Navasakam News Network

Navasakam News Network Navasakam News Network (NNN) - Your voice, your news! We bring you the latest updates on issues that matter. Join us and be a part of the change.

Rest in peace, Deva Raj anna.దళిత సమాజానికి బలమైన అండ, ఉన్నత విద్యావంతుడు అయిన   అన్న గారు ఈరోజు ఉదయం హఠాత్తుగా గుండెపోట...
07/03/2023

Rest in peace, Deva Raj anna.

దళిత సమాజానికి బలమైన అండ, ఉన్నత విద్యావంతుడు అయిన అన్న గారు ఈరోజు ఉదయం హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం తీవ్ర విచారకరం, శక్తిమంతమైన స్వరాన్ని కోల్పోయిన మన తెలుగు దళిత సమాజానికి ఆయన హఠాన్మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. దళిత సమాజాన్ని దుక్కంలో ముంచేసి తన విద్యని, పోరాటాన్ని వారసత్వంగా మిగిల్చి వెళ్ళిపోయాడు.

దేవరాజ్ అన్న అగ్ర కుల పీడనని అనుభవించి పట్టుదలతో ఉన్నత విద్య అభ్యసించి అత్యంత ఎత్తుకి ఎదిగిన విద్యావేత్త, దళిత మేధావి. దళిత చైతన్యానికి, దళిత విద్యార్ధులకు మద్దతుగా తన జ్ఞానాన్ని, ప్రతిభని, తన స్తానాన్ని ఉపయోగించడం పట్ల ఎక్కువ శ్రద్ద చూపాడు, అణగారిన వర్గాల హక్కుల కోసం తన పరిధిలో అవిశ్రాంతంగా పోరాడాడు.

దేవరాజ్ అన్న దళిత సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారంగా యువ దళిత విద్యార్థులకు మార్గదర్శకత్వం కోసం ఒక ప్రొఫెసర్‌గా ఎన్నో loc విదాలుగా సహకరిస్తూ వచ్చాడు, దళిత విద్యార్ధులు ఎదుర్కొన్న అడ్డంకులను తొలగించడానికి వారి కలలను కొనసాగించడానికి ఎంతగానో సహాయ పడ్డాడు.

దళితుల సమస్యల పట్ల దేవరాజ్ అన్న యొక్క నిబద్ధత తిరుగులేనిది, సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని పెంపొందించడానికి అతను దళిత కార్యకర్తలు మరియు సంస్థలతో కలిసి పనిచేయడమే అనేక రకాలుగా ఆర్ధిక సహాయం అందిస్తూ వచ్చాడు.

దేవరాజ్ అన్న యొక్క వారసత్వం అతను సహకరించిన లెక్కలేనన్ని జీవితాల ద్వారా మరియు దళిత చైతన్యం కోసం అతను చేసిన పోరాటం ద్వారా జీవించి ఉంటుంది.

దేవరాజ్ అన్నని కోల్పోవడం దళిత సమాజానికి, సామాజిక న్యాయం కోసం విస్తృత పోరాటం చేస్తున్న వారికి పెద్ద దెబ్బ. ఈ సందర్భంగా దేవరాజ్ అన్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు సహోద్యోగులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము, సామాజిక న్యాయం, సమానమైన హక్కులు కోసం పోరాడడం ద్వారా మేము అతని వారసత్వాన్ని కొనసాగిస్తూ, దేవరాజ్ అన్న జ్ఞాపకాన్ని గౌరవిస్తూనే ఉంటాము.

With a heavy heart and tears in my eyes, I sign off as your fellow brother in the Dalit community.

~ Vijay Kumar Vangalapudi

02/03/2023
సైన్స్ డే శుభాకాంక్షలు! భారతదేశానికి చెందిన ఒక హేతువాదిగా, ప్రపంచం సాదిస్తున్న  శాస్త్రీయ పురోగతికి, ఇంకోవైపు మన సమాజాన్...
28/02/2023

సైన్స్ డే శుభాకాంక్షలు!

