ADN News

ADN News Nellore's first full HD Digital Cable Network :: ADN News
(7)

10/12/2023

మర్రిచెట్టు తొర్రలో దెయ్యం ఉందంటారు, మర్రిచెట్టు కింద పడుకుంటే ఊపిరి ఆడదంటారు..మర్రిచెట్టుపై ఊయల కడితే సంతానం కలుగుతుందంటారు , మర్రిచెట్టు పార్వతీదేవి స్వరూపమంటారు.. ఇలా మర్రిచెట్టుగురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.. అయితే ఆ కథలసంగతెలా ఉన్నా , ఇదిగో ఈ మహామర్రి చెట్టులో నాగుపాములు నివాసం ఉంటున్నాయట. పుట్టలో ఉండాల్సిన పాములు ఈ చెట్టులో ఎందుకున్నాయో తెలియదు.. చాలాకాలంగా ఈ మర్రి చెట్టు నాగుపాములకు నిలయం, తిరుపతి జిల్లా ఏర్పేడు నుంచి వేంకటగిరి పోయే రోడ్డులో , వెంకటగిరి సరిహద్దులోనే , రోడ్డుపక్కనే ఈ చెట్టు ఉంది, 400 యేళ్ళనాటి ఈ మర్రిచెట్టుని చూస్తేనే భయమేస్తోంది. చుట్టూ ఊడలు దిగిఉన్న ఈ మర్రిచెట్టులో 12 అడుగుల వరకు పొడవున్న నాగుపాముల ఐదు ఉన్నాయట, దీనిపక్కనే అమ్మవారి ఆలయం ఉంది. ఈ నాగులు ఎవరినీ ఇంతవరకు కాటెయ్యలేదట.. ఈ మర్రిచెట్టులో నాగులు దాగిఉన్న విషయం చుట్టుపక్కల అందరికీ తెలిసినా వాటిని ఏమీ చెయ్యరు. ఎక్కడ తిరిగినా , ఆ ఐదు పాములు ఈ చెట్టులోకే వస్తాయని చెబుతారు..

09/12/2023

ఆడుదాం ఆంధ్రా ఛాలెంజ్ కాదమ్మా, బైక్ లో ఆగకుండా ఈ కలుజు దాటండి.. నెల్లూరు చెరువు కలుజు ఇది.. ఎన్ని ప్రభుత్వాలు ,మారినా మారని దుస్థితి..

09/12/2023

కొండలు, కోనల పైనుంచి దూకుతున్న ,కోతులగుండం జలపాతం.. మర్రిపాడు మండలంలో సింగనపల్లి అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలమధ్య కనువిందు చేస్తోంది. జలపాతానికి వెళ్లేందుకు సరైన మార్గం లేక ఇబ్బందులు పర్యాటకులు ఇబ్బందిపడుతున్నారు..

09/12/2023

ఏడుకొండల స్వామీ, ఏమి నీలీల.. ఈ పేద, వృద్ధ భక్తుడిని ఇలా కనికరించావా..?

04/12/2023

మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతంలో ప్రచండ గాలులకు తల్లడిల్లుతున్న పల్లెలు.. ఎంత తీవ్రంగా ఉందో చూడండి..

03/12/2023

చెప్పితే వినకపోతే ఇంతే డ్రైవరూ ..ప్రమాదమని తెలిసి కూడా పొతే అంతే . నెల్లూరు రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జివద్ద మొలలోతు నీళ్లున్నా ఈ డొక్కు బస్సుని దింపేసాడు.. బస్సు ఆగిపోవడంతో ప్యాసెంజర్లకు గుండె ఆగినంత పనయింది. ఒక్కొక్కరు దిగేసి బ్రతుకుజీవుడా అని బయటపడ్డారు..

03/12/2023

పైనాపిల్ కట్టింగ్ స్కిల్స్ చూడండి.. అలాగే పైనాపిల్ ఆరోగ్య రహస్యాలు, పోషకవిలువలు తెలిస్తే ఇక మీరు వదలరు.. చూసెయ్యండి..

02/12/2023

ఆగుడిలో రూపాయి బిళ్ళ నిలబడితే
పెద్దమ్మ తల్లి వరమిచ్చినట్టేనట..
==================///
దేవుడంటే నమ్మకమే..ఆ నమ్మకమే మనిషిని ముందుకు నడిపిస్తుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఓ వింత ఇది. భక్తులు రూపాయి బిళ్ళను ధ్వజస్తంభం దగ్గర నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. అది నిలబడితే అమ్మ వరం ఇచ్చిందని కోరిక తీరిందని భావిస్తారు.. చూడండి ఆ సందడి..

