప్ ఎందుకు వేసుకోరు ...?

మలప్పురం జిల్లా కలెక్టర్ మిస్ రాణి సోయామోయి కళాశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు.

ఆమె చేతి గడియారం తప్ప మరే ఇతర నగలు ధరించలేదు.
చాలా మంది విద్యార్థులను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఆమె ఫేస్ పౌడర్ కూడా ఉపయోగించలేదు.ప్రసంగం ఆంగ్లంలో ఉంది. ఆమె ఒకట్రెండు నిముషాలు మాత్రమే మాట్లాడింది, కానీ ఆమె మాటల్లో దృఢ నిశ్చయం ఉంది. అనంతరం చిన్నారులు కలెక్టర్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు.
ప్ర: మీ పేరు ఏమిటి?
నా పేరు రాణి, సోయామోయి నా ఇంటి పేరు. నేను జార్ఖండ్ వాసిని.

ఇంకేమైనా అడగాలా?

ఒక సన్నని అమ్మాయి ప్రేక్షకుల నుండి లేచి నిలబడింది.
అడగండి..
"మేడమ్, మీరు ఎందుకు మేకప్ వేసుకోరు?"
కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె సన్నటి నుదుటి మీద చెమట కారింది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొంచెం నీళ్లు తాగింది. తర్వాత విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సైగ చేసింది. అప్పుడు ఆమె నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది.
మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. ఇది ఎప్పటికీ ఒక్క మాటలో సమాధానం చెప్పలేని విషయం. దానికి సమాధానంగా నా జీవిత కథ మీకు చెప్పాలి. నా కథ కోసం మీ విలువైన పది నిమిషాలు కేటాయించడానికి మీరు సిద్ధంగా ఉంటే నాకు తెలియజేయండి.
సిద్ధమే అన్నట్టు స్పందన వచ్చింది.

నేను జార్ఖండ్‌లోని గిరిజన ప్రాంతంలో పుట్టాను. కలెక్టర్ ఆగి పిల్లల వైపు చూసింది.

