Our ADONI

Our ADONI ADONI is a city in the Kurnool district in the Indian state of Andhra Pradesh. It is a municipality
(1)

02/11/2024

01/11/2024

ాగ్రత్త ోని_వాసులు

27/10/2024

13/07/2024

*డ్యాన్స్ చేస్తూ కోడి తల కొరికేసిన డ్యాన్సర్.. అనకాపల్లిలో కేసు నమోదు*

పెటా ఇండియా ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు

ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారంటూ ఫిర్యాదు

డ్యాన్సర్‌తో పాటు నిర్వాహకులపైనా కేసు

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో ఆసక్తికరమైన ఘటన వెలుగుచూసింది.

ఓ డ్యాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

నృత్య ప్రదర్శనలో జనసందోహం ముందు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడి తలను తన పళ్లతో కొరికి చంపాడని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసు అధికారులను పెటా ఇండియా సంప్రదించింది. ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారని, వినోదం పేరిట ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ, జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం-1960లోని సంబంధిత సెక్షన్ కింద డ్యాన్సర్‌తో పాటు నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
------------------------------------

*విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి ట...
05/07/2024

*విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టి.జి భ‌ర‌త్*

విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మంత్రి టి.జి భ‌ర‌త్ క‌లిశారు. విజయవాడ నుండి కర్నూలు ఎయిర్‌పోర్టుకు విమానసౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ కోసం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర మంత్రిని కోరిన‌ట్లు టి.జి భ‌ర‌త్ చెప్పారు. ఈ విష‌యంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు. విజయవాడ నుండి కర్నూలుకు విమాన స‌ర్వీసులు త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని, ఏడాదిలోపు రాత్రి స‌మ‌యాల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయిస్తాన‌ని కేంద్ర మంత్రి చెప్పార‌న్నారు. ఈ మేర‌కు పనులు ప్రారంభించాలని వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారన్నారు. క‌ర్నూలుకు విమాన సర్వీసులు అందుబాటులోకి వ‌స్తే ఓర్వ‌క‌ల్లు ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌కు పారిశ్రామికవేత్తలు రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుందని టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తే ఇండస్ట్రియల్ జోన్లో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారన్నారు. క‌ర్నూలుకు ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న‌ట్లు టి.జి భ‌ర‌త్ తెలిపారు.

హైదరాబాద్‌: సినీ నటుడు రాజ్‌ తరుణ్ పై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ప్రియురాలు లావణ్య.. తనను పెళ్లి చేసుకు...
05/07/2024

హైదరాబాద్‌: సినీ నటుడు రాజ్‌ తరుణ్ పై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ప్రియురాలు లావణ్య.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు.. 11 ఏళ్లుగా రాజ్‌ తరుణ్‌తో రిలేషన్‌లో ఉన్నా.. గుడిలో పెళ్లి చేసుకున్నామని ఫొటోలు బయటపెట్టిన లావణ్య

కర్నూలు: కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌పై పోక్సో కేసు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలికపై లైంగిక వేధింపులకు పాల్ప...
04/07/2024

కర్నూలు: కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌పై పోక్సో కేసు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సుధాకర్‌పై ఆరోపణలు

తేదీ : 03-07-2024 ( బుధవారం)ఆదోని ఎమ్మెల్యే శ్రీ డా.పార్థసారథి గారి *పర్యటన*👉 ఉదయం 11 గంటలకు నుండి 12:45 నిమిషాల వరకు పా...
03/07/2024

తేదీ : 03-07-2024 ( బుధవారం)

ఆదోని ఎమ్మెల్యే శ్రీ డా.పార్థసారథి గారి *పర్యటన*

👉 ఉదయం 11 గంటలకు నుండి 12:45 నిమిషాల వరకు పార్టీలో నూతనంగా చేరికల వారి సమావేశంలో పాల్గొంటారు.

స్థలం:- ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్.

మధ్యాహ్నం 1:15 మార్కెట్ యార్డ్ లో కమిషన్ ఏజెంట్లు, గుమస్తాల, వేమెన్స్ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.