02/12/2023

చంద్రగిరి కోటలో అద్బుత టెక్నాలజీ.. 600 ఏళ్ల క్రితమే రాజమహల్ ఎదురుగా ఉన్న కొలను నుంచి వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న కొండమీద కోటలో ఉన్న సైనిక స్థావరాలకు నీళ్లు పంప్ చేసేవారు.. ఎలాగో చూడండి.

28/11/2023

శబరిమలైలో పెరుగుతున్న రద్దీతో ఆ క్షేత్రం కిటకిట లాడుతొంది. కార్తీక మాసంకూడా రావడంతో ఎక్కుమంది అయ్యప్పస్వాములు శబరిమల ప్రయాణం కడుతున్నారు..శబరిమలకు పోయే భక్తుల్లో సగం మంది ఆంధ్రనుంచే ఉన్నారు.

27/11/2023

ఆంజనేయ స్వామి వాహనమైన ఒంటెని ఆలయాల్లో మీరెక్కడా చూసిఉండరు.. ఇదిగో ఇక్కడ చూడండి.. ఇంత పెద్ద ఒంటె వాహనాన్ని స్వామి ఆలయంలో ఆయన విగ్రహం ముందు పెట్టారు. కళాత్మకంగా తీర్చిదిద్దిన ఈ ఆలయం ఆత్మకూరుకు సమీపంలో మెయిన్ రోడ్డుమీదనే ఉంది..

26/11/2023

నల్లమల కీకారణ్యంలో కొండకోనల్లో ఘటిక సిద్ధేశ్వరం ఆలయం ఉంది. అక్కడ ప్రశాంత వాతావరణమే ఆధ్యాత్మికత భావాలను కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుజిల్లా సీతారామపురం మండలంలోని శ్రీసిద్ధేశ్వరకోనలో ఉంది. చాలా పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్న దశలో అవధూత కాశీనాయన స్వామి పునరుద్ధరించారు. ఇది నెల్లూరుకి 110 కిమీ దూరంలో ఉంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య ఘటిక సిద్దేశ్వరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ ఉంటారు. అగస్త్య మహాముని కూడా ఈ ప్రాంతంలోనే తపస్సు చేశారని చెబుతుంటారు..

26/11/2023

కొండసెలయేటిలో వచ్చే నీళ్ళే ,
ఆ పట్టణ ప్రజలకు అమృతం..నమ్మలేని నిజం.
=====================///
కొండ కోనలలో, గలగల పారే సెలయేటి నీళ్ల సవ్వడిలో.. ఇదేదో కవిత్వం కాదు ,నిజం. నేటి ఆధునిక కాలంలో కూడా కొండ కోనల నుంచి వచ్చే సెలయేటి నీళ్లు తాగే అదృష్టం ఎంతమందికి ఉంటుంది..? వాటిని సేవించే భాగ్యం ఎంతమందికి దక్కుతుంది..? ఇదేదో అడవుల్లో, కొండల్లో ఉండే జాతుల గురించి వారి జీవన విధానం గురించి కాదు . ఒక పట్టణం మధ్య ప్రకృతి ఒడిలో పెరుగుతున్న ఓ పల్లె జీవనం గురించి. దేశ ప్రసిద్ధి చెందిన ఉదయగిరి కొండ కింద ఉన్న పల్లెల ప్రజలు కొండల్లో నుంచి వచ్చే సెలయేటి నీటిని గ్రామాలకు మళ్లించుకుని మంచినీటిగా వాడుకుంటున్నారు.

26/11/2023

సోకులుమీకేనా మాకు లేవా అన్నటుంది ఈ డ్యాన్స్ గుర్రం మేకప్.. చూడండి ఎంత రిచ్ గా టాటూస్ , బాడీ పెయింటింగ్స్ వేయించుకుందో..