నేను కోడెర్మా జిల్లాలోని "మైకా" గనులతో నిండిన గిరిజన ప్రాంతంలో చిన్న గుడిసెలో పుట్టాను.మా నాన్న, అమ్మ మైనర్లు. నాకు ఇద్దరు అన్నలు మరియు ఒక చెల్లెలు ఉన్నారు. వర్షం పడితే కారుతున్న చిన్న గుడిసెలో మేము నివసించేవారం.వేరే ఉద్యోగం దొరక్కపోవడంతో నా తల్లిదండ్రులు తక్కువ జీతానికి గనుల్లో పనిచేసేవారు. ఈ పని చాలా దారుణం గా ఉంటుంది. నాకు నాలుగేళ్ల వయసులో మా నాన్న, అమ్మ, ఇద్దరు అన్నదమ్ములు రకరకాల జబ్బులతో మంచం పట్టారు.గనుల్లోని ప్రాణాంతక మైకా ధూళిని పీల్చడం వల్లే ఈ వ్యాధి వస్తుందని అప్పట్లో వారికి తెలియదు.నాకు ఐదేళ్ల వయసులో మా అన్నలు అనారోగ్యంతో చనిపోయారు.
చిన్న నిట్టూర్పుతో కలెక్టర్ మాట్లాడటం ఆపి, రుమాలుతో ఆమె కళ్ళు తుడుచుకున్నారు. చాలా రోజులు మా ఆహారంలో నీరు మరియు ఒకటి లేదా రెండు రోటీలు ఉంటాయి. నా సోదరులిద్దరూ తీవ్రమైన అనారోగ్యం మరియు ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కరెంటు, పాఠశాల, ఆసుపత్రి, మరుగుదొడ్డి లేని గ్రామాన్ని మీరు ఊహించగలరా? .
ఒకరోజు నాన్న నన్ను పట్టుకున్నప్పుడు
ఆకలితో,ఎండిపోయిన నా చర్మం, ఎముకలాంటి నా చేతిని పట్టుకున్న నాన్నతో కలిసి టిన్ షీట్లతో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పనికోసం వెళ్ళాను. కాలక్రమేణా ఖ్యాతి గడించిన మైకా గని.అది ఒక పురాతన గని,తవ్వి, తవ్వి, పాతాళం వరకు విస్తరించింది.దిగువన ఉన్న చిన్న చిన్న గుహల గుండా వెళ్లి మైకా ఖనిజాలను సేకరించడం నా పని. పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే సాధ్యమైయ్యేది.నా జీవితంలో మొదటి సారి కడుపు నిండా రోటీలు తిన్నాను. కానీ ఆ రోజు నేను వాంతి చేసుకున్నాను. నేను ఫస్ట్ క్లాస్‌లో ఉండాల్సిన సమయంలో, నేను విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదులలో మైకాను సేకరిస్తున్నాను. అప్పుడప్పుడు కొండచరియలు విరిగిపడటంతో దురదృష్టవంతులైన పిల్లలు చనిపోవడం,అప్పుడప్పుడు కొందరు ప్రాణాంతక వ్యాధులతో చనిపోవడం అక్కడ సర్వసాధారణం. రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే ఒకసారి భోజనానికి సరిపడా సంపాదించవచ్చు. ప్రతిరోజు విషపూరిత వాయువులను పీల్చడం, ఆకలి కారణంగా నేను సన్నగా మారాను. ఒక సంవత్సరం తర్వాత మా చెల్లి కూడా గనిలో పనికి వెళ్లడం ప్రారంభించింది. అలా నాన్న, అమ్మ, చెల్లి, నేను కలిసి పనిచేసి ఆకలి లేకుండా బతకగలం అనే స్థితికి వచ్చాము.
కానీ విధి మరో రూపంలో మమ్ముల్ని వెంటాడడం ప్రారంభించింది. ఒకరోజు నేను విపరీతమైన జ్వరంతో పనికి వెళ్ళనప్పుడు, అకస్మాత్తుగా వర్షం కురిసింది. గని బేస్‌లో ఉన్న కార్మికులపై గని కూలిపోవడంతో వందలాది మంది చనిపోయారు. వారిలో నాన్న, అమ్మ, చెల్లి ఉన్నారు.కలెక్టర్ రాణికి రెండు కళ్లలోనూ కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ప్రేక్షకులంతా ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయారు. చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి.అప్పుడు నాకు ఆరేళ్లు మాత్రమే
చివరికి ప్రభుత్వ అనాధ ఆశ్రమానికి వచ్చాను. అక్కడ నేను చదువుకున్నాను. నేను నా మొదటి వర్ణమాలలను మా గ్రామం నుండి నేర్చుకున్నాను. ఇప్పుడు కలెక్టర్ గా మీ ముందు ఉన్నాను.
నేను మేకప్ ఉపయోగించక పోవడానికి దీనికి మధ్య సంబంధం ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు.ఆమె ప్రేక్షకులను చూస్తూ చెప్పడం కొనసాగించింది.

ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించిన మైకా మొత్తం మేకప్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారని నేను చదువుకొనే సమయంలోనే తెలుసుకున్నాను. మైకా అనేది ముత్యాల సిలికేట్ ఖనిజంలో మొదటి రకం. పెద్ద పెద్ద కాస్మెటిక్ కంపెనీలు అందించే మినరల్ మేకప్‌లలో, 20,000 మంది చిన్నపిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టిన బహుళ-రంగు మైకా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.కాలిపోయిన కలలతో, ఛిద్రమైన జీవితాలతో, శిలల మధ్య నలిగిన మాంసాలతో, రక్తాలతో గులాబీ మెత్తదనం మీ చెంపల మీద విస్తరిస్తుంది. మిలియన్ల డాలర్ల విలువైన మైకా ఇప్పటికీ ఉపయోగించబడుతుంది, గనుల నుండి శిశువు చేతులను కైవసం చేసుకుంది. మన అందాన్ని పెంచుకోవడానికి. ఎంతోమందిని బలిగొన్న,
నలిగిన పిల్లల చేతుల నుండి వచ్చి మన అందాన్ని పెంచుకోవడానికి వచ్చిన ఈ మేకప్ ని నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి? ఆకలితో మరణించిన నా సోదరుల జ్ఞాపకార్థం నేను కడుపునిండా ఎలా తినగలను? ఉన్నన్నాళ్లు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను స్మరిస్తూ నేను ఖరీదైన పట్టు వస్త్రాలు ఎలా ధరించగలను? రాణి పెదవులపై చిరునవ్వుతో, కళ్లలోని కన్నీళ్లు తుడుచుకోకుండా, తల నిమురుతూ వెళ్లిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు.
(జార్ఖండ్‌లో ఇప్పటికీ అత్యంత నాణ్యమైన మైకాను తవ్వుతున్నారు. 20,000 కంటే ఎక్కువ మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లకుండానే అక్కడ పని చేస్తున్నారు. అనేక మంది చనిపోతున్నారు కొండచరియలు విరిగిపడటం, కొన్ని వ్యాధుల కారణంగా)
---
- సునీల్

