19/06/2024
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీ
* హైదారాబాద్ జర్నలిస్టు సొసైటీ సభ్యులకు ఇళ్ల స్థలాలు
* జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మూడు నెలలు పొడిగింపు
* రాష్ట్ర సమాచార పౌర సంబంధాల రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
* ఖమ్మం లో టీయూడబ్ల్యుజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయాహసభలు
రాష్ట్రంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీ ని తీసుకు వస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర తృతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కీలక పాత్రను పోషించారని అన్నారు.