Awaz adn news

Awaz adn news ప్రతికక్షణం ప్రజల కోసం

    😍😍
15/04/2024

😍😍

15/04/2024

ఒక్క అవకాశం ఇవ్వండి ఆదోని నియోజకవర్గం ని కేంద్రంతో పరిచయం చేపిస్తా..! ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి..

15/04/2024

ఎన్నికల ప్రచారం వేగాన్ని పెంచారు ఆదోని వైసిపి సైన్యం..

ఎన్డీఏ కూటమి అధికారం వస్తే గ్రామంలో ఇంటింటికి మంచినీరు. డాక్టర్ పార్థసారథి
15/04/2024

ఎన్డీఏ కూటమి అధికారం వస్తే గ్రామంలో ఇంటింటికి మంచినీరు. డాక్టర్ పార్థసారథి

15/04/2024

ఎన్డీఏ కూటమి అధికారం వస్తే గ్రామంలో ఇంటింటికి మంచినీరు. డాక్టర్ పార్థసారథి

  👍👍😍
14/04/2024

👍👍😍

14/04/2024

పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

*పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తుకు చేసుకొనుటకు ఏప్రిల్ 15 చివరి తేది.:-*

*నిత్యావసర సేవలందించే 33 విభాగాల వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు సదుపాయం*

*ఆదోని ఎన్నికల అధికారి/ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ గారు.*

*ఆదోని/ఏప్రిల్ 14:-*

*సార్వత్రిక ఎన్నికలు -2024 కు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే 33 నిత్యావసర సేవలు (Essential Services) అందించే శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తోందని ఆదోని ఎన్నికల అధికారి/ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.*

*వివిధ విభాగాల్లో విధుల్లో ఉంటూ పోలింగ్ రోజు ఓటు వేయలేని 33 శాఖలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని, ఈ అవకాశాన్ని అర్హులైన ఆయా విభాగాలకు చెందిన వారు ఏప్రిల్ 15 వ తేది లోపు సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అర్హతవున్న విభాగాల వివరాలను వెల్లడించింది. ఇందు కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించడంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఫారం 12 డి మరియు ఫారం 12 లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.*

*ఇందుకోసం ఆదోని నియోజకవర్గం లో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిగా సబ్ కలెక్టర్ వారి కార్యాలయపు పరిపాలన అధికారి సి. ఆర్ శేషయ్య నియమించడం జరిగిందన్నారు. సదరు నోడల్ అధికారి వారికి ఏప్రిల్ 15 తేది సాయంత్రం లోపు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఫారం - 12 డి మరియు ఫారం 12 తో పాటు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, డ్యూటీ ఆర్డర్ కాపిలను జత చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ యొక్క అవకాశాన్ని ఆదోని నియోజకవర్గ ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు.*

*పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించిన విభాగాలు....*

*1. మెట్రో, 2. రైల్వే రవాణా (ప్రయాణికులు, సరుకు రవాణా) సేవలు, 3. పోలింగ్ రోజు కార్యకలాపాలను కవర్ చేయడానికి కమిషన్ ఆమోదంతో అధికార లేఖలు జారీ పొందిన మీడియా వ్యక్తులు, 4. విద్యుత్ శాఖ, 5. బీఎస్ఎన్ఎల్, 6. పోస్టల్ టెలిగ్రామ్, 7. దూరదర్శన్, 8. ఆలిండియా రేడియో, 9. రాష్ట్ర మిల్క్ యూనియన్, మిల్క్ కో.ఆపరేటివ్ సొసైటీలు,10. ఆరోగ్య శాఖ,11. ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్,12. విమానయానం,13. రోడ్డు రవాణా సంస్థ,14. అగ్నిమాపక సేవలు,15. ట్రాఫిక్ పోలీస్,16. అంబులెన్స్ సేవలు,17. షిప్పింగ్,18. ఫైర్ ఫోర్స్,19. జైళ్లు, 20. ఎక్సైజ్ శాఖ, 21. వాటర్ ఆథారిటీ, 22. ట్రెజరీ సర్వీస్, 23. అటవీశాఖ, 24. సమాచార, ప్రజాసంబంధాల శాఖ, 25. పోలీసు, 26. పౌర రక్షణ- హోంగార్డులు, 27. ఆహార పౌర సరఫరాలు - వినియోగదారుల వ్యవహారాలు, 28. ఎనర్జీ (పవర్),29. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, 30. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, 31. డిపార్ట్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూడి, 32. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్, 33. విపత్తు నిర్వహణ శాఖలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని సబ్ కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.*

