25/07/2022
ఆంద్రప్రదేశ్ లో జల జీవన్ మిషన్ అమలుపై ప్రశ్నించిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు
కావలి జూలై 25
రాజ్యసభలో బీద మస్తాన్ రావు ఆంద్రప్రదేశ్ లో జల జీవన్ మిషన్ క్రింద గ్రామీణ ప్రాంతాల్లోని ఎంత శాతం గృహాలకు త్రాగు నీటి సరఫరా అందించబడినదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల జీవన్ మిషన్ (JJM) కింద ప్రభుత్వం 100 శాతం లక్ష్యాన్ని సాధించగలదా అని, అలా అయితే, దాని వివరాలు మరియు కాకపోతే, దానికి కారణాలు తెలియచేయవలసినదిగా ప్రశ్నించగా కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.2024 నాటికి దేశంలోని అన్ని గ్రామీణ కుటుంబాలకు హర్ ఘర్ జల్ నినాదంతో జల్ జీవన్ మిషన్ (JJM) పథకం క్రింద- రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరికి త్రాగునీటి కుళాయి సరఫరాను అందించేవిధంగా భారత ప్రభుత్వం ఆగస్టు, 2019 నుండి, అమలు చేస్తోందని, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన ప్రకారం మెత్తం 95.69 లక్షల గ్రామీణ కుటుంబాలలో 57.47 లక్షల కుటుంబాలకు (60.06%) కుళాయిల ద్వారా నీటి సరఫరా అందించబడినదని, రాష్ట్రంలో మిగిలిన అన్ని గ్రామీణ కుటుంబాలకు 2024 మార్చినాటికి కుళాయిల ద్వారా నీటి సరఫరా అందించబడేవిధంగా లక్ష్యాన్నిపెట్టుకోబడినదని తెలియ చేసారు.జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి, ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశం మొత్తంలో శిక్షణలు వర్క్‌షాప్‌లు/కాన్ఫరెన్స్‌లు/వెబినార్‌లు ద్వారా సాంకేతిక మద్దతు అందించడానికి అనేక ప్రణాలికలు రూపొందించడం జరిగినదని తెలియచేసారు.
గ్రామ పంచాయతీలలో సురక్షితమైన త్రాగు నీరు అందించడానికి ప్రత్యెక ప్రచారం ద్వారా, పాటశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు మరియు ఆశ్రమాలకు పైపులద్వారా నీటి సరఫరా అందించడానికి ప్రణాలికను సులభతరం చేయడానికి అంద్రప్రదేశ్ తో సహా మిగిలిన అన్ని రాష్ట్రాలలో జల్ జీవన్ మిషన్ అమలుకోసం వివరణాత్మక మార్గదర్సకాలు తయారుచేయడంజరిగినదని తెలియచేసారు.జల్ జీవన్ మిషన్ అమలు ఆన్‌లైన్ పర్యవేక్షణ కోసం, JJM-ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సమాచార వ్యవస్థ (IMIS) మరియు JJM-డ్యాష్‌బోర్డ్ లో ఉంచబడ్డాయి.పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ .(PFMS) ద్వారా పారదర్శక ఆన్‌లైన్ ఆర్థిక నిర్వహణ కోసం రూపొందించబడిందని, 2021-22లో 3,182.88 కోట్ల నుండి 2022-23లో JJM కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3,458.20 కోట్ల కేంద్ర నిధులను పెంచుతూ కేటాయించడంజరిగినదని అన్నారు.