కొత్త జిల్లాల ఏర్పాటుకు కెబినెట్ ఆమోదం1974 ఏపీ జిల్లాల (ఏర్పాటు) చట్టంలోని సెక్షన్-3(5) ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు.చట...
27/01/2022

కొత్త జిల్లాల ఏర్పాటుకు కెబినెట్ ఆమోదం

1974 ఏపీ జిల్లాల (ఏర్పాటు) చట్టంలోని సెక్షన్-3(5) ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు.

చట్టానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రాథమిక నోటిఫికేషన్ రూపొందించిన సీసీఎల్ఏ

శ్రీకాకుళం...(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం+ఎచ్చెర్ల

విజయనగరం... 7నియోజకవర్గాలు (విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, రాజాం,+ఎస్‌కోట)

వైజాగ్ జిల్లా... భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్, సౌత్‌

అనకాపల్లి... 7నియోజకవర్గాలు... అనకాపల్లి, చోడవరం, పాయకరావుపేట,పెందుర్తి, యలమంచిలి,మాడ్గుల, నర్సీపట్నం.

అరకు.... 3 నియోజకవర్గాలు (అరకు,పాడేరు,రంపచోడవరం)

పార్వతీపురం... నాలుగు నియోజకవర్గాలు(పార్వతీపురం,కురుపాం,సాలూరు, పాలకొండ)

రాజమండ్రి... కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం,రాజమండ్రిసిటి, రాజమండ్రి రూరల్‌, రాజానగరం, అనపర్తి

కాకినాడ... కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం

అమలాపురం... అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం

ఏలూరు.... ఏలూరు, చింతలపూడి, దెందులూరు, పోలవరం,ఉంగుటూరు, నూజివీడు,కైకలూరు

నరసాపురం... నరసాపురం, ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు,తాడేపల్లిగూడెం.

విజయవాడ... విజయవాడ ఈస్ట్‌, వెస్ట్, సెంట్రల్‌, నందిగామ,జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు

మఛిలీపట్నం,... మఛిలీపట్నం, పెడన, గుడివాడ, పామర్రు, పెనమలూరు, అవనిగడ్డ, గన్నవరం...

బాపట్ల... బాపట్ల, రేపల్లే,వేమూరు,చీరాల,పరచూరు,అద్దంకి

గుంటూరు... గుంటూరు వెస్ట్‌, గుంటూరు ఈస్ట్‌, ప్రత్తిపాడు,పొన్నూరు, తాడికొండ, తెనాలి, మంగళగిరి

నరసరావుపేట... నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, మాచర్ల, పెదకూరపాడు

ఒంగోలు... ఒంగోలు, కొండపి,దర్శి, కనిగిరి, గిద్దలూరు,మార్కాపురం,ఎర్రగొండపాలెం+ సంతనూతలపాడు

నెల్లూరు... నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్‌, కోవూరు,కావలి,ఆత్మకూరు, ఉదయగిరి,కందుకూరు+సర్వేపల్లి

తిరుపతి... తిరుపతి,శ్రీకాళహస్తి,సత్యవేడు, వెంకటగిరి, గూడురు, సూళ్లూరుపేట+చంద్రగిరి

