29/11/2021
CONCEPT OF NEW P***E VELUGU BUS DESIGN.
🤍🖤💚🤍🖤💚🤍🖤💚🤍🖤💚🤍🖤💚🤍🖤💚🤍🖤💚
పల్లె పచ్చదనం కనిపించేలా ఆకుపచ్చ రంగు, బస్సు పల్లె ప్రయాణం చేసే రోడ్డు రంగు (అతి తక్కువ శాతం) మరియు తెల్లని ఆకాశం తెలుపు రంగు (ఎక్కువ శాతం) తో ఈ "పల్లె వెలుగు" బస్సు రంగు మార్చబడినది.
ఈరోజు ఒక ప్రముఖ పత్రిక పల్లె వెలుగు బస్సు వేసిన కొత్త రంగులని మొత్తం బూడిద రంగు ఉంది అని వ్యంగంగా కార్టూన్ బొమ్మ వేశారు. బహుశా ఆ పత్రిక సోదరులు పల్లె వెలుగు బస్సు కొత్త రంగుని నలుపు మరియు తెలుపు చిత్రంలో(Black & White Photo) చూసుంటారు. వారి కోసం కలర్ ఫోటో పెడుతన్నాం. దయచేసి గమనించాలని కోరుకుంటున్నాం.
ప్రభుత్వం మారక ప్రతిసారి బస్సు రంగులు మార్చడం చాలా సహజం. దాని వలన ప్రజలకి కూడా కొత్తదనం ఉంటుంది. అలాగా అని ఏ ప్రభుత్వమూ తాము చెప్పిన రంగులు వెయ్యమని ఆర్టీసీ అధికారులకి ఎవరు చెప్పలేదు. 1995, 2004, 2014 ఇలా ప్రతిసారి కొత్త ప్రభుత్వాలు వచ్చాక రంగులు మార్చిన విషయము మనకి తెలిసిన సంగతే. 2005 నుంచి 2014 వరకు తెలుపు, ఆకుపచ్చ రంగులో ఉండే "పల్లె వెలుగు" బస్సులు 2014 లో కొత్త ప్రభుత్వం వచ్చాక పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులు తో మార్చబడినది. 2005 నుంచి 2014 వరకు పల్లెలకు వెళ్లే "పల్లె వెలుగు"బస్సులు పేరుని 2014 లో కొత్త ప్రభుత్వం వచ్చాక "తెలుగు వెలుగు"గా మార్చబడినది . 2019 కొత్త ప్రభుత్వం తిరిగి మరలా ఆ పేరుని "పల్లె వెలుగు" గా మార్చారు. కొత్త ప్రభుత్వం వచ్చి దాపు రెండు ఏళ్ళు తర్వాత తిరిగి ఆకుపచ్చ, తెలుపు రంగు వేశారు. ఇందులో వ్యంగ్యం ఎందుకో మాకు అర్ధం కాలేదు. ఆర్టీసీ బస్సుల మీద రాజకీయ దుష్ప్రచారాలు దయచేసి ఎవరు చెయ్యవద్దు అని మా మనవి. కొన్ని లక్షల వీక్షకులు ఉన్న పత్రికలు వాస్తవాలు తెలుసుకుని బాధ్యతగా ప్రచురించాలి అని మేము కోరుకుంటున్నాం. మీ దగ్గర వాస్తవాలు లేవు అంటే చెప్పండి మేము బయట పెడతాము. ధన్యవాదాలు.
Source: APS RTC