సాయంత్రం 6 :00 నుండి 8:00 ల వరకు షరాఫ్ బజార్లో బంగారం వ్యాపారస్తులు ఎమ్మెల్యే గారిని సన్మానం చేసే సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన టీమ్ ఇండియా. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై గెలిచి ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్...
29/06/2024

T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన టీమ్ ఇండియా. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై గెలిచి ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్.

28/06/2024
28/06/2024

*_🌹కేరళ పోలీస్ స్టేషన్‌లో చాలా కాలం పాటు క్లీనర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొంది, ఇంటికి వెళ్తున్న మహిళను సన్మానించే విధంగా పోలీస్ జీపులో ముందు సీటులో కూర్చున్న దృశ్యం. మరియు ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి వెనుక సీటులో కూర్చునారు

16/09/2023
08/06/2023

ఎన్నో ఏళ్లుగా కలగంటున్న ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ..
అడ్మిషన్స్ ప్రక్రియను ప్రారంభించి, కొత్త ప్రిన్సిపాల్ ను కుడా ప్రభుత్వం నియమించింది..
ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం

ఎంతో మంది నాయకులు ఓట్ల కోసం వాడుకున్న ఈ ప్రక్రియను
ఆదోని యువతకు అందించిన ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారికీ నా ఆదోని నియోజకవర్గ ప్రజల తరుపున, నా తరుపున ప్రత్యేక ధన్యవాదాలు..

మీ
Y. సాయి ప్రసాద్ రెడ్డి
MLA,ADONI.

వివాహాలకు సహాయం చేస్తున్న మనోజ్ గారు. ..ఆదోని పట్టణానికి చెందిన నరసింహులు కుమార్తె వైశాలి వివాహానికి తాళి మెట్టెలు ఇచ్చి...
08/12/2022

వివాహాలకు సహాయం చేస్తున్న మనోజ్ గారు. ..

ఆదోని పట్టణానికి చెందిన నరసింహులు కుమార్తె వైశాలి వివాహానికి తాళి మెట్టెలు ఇచ్చి తన మంచి మనస్సు చాటుకున్న యువనాయకుడు Y. జయమనోజ్ రెడ్డి గారు.

అదోని నియోజకవర్గం ఇన్ చార్జి మరియు మాజీ శాసన సభ్యులు మీనాక్షి నాయుడు అన్నగారి హృదయపూర్వక జన్మదిన శుభకాంక్షలు 🎂🎉
25/10/2022

అదోని నియోజకవర్గం ఇన్ చార్జి మరియు మాజీ శాసన సభ్యులు మీనాక్షి నాయుడు అన్నగారి హృదయపూర్వక జన్మదిన శుభకాంక్షలు 🎂🎉

ఆదోని టూ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ నాయక్ గారు
05/10/2022

ఆదోని టూ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ నాయక్ గారు

Vijaya Dasami subhakanshalu
05/10/2022

Vijaya Dasami subhakanshalu

కర్నూలు జిల్లా... ఆదోని ఒకటవ పట్టణ పోలీసు కానిస్టేబుల్ కు   వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రశంసాపత్రం అందజేసిన... జిల్లా ...
12/09/2022

కర్నూలు జిల్లా...

ఆదోని ఒకటవ పట్టణ పోలీసు కానిస్టేబుల్ కు వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రశంసాపత్రం అందజేసిన... జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్ గారు.

• రూ. 84 లక్షల విలువైన బంగారు , వజ్ర, వెండి ఆభరణాలు రికవరీ చేయడంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కానిస్టేబుల్ కి అభినందన.

• ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తే విధుల పట్ల అంకిత భావంతో పని చేస్తారనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం ... జిల్లా ఎస్పీ.

ఆదోని ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్.హాజీ బాషా ( PC – 2593) ను వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కు ఎంపిక చేసి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్ గారు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు.

ఆదోని 3 టౌన్ పోలీసుస్టేషన్ ( Cr.No.90/2022 U/s 457, 380 IPC) పరిధిలోని జబ్బార్ జ్యూవెలరీ షాపులో జరిగిన దొంగతనం కేసులో 3 నిందితులను గుర్తించి, సోత్తును రికవరీ చేశారు.