భారతదేశానికి చెందిన ఒక హేతువాదిగా, ప్రపంచం సాదిస్తున్న శాస్త్రీయ పురోగతికి, ఇంకోవైపు మన సమాజాన్ని పీడిస్తూ, ప్రబలంగా పాతుకుపోతున్న మూఢ నమ్మకాల మధ్య, నకిలీ శాస్త్రోక్త విశ్వాసాల మధ్య అంతరం కొలవలేనంత అగాధంలో వుండటం నన్ను ఇలా ప్రశ్నించేలా చేస్తుంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(h) ప్రకారం, శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం మరియు విచారణ మరియు సంస్కరణ స్ఫూర్తిని ప్రోత్సహించడం ప్రతి భారతీయ పౌరుడి విధి. బాబాలు, గురువులు అసత్యాలు, అర్ధ సత్యాలు ప్రచారం చేస్తూ అవే నిజమే అని నమ్మిస్తున్న దేశంలో, శాస్త్రీయ అక్షరాస్యత మరియు విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించడం గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైనది.

ఈరోజు సైన్స్ డే సందర్భంగా మన సమాజంలో పాతుకుపోయిన కొన్ని గుడ్డి నమ్మకాలను సవాలు చేస్తూ. శాస్త్రీయ దృక్పథం మరియు విమర్శనాత్మక ఆలోచన యొక్క ప్రాముఖ్యతను జరుపుకుందాం.

ఈ సందర్భంగా సైన్స్ మరియు లాజిక్ ని మన నిత్య జీవితంలో ఎలా అప్లై చేయాలో ఒక చిన్న ఉదాహరణతో పరిశీలిద్దాం.

హిందువుల ఆరాధ్య దైవమైన అయ్యప్ప స్వామి #విష్ణు మరియు #శివ అనే ఇద్దరు మగ దేవుళ్ళు సంగమిస్తే జన్మించాడని హిందువులు నమ్ముతారు. ఇద్దరు మగవారు సంగమిస్తే అయ్యప్ప జన్మించాడు అనే నమ్మకాల మూలం మన సంస్కృతి, సాంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయినప్పటికీ, దీనికి శాస్త్రీయ ఆధారం లేదు.

పునరుత్పత్తికి మగ మరియు ఆడ ఇద్దరూ అవసరమని స్కూల్ స్తాయి విద్యార్ధులకు కుడా తెలుసు, ప్రకృతిలోని ప్రతి జీవికి పునరుత్పత్తి ద్వారా పిల్లలు పుట్టాలి అంటే ఒక మగ మరియు ఒక ఆడ జీవుల సంభోగం ద్వారా మాత్రమె పిల్లలు పుడతారు అని సైన్సు చెబుతుంది.

ఈ సందర్భంలో సగటు పౌరుడు

ఈ విశ్వాసానికి శాస్త్రీయ ఆధారం వుందా?
పునరుత్పత్తి గురించి సైన్సు ఏమి చెబుతుంది?
ఇద్దరు మగవారు సంగమించి బిడ్డకు జన్మనివ్వడం సాధ్యమేనా?
మగవారికి బిడ్డను కనడానికి అవసరమైన పునరుత్పత్తి వ్యవస్థ వుందా?.

అనే ప్రశ్నలు వేసుకుంటే వీటికి ఖచ్చితమైన సమాధానాలు దొరుకుతాయి. లేదా కేవలం గుడ్డి నమ్మకమే మాకు ముఖ్యం అనుకుంటే అసలు ప్రశ్నతోనే పని లేదు.

ఈ ప్రశ్నలు వేసుకోవడానికి సగటు భారతీయుడికి హేతుబద్ధకం అంటే ఆలోచన చేయడానికి ఎక్కువగా బుర్రకి పని చెప్పకపోవడం. ఇలాంటి నమ్మకాలను ప్రశ్నించడానికి, హేతుబద్ధమైన ఆలోచనను ప్రోత్సహించడానికి తర్కం మరియు తార్కికతను ఉపయోగించడం చాలా కీలకం.