కర్నూలు జిల్లా ఆదోని ఫోటోగ్రాఫర్ మరియు వీడియో మిక్సర్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కు సన్మాన సభ...
14/04/2024

కర్నూలు జిల్లా ఆదోని ఫోటోగ్రాఫర్ మరియు వీడియో మిక్సర్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కు సన్మాన సభ...

14/04/2024

కర్నూల్ లో టీజీ భారత్ కు పెరుగుతున్న ప్రజాదరణ..!

14/04/2024

ఎన్నికలప్పుడు జగన్ కె ఎందుకు ఇలా జరుగుతాయి..NDA కూటమి నాయకులు...

14/04/2024

ఇలాంటి మూర్ఖులు ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ ఆదోనిలో బిజెపి నుంచి పోటీ చేసి ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు...! వైసీపీలో కి వలసలు షురూ.....

14/04/2024

ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇదేనా ముస్లిం మైనార్టీల పైన ఉన్న ప్రేమ నీకు : కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి...

ఇంటర్ పరీక్షలో టాపుగా నిలిచిన విద్యార్థిని..కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో  ఆస్పరి మండలం కేజీబీవీ కళాశాలలో ఇంటర్మీడియట్ ...
14/04/2024

ఇంటర్ పరీక్షలో టాపుగా నిలిచిన విద్యార్థిని..

కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో ఆస్పరి మండలం కేజీబీవీ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల్లో టాపర్ గా నిలిచిన విద్యార్థిని నిర్మలను అభినందించిన జిల్లా కలెక్టర్ డా జి.సృజన*

ఆదోని సబ్ కలెక్టర్      *రాజకీయ ప్రచారాలకు, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి.:-*     *ఎం.సి.స...
13/04/2024

ఆదోని సబ్ కలెక్టర్

*రాజకీయ ప్రచారాలకు, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి.:-*

*ఎం.సి.సి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.:-*

*రాజకీయ పార్టీల ప్రతినిధులకు నామినేషన్, స్కూటీని, ఉపసంహరణలపై దశ నిర్దేశం.:-*

*ఆదోని ఎన్నికల అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ గారు.:-*

*ఆదోని/ఏప్రిల్ :- 13*

*రాజకీయ ప్రచారాలకు, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదోని ఎన్నికల అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. శనివారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదోని ఎన్నికల అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు.*

*ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల ప్రవర్తనా నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కoడక్ట్ సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పకుండా నిబంధనలు పాటించాలన్నారు. సభలు-సమావేశాలు, ఊరేగింపులు-ర్యాలీలు రాజకీయ పార్టీ ప్రచారాలపై మరియు ఇంటింటి ప్రచారాలపై 48 గంటలు ముందుగా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిబంధన ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.*

*ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆయా రోజుల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ నామినేషన్ల దాఖలు చేయవచ్చు.ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్లకు అవకాశం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రతి అంశాన్ని పక్కాగా పరిశీలించనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో కొందరు అభ్యర్థులు డమ్మీ సెట్‌ దాఖలు చేయనున్నారు. మొత్తమ్మీద ఒక అభ్యర్థి నాలుగు సెట్లు నామినేషన్లు దాఖలు చేయడానికి వీలుంది. ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.10 వేలు.. అసెంబ్లీకి పోటీ చేసే సాధారణ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేల చొప్పున ధరావత్తు చెల్లించాలి. అసెంబ్లీ అభ్యర్థులు ఫారం 26లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఫారాన్ని నామినేషన్‌ రోజు సాయంత్రం 3 గంటల్లోపు అందజేయాలి. ఎన్నికల్లో ‘సువిధ’ యాప్‌లో దాఖలు చేసిన అనంతరం హార్డుకాపీలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులకు మాత్రమే ఛాంబర్‌లోకి అనుమతిస్తారు.*

*నామినేషన్ల పరిశీలన..