చిత్తూరు... చిత్తూరు, నగరి, గంగాధర నెల్లూరు,పూతలపట్టు, పలమనేరు, కుప్పం+పుంగనూరు

రాజంపేట... రాజంపేట, రైల్వేకోడూరు,రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి

కడప... కడప, పులివెందుల, జమ్మలమడుగు,పొద్దుటూరు, కమలాపురం,మైదుకూరు, బద్వేలు

నంద్యాల... నందికట్కుకూరు,శ్రీశైలం, ఆళ్లగడ్డ, డోన్‌, బనగానపల్లి, నంద్యాల

కర్నూలు... కర్నూలు,కొడుమూరు, ఎమ్మిగనూరు,ఆదోని, మంత్రాలయం, ఆలూరు,పత్తికొండ+పాణ్యం....

అనంతపురం... అనంతపురం, సింగనమళ,తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం,రాయదుర్గం +రాప్తాడు

హిందూపురం... హిందూపురం,పెనుకొండ, మడకశిర,పుట్టపర్తి,ధర్మవరం,కదిరి

అమలాపురం... కోనసీమ జిల్లా..

అరకు.. అల్లూరి సీతారామారాజు జిల్లా

హిందూపురం... పుట్టపుర్తి
హెడ్‌క్వార్టర్‌గా.. సత్యసాయి జిల్లా

తిరుపతి... బాలాజీ జిల్లా...

కృష్ణాజిల్లా... ఎన్టీఆర్ జిల్లా....

రాజమండ్రి ... గోదావరి జిల్లా...

రాజంపేట... రాయచోటి హెడ్‌క్వార్టర్‌గా... అన్నమయ్య జిల్లా

బాపట్ల హెడ్‌క్వార్టర్‌గా .. భవపురి జిల్లా....

అరకు పార్లమెంటు పరిధిలో పార్వతీపురం జిల్లా....

21/01/2022

ప్రభుత్వ ఉద్యోగులు
సమ్మెకు సిద్ధం కావడం సబబేనా..???

తొలి "గే" వివాహం..!!--తెలంగాణా రాష్ట్రంలో తొలి గే వివాహం జరిగింది.గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటూ వచ్చిన సుప్రియో, అభయ్‌...
19/12/2021

తొలి "గే" వివాహం..!!
--

తెలంగాణా రాష్ట్రంలో తొలి గే వివాహం జరిగింది.

గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటూ వచ్చిన సుప్రియో, అభయ్‌లు ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ వివాహం జరిగింది.
మన దేశంలో స్వలింగసంపర్కం చట్టబద్ధత కల్పిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.

దీంతో విదేశాల్లో తరహాలోనే మన దేశంలో కూడా ఈ గే వివాహాలు జరుగుతున్నాయి. ఈ సంస్కృతి మెల్లగా తెలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. ఫలితంగా తెలంగాణాలో తొలి స్వలింగ సంపర్క వివాహం జరిగింది.

హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో లెక్చరర్‌గా సుప్రియో పనిచేస్తుంటే, అభయ్ మాత్రం సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్‌గా కొనసాగుతున్నాడు.

వీరిద్దరూ గత ఎనిమిదేళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై, అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.
ఆ తర్వాత వీరి అభిప్రాయాలు కలవడంతో వీరిద్దరూ ప్రేమించుకోవాలని నిర్ణయం తీసుకుని, తమ పెద్దలను ఒప్పించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

*104 ప్రమాదాలు.. 1300 మంది మృతులు.. విమాన ప్రమాదాలు అక్కడే ఎందుకు ఎక్కువ..?*హెలీకాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టా...
08/12/2021

*104 ప్రమాదాలు.. 1300 మంది మృతులు.. విమాన ప్రమాదాలు అక్కడే ఎందుకు ఎక్కువ..?*

హెలీకాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, పలువురు అధికారులు మృతి చెందడంపై.. దేశ వ్యాప్తంగా విషాధచాయలు అలుముకున్నాయి. గతంలో హెలీకాప్టర్ ప్రమాదాల్లో చాలా మంది ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు దుర్మరణం చెందిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం బిపిన్ రావత్ మృతిచెందడంతో హెలీకాప్టర్ ప్రమాదాలపై మరోసారి చర్చ నడుస్తోంది. విమాన ప్రమాదాలు తరచూ జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకే ప్రాంతంలో ఏకంగా 104 ప్రమాదాలు జరగ్గా.. మొత్తం 1300 మంది మృతి చెందారనే విషయం చాలా మందికి తెలీదు. ఆ ప్రదేశం ఎక్కడ, అక్కడే ఎందుకు అన్ని ప్రమాదాలు జరిగాయి.. అనే వివరాల్లోకి వెళితే.*