ఇలాంటి నమ్మకాలే సాంప్రదాయ విశ్వాసాలను గుడ్డిగా నమ్మేలా చేసి సమాజ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఈ గుడ్డి నమ్మకాలే లౌకిక జ్ఞానం స్తానంలో ఆలోచన లేని ఆవేశం, అరుపులు, కేకలతో మనిషి పురోగతిని నిరోదిస్తుంది.

మన సమాజంలో ఉన్న అనేక మూఢ నమ్మకాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి నమ్మకాలు తరచుగా నకిలీ బాబాలు (బాబాలు అందరూ నకిలీలే), ప్రజల అజ్ఞానం మరియు భయాన్ని దోపిడీ చేయడానికి ప్రయత్నించే ఇతర వ్యక్తులచే ప్రచారం చేయబడతాయి. కాబట్టి మూడనమ్మకాలకి హేతుబద్దతకి మధ్య అంతరాలను నిరోదించిన రోజున మాత్రమే మనం అజ్ఞానం మరియు అంధ విశ్వాసాల నుండి విముక్తి పొంది మరింత జ్ఞానోదయ, ప్రగతిశీల సమాజం వైపు పయనించి మంచి భవిష్యత్తును నిర్మించగలము.

ఆలోచన చేయండి.

~ Vijay Kumar Vangalapudi
Tech Support Engineer
Freelance Journalist
Human Rights Activist

“నవశకం న్యూస్ నెట్వర్క్”మిత్రులకు, సహచర ఉద్యమకారులకు విజ్ఞప్తి. భారతదేశంలోని దళిత, మైనారిటీ మరియు అణగారిన వర్గాలు ఎదుర్క...
26/02/2023

“నవశకం న్యూస్ నెట్వర్క్”

మిత్రులకు, సహచర ఉద్యమకారులకు విజ్ఞప్తి.

భారతదేశంలోని దళిత, మైనారిటీ మరియు అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై, మానవ హక్కుల సవాళ్ళను ప్రధాన స్రవంతి వార్తా చానల్స్ రోజువారీగా ఎలా విస్మరిస్తున్నాయో చూస్తున్నాము.

మన దేశంలో లెక్కలేనన్ని వార్తా చానల్స్ వున్నాయనడంలో సందేహం లేదు, కానీ వాటిలో ఎక్కువ భాగం మన సమాజంలో అణగారిన వర్గాలకు వాయిస్ ఇవ్వడం కంటే సంచలనాత్మక కథనాలు మరియు వినోదంపై దృష్టి పెడుతున్నాయి తప్ప సాదారణ ప్రజల పక్షాన నిలబడటం లేదు అనడానికి మన న్యూస్ చానల్స్ ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ అంతరాన్ని పెకిలించి మన స్వరాన్ని వినిపించడానికి, ఈ సమాజంలో మనం చూడాలనుకుంటున్న మార్పుగా మారడానికి ఇది సరైన సమయం.

సంచలనాలు, వినోద ఆధారిత వార్తా చానళ్ళ సముద్రంలో ఆశాజ్యోతిగా “నవశకం న్యూస్ నెట్‌వర్క్‌” ను పరిచయం చేస్తున్నాము. మేము సమాజంలోని అత్యంత అట్టడుగున ఉన్న వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రజలకు మద్య అనుసంధానంగా పని చేసే ఖచ్చితమైన మరియు విశ్వసనీయమైన వార్తలను తీసుకురావడానికి కట్టుబడి ఉన్న ఉద్వేగభరితమైన జర్నలిస్టుల బృందంగా మాకు మేము పరిచయం చేసుకుంటున్నాము.