25/11/2023

జడలు విప్పిన మర్రిచెట్టు.. ఈ పదం పురాణ గాథల్లోనూ ,దెయ్యాల కథల్లోనూ మనం తరుచూ వింటూ ఉంటాం. మర్రిచెట్టు జడలు విప్పితే ఎలా ఉంటుంది, అసలు మర్రిచెట్టు జడలు విప్పడం అంటే ఏమిటో నేటి తరానికి తెలియకపోవచ్చు. అలా తెలియకపోతే ఇదిగో ఈ చెట్టు చూడండి. దాదాపు 300 ఏళ్లకు పైగా ఈ మర్రిచెట్టు ఇక్కడ ఉంది. జడలు విప్పడం అంటే ప్రతి కొమ్మ నుంచి ఊడలు కిందకి దిగి ఇన్నేళ్లుగా ఈ చెట్టు ఆ దారిన పోయే వారికి నిడనిస్తుంది. ఎప్పుడో ఆ చెట్టు చుట్టూ కట్టిన రచ్చబండలు కూడా మర్రిచెట్టు వేర్లలో కలిసిపోయాయి. ఊడలు దిగి చూసేందుకు వింతగానో విచిత్రంగా ఉన్న ఈ జడల మర్రి చెట్టు ఒక విశేషం. ప్రకాశం జిల్లా పామూరు కందుకూరు రోడ్లో మోపాడు కూడలిలోఉంది..

25/11/2023

హైదరాబాద్ నుంచి చెన్నైకి సైకిల్ లో పోయినా వారంరోజుల్లో పోవచ్చు.. అయితే సూపర్ స్పీడ్ వోల్వో ట్రక్కుకు 32 రోజులు పట్టింది.. ఈ తాబేలు నడక ఎందుకో చూడండి..

24/11/2023

చిలుక ఏకాదశి సంబరాల్లో,మహిళల కోలాటం..కనులకు విందు చేసింది.. శ్రీనివాసుడి ఊరేగింపులో అలాగే గంటలతరబడి తరబడి కోలాటం వేశారు.. .

24/11/2023

మెకానికల్ ఏనుగులకు ఇప్పుడు భలే డిమాండ్..
======================///
ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో మెకానికల్ ఏనుగులకు డిమాండ్ వచ్చింది. దీనికి కిరాయి అసలు ఏనుగు కొన్నంత పనవుతుంది.. లక్షరూపాయలుకు తక్కువకాకుండా ఈ మెకానికల్ ఏనుగులకు అద్దె వసూలుచేస్తున్నారు..

24/11/2023

జగనన్న మీద ప్రేమతో. ఓ నేతన్న ,
ఇది నీకు ఇవ్వాలన్నా ఒక్కసారి కలవాలన్నా
===================///
చిత్తూరు జిల్లా నగరికి చెందిన భక్తవత్సలం అనే ఈ చేనేత కార్మికుడు ఆరు నెలలు శ్రమించి అందమైన సిల్క్ శాలువా , చీరె, చొక్కా నేసాడు. శాలువాలో జగన్, రాజశేఖర్ రెడ్డి ఫొటోలు, చీర కొంగులో జగన్ ఫొటోలు, చొక్కా పై జగన్ ఫొటోలతో నేసిన ఈ వస్త్రాలను జగన్ ని కలిసి ఇవ్వాలని కోరిక.. అయినా అవకాశం దొరకడంలేదంట.. జగన్ ఎప్పటికి కరుణించేనో ..? ఎప్పటికి కలిసే అవకాశ మిచ్చేనో ..? ఆ జగన్ కే ఎరుక .

24/11/2023

ఉదయగిరి కొండలను కమ్మేసిన కారుమబ్బులు..హిమలయాలను తలపించే మనోహర దృశ్యాలు..

21/11/2023

చుట్టూ కొండలు, మధ్యలో కీకారణ్యం , అరణ్యంలో యజ్ఞకుండం లాంటి 400 ఏళ్లనాటి అద్భుత బావి , ఎందుకుంది..?

21/11/2023

నెల్లూరులో నారాయణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద బ్రహ్మ్యేశ్వర ఆలయంలో శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటంది. ఇక్కడ ఆలయంలో శివలింగాన్ని మంచులో కప్పేశారు. కార్తీక మాసం సందర్భంగా చేసిన ఈ ప్రత్యేక అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది..

20/11/2023

జగన్ ఇటు వస్తుంటే ఆ స్వామి ఆటుపోతున్నాడు . ఎందుకో..?
======================///
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మకాం మార్చేస్తున్నారు. సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి , గురుతుల్యుడు అయిన స్వరూపానందేంద్ర మకాం హైదరాబాదుకు మార్చడంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జగన్ విశాఖను రాజధాని చేస్తానని , ఇక తన మకాం అక్కడేనని , విశాఖకు వస్తుంటే , స్వరూపానంద , విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. టిడిపి సోషల్ మీడియా మాత్రం రాబోయే పరిణామాలు గమనించే , స్వరూపానంద మకాం మార్చేస్తున్నారని ప్రచారం పెట్టింది