*ఆసియాలో మొత్తంలో జరిగిన విమాన ప్రమాదాలను పరిశీలిస్తే.. ఇండోనేషియాలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసింది. 1945 నుంచి ఇప్పటిదాకా.. ఇండోనేషియాలోనే జరిగిన ప్రమాదాలు ఎక్కడా జరగలేదు. ఆర్థిక, సామాజిక, భౌగోళిక కారణాలతోనే అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయట. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, సాంకేతిక, సామర్థ్య లోపం తదితర కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధ్యయనంలో తేలింది. ఇటీవల 62మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం.. ఇండోనేషియా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే.*

*విమానయాన అధికారుల అశ్రద్ధ వల్లే ఇండోనేషియాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిసింది. వైమానిక భద్రతా నెట్‌వర్క్‌ గణాంకాల ఆధారంగా 1945 నుంచి ఇప్పటి వరకు జరిగిన విమాన ప్రమాదాల్లో 13,00 మంది పౌరులు మరణించారు. ఈ కారణంగా ఇండోనేషియా విమానాలకు పలు దేశాలు అనుమతిని నిరాకరించాయి. 2007 నుంచి 2016 వరకు అమెరికాలోనూ, 2007 నుంచి 2018 వరకు యూరోపియన్‌ యూనియన్‌లోనూ ఇండోనేషియా విమానాలను రద్దు చేశారు. అయితే ప్రస్తుతం విమాన రంగంలో సమూల మార్పులు చేసేలా అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారట. ఇందులో భాగంగా తరచూ విమానాల పనితీరుని పర్యవేక్షించడం, పైలెట్లకు మెరుగైన శిక్షణ తదితర అంశాల్లో శ్రద్ధ తీసుకుంటున్నారని అక్కడి ప్రధాన మీడియా సమాచారం ప్రకారం తెలుస్తోంది.
------

మిత్రమా.. వచ్చేసా..!కాస్త ఆలస్యం అయింది రాజా..!! ఇక్కడ అంతా కుశలమే నా.. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఏమంత ఆహ్లాదకరంగ...
04/12/2021

మిత్రమా.. వచ్చేసా..!
కాస్త ఆలస్యం అయింది రాజా..!!

ఇక్కడ అంతా కుశలమే నా.. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఏమంత ఆహ్లాదకరంగా లేవు రాజా.. మన రోజుల్లోనే బాగుండేవి. ఇప్పుడంతా స్వార్ధం. అయినా.. నీవు మమ్మల్ని విడిచి వెళ్ళాక... నేను ఉమ్మడి రాష్ట్ర CM గా రాజీనామా చేశాక.. ఆ మురికి జోలికి వెళ్లలేదులే రాజా..

ఏదో గౌరవ ప్రదంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గా చేసి.. ఆరోగ్యం సహకరించక పోవడంతో hyd లొనే ఉన్నా.. నేను ఒంటరిగా ఉన్న సమయంలో.. రాజకీయాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిన్ను తలచుకునే వాడ్ని అనుకో.. గత కొంత కాలంగా కూడా... నీవు గుర్తొచ్చినప్పుడల్లా.. కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగేవి రాజా... ఇక నేను కూడా నెదగ్గరికి వచ్చేసా గా... సంతోషంగా ఉంది మిత్రమా..!!
---
ఈ చిత్రం చూశాక.. ఇలా రాయలనిపించింది. ఎవరూ నొచ్చుకోవద్దు సుమా...
ఓం శాంతి

- మీ.. సునీల్

02/12/2021

ఏబీఎన్ రాధాకృష్ణ నా బొచ్చు కూడా పీకలేడు....

