29/02/2024
మహిళల్లో రక్త హీనతకు కారణాలనేకం .. 1 . ఐరన్ లోపం - అనీమియా
2 . బహిష్టు సమయంలో అధిక రక్త స్రావం .
౩. బి- 12 విటమిన్ లోపం
4 . హార్మోన్ సమస్యలు .
4 .పీసీఓఎస్ .
5 . కీమోథెరపీ .
పరిష్కారాలు :
హార్మోన్ సమస్యలకు పీసీఓఎస్ కు కారణాలు సరిగ్గా చెప్పలేము అని లక్ష సోది కబుర్లు చెబుతారు . శరీరం మనది . పిల్లలు మనవారు . మనిషి కోసం వైద్యం .. అంతే కానీ ఫార్మసురుల కోసం మనుషులు కాదు కదా? . కాబట్టి వారి పరిశోధనలు ఎక్కడైనా తెల్లారనీ .. ఇవి చేయండి .
1 . పిజ్జా , బర్గర్ , ప్యాకెట్ ల వచ్చే పొటాటో చిప్స్ , సోయా , సినిమా థియేటర్స్ లో దొరికే అమెరికా స్వీట్ కార్న్ , బుసబుస పొంగే పెప్సీ కోక్ లాంటి కూల్ డ్రింకులు .. పిల్లల దరికి చేరనివ్వకండి . వారానికి ఒకటి తిన్నా/ తాగినా .. పదహైదు ఏళ్లకు థైరాయిడ్ / పిసిఒన్ సమస్యలు వచ్చే ప్రమాదం .
2 . ఐరన్ కోసం , ప్రోటీన్ కోసం , అలాగే బి -12 కోసం... మాంసాహారులైతే మాంసం , ఆర్గాన్స్ { లివర్ కిడ్నీ లాంటివి } చికెన్ , ఫిష్ .
శాకాహారులకు పాలకూర , వేరుశనిగె గింజెలు , అల్మొన్డ్స్ , వాల్నట్ , క్యాబేజి .
శాకాహారులకు ఆహారం ద్వారా బి 12 అందే అవకాశం తక్కువ . కాబట్టి ఫోర్టిఫీడ్ సీరియల్స్- ఉదాహరణ కెల్లొగ్స్ లాంటివి .
౩. తీసుకొనే ఆహారంలో ఐరన్ సమృద్ధిగా ఉన్నా, సి విటమిన్ లోపం ఉంటే అది శరీరానికి అందదు . సి విటమిన్ కోసం వారానికి ఒక నిమ్మ / నారింజ . వీలుంటే కాస్త ఎక్కువ .
4 . ఐరన్ లోపం ఎక్కువ ఉంటే అప్పుడు టీ కాఫీ నిలిపేయాలి . మామూలు సమయాల్లో కాల్షియమ్ సమృద్ధిగా ఉండే నువ్వుల లడ్డు లాంటిది వారానికి కనీసం ఒకటి తినాలి .
కానీ ఐరన్ లోపం వున్నప్పుడు ఆ సమస్య చక్కబడే దాక కాల్షియమ్ రిచ్ ఫుడ్స్ తీసుకోకూడదు .
5 . పిల్లలకు ఆటలే వ్యాయామం . చదువు ముఖ్యమే . ఐఐటీ ఫౌండేషన్ పేరుతొ రాత్రి పొద్దు పోయే దాకా ఆటలు లేకుండా పాఠశాల్లో.... ఇంటికొచ్చాక సోఫా పై కూర్చుని సెల్ ఫోన్ తో ఆటలు... ఐఐటీ సీట్ వచ్చినా టీన్ ఏజ్ దాటకముందే టైపు వన్ డయాబెటిస్ , పీసీఓఎస్ , థైరాయిడ్ లాంటి వ్యాధులు వస్తే జీవితం నరకం .
కాబట్టి చదువు , ఆటలు .. వీటి మధ్య బాలన్స్ ఉండేలా చూడాలి .
పెద్దవారికి వ్యాయాయం . కనీసం నడక .
