07/11/2022
*అతిమధురము*
ఒక తియ్యని వేర్లు గల మొక్క Glycyrrhiza Glabra (liqcorice) Barks & root Plant
ఆయుర్వేద వైద్య విధానంలో అత్యంత తీయని రుచి కలిగి అత్యంత శక్తివంతమైన ఔషధాల్లో అతి మధురం అగ్రస్థానాన్ని పొందిందంటే అతిశయోక్తి కాదు. మధుయష్టి, యష్టి మధు, మధూకలాంటి వివిధ సంస్కృత నామాలతో వ్యవహరింప బడుతూ, హిందీలో ములేటిగా ప్రాచుర్యం పొందిన ఫాబేసి అనే వృక్ష కుటుంబానికి చెందిన మొక్క ఇది. దీని శాస్త్రీయ నామం 'గ్లయిసిరైజా గ్లాబ్రా'. ఈ మొక్కపై జరిగిన అధ్యయనాల్లో ఈ మొక్కలో గ్లయిసిరైజిక్ ఆమ్లం, గ్లూకోజ్, సుక్రోజ్, యాస్పిరాజిన, ఈస్ట్రోజెన్, స్టిరాయిడ్, సుగంధిత తైలం మొదలైన అంశాలున్నట్లు వెల్లడైంది. పంజాబ్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అతి మధురం, గుమ్మడి, రోజు పూలు, సోపు గింజలు మొదలైన వాటితో ఒక ఔషధాన్ని రూపొం దించి, ఎలుకలపై ప్రయోగించి పరి శోధించారు. జీర్ణా శయంలోని వ్రణాన్ని మార్చడమే కాక, ఇతర ఆధునిక ఔషధాలతోపాటు దీనిని కూడా వాడటం వల్ల ఆ వ్రణం మానే ప్రక్రియ శీఘ్రతరమైనట్లు గుర్తించారు. అలాగే ఆధునిక ఔషధాల దుష్పరిణామాలు తగ్గడాన్ని కూడా గుర్తించారు.
అతి మధుర చూర్ణంలో సగభాగం వచ చూర్ణం కలిపి పూటకు పావు స్పూను వంతున మూడు పూటుల తగినంత తేనెతో కలిపి తీసుకుంటే వివిధ రకాలైన దగ్గులు తగ్గుతాయి.
అతిమధురం, అశ్వగంధ, శుంఠి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, అరస్పూను నుంచి ఒక స్పూను వరకూ అరకప్పు పాలతో కలిపి సేవిస్తుంటే కీళ్లు, కండరాల నొప్పులు, ఒంట్లో నీరసం తగ్గి హుషారుగా ఉంటారు.
సోపు గింజల చూర్ణానికి రెట్టింపు అతి మధురం, పటికబెల్లం కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం ఒక స్పూను వంతున అరకప్పు నీటిలో కలిపి సేవిస్తే కడుపు ఉబ్బరం, దగ్గు, ఆయాసం, త్రేన్పులు తగ్గుతాయి.
అతి మధుర చూర్ణాన్ని మూడు పూటలా పూటకు ఒక స్పూను వంతున అరకప్పు నీటిలో కలిపి సేవిస్తుంటే అధిక దాహం, ఎక్కిళ్లు, నోటిపూత, కడుపులో మంట, అధిక వేడి, చర్మంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.
అరకప్పు పాలలో కలిపి సేవిస్తుంటే బాలింతల్లో స్తన్యవృద్ధి జరుగుతుంది. బియ్యం కడుగు నీళ్లతో సేవిస్తే నోరు, ముక్కు మొదలైన భాగాలనుంచి కారే రక్తస్రావం, స్త్రీలలో అధిక బహిష్టు రక్తస్రావం తగ్గుతాయి. జీర్ణాశయ, గర్భాశయ, శ్వాసకోశ వ్యాధులకు వాడే ఔషధాల్లో అతి మధురాన్ని ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు.
అతి మధుర చూర్ణంతో పళ్లు తోముకుంటే పిప్పిపళ్లు, చిగుళ్లనుంచి రక్తస్రావం, నోటి పుళ్లు, నోటి దుర్వాసన తగ్గుతాయి.
