Hstv1 Hindu Sakthi Daily Paper

Hstv1 Hindu Sakthi Daily Paper హిందూ శక్తి దిన పత్రిక , HSTV Channel Editor Eillipilli Appalarajhu

31/10/2024
31/10/2024

*ప్రదక్షిణ ఎందుకు చేస్తాము ?*

గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి??? ...
*ప్రదక్షిణ అని దేనిని అంటారు??*
_అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు._
_ఋగ్వేదం ప్రదక్షిణ గురించి చెబుతూ దక్షిణం వైపు ముందుకు ఆర్తితో నడవడం అని చెబుతుంది._
స్కాందపురాణం ప్రదక్షిణంలో ప్రతీ అక్షరం గురించి చెబుతూ ...
*ప్ర - అంటే పాపాన్ని నివృత్తి చేస్తుంది అని,*
*ద - అంటే కోర్కెలను ఒసగేది అని,*
*క్షి - అంటే కర్మను క్షయం చేసేది అని,*
*ణ - అంటే మోక్షాన్ని అనుగ్రహించేది అని చెబుతుంది...*
*శాస్త్ర ప్రకారం ప్రదక్షిణకు అర్థం ఏమి???*
_మొదటి అచ్యుత ప్రదక్షిణ చేస్తే మానసిక పాపాలు నాశనం చేస్తుందని,_
_రెండవ ప్రదక్షిణ చేస్తే వాచిక పాపాలు నివృత్తి అయిపోతుందని,_
_మూడవ ప్రదక్షిణ కాయిక పాపాలు క్షయం అవుతుందని శాస్త్ర వచనం._
గుడిలోనికి వచ్చిన వారు ఎన్నో మానసిక భారాలను మోసుకు వస్తారు...
పూర్వం ఒక వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు అతడిని ఒక అరగంట ప్రశాంతంగా కూర్చోబెట్టిన తరువాతనే అతడికి బీపీ వంటి ఇతర వైద్యపరీక్షలు నిర్వహించేవారు.
అంటే ఒకరి భౌతిక పరిస్థితి సాధారణ పరిస్థితికి వచ్చిన తరువాత కానీ అతడి స్థితిని పట్టుకోలేరు, బాగుచెయ్యలేరు అని నిరూపింపబడిన శాస్త్రం.
అలాగే గుడికి వచ్చిన వాడి మానసిక స్థితి సాధారణ స్థితి Normal కి రావాలంటే ఆ శక్తి వలయంలో ఒక మూడుసార్లు ప్రదక్షిణ తప్పక చెయ్యాలి అని మన వాంగ్మయం చెబుతుంది.
ప్రదక్షిణ చేసేటప్పుడు Clock Wise గా నడుస్తాము, దేవాలయం చుట్టూ మొదట దక్షిణం వైపు మొదటి అడుగు వేస్తూ నడుస్తాం.
ఇలా నడవడం వలన ఎప్పుడూ మన కుడివైపు ఎప్పుడూ లోపలున్న విగ్రహం ఉంటుంది.
కుడి వైపు ఎప్పుడూ మంగళకరంగా చెప్పబడుతుంది.
అత్యంత మంగళప్రదమైన భగవంతుడు మనకు ఎప్పుడూ మంగళం వైపు ఉండి మనల్ని ముందుకు నడిపించాలని ప్రార్ధిస్తూ ప్రదక్షిణ చేయాలి...
ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా నడవమని నియమం ఉంది, శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి...
*ప్రదక్షిణలు ఎలా ఉండాలి???*
_ఒక నిండు గర్భిణి నెత్తిన ఒక నిండు కుండ పట్టుకుని నడిచినట్టుగా నడవాలి అని శాస్త్రం చెబుతోంది_
ఒక వలయం (Circle) సెంటర్ నుండి సమాంతర దూరం గా (Equidistant) గా ఉన్నట్టు లోనున్న భగవంతుని సెంటర్ గా చేసుకుని జీవుడు ప్రదక్షిణ చేసినట్టు అని అర్ధం.
ఆది శంకరాచార్యులు చెప్పినట్టు 1008 విశ్వాలు ఆ పరమాత్ముని చుట్టూ తిరిగినట్టు నువ్వు గుడిచుట్టూ తిరగాలి అని అంటారు...
21 ప్రదక్షిణలు చేసిన వారు సకల సంపదలు పొందగలరని స్వయంభూ ఆగమ శాస్త్రం చెబుతుంది