6 . అమ్మాయిలు పదో ఏట నుంచి పొత్తి కడుపు భాగం అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ బలోపేతం అయ్యేలా కొన్ని ఆసనాలు చేస్తే బహిష్టు సమయం లో నొప్పి , అటు పై సంతాన లేమి.. సిజేరియన్ ఆపరేషన్ లు లాంటివి వాటిని చాలా మటుకు నివారించవచ్చు . ఆ ఆసనాలు-- కపోతాసన , మలాసన, నావాసన, హలాసన.
ఏదో సోది చెబుతారండీ .. మా అమ్మ అమ్మమ కాలం లో ఈ ఆసనాలు చేసారా ? వారు సుఖ ప్రసవం చేయలేదా ? వారికి బహిష్టు సమయం లో అధిక రక్త స్రావం , విపరీత మైన నొప్పులు లాంటి సమస్యలు లేవే? అని ఎవరైనా అనుకోవచ్చు . వారి కాలం లో జంక్ ఫుడ్ లేదు . వాక్ సీన్ లు లేవు . మాయమాటలు చెప్పి వాక్ సీనులు లు గుచ్చేసేవారు కాదు . వారు వంగి చీపురుతో ఇల్లు ఊడ్చే వారు , బట్టలుతికేవారు , వడ్లు దంచేవారు . పోనీ ఒక పని చెయ్యండి . మీ పిల్లలతో... అమ్మాయిలే ఎందుకు ? అబ్బాయిలు తో కూడా ఇంటి పని చేయించండి . అనేక ప్రయోజనాలు కలుగుతాయి .
కొత్తగా వచ్చిన వాక్ సీన్ లు వేయించొద్దు .
వేయించాలి అనుకొంటే కొంతమంది వేయించుకొన్నాక .. ఆరు నెలలు ఆగి వారి దగ్గర నుంచి .. ఫీడ్ బ్యాక్ తీసుకొని అప్పుడు సాహసం చేద్దురు కానీ !
6 . అధిక కార్బోహైడ్రేట్లు వద్దు . కార్బోహైడ్రేట్లు పరిమితంగా తీసుకోవాలి . అదీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ .. అంటే రాగులు జొన్నలు ముడి బియ్యం , మైదా కలపని గోధుమ పిండి అన్నిటికీ మించి మిల్లెట్స్ తీసుకోవాలి . తెల్లనం ఎంత తగ్గిస్తే అంత మంచిది .
7 . మహిళలు రోజుకు మూడు లీటర్ల నీరు .. అమ్మాయిలు వారి వయసు బట్టి ఒకటి నుంచి రెండు లీటర్లు తప్పని సరిగా తీసుకోవాలి .
8 . స్ట్రెస్ కు దూరంగా ఉండాలి .. అంటే హింసాత్మక వీడియో లు అత్తా కోడళ్ల కొట్లాట సీరియల్స్ , హింసాత్మక సినిమా లు వెబ్ సిరీస్ లాంటి వాటికీ దూరంగా ఉండాలి .
మనసుకు హాయి నిచ్చే మ్యూజిక్ వినండి.
ఎమ్మెస్ అమ్మ విష్ణు సహస్ర నామం , భజ గోవిందం , బాలమురళి పంచ రత్న కృతులు .. ఒక సారి ట్రై చేయండి . దేవుడు సంగతి ఎలా వున్నా .. మ్యూజిక్ థెరపీ అని ఒకటి ఉందని గ్రహించగలరు .
9 . కాఫీ లో వుండే కెఫీన్ బహిష్టు సమయం లో సమస్యలు అధికం కావడానికి ఒక కారణం . కాఫీ పూర్తిగా మానేస్తే మంచిది. లేదా కనీసం ఆ మూడు రోజులు తాగొద్దు .
అల్లం, దాల్చిన చెక్క బహిష్టు సమస్యలకు ఎంతో ఉపకరం.
ఇలా ఇంట్లో నుంచే పెద్దగా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పొందవచ్చు .
లైఫ్ చాల సింపుల్ .
కానీ చాలా మంది తమ అమాయకత్వం తో అజ్ఞానం తో దాన్ని సంక్లిష్టం చేసుకొంటారు . అదే ఫార్మసురులకు వరం .