అతి మధుర చూర్ణం, ఎండు ద్రాక్ష సమానంగా కలిపి దంచి ముద్ద చేసి ఉంచుకుని, రోజూ రెండుసార్లు పూటకు పది గ్రాముల చొప్పున చప్పరించి కప్పు పాలు సేవిస్తుంటే స్త్రీలలో రక్తహీనత వల్ల కలిగే నీరసం, ఆయాసం, అలసట, గుండె దడ, మలబద్ధకం తగ్గు తాయి. రుతురక్తం సక్రమంగా పద్ధతిలో, సరైన ప్రమాణంలో వెలువడుతుంది. అధిక రుతుస్రావం తగ్గు తుంది. సుఖ ప్రధమైన నిద్ర కలుగుతుంది.
అతి మధురం, ఆకుపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఒక స్పూను వంతుగా రోజూ రెండుపూటలా అరకప్పు పాలతో కలిపి సేవిస్తుంటే మనో వ్యాకులత తగ్గి మనో నిబ్బరం, మానసిక ప్రశాంతత, మానసిక ఉత్తేజం కలుగుతాయి.
అతి మధుర చూర్ణాన్ని గాయాలు, వ్రణాలు, పుళ్లపై చల్లుతుంటే రక్తస్రావం తగ్గి శీఘ్రంగా మానుతాయి.
అతి మధురం, కరక, తాని, ఉసిరిక చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, ఉదయం, సాయంత్రం రెండుపూటలా సేవిస్తుంటే నేత్ర దోషాలు తగ్గి కంటి చూపు మెరుగవుతుంది.
అతి మధురం, సరస్వతిఆకు, అశ్వగంధ, పటిక బెల్లం చూర్ణాలను సమానంగా కలిపి రెండుపూటలా పావుస్పూను నుంచి స్పూను వరకూ మోతాదుగా అరకప్పు పాలతో సేవిస్తుంటే మెదడుపై ప్రభావం చూపి మతి మరుపు తగ్గి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
* దీర్గాయుష్షుకి, ముసలితనం త్వరగా రాకుండా ఉండుటకు యష్టిమధూకం చూర్ణం ఒక స్పూన్ ప్రతినిత్యం పాలతో కలిపి తాగుచుండవలెను.
* గుండె ప్రదేశములో అయినను మర్మావయవముల ప్రదేశాలలో దెబ్బలు తగిలినప్పుడు మనిషి రోజురోజుకి మనిషి క్షీణించిపోవును. అటువంటి సమయాలలో శొంఠి , యష్టిమధుకం సమానంగా తీసుకుని కషాయం చేసుకుని తాగినను, లేదా పాలతో కలిపి తాగుచున్న శరీరం క్షీణించునట ఆగిపోవును.
* గర్భిణి గర్భము నందలి శిశువు ఎదగకుండా ఉన్నచో పాలల్లో యష్టిమధుకం , నేలగుమ్మడి చూర్ణం కలకండ కలిపి తాగుచున్న శుష్కించి ఉన్న గర్బం వృద్ధినొందుతూ గర్భములోని శిశువు ఎదుగును.
* శరీరంలో వాతం పెరిగి రక్తము నందు దోషం కలుగ చేయును . ఈ విధమైన రక్తదోషం వల్ల అరచేతులు , అరికాళ్లలో నల్లటి మచ్చలు ఏర్పడి తిమ్మిరి , పోట్లు కలుగును.
* పాండురోగముతో బాధపడువారు యష్టిమధూక చూర్ణమును గాని కషాయమును గాని తేనెతో కలిపి తాగుచున్న పాండురోగం నివర్తించును.
* అంగము నుండి కాని ఆసనము నుంచి రక్తం పడుచున్నచో యష్టిమధుకం మరియు తేనె కలిపి లొపలికి ఇచ్చి వాంతి చేయించవలెను .