20/11/2023

శివపార్వతుల తలపై పూలు కిందపడితే అది జరిగినట్టే..
=========================///
ఆ దేవాలయంలో కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్న మహాత్యమిది.. మీ మనసులో ఒక కోరిక ఉందని చెబితే , పూజారి మంత్రం చదివి గంట మోగిస్తాడు.. గంట ఆపేలోగా శివపార్వతుల తలపై పువ్వు కిందపడుతుంది.. పడకపోతే మీ కోరిక తీరదు.. కొన్నేళ్లుగా ఈ విచిత్రం జరుగుతున్న ఆలయం సైదాపురం మండల కేంద్రంలోని సిద్దేశ్వర స్వామి కొండగుహలో జరిగే వింత.. మీరూ చూడండి .

19/11/2023

ఆస్ట్రేలియా , ఇండియా క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా గ్రౌండ్స్ లో లైవ్ ప్రసారానికి కుర్రాళ్ళు పోటెత్తారు. ఈ సందర్భంగా పిచ్చెక్కిపోతుంది.. అబ్బా టెన్షన్.. అంటూ ఫైనల్ మ్యాచ్ పై జోష్ , టెన్షన్ చూడండి.. .

19/11/2023

వందేళ్ల క్రితం మట్టితో కట్టిన గోడలోకి మర్రి చెట్టు ఊడలు దిగినా బీటలు వారలేదు.. ఇదేమి మట్టి సామీ.. ఇంత పవర్ ఫుల్..?

18/11/2023

కుర్రాళ్ళు, కడుపునిండా బిర్యానీ లాగించేసి , ఇదిగో ఈ ఫుల్ జార్ సోడా కోసం పోతున్నారు. అల్లం, కొత్తిమీర, పుదీనా , నిమ్మరసం, ఉప్పు దంచికొట్టి సోడాలో కలిపితే అబ్బా దీని దెబ్బ అంటున్నారు.. చూడండి ఎలా తయారుచేస్తున్నారో..

08/11/2023

సంప్రదాయ నృత్యరీతులలో కూచిపూడి, భరతనాట్యం తరువాత చూడముచ్చటైనది కేరళ కధాకళీ నృత్యం.. ఈ కళాకారులు కేరళ బ్యాండు కి అనుగుణంగా ఎంత బాగా నృత్యం చేస్తున్నారో చూడండి..

03/11/2023

గుహలలో రంగులలోకం.. మాయాప్రపంచం కాదు.. ఇది ప్రకృతి సృష్టించిన అద్భుతం.. నంద్యాల జిల్లా బెలుం గుహలలో అందాలను చూడండి..

31/10/2023

ఫాస్ట్ ఫుడ్స్ వచ్చిన తరువాత జనం టేస్ట్ మారింది.. వెరైటీస్ కూడా మారాయి.. దానికి తగ్గట్టు రేట్లు కూడా పెరిగినా జనం అవన్నీ పట్టించుకోరు , టేస్టు , వెరైటీ .. చాలు అవే స్ట్రీట్ ఫుడ్ కి ఇప్పుడు పెట్టుబడులు.. కాజు దోసె చూడండి .. దోసెల్లో ఈ దోసె వేరయ్యా అన్నట్టు జీడిపప్పు దోసె ఒక్కసారి తింటే అబ్బో టేస్ట్ అదుర్స్.. మేకింగ్ చూడండి.

30/10/2023

హైదరాబాద్ నగరం రాత్రి అయితే వెలుగుజిలుగుల్లో కొత్త అందాలను సంతరించుకుంటుంది. ఈ పార్క్ లో చూడండి.. నీటితుంపర్ల జలతారుల మధ్య సప్తవర్ణాల రంగుల్లో ఎంత మనోహరదృశ్యం ఆవిష్కృతమైందో..?

30/10/2023

జబర్దస్త్ తన్మయి డ్యాన్స్ మామూలుగా లేదుగా.. మధ్యలో శాంతిస్వరూప్ చేరాడు.. ఇక చెప్పాలా ?? చూడండి.

30/10/2023

పెళ్లిళ్లు, రిసెప్షన్లు చిన్నగ్రామాల్లో కూడా హైటెక్ లెవెల్ కి ఎదిగిపోయాయి.. నెల్లూరు జిల్లా పొదలకూరులో సోమాభాస్కర్ అనే వ్యాపారి తన కూతురుకి చేసిన పెళ్లి, రిసెప్షన్ మెగా ఈవెంట్ గా నిలిచింది. గతరాత్రి వియ్యంకుడు అడిగోపుల హరిబాబుతో కలిసి ఏర్పాటు చేసిన రిసెప్షన్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏకవీర లెవెల్లో ఇలా స్వాగతం చెప్పారు..