ఇందులో
1,250 గ్రాముల బంగారు ఆభరణాలు(రూ.62 లక్షల 50 వేలు విలువ)

13 లక్షల డైమాండ్ జ్యూవెలరీ

10 కేజిల 100 గ్రాముల విలువైన వెండి ఆభరణాల( రూ.8 లక్షల 50 వేలు)ను రికవరి చేయడంలో అంకితభావంతో చేసిన కృషికి కానిస్టేబుల్ ఎస్.హాజీ బాషా ను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

• విధి నిర్వహణలో ప్రతిభ ను గుర్తించి , ప్రోత్సాహకంగా అవార్డులను అందజేస్తే వారిలో మరింత ఉత్సాహం పెరిగి, ఇంకా నిబద్ధతతో విధులు నిర్వహిస్తారని, వారిని మరింత చైతన్యవంతుల్ని చేసే ఉద్దేశ్యంతో జిల్లాలో బెస్ట్ వీక్లీ పర్ఫార్మెన్స్ ప్రశంసా పత్రాలను పోలీసు సిబ్బందికి అందజేస్తున్నామని జిల్లా ఎస్పీ గారు సోమవారం తెలిపారు.

పోలీసు సిబ్బందిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఇలాంటి అవార్డుల ను అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సంధర్బంగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్.హాజీ బాషా ( PC – 2593) జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ జేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు...

ఈ రోజున గణేశునికి దుర్వాను సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది మరియు కోరిక...
31/08/2022

ఈ రోజున గణేశునికి దుర్వాను సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది మరియు కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ ఉపవాసం స్కంద, శివ, గణేశ పురాణాలలో ప్రస్తావించబడింది. 'శ్రీ గణేశాయ నమః దుర్వాంకురాన్ సపరణయామి.' ఈ మంత్రంతో గణేశుడికి దుర్వాసన సమర్పిస్తే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి గణేశుడు ప్రసన్నుడై సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు.ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

Meet our new Kurnool SP Sri Siddharth Kaushal IPS. Welcome to Kurnool Sir. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరిం...
23/06/2022

Meet our new Kurnool SP Sri Siddharth Kaushal IPS. Welcome to Kurnool Sir.

కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన... శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారు .

24 గంటలు ప్రజలకు సేవలందిస్తాం.

మహిళల భద్రతకు ,శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తాం.

సెబ్ ఎన్ ఫోర్స్ మెంట్ పనితీరును బలోపేతం చేస్తాం.

ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచుతాం.

ట్రాఫిక్ క్రమబద్దీకరణకు, సైబర్ నేరాల నివారణకు కృషి చేస్తాం.

అన్ని ప్రభుత్వ శాఖల సహాకారం, సమన్వయంతో కలిసి పని చేస్తాం.

అసాంఘిక కార్యక్రమాల పై స్పెషల్ డ్రైవ్ చేపడతాం.

ఎక్కడైనా సమస్యలుంటే ప్రజలు పోలీసు యంత్రాంగానికి సమాచారం అందిస్తే సమస్యను బట్టి తగిన చర్యలు తీసుకుంటాం.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల లో భాగంగా ఇంతకుమునుపు కర్నూల్ జిల్లా ఎస్పీ గా పనిచేసిన సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారు కోనసీమ జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారు కర్నూల్ జిల్లా ఎస్పీగా గురువారం జల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

మొదటగా ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారి కి పూరోహితులు ఆశీస్సులు అందజేశారు. జిల్లా ఎస్పీ గారు పోలీసుఅధికారులతో మాట్లాడారు.

శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారి గురించి…

2012 ఐపియస్ బ్యాచ్ కు చెందిన శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారి స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, మొదటిసారిగా గ్రేహౌండ్స్ లో విధులు నిర్వర్తించారు.

