26/06/2023
బీజేపీ ఆలోచనా ధోరణి మొత్తానికే పక్కదారి పట్టింది , వారికి ఎప్పుడు క్లారిటీ లేదు ,
ఆవిషయం ఇప్పుడు ప్రజలకు క్లారిటీ వచ్చింది .
ఇక దేశం నుండి బీజేపీ తుడిచిపెట్టుకపోవడం ఖాయం అయినట్లే వారి ఆలోచనలలో తెలుస్తుంది .
ధరణి పోర్టల్ ను రద్దు చెయ్యం - బండి సంజయ్
ధరణి పోర్టల్ ను రద్దు చేస్తాం - నడ్డా
కవిత ను అరెస్ట్ చేస్తాం - బండి సంజయ్
కెసిఆర్ ను అరెస్ట్ చేస్తాం - నడ్డా
హహహ బడే నవ్వొస్తుంది , అస్సలు వీళ్లకు కొంచం కూడా క్లారిటీ లేదు , కెసిఆర్ అవినీతి వల్ల రాష్ట్రం బీహార్ అయ్యింది , దివాళా తీసింది , జీతాలు ఇవ్వలేని స్థాయి కి దిగజారి పోయింది, కెసిఆర్ పై సిబిఐ ఇంక్విరి వెయ్యాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు బీజేపీ కెసిఆర్ పై చర్యలు తీసుకోవటం లో పూర్తిగా ఫెయిల్ అయ్యింది - ఎందుకంటే BJP =(B )RS ఒక్కటే కాబట్టి .
కవిత లిక్కర్ స్కాం లో పీకలలోతుకు కూరుక పోయింది , రాష్ట్ర ఇజ్జతి నడిరోడ్డులో తీసింది , ఆమెతో పాటు ఆ స్కాం లో ఉన్న అందరు జైళ్ల ఉంటారు కానీ
కవిత మాత్రం జైలుకు పోదు ఎందుకు ? ఈ ప్రశ్న తెలంగాణా లో ఉన్న ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్న పెద్ద టాపిక్ .
సామాన్యునికి ఒక లెక్క - కవితకు ఒక లెక్క ? - ఎందుకంటే BJP =(B )RS ఒక్కటే కాబట్టి అని అంటున్నారు .
లిక్కర్ స్కాం లో జైల్లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కోసం "కేజ్రీవాల్ హైదరాబాద్ రాక " తర్వాత కెసిఆర్ , KTR ఢిల్లీ పోయి అమిత్ షా ను కలవటం,
దేశంలో ఉన్న ప్రతిపక్షాలు బీజేపీ ని గద్దె దింపే కార్యాచరణ కోసం ప్రతిపక్షాలు బీహార్ లో కలిస్తే , బీజేపీ ని గద్దె దింపుతా అన్న BRS , అదే రోజు బీజేపీ షా ను కలసి మేము మీతో నే ఉన్నాం , కవిత ను కెసిఆర్ ను జైలు కు పంపొద్దు అని మాట తీసుకోవడం ... (ఎందుకంటే BJP =(B )RS ఒక్కటే కాబట్టి అని అంటున్నారు
ఇది ఇలా ఉంటె రాష్ట్రం లో BJP =(B )RS ఢిల్లీ లో దోస్తీ , గల్లీ లో కుస్తీ అనే ఆట ను ఆడుతూనే ఉంది , అయితే ప్రజలకు ఈ విషయం పూర్తిగా కర్ణాటక ఎలక్షన్ ల తర్వాత అర్ధమయ్యింది . కర్ణాటక ఎలక్షన్ లలో BJP =(B )RS , కుమారస్వామి పార్టీ కి , MIM కి వందల కోట్లు డబ్బు పంపి BJP వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు పడకుండా నిలువరించే ప్రయత్నం చేసి , బొక్క బోర్లా పడిపోయాయి అనే విషయం ప్రజలలో విపరీత మయిన చర్చ నడుస్తుంది .
ఇగ
గత మూడు సంవత్సరాలనుండి కాంగ్రెస్ పేరు ఎత్తని ఊసరవెల్లి కెసిఆర్ , ఒక్క సారి కాంగ్రెస్ పార్టీ ని తిట్టే జపం చెయ్యటం మొదలు పెట్టాడు , దగా దశాబ్ది ఉత్సవాల్లో (B )RS పండుగ చెయ్యాలనుకున్న చెప్పటానికి ఏమి లేక కాంగ్రెస్ పై అవాకులు చెవాక్కులు పేలుడు పేలుతున్నాడు , కానీ అది ప్రజలు కాదుకదా ఎవరు కనీసం మాట్లాడుకోనేలేదు .
కెసిఆర్ మాటలు
కెసిఆర్ మాటలను ప్రజలు కనీసం తమ కాళీ సమయాల్లో ముచ్చట కు కూడా తావు ఇవ్వట్లేదు , ఏదయినా అన్నా "ఈ కెసిఆర్ రోజుకో మాట మాట్లాడుతాడు , నిలకడ లేదు ఈన మాటలను , తాగినోడి మాటలను ఇంకా నమ్మలేం, ఇగ చాలు , కెసిఆర్ బిడ్డ కవిత దోపిడీ , మరీ ఈ కుటుంబం బాగా సంపాదించుకుంది , ఇగ వీళ్ళ రాజకీయం చాలు అంటున్నారు గ్రామాల్లో ప్రజలు .
అయితే ముఖ్యం గా కవిత ఇన్ని వేల కోట్లు స్కాం చేసినా BJP =(B )RS ఎందుకు కవిత ను జైలుకు పంపలేదు అన్న కోపం ప్రజల్లో బాగా ఉన్నట్టు కనిపిస్తుంది .
కాంగ్రెస్ ముచ్చట
ప్రజలు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర , అయన పడ్డ కస్టాలు కర్ణాటక లో కాంగ్రెస్ విజయం ,
గ్యాస్ సీలెండర్ సబ్సడీ ,
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ,
ఉద్యోగాలు ,
ఇవన్నీ కలిసి కాంగ్రెస్ ముచ్చెట గ్రామస్తులను , కాంగ్రెస్ చేసిన పనులను గుర్తు కు తెస్తుంది ,
ఇందిరమ్మ ఇల్లు , లక్ష రూపాల ఋణ మాపి , ఫీజు పైసలు వాపసు ,కుయ్యు , కుయ్యు అనే 108, రేషన్ కార్డు లో వచ్చిన 11 వంట వస్తువులు ,
పావలా ఋణాలు , ఉద్యోగాలు , అన్ని వాళ్ల ఉన్నప్పుడు బాగుండే అని తమ అభిప్రాయాలను చెప్పుకుంటున్నారు ,
ఒక రకంగా తెలంగాణాలో ప్రజలు కాంగ్రెస్ కు ఈ సారి ఓటు వెయ్యాలి రా అనే అవగాహనకు వస్తున్నారు , ఒక రకమైన వాతావరణం కమ్ముకుంటుంది ,
ప్రజల్లో కాంగ్రెస్ పై ఆ పాత ప్రేమ , మళ్ళి పుట్టుకొస్తుంది అని గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులు అనుకుంటున్నారు .
ఏది ఏమైనా , నిర్యుద్యోగులకు ఉద్యోగాలు రావాలి , విద్యా , వైద్యం , అవకాశాలు , అందరికి రావాలి , ధరలు తగ్గాలి , అందరికి జీవితం మీద కొత్త ఆశలు కలగాలి , మళ్ళి ప్రజలు కలలు కనాలి , మన పాలన రావాలని కోరుకుందాం .
ఇట్లు
పవన్ మల్లాది .