28/10/2023

శనివారం అర్థరాత్రి దాటిన తరువాత పాక్షిక చంద్ర గ్రహణం సమయంలో ఇలా రాహువు మింగిన చంద్రుడు... రాపూరు నుంచి తీసిన దృశ్యాలు..

28/10/2023

పెరట్లో ద్రాక్ష ఇలా ఇరగ కాసింది.. పుల్లపుల్లగా, తియ్య, తియ్యగా పండ్లు భలేగున్నాయి.. ద్రాక్ష తోటలులేని చోట కాసిన ఈ మొక్క ఇప్పుడు విశేషమే..

27/10/2023

వామ్మో తిరుమల కాలిబాటలో
మళ్ళీ చిరుత, ఎలుగు సంచారం..
=================///
తిరుమల నడకదారిలో మళ్ళీ చిరుత అలికిడి సంచలనం కలిగించింది. తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఈనెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుండి రిపీటర్ మధ్య ప్రాంతంలో ఒక చిరుత, ఒక ఎలుగుబంటి తిరుగుతున్నట్టుగా కెమెరా ట్రాప్ లో నమోదయింది.అందువల్ల నడకదారిలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తిచేసింది. భక్తులు గుంపులు గుంపులుగానే వెళ్లాలని సూచించింది. దీంతో మళ్ళీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ చిరుతను ట్రాప్ కెమెరాల్లో పసిగట్టిన అధికారులు , అది కాలిబాటపక్కనే సంచరిస్తున్నట్టు చూసారు.. ఎలుగుబంటి కూడా అలాగే కాలిబాట పక్కనే కనిపించింది.

27/10/2023

పెంచలకోనలో వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం సైదాపురం మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది..

25/10/2023

పెళ్ళిళ్ళు, రిసెప్షన్ల ట్రెండ్ మారిపోయింది. నెల్లూరు జిల్లా పొదలకూరులో సోమా భాస్కర్ అనే వ్యాపారి తన రెండో కూతురికి రిసెప్షన్ జరిగిన తీరు అదిరిపోయింది..

23/10/2023

భారతీయ శిల్ప కళకు ఘనమైన వారసత్వంగా నిలిచే మహాబలిపురంలో మహిషాసుర మర్దని బాహుబలి రాయి విచిత్రమేకాదు, ఏకశిలగా కొన్ని వేల టన్నులు బరువుగలిగినది. ఈ మహిషాసుర మర్దని రాయిని మలిచి దానిలో మందిరాలు ఆలయాలు నిర్మించారు. ఇవన్నీ కాక మహిషాసుర మార్గాన్ని బాహుబలి రాయిపై మరో ఆలయాన్ని కూడా నిర్మించారు వైష్ణవ శైవ సంప్రదాయాలలో ఈ ఆలయాలను నిర్మించడం విశేషం. ఇంత పెద్ద రాయిలో ఇన్ని గుహలు, మండపాలు మందిరాలు చెక్కడం బహుశా ప్రపంచంలో మరెక్కడ కనిపించని ఒక అద్భుతం. ఒక అంతుచిక్కని రహస్యం. పల్లవుల కాలం నాటి శిల్ప కళా వైభవానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ దేవతలు రకరకాల భంగిమల్లో ఉంటారు. పురాణ కథలను శిల్పాల రూపంలో అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చెక్కారు. ఆనాటి శిల్పుల నైపుణ్యానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.

23/10/2023

పల్లె జీవితాన్ని రాజకీయ విషం కలుషితం చేసిన వేళ, పల్లె జీవితాన్ని నాగరికత అనే రాక్షసి చిద్రం చేసిన వేళ, పల్లె తల్లి ఒడిలో కక్షల కార్పణ్యాల చిచ్చు రగులుతున్న వేళ, ఓ పల్లె అన్ని మర్చిపోయి మురిసిపోతోంది. పల్లె తల్లి ఈ పల్లెను చూసి ఆనంద పడుతోంది. పొంగళ్ళు సంప్రదాయమే ఆ పల్లెని కాపాడుతొంది..

Address

Thota Vijaya Bhaskar
Nellore
523004

Telephone

+919440207109

Alerts

Be the first to know and let us send you an email when ADN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Akshara Digital Network

Our Website : www.adnnews.in