పార్వతీపురం , విశాఖపట్నం నందు ఏఎస్పీగా , గుంతకల్ , ప్రకాశం , కృష్ణా జిల్లాలలో ఎస్పీగా విధులు నిర్వహించారు.

2018 లో ఎస్పీగా పదోన్నతి పొంది మొదట గుంతకల్ ఎస్పీగా , 2019 నుంచి ప్రకాశం జిల్లా ఎస్పీగా చేశారు . 2021 జులై 14 నుంచి కృష్ణా జిల్లాలో ఎస్పీగా పనిచేస్తూ బదిలీ పై 2022 జూన్ 23 న కర్నూలు జిల్లాకు వచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మిడియా తో మాట్లాడారు.

కర్నూలు జిల్లా ఎస్పీగా రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గారికి, రాష్ట్ర డిజిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

ఇది వరకు పని చేసిన జిల్లా ఎస్పీ సిహెచ్ . సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారు బాగా పని చేశారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహిస్తామన్నారు. మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు.

వాట్సప్ లో ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. సమస్యతో వచ్చిన ప్రతి ఒక్క బాధితుడికి తక్షణ పరిష్కారం అందేలా కృషి చేస్తామన్నారు.

గుట్కా, గంజాయి, అక్రమ మద్యం, అక్రమ ఇసుక, రవాణా , నాటు సారా తయారీ అరికడతామన్నారు. నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

14/04/2022

కర్నూలు జిల్లా ఎస్పీ మరియు కర్నూలు DFO వారి సంయుక్త ప్రకటన

కర్నూలు జిల్లా(14.04.2022)

ఆదోని తాలుకా నారాయణపురం, కమ్మరి చేడు గ్రామాల సరిహద్దులలో 11 కృష్ణ జింకలను చంపిన కేసులో హైదరబాద్ కు చెందిన ముఠా సభ్యులను గుర్తించి కేసును చేధించిన కర్నూలు జిల్లా పోలీసులు మరియు ఫారెస్టు అధికారుల దర్యాప్తు బృందం.

2022 సంవత్సరం మార్చి 6 వ తేదిన 11 క్రిష్ణ జింకలను వేటాడిన కేసుకు సంబంధించి ఆదోనిలో ఫారెస్టు డిపార్టు మెంట్ వారు కేసు నమోదు చేయడం జరిగింది. కేసును చేధించడం కోసం పోలీసు మరియు ఫారెస్టు బృందాల జాయింట్ ఇన్విస్టేగేషన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది.

దర్యాప్తులో తెలిసిన విషయం ఏమంటే...

2022 సంవత్సరం మార్చి 5 వ తేది న హైదరాబాద్ చెందిన 5 మంది వ్యక్తులు తుపాకులతో ఒక కమాండర్ జీప్ , ఒక ఇన్నోవా కారులో బయలు దేరి , అదే రోజు రాత్రి కి ఆదోని కి చేరుకుని ఆదోని లోని ఒక హోటల్ బస చేసి మరుసటి రోజు అనగా మార్చి 6 వ తేదిన తెల్లవారుజామున 2 వాహానాలలో జింకల వేటకు బయలు దేరి ఆదోని, ఆలూరు మండలాలోని నారాయణ పురం , కమ్మరి చేడు గ్రామాల సరిహద్దుల్లోని వ్యవసాయ పొలాలు మరియు చెరువుల చుట్టు ప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో రెక్కి చేసి కృష్ణ జింకలను వేటాడి తుపాకులతో 11 మగ జింకలను కాల్చి, చంపి తలలను కత్తులతో నరికి వేరుచేసి తలలన్నింటిని అక్కడ పడవేసి జింకల చర్మాలను, మాంసంను తీసుకెళ్ళి పోయారని దర్యాప్తులో ఈ విషయం తెలిసింది.

ఈ నేరానికి పాల్పడిన వారిలో ముఠాలో ఒక సభ్యుడైన అయూబ్ ఖాన్ లంగర్ హౌస్ - హైదరబాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి మరియు అతని వద్ద ఉన్న ఒక తుపాకిని స్వాధీనం పరుచుకుని కర్నూలు జిల్లా , ఆలూరు కోర్టు లో హజరు పరచగా, రిమాండుకు తరలించడమైనది.