నవశకం అంటే "New Era" అని అర్థం, ఆలోచన, వివేకం కలిగిన కొత్త తరం కోసమే మా ప్రయత్నం కుడా - సామాన్యుల కోసం నిలబడి అణచివేతకు గురైన గొంతులకు వేదికను అందించే జర్నలిజం యొక్క కొత్త శకం. దీనికి ప్రధాన వేదికగా “నవశకం న్యూస్ నెట్వర్క్” సంభందించిన 1. వెబ్సైటు 2. యూట్యూబ్ 3. ఫేస్బుక్ 4. ట్విట్టర్ ఖాతాలు వేదికగా వుంటాయి.

ఈ న్యూస్ నెట్వర్క్ ని ప్రస్తుతం శాంపిల్ కంటెంట్‌తో ప్రారంభించాము, మేము మా కంటెంట్‌ను మరింత మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తాము అయితే ముందు ముందు మరింత ముఖ్యమైన సమస్యలపై మీకు అప్ డేట్స్ అందజేస్తామని హామీ ఇస్తున్నాము.

అయితే, మీ మద్దతు లేకుండా మేము విజయం సాధించలేము. కాబట్టి, మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం ద్వారా, మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయడం ద్వారా మీ మద్దతును తెలియచేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము.

అణచివేతకు గురవుతున్న వర్గాల కోసం వాయిస్ అందించడానికి తద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి మాతో చేరండి. ఈ లింక్స్ ని మీ గ్రూప్స్ నందు, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి, మీరు కమ్యూనిటీ చర్చలలో భాగం కావాలనుకుంటే,కామెంట్స్ సెక్షన్ లోని లింక్స్ ని ఉపయోగించి Navasakam సోషల్ మీడియా వేదికలలో చేరండి.

-
Vijay Kumar Vangalapudi
Freelance Journalist
Human Rights Activist

25/02/2023

Are you curious about how one of India's biggest corporations, the Adani Group, scammed the country? Look no further than this eye-opening video!

In this video, we'll delve into the Adani Scam, where the Adani Group is accused of siphoning off public money, evading taxes, and violating environmental regulations. We'll explore the history of the Adani Group, its connections with top Indian politicians, and its controversial rise to power in the business world.

You'll also learn about the whistleblower MVS Sharma, who exposed the Adani Scam, and his criticisms of Gautam Adani and Prime Minister Modi. We'll discuss how investigative journalists uncovered the scandal and the public disclosure that followed.

Through our discussion, you'll discover the devastating impact of the Adani Scam on India's economy, environment, and society. You'll understand the role of crony capitalism and political interference in the scandal and the challenges of ensuring accountability and good governance in India.

So, if you want to learn the truth about the Adani Scam and its implications for India, join us in this video!

LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to Navasakam for more videos:
https://bit.ly/navasakam

► Like us on Facebook: https://www.fb.com/navasakam
► Follow us on Twitter: https://twitter.com/Navasakam_Media
► Visit Our Website: https://navasakam.in

means "New Era" it is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis, and opinions.

*పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ* 👇 Video & Gallery https://navasakam.in/kaikaluru-police-co...
29/10/2022

*పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ*

👇 Video & Gallery

https://navasakam.in/kaikaluru-police-commemoration-day-2022/

పోలీస్ అమర వీరులకు ఘన నివాళులు అర్పించవలసిన బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరిపై ఉందని పోలీస్ అమర వీరుల సంస్కరణ వారో...

Congratulations Satish Kumar Kunavarapu John Peta Youth Association  వైస్ ప్రెసిడెంట్ సతీష్ కునవరపు కైకలూరు నియోజకవర్గ శ...
20/10/2022

Congratulations Satish Kumar Kunavarapu

John Peta Youth Association వైస్ ప్రెసిడెంట్ సతీష్ కునవరపు కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ Dulam Nageswara Rao గారి ఆశిస్సులతో ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy గారి ఆదేశాలతో YSRCP Party Kaikaluru పార్టీ కైకలూరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్గా ఎన్నుకోబడ్డ సందర్భంగా సతీష్ మరియు కో కన్వీనర్లకు మరియు ఏలూరు జిల్లా కో కన్వీనర్ గా ఎన్నుకోబడ్డ Chinnu శ్యాం కి జాన్ పేట యూత్ అసోసియేషన్ తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు


