Toofan telugu news daily - 50k Followers

Toofan telugu news daily - 50k Followers Telugu News Daily. Following 50K Fans. News Paper is published from Hyderabad. www.toofandaily.com
(3)

02/12/2024
01/12/2024

*శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట*

తేదీ*01/12/2024 *ఆదివారం *

*శ్రీస్వామి వారి ఆదాయము*
*రూ:- 56,71,426/-

శ్రీ స్వామి వారికి 1400మంది భక్తులు తలనీలాలు సమర్పించారు
కళ్యాణ కట్ట 70,000/-
ప్రధాన బుకింగ్ 3,44,550/-
కైంకర్యములు 1,600/-
సుప్రభాతం 21,800/-
బ్రేక్ దర్శనం 4,84,200/-
వ్రతాలు 2,87,200/-
వాహన పూజలు13,300/-
VIP దర్శనం 8,37,900/-
ప్రచారశాఖ 61,000/-
పాతగుట్ట 37,670/-
కొండపైకి వాహన ప్రవేశం 7,00,000/-
యాదఋషి నిలయం 1,68,220/-
సువర్ణ పుష్పార్చన 1,26,864/-
శివాలయం 22,600/-
శాశ్వత పూజలు Nill/-
పుష్కరిణ 3,000/-
ప్రసాదవిక్రయం 21,31,980/-
లాకర్స్ 400/-
అన్నదానం 1,53,641/-
విమానాగోపురం5,501 /-
లీజేష్ 2,00,000/-

సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం.
01/12/2024

సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్
బుర్రా వెంకటేశం.

30/11/2024

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో మూడు రోజులపాటు జరిగిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎంగారు పాల్గొన్నారు.

♦️ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటికే రుణమాఫీ చేయగా, తాజాగా ఈ వేదిక నుంచి మరో 3,13,897 మంది రైతు కుటుంబాలకు రుణ మాఫీ చేస్తూ అందుకు అవసరమైన 2747.67 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు.

♦️తాజాగా విడుదల చేసిన నిధులతో రాష్ట్రంలో మొత్తంగా 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది. ఈ నిధులను విడుదల చేయడంతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎంగారు వర్చువల్ గా ప్రారంభించారు.

♦️అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళా సమాఖ్య కోసం 255 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ...

♦️ప్రజా ప్రభుత్వానికి ఇకనుంచి రైతులే బ్రాండ్ అంబాసిడర్లు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు పారనప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించినం.

♦️రైతే రాజు అని ప్రభుత్వం రైతన్నలకు రుణమాఫీ చేయడంతో పాటు వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అన్న పరిస్థితుల నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కాకుండా ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇచ్చిన సందర్భంలో రైతు పండుగ చేసుకుంటున్నం.

♦️గ్రీన్ చానెల్లో నిధులు విడుదల చేయించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించే బాధ్యత తీసుకుంటం.

♦️కొడంగల్ రుణం తీర్చుకోవాలని 1300 భూ సేకరణ చేసి పరిశ్రమలు స్థాపించి 25 వేల మంది మహిళలకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రయత్నం చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నరు. అమాయకులను రెచ్చగొడుతున్నరు.

♦️భూమి అందరికీ ఆత్మగౌరవం. అభివృద్ధి జరగాలంటే భూ సేకరణ తప్పడం లేదు. అవసరమైతే భూ సేకరణకు రెట్టింపు పరిహారం చెల్లించడమే కాకుండా నష్టపోయిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

♦️ఇక్కడ పుట్టిన వాడిని... గిట్టేది కూడా ఈ గడ్డమీదే. ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే, అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు. జిల్లా వాసిగా నా బాధ్యత నాకు తెలుసు.

♦️ భారీ స్థాయిలో జరిగిన ఈ రైతు పండుగలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, జూపల్లి కృష్ణారావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సలహాదార్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రైతు పండుగ స్టాల్స్ విజిటింగ్ ఫొటోస్
30/11/2024

రైతు పండుగ స్టాల్స్ విజిటింగ్ ఫొటోస్

29/11/2024

డిసెంబర్ 4 న పెద్దపల్లి లో సి.ఎం. సభ

సభా ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, నవంబర్ 29 :: డిసెంబర్ 4 వ తేదీన పెద్ద పల్లిలో నిర్వహించే యువ శక్తి సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరై దాదాపు 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందచేస్తారని రాష్ట్ర పరిశ్రమలు,ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్ద పల్లిలో డిసెంబర్ 4 వ తేదీన తలపెట్టిన ముఖ్యమంత్రి గారి సభా ఏర్పాట్లపై నేడు సాయంత్రం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శ్రీధర్, సందీప్ సుల్తానియా, క్రిస్టినా చోంగ్తు, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, సి.ఎంఓ అధికారి వేముల శ్రీనివాసులు, సమాచార శాఖ ప్రత్యేక కమీషనర్ హరీష్, విద్యా శాఖ డైరెక్టర్ వెంకట నర్సింహా రెడ్డి, పెద్దపల్లి కలెక్టర్ హర్ష, రామగుండం పోలీస్ కమీషనర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యువత కై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ సభలో ఇటీవల గ్రూప్ IV లో ఎంపికైన 8143 మందికి, 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందచేస్తారని వివరించారు. ఈ సభలోనే స్కిల్ యూనివర్సిటీలో బాగస్వామ్యమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పంద పత్రాలను సంతకం చేయడం జరుగుతుందని,, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభోత్సవం, సి.ఎం కప్ ప్రారంభం లతో పాటు వందలాది కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలియచేసే దాదాపు 40 స్టాళ్లను ఈ సభా వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే, వరంగల్, మహబూబ్ నగర్ లో మాదిరిగానే పెద్దపల్లి సభకు విస్తృత ఏర్పాట్లను చేయాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.

