06/10/2024
*నిజమైన వర్కింగ్ జర్నలిస్టులూ ఒక్కసారి ఆలోచించండి.. మనం ఏం కోల్పోతున్నామో.. ఇపుడు ఆలోచించకపోతే మరింత అన్యాయానికి గురవుతాం. పోరాడదాం..పోరాడి.. సాధిద్దాం..!*
1)ఏ ప్రభుత్వం వచ్చినా పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి ఒక్క వర్కింగ్ జర్నలిస్టులకు తప్పా..?
2)కనీసం వర్కింగ్ జర్నలిస్టుకి ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కార్డు కూడా మనం సాధించుకోలేకపోతున్నాం..లోపం ఎక్కడుంది..?
3)గత ప్రభుత్వం జీఓనెంబరు 38ని తీసుకొని మీడియాని అదహ్ పాతాళానికి తొక్కేసింది. కూటమి ప్రభుత్వంలోనూ ఇంచుమించుగా అదే పరిస్థితి రాబోతుందని సమాచారం.. కొత్త జీఓ అమలు, నిభందనలకు సంబంధించిన సమావేశాలు జరుగుతున్నాయి..? మేము తోపు అని చెప్పుకునే ఏ యూనియన్ నేతలైనా దీనికోసం ఆలోచించారా..?
4)వర్కింగ్ జర్నలిస్టులకి ప్రెస్ అక్రిడిటేషన్(ప్రతీ మండల విలేఖరికి ఇవ్వాలి), హెల్త్ కార్డు, యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్, ఇంటి స్థలం, హౌసింగ్ స్కీమ్ ఇవ్వాలి.. ఇదే అన్ని యూనియన్ల ప్రధాన డిమాండ్ కావాలి.
5)మీడియాలో కనీస విద్యార్హత ఇంటర్ లేదా డిగ్రీని ఖచ్చితంగా చేయాలి.. తద్వారా స్క్రాప్ తగ్గిపోవడానికి అవకాశం వుంటుంది.?
6)మీడియా(ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్) ఏకీకృత విధానాలు ఒకేలా ఉండాలి.. 58ఏళ్లు దాటిన జర్నలిస్టుకి రిటైర్ మెంట్ ప్రకటించి ప్రభుత్వం కనీసం రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలి..
7)ప్రధాన పత్రికలకు ఇచ్చినట్టుగానే చిన్న, మధ్యతరహా పత్రికలు, లోకల్ కేబుల్ టీవిలకు కూడా ప్రభుత్వం యాడ్స్ ఇవ్వాలి.. ఒక్క పెద్ద పేపర్ కి ఇచ్చే మొత్తంతో ఒకేసారి రాష్ట్రంలోని చిన్నపత్రికలన్నింటికీ ఒకేసారి యాడ్స్ ఇవ్వొచ్చుననే అంశాన్ని అన్నియూనియన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
8)జర్నలిస్టుల ట్రేడ్ యూనియన్లకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాలి. ఒక యూనియన్ సభ్యుడు ఒక యూనియన్ కే పరిమితంగా ఉండే లేబర్ యాక్టు, చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి.
8)ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటైన, గుర్తింపు లేని యూనియన్లను ప్రభుత్వమే సుమోటోగా రద్దుచేయాలి. లేదా ఆడిట్ రిపోర్ట్ సబ్ మిట్ చేసే సమయంలో ఉన్న సభ్యుల వివరాలను ఇతర యూనియన్లతో కలిపి దొంగ లెక్కలు చూపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
9) స్వలాభం కోసం ఒక్కో జర్నలిస్టు రెండు మూడు యూనియన్లలో సభ్యులు ఉన్నారు. అలాంటి వారందరినీ ఏరివేసి ఒకే యూనియన్ కి పరిమితం చేయాలి. లేదంటే ఏ యూనియన్ లోనూ సభ్యత్వం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
10)అలా చేయడం ద్వారా నిజమైన వర్కింగ్ జర్నలిస్టు మాత్రమే మిగులుతారు. తద్వారా ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా ఆస్కారం వుంటుంది. అలా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు స్వచ్చందంగా ముందుకొచ్చి వారి వారి యూనియన్ లోని సభ్యుల వివరాలను ప్రభుత్వానికి అప్పగించాలి.
11)జర్నలిస్టుల పేరుతో కొంతమంది మూకుమ్మడి వసూళ్లు, అక్రమాలకు పాల్పడేవారిని జర్నలిస్టులే గుర్తించి కేసులు నమోదు చేయాలి. లేదా వసూలు చేసిన మొత్తాలను జర్నలిస్టులకే ఖర్చుచేయాలి.. వారి సంక్షేమానికే వినియోగించాలి. తద్వారా మరో తేడా యూనియన్ అలాంటి పనులు చేయడానికి ముందుకి రాకుండా వుంటుంది.
12)రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఏ ప్రభుత్వం మారినా వారి వారి సొంత మీడియాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆ విధానం మారి మీడియా మొత్తాన్ని ఒకేలా పరిగణించేలా చూడటం కోసం జర్నలిస్టులంతా ఒక తాటిపైకి వచ్చి ఉద్యమించాలి.
13)సమాజంలో నాల్గవ స్థంబంగా ఉంటున్న నిజమైన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50శాతం ఫీజు రాయితీలు కల్పించాలి. అది రాష్ట్రవ్యాప్తంగా జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. హెల్త్ కార్డు ప్రీమియం కూడా ప్రభుత్వమే సీఎస్ఆర్ నిధుల నుంచే చెల్లించాలి.
14)రాష్ట్రంలో 13 జిల్లాలు 26 అయినపుడు మీడియా కూడా విభజన జరగింది. దానికి అనుగుణంగానే కొత్త జిల్లాను కూడా ఒక యూనిట్గా పరిగణించి అక్కడ కూడా డెస్క్, రిపోర్టర్లకు ప్రెస్ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి.
15)దానికి సంబంధించి అన్ని జర్నలిస్టు యూనియన్లు ప్రతినిధులు ఒక తాటిపైకి వచ్చి విషయాన్ని రాష్ట్రప్రభుత్వం, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి దృ
ష్టికి తీసుకు రావాలి. అంతే కాకుండా జిల్లా సమాచారశాఖ కార్యాలయాల్లోని ఉద్యోగుల భర్తీకి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడం ద్వారా మీడియాకి సకాలంలో సమాచారం అందుతుందనే విషయాన్ని గుర్తించాలి. ప్రతీ వర్కింగ్ జర్నలిస్టు పై విషయాలన్నింటిపైగా క్షుణ్ణంగా ఆలోచించి ఏకం కావడం ద్వారా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి వీలవుతుంది.
అక్షరాభివందనాలతో
మీ
*పి.బాలభాను( బాలు)*
*ఈరోజు-ఈఎన్ఎస్ చీఫ్ రిపోర్టర్*
*Ens Live App*
*www.enslive.net*
*విశాఖపట్నం-9490280270, 9390280270*