కన్నా రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు💐 ఆటపాక YSRCP పార్టీ నాయకులు, జాన్ పేట యూత్ అసోసియేషన్ టీం కి అత్యంత సన్నిహితులు ...
02/10/2022

కన్నా రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

💐 ఆటపాక YSRCP పార్టీ నాయకులు, జాన్ పేట యూత్ అసోసియేషన్ టీం కి అత్యంత సన్నిహితులు శ్రీ కన్నా రమేష్ గారికి జాన్ పేట టీం తరపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐

🎂💐 కైకలూరు YSRCP పార్టీ యువనాయకులు కైకలూరు పంచాయతీ 7వ వార్డ్ మెంబర్ ఆప్త మిత్రులు   గారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ ...
01/10/2022

🎂💐 కైకలూరు YSRCP పార్టీ యువనాయకులు కైకలూరు పంచాయతీ 7వ వార్డ్ మెంబర్ ఆప్త మిత్రులు గారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన YSRCP నాయకులు Peta Youth Association ప్రెసిడెంట్ రిపోర్టర్ మైనారిటీ నాయకులు తదితరులు పార్టీ నందు మరిన్ని వున్నత పదవులు అధిరోహించాలని కోరి జాన్ పేట యూత్ అసోసియేషన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు 🎂💐



💐 ఆటపాక YSRCP పార్టీ ప్రెసిడెంట్, జాన్ పేట యూత్ అసోసియేషన్ టీం కి అత్యంత సన్నిహితులు, సోదర సమానులు  శ్రీ తలారి జాన్ గారి...
05/09/2022

💐 ఆటపాక YSRCP పార్టీ ప్రెసిడెంట్, జాన్ పేట యూత్ అసోసియేషన్ టీం కి అత్యంత సన్నిహితులు, సోదర సమానులు శ్రీ తలారి జాన్ గారికి జాన్ పేట టీం తరపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐

15/08/2022

Live: Independence day celebrations at Jagruti School Kaikaluru.

అందరికీ ఆహ్వానంఆగష్టు 15వ తారీకు ఉదయం 9 గంటలకు శ్రీ నిమ్మగడ్డ నాగభూషణం ప్రభుత్వ  ఉన్నత పాఠశాల, జాన్ పేట, ఆటపాక నందు కైకల...
14/08/2022

అందరికీ ఆహ్వానం

ఆగష్టు 15వ తారీకు ఉదయం 9 గంటలకు శ్రీ నిమ్మగడ్డ నాగభూషణం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జాన్ పేట, ఆటపాక నందు కైకలూరు శాసనసభ్యులు గౌ|| శ్రీ దూలం నాగేశ్వరరావు గారు ఉదయం 9 గంటలకు
1. జెండా వందనం కార్యక్రమం తరువాత
2. NNMNS టాపర్స్ కి బహుమతులు
3. 10th క్లాస్ టాపర్స్ కి బహుమతులు
4. జగన్నన విద్యా కానుక బుక్స్ పంపిణీ కార్యక్రమం
5. నాడు నేడు 2nd ఫేజ్ బిల్డింగ్ అదనపు తరగతి గదుల నిర్మాణము కొరకు శంఖుస్తాపన చేస్తారు కావున నాయకులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ మరియు ఉపాద్యాయులు ఆహ్వానిస్తున్నాం.