* రక్తముతో కూడిన వాంతులు అవుచున్న యష్టిమధుకం , మంచిగంధం పాలతో మెత్తగా నూరి ఆ ముద్ద పాలతో కలిపి లోపలికి ఇచ్చిన రక్తవాంతి కట్టును .
*🌴 మన ఆరోగ్యం 🌴*
*ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే నాకు 9849894906 SMS చెయ్యండి. ఆయుర్వేద వైద్యుల ద్వారా సలహాలు సూచనలు ఫోన్ & SMS ద్వారా గాని తెలియ పరుస్తాను,మీ వివరాలు గోప్యముగా ఉంచడం మా విధి*
*ఈ ఆయుర్వేద సమాచారం మీ స్నేహితులకు & గ్రూప్స్ లో షేర్ చెయ్యండి , మీ వంతుగా అనేకమందికి మేలు చేసినవారౌతారు.*
* నరికినప్పుడు ఏర్పడే దెబ్బ తగిలినప్పుడు యష్టిమధుకం యొక్క కషాయంతో దెబ్బని కడిగి వేడి నేతితో యష్టిమధుకం చూర్ణమును మెత్తగా ఉడికించి దెబ్బపై కట్టవలెను.
* మూత్రం బంధించినప్పుడు యష్టిమధుకం , ద్రాక్షాపండ్లు కలిపి నూరి పాలతో కలిపి తాగించిన వాతం కిందికి ప్రసరించి మూత్రాన్ని జారిచేయును .
* గొంతులో కఫం అడ్డుపడి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుచున్నప్పుడు యష్టిమధుకం నోట్లో వేసుకొని చప్పరించుచూ రసం మింగుచున్న కఫం కరిగి ద్రవరూపంలో మారును . ఊపిరి అందని శ్వాసరోగమున శ్వాస మార్గమును మెత్తపరిచి శ్వాస సరిగ్గా ఆడునట్లు చేయును .
* కడుపులో అల్సర్లు వల్ల కడుపులో మంట వస్తున్నచో యష్టిమధూకం చూర్ణం పొడిని మూడు గ్రాములు నీటిలో కలిపి రెండుపూటలా సేవించుచున్న కడుపులో మంట తగ్గును.
* దగ్గు విపరీతంగా వస్తున్నపుడు యష్టిమధూకం చూర్ణం , తేనె కలిపి ఉండలుగా చేసి నోటి యందు ఉంచుకుని కొద్దికొద్దిగా రసాన్ని మింగుచున్న ఎటువంటి దగ్గులు అయినా తగ్గును. పొగ తాగడం వలన వచ్చే దగ్గుకి అద్భుతంగా పనిచేయును .
* జ్వరం వచ్చు సమయంలో అతిమధుర చూర్ణం పాలతో గాని తేనెతో గాని సేవించుచున్న అన్ని రకాల జ్వరాలు నివారణ అగును.
* ఎక్కిళ్లు ఆగకుండా వచ్చు సమయంలో అతిమధురం చూర్ణం రెండు టీస్పూనులు , అర స్పూన్ తేనె కలిపి సేవించుచున్న ఎలాంటి ఎక్కిళ్లు అయినా తగ్గిపోవును .
* వేడి శరీరం కలవారికి ఈ అతిమధుర చూర్ణం వాడటం వలన చలవ చేసి వేడివలన వచ్చు సమస్యలు నివారణ అగును.
యష్టిమధుకం మొక్కలో ప్రధానంగా వేరుని ఔషధాల కొరకు ఉపయోగిస్తారు .
*🌴 మన ఆరోగ్యం 🌴*
*ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే నాకు 9849894906 SMS చెయ్యండి. ఆయుర్వేద వైద్యుల ద్వారా సలహాలు సూచనలు ఫోన్ & SMS ద్వారా గాని తెలియ పరుస్తాను,మీ వివరాలు గోప్యముగా ఉంచడం మా విధి*
*ఈ ఆయుర్వేద సమాచారం మీ స్నేహితులకు & గ్రూప్స్ లో షేర్ చెయ్యండి , మీ వంతుగా అనేకమందికి మేలు చేసినవారౌతారు.*