 #500 ఏళ్ళ క్రితం జరిగిన అద్భుత సంఘటన - శ్రీ సుబ్రహ్మణ్యుడే శ్రీ  సుబ్బారాయుడుగా వెలసిన క్షేత్రం , శ్రీ సుబ్బారాయుడి నిజ...
30/10/2024

#500 ఏళ్ళ క్రితం జరిగిన అద్భుత సంఘటన -
శ్రీ సుబ్రహ్మణ్యుడే శ్రీ సుబ్బారాయుడుగా వెలసిన క్షేత్రం ,
శ్రీ సుబ్బారాయుడి నిజరూప దర్శనం

#పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆదివారం అందరికీ సెలవు. #ఆ పల్లెకూ సెలవే. #కానీ మిగిలినవారికంటే కాస్త ఎక్కువ సెలవు. #ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. #మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా.. ఆ ఊరిలో దొరకదు. #ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. #ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉంది.

#ఏమిటా కథ..?*
500 ఏళ్ళ క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. #గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయిం చాడు. #మాఘ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. #దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు. #ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డుతగులుతుంది. #ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమౌతుంది. #ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు.

#కాసేపటి చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూస్తారు. #అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడుతుంది. #ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని(సుబ్రహ్మణ్యేశ్వస్వామి), మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు. #అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటిచూపు వస్తుంది. #దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్థులు నిర్ణయించుకుంటారు. స్వామివారిని వేడుకుంటారు. ‘ #రాత్రి రోకలిపోటు తరువాత మొద లుపెట్టి.. తెల్లవారు జామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి’ అని స్వామి సెలవిస్తాడు. #లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరి స్తాడు. స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. #కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. #పైకప్పులేని ఆలయం సిద్ధమౌతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా.. స్వామి వెలసిన తరువాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఇదీ స్థల పురాణం.

#ఆదివారం సెలవెందుకు..?*
సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. ఎస్‌ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. #కేవలం ఆదివారం రోజే 6 నుంచి 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. #ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి. #స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. #తమను చల్లాగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్థులు. #ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. #గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు. #మామూలు రోజుల్లో కావాలన్నా.. గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. #ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రిపండుగ నిర్వహించడం సాధారణం. #ఆ పండుగ ఆదివారం వస్తే.. సోమవారానికి వాయిదా పడుతుంది.

#ఆ మూడు మాసాల్లోనూ అంతే..*
#ఏడాది పొడవునా ఆదివారాలతోపాటు కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్థులు మాంసాహారం ముట్టరు. #ఈ కట్టుబాటును ఎవ్వరూ మీరింది లేదు. #ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసా హారానికి దూరంగా ఉంటూ గ్రామస్థులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుం టున్నారు. #ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు.

#అంత్యక్రియలకూ సెలవే....*
#కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900. #ఆదివారం గ్రామస్థుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు. #మరుసటిరోజు వరకూ మృత దేహాన్ని ఇంటివద్దే ఉంచుతారు. #సోమవారం అంత్యక్రియలు నిర్వహి బస్తారు. #ఇందుకూ స్వామిపై ఉన్న అపార మైన భక్తే కారణం. #గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. #అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. #మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు.

#ఎలా చేరుకోవచ్చు...?*
బనగానపల్లె మండలం నందివర్గం నుండి S.కొత్తూరు 5 కి.మీ దూరంలో కలదు.ఇక్కడ నుండి ఆటో సదుపాయం కలదు.🙏🙏🙏🌺🌺🌺🌺🙏🙏🙏

#సర్వోజనా సుఖినోభావంత్🙏

#అందరికి ధన త్రయోదశి శుభాకాంక్షలు

094946 65547
30/10/2024

094946 65547

తెలుగు దేశం పార్టీ మెంబెర్షిప్
30/10/2024

తెలుగు దేశం పార్టీ మెంబెర్షిప్

Address

Visakhapatnam
530052

Alerts

Be the first to know and let us send you an email when Hstv1 Hindu Sakthi Daily Paper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hstv1 Hindu Sakthi Daily Paper:

Videos

Share

Nearby media companies


Other Broadcasting & media production in Visakhapatnam

Show All