ఇట్లు
శ్రీ అల్లూరి రవి ప్రకాష్
ప్రధానోపాధ్యాయులు

శ్రీమతి వంగలపూడి ఇందిరాబోస్
విద్యాకమిటీ చైర్ పర్సన్ & సభ్యులు

🐟 Andhra fish seeds - ఆంధ్రా ఫిష్ సీడ్స్ ✅ WhatsApp: 📱9160301555 📍Kaikaluru 👉 Andhra Fish Seed Suppliers - We are locate...
29/07/2022

🐟 Andhra fish seeds - ఆంధ్రా ఫిష్ సీడ్స్ ✅ WhatsApp: 📱9160301555 📍Kaikaluru 👉 Andhra Fish Seed Suppliers - We are located in Kaikaluru, on the shores of the world-famous Kolleru Lake. We offer the best prices and wholesale rates on all types of freshwater fish seeds. We are a well-known fish seed supplier, and wholesaler in Kaikaluru. We specialise in providing high-quality, low-cost Fish Seeds in Kaikaluru, Kolleru....

https://navasakam.in/andhra-fish-seeds/

PH: 9160301555 - At Andhra fish seed suppliers, we supply all types of freshwater fish seeds at the best prices and wholesale rates.

🎉 Greetings to Kaikaluru MLA Shri Dulam Nageswara Rao Garu on his birthday. Wishing you a long and healthy life.🎉       ...
08/07/2022

🎉 Greetings to Kaikaluru MLA Shri Dulam Nageswara Rao Garu on his birthday. Wishing you a long and healthy life.🎉


05/07/2022

జగనన్న విద్యా కానుక స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం - కైకలూరు



02/07/2022

- కైకలూరు MLA శ్రీ DNR గారి పైన అసత్య ఆరోపణలు ఖండించిన YSRCP నాయకులు శ్రీ పెద్దిరెడ్డి రాము గారు.

02/07/2022

🔴 - కైకలూరు MLA శ్రీ DNR గారి పైన అసత్య ఆరోపణలు ఖండించిన YSRCP నాయకులు శ్రీ ఘంటశాల జగన్నాధం గారు.

02/07/2022

🟢 - కైకలూరు MLA శ్రీ DNR గారి పైన అసత్య ఆరోపణలు ఖండించిన YSRCP నాయకులు శ్రీ జయమంగళ కాసులు గారు.

02/07/2022

అసత్య ప్రచారాలు చేస్తున్న కైకలూరు తెలుగు దేశం పార్టీ నాయకులకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన YSRCP నాయకులు మోట్రు అర్జునరావు.




02/07/2022

అసత్య ప్రచారాలు చేస్తున్న కైకలూరు తెలుగు దేశం పార్టీ నాయకులకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన YSRCP నాయకులు సతీష్ కునవరపు.




కైకలూరు పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టిన చిన్న చెరువు అభివృద్ధి, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్న తీరును ఈ ఉదయం ...
30/06/2022

కైకలూరు పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టిన చిన్న చెరువు అభివృద్ధి, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్న తీరును ఈ ఉదయం కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) RWS DEE శాస్త్రి, AE నాగబాబులతో కలిసి పరిశీలించి సూచనలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మంగినేని పోతురాజు, నిమ్నల సాయి, కూనవరపు సతీష్త దితరులు పాల్గొన్నారు.



కైకలూరు నియోజకవర్గం స్థాయి పార్టీ ఫ్లినరీ సమావేశం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి YSR కుటుంబ సభ్యులకు పేరుపేరునా న...
29/06/2022

కైకలూరు నియోజకవర్గం స్థాయి పార్టీ ఫ్లినరీ సమావేశం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి YSR కుటుంబ సభ్యులకు పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని, ఇది ఏలూరు జిల్లాకే తలమానికంగా జరుగుతుందని స్థానిక శాసనసభ్యుల సమర్థతే దీనికి కారణంగా భావిస్తున్నానని మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు, ఈ సాయంత్రం కైకలూరు శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, స్థానిక CNR గార్డెన్స్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి వైకాపా ప్లీనరీ సమావేశం లో ఆళ్ల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు....

https://navasakam.in/kaikaluru-constituency-plenary-meeting/

కైకలూరు నియోజకవర్గం స్థాయి పార్టీ ఫ్లినరీ సమావేశం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి YSR కుటుంబ సభ్యులకు పేరు...

Address

Navasakam
Eluru
521333

Alerts

Be the first to know and let us send you an email when Navasakam News Network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Navasakam News Network:

Videos

Share

Nearby media companies