28/11/2024

ఖేలో ఇండియా గేమ్స్ కు వేదికగా హైదరాబాద్

2026లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖం



తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సానుకూలంగా స్పందించింది. వచ్చే ఏడాది నిర్వహించేలా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా 2025లో బిహార్‌లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ సింగ్ మాండవీయ సానుకూలంగా స్పందించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారు. రాతపూర్వక విజ్ఞప్తిని జితేందర్‌రెడ్డి గురువారం (నవంబరు 28) కేంద్ర మంత్రికి అందజేసి వివరించగా పై స్పష్టత లభించింది.



హైదరాబాద్ నగరంలో 32వ జాతీయ క్రీడలు (2002లో), ఆఫ్రో ఆషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. క్రీడా రంగానికి గత పదేండ్ల పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.



గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్సుల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, హాకీ టర్ఫ్, షూటింగ్ రేంజ్, సరూర్‌నగర్‌లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం (ఎయిర్ కండిషన్డ్), సింథటిక్ టెన్నిస్ కోర్ట్, స్కేటింగ్ ట్రాక్, ఔట్ డోర్ స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియంతో పాటు టెన్నక్ కాంప్లెక్స్, ఫుట్ బాల్ గ్రౌండ్, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించే సౌకర్యం, ఉస్మానియా క్యాంపస్‌లో సైక్లింగ్ వెల్‌డ్రోమ్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ ట్రాక్, జింఖానా-2 గ్రౌండ్‌లో ఫుట్ బాల్ గ్రౌండ్‌తో పాటు ఔట్ డోర్ గేమ్స్ నిర్వహించే వసతులు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్ గుర్తుచేశారు.



క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏటా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, వింటర్ గేమ్స్, పారా గేమ్స్, యూనివర్శిటీ గేమ్స్ తదితరాలను 2018 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నదని సీఎం రేవంత్ గుర్తుచేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పది రెట్ల మేర క్రీడల కోసం కేటాయింపులను పెంచినట్లు సీఎం రేవంత్ గుర్తుచేశారు. కేవలం క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా క్రీడాకారులు చేరుకునేలా రైలు, విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయని, పేరెన్నికగన్న స్టార్ హోటళ్ళు, ఇతర వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాకుండా యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని కూడా రూపొందిస్తున్నదని, ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.



ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తిని కేంద్ర మంత్రికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి.... అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి క్రీడారంగంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆర్థికంగా మాత్రమే కాక అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక గుర్తింపు సాధించిందని, ఇకపైన క్రీడా పోటీల నిర్వహణతో పాటు భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉన్నదని జితేందర్ రెడ్డి గుర్తుచేశారు.



కేంద్ర మంత్రితో జరిగిన ఈ సమావేశంలో జితేందర్ రెడ్డితో పాటు ఎంపీలు డాక్టర్ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామ్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.



====

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిగారు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా గారి కుమార్తె రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు...
25/11/2024

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిగారు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా గారి కుమార్తె రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు ఎం.అనిల్ కుమార్ యాదవ్ గారు, చామల కిరణ్‌కుమార్ రెడ్డి గారు హాజరయ్యారు.

25/11/2024

బీసీ కమిషన్ కార్యాలయంలో బీసీల స్థితిగతులపై నేడు రేపు బహిరంగ విచారణ. చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి రంగు ల ఆధ్వర్యంలో బహిరంగ విచారణ. నేడు ప్రత్యేకించి కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్ లకు అవకాశం. ఉదయం 10 గం. నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న విచారణ.
ఖైరతాబాద్ లోని కమిషన్ కార్యలయం లో జరిగే బహిరంగ విచారణలో అందరు పాల్గొనాలని కమిషన్ విజ్ఞప్తి.


తెలంగాణ బీసీ కమిషన్

24/11/2024

ఈ నెల 26 న ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్-మేళా
• 100 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ.

హైదరాబాద్, నవంబర్ 24 : ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ నెల 26 న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీ లోని ఫార్మాసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ లకు చెందిన 100 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డీ ఫారసీ, బీ ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డిగ్రీ చేసిన 18 నుండి 35 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలియజేసింది. రూ.14 ,800 నుండి రూ.25 వేలవరకు వేతనం ఉండే ఈ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు మరిన్ని వివరాలకు టి. రఘుపతి, HR (Ph.No.82476 56356) ను సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో వద్ద నేరుగా నవంబర్ 26 న హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు

Address

Hyderabad
500020

Alerts

Be the first to know and let us send you an email when Toofan telugu news daily - 50k Followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Toofan telugu news daily - 50k Followers:

Videos

Share

Nearby media companies


Other Broadcasting & media production in Hyderabad

Show All