పోలవరం ప్రాజెక్ట్ డిసెంబర్ కి పూర్తి కాకపోవడానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణమని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. గూడూరు లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు , గత ప్రభుత్వం తప్పిదం వల్లే పోలవరం ఆలస్యం అయిందని అది వదిలేసి నన్ను సీబీన్ ఆర్మీ, PAYTM బ్యాచ్ దాని మీద కధనాలు వండి వార్చిన ABN రాధాకృష్ణ నన్ను ట్రోల్ చేస్తే ఏమి నా వెంట్రుక కూడా ఊడదని మంత్రి అనిల్ కుమార్ ఘాటుగా సమాధానం చెప్పారు

పాత కథ అయినా... స్పూర్తి కలిగిస్తోంది..!!--కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది ట...
27/11/2021

పాత కథ అయినా... స్పూర్తి కలిగిస్తోంది..!!
--

కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు
వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం
ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు .
చీకటి పడితే ఎలా?
దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు
( సిగ్నల్స్ లేవు ).
ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది ..
అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ?
ఏమి చేస్తాడు .?
ఆందోళన !.
అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ?
టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని
గ్రహించాడు ." భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు
ఆమె భయపడుతూనే ఉంది .
" నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి
కారులో పెట్టాడు ..
ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు ." మీరు కాదనకండి . మీరు ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది.
" నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు...
మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి ...
అదొక చిన్న హోటల్ .
కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ
తనే చేస్తోంది . ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు.ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000నోటు ఇచ్చింది . ఆమె చిల్లర
తేవడానికి వెళ్ళింది .
తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు ..
ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు .అందులో ఇలా ఉంది .." చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు
సహాయపడు . " అని రాసి ఉంది..
ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని....
ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్!
భగవంతుడే మనకు సహాయం చేశాడు .
ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా..

మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది అన్నది ఆ కధ యొక్క పరమార్ధం..!!

26/11/2021

si : రేయ్ యా వూర్రా మీది...??
పిల్లలు : ఇదే ఊరు సార్...😂
Si : ఇదే ఊరంటే యావూరు..??
పిల్లలు : పెడ్డకడుబూరు సార్...,😂కర్నూలు జిల్లా పెద్దకడుబూరు సార్ పెన్సిల్ ఎత్తుకున్నాడు కేసు పెట్టండి సార్ అంటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన పిల్లలు😃😂😂

ఖర్మ ఫలితంఎవరూ మార్చలేరు..!! * చంద్రబాబుకు శని దశ పీక్ లో ఉంది-----మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్వాషాఢ నక్షత్రం ...
19/11/2021

ఖర్మ ఫలితం
ఎవరూ మార్చలేరు..!!
* చంద్రబాబుకు శని దశ పీక్ లో ఉంది
-----

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం ధనుస్సు రాశిలో పుట్టారు. ఆయన 2014లో ముఖ్యమంత్రి అయిన ‌తర్వాత 2014 నవంబర్ 3 నుండి ఏలినాటి శని మొదలైంది.

మొదటి రెండున్నర సంవత్సరాల ఏలినాటి శని దశలో ఎటువంటి వ్యతిరేకత లేదు... శని రెండవ దశలో ఉన్న రెండున్నర సంవత్సరాల టైంలో అంటే 2019లో శని నడినెత్తి మీద అత్యున్నత శిఖరంలో ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకత తారాస్థాయికి చేరుకుంది. అప్పట్లో ఆయన నల్లదుస్తులు ధరించడం కూడా శని యొక్క అత్యంత వ్యతిరేక ప్రభావమే.

అందుకే 23 సీట్లతో ఘోరంగా ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనకు ఏలినాటి శని పీక్ లో ( దశ ) నడుస్తోంది.. అంటే శని చాలా బాధలు పెట్టి, కర్మ ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడు. ఈ ఫలితాన్ని ఎవరూ మార్చలేరు. నాడు కౌరవ సభలో పాండవులు జూదమాడి రాజ్యాన్నిబపోగొట్టుకుని అడవులపాలయ్యారంటే దాని వెనుక శకుని కుట్రో, దుర్యోధనుడి పగ అనేది పక్కనపెడితే అందుకు మూలం మాత్రం శని ప్రభావం. అలాగే దుర్యోధనుడు చివరకు పాతాళం లో దాక్కోవడానికి కూడా శని ప్రభావమే. అంతెందుకు రాముడు అడవులపాలవడానికి.. సీతను చూసి మోహించి ఆ దేవిని లంకకు తీసుకెళ్లిన లంకేశ్వరుడు కడకు అంతం కావడానికి కూడా ఈ "శని దశ" పీక్ లో ఉండటమే. ఇది పురాణాలు చెప్పిన నిజం.