గ్యాంగులోని మిగత ముఠా సభ్యుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ కేసును త్వరతగతిన చేధించిన సిఐలు విక్రమసింహా, శ్రీనివాసులు, పార్థసారథి మరియు ఎస్సైలు నరేంద్రకుమార్ రెడ్డి, మన్మథవిజయ్, గిరిబాబు, పోలీసు సిబ్బంది బషీర్,సుధాకర్, మునీర్ తదితరులను మరియు ఆదోని FRO స్ఫూర్తి గార్లను కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారు మరియు డిఎఫ్ ఓ సుమన్ బెన్ వల్ లు ప్రత్యేకంగా అభినందించారు.

జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.

మీరు కన్నడలో మంచి హీరో..సూపర్ స్టార్ అని  తెలుసు...మీ గురించి అంతకు మించి నాకు తెలీదు..కానీ ఈ రోజు తెలుసుకున్నాను..22 అన...
29/10/2021

మీరు కన్నడలో మంచి హీరో..సూపర్ స్టార్ అని తెలుసు...మీ గురించి అంతకు మించి నాకు తెలీదు..
కానీ ఈ రోజు తెలుసుకున్నాను..
22 అనాధశ్రమాలు..
32 గ్రామాలు దత్తత..
18 గోశాలలు..
వేలమందిని చదివిస్తున్నారని...
ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి బోజనం...
ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపే నిజమైన హీరో..
అందరూ హీరోలు కావాలని అనుకుంటారు
వాళ్ళు చేసే మంచి పనులు నిజమైన హీరోలుగా
ప్రజల మనస్సులో ఎప్పటికీ సజీవంగా ఉంటారు..

ఇలాంటి మనసున్న మహారాజుని కోల్పోవడం నిజంగా అందరికీ తీరని లోటు...కానీ మరీ ఇంత చిన్న వయసులో 46 ఏళ్లకే చనిపోవటం మాత్రం బాధాకరం సార్....

డబ్బు, హోదా, పలుకుబడి ఎన్ని ఉన్నా చావు అనేది ఎవరికీ ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం.. చావు వచ్చాకా తప్పించుకోలేము..

మనకి దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో ఉన్నంతలో సంతోషంగా బతకడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి...ప్రతి నిమిషం ఎంజాయ్ చేయండి..

పుట్టుకతో ఏమి తీసుకురాము.. వట్టి చేతులతో వస్తాం.. పోయేటప్పుడు వట్టి చేతులతోనే పోతాం..

ఈ నిజాన్ని చాలా మంది గ్రహించలేక కూర్చొని తిన్నా, తరతరాలు బతకడానికి సరిపోయేంత ఉన్న కూడా ఇంకా ఇంకా సంపాదించాలి అనే అత్యాశతో కొంతమంది అవినీతి చెస్తే, మరి కొంతమది లేనిపోని దుర్మార్గపు పనులు అన్ని చేస్తుంటారు.. ఎందుకు అలాంటి డబ్బు?? చివరకు మీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నా, లక్షల కోట్లు ఉన్నా పోయే సమయం వచ్చింది అంటే ఎవరు ఆపలేరు..

Miss You Puneeth Rajkumar garu 🙏🙏🙏

You will always stay in our hearts ……always forever Rest in peace 💔

మంచితనానికి మారుపేరు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఆదోని మాజీ ఎమ్మెల్యే శ్రీ *కె కొంక మీనాక్షి నాయుడు* అన్నగారికి జన్మ...
25/10/2021

మంచితనానికి మారుపేరు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఆదోని మాజీ ఎమ్మెల్యే శ్రీ *కె కొంక మీనాక్షి నాయుడు* అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు❤️

మీరు అయ్యారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నా🙏🏻

Praying for Dr Manmohan Singh! May God give you good health...
14/10/2021

Praying for Dr Manmohan Singh! May God give you good health...

Address

Adoni
518301

Website

Alerts

Be the first to know and let us send you an email when Our ADONI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category