అసెంబ్లీ ని కౌరవ సభతో పోల్చడం నాటి నుంచే
----
అంతెందుకు.. నాడు కరుణానిధి సీఎం గా ఉన్నప్పుడు జయలలితని నిండు సభలో DMK సభ్యులు ఆమె చీరను లాగినప్పుడు కూడా ఆమె కౌరవ సభ గానే అభివర్ణించారు. మన రాష్ట్రంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు రోజా ను అసెంబ్లీలో అవమానించి ఏడాదిపాటు సస్పెండ్ చేసినప్పుడు ఆమె సైతం కురు సభలానే పోల్చారు. అలాగే ఆనాడు జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ మంత్రులు, mla లు సభలో ఎలా ప్రవర్తించారో.. దుర్భాష వాడారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ అవమానాలు భరించలేకే జగన్ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి.. పాదయాత్ర చేపట్టి తిరిగి ముఖ్యమంత్రి గా సభలో అడుగు పెట్టారు. అది కూడా అత్యధిక సీట్లతో. రెండున్నారేళ్ళల్లో సీన్ రిపీట్ అయింది. 23 సీట్లకు పరిమితమైన బాబుకి, తన అనుంగా సభ్యులకు జగన్ బృందం ప్రత్యేక్షంగానో.. పరోక్షంగానో నాటి బాధలను రుచి చూపించారు. జగన్ మోహన్ రెడ్డిది పగో.. ప్రతీకారమో.. జనాలు ఆయనపై చూపించే అభిమానమో.. లేక నమ్మకంతో నో.. అన్ని ఎన్నికల్లో టీడీపీ కి ఇక భవిష్యత్ లేదు అనేలా తీర్పు ఇచ్చారు. చివరాఖరకు కుప్పం లో కూడా పాగా వేసేశారు. దాంతో బాబు కు ఘోర పరాభవం జరిగినట్లైంది. అంతేకాక అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, పట్టాభి, బోండా ఉమాలతో పాటు లోకేష్ ల నోటి దురుసు తో పార్టీ ప్రతిష్ట గంగ పాలుతోందని చంద్రబాబుకి తెలిసినా... వారిని కంట్రోల్ చేయడంలో ఆయన విఫలం అయ్యారనే చెప్పాలి. తుదకు ఎల్లో మీడియా గా కీర్తికేక్కిన ABN, ఆంధ్రజ్యోతి, tv5, ఈనాడు-ఈటీవీ ల రాతలు, డిబేట్ల వల్ల కూడా ఆ పార్టీకి, చంద్రబాబుకు మేలు చేయకపోగా పెద్ద నష్టమే జరుగుతుంది. దీన్ని గుర్తెరిగి చక్కదిద్దుకుంటే బాబుగారు చేసిన ఛాలెంజ్ నెరవేరుతుందో... లేకపోతే YSRCP నేతలు చెబుతున్నట్లు ఇక బాబోరిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం. అనేది నిజం అవుతుందో మరో రెండున్నరేళ్లు వేచి చూడాలి.

ఇలా నేను రాయడం ఎవరికి నచ్చినా... నచ్చకపోయినా... నన్ను తిట్టేవాళ్లకు కూడా ఈ "శని" ప్రభావం ఉంటుంది జాగ్రత్త. నేను చెప్పింది నిజం అయితే... ఓ కామెంట్ పెట్టండి.. పదిమందికీ తెలియజేయాలంటే ఓ షేర్ చేయండి చాలు.

- సునీల్. ఆర్
జర్నలిస్ట్- నెల్లూరు

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Suneel journalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Media/News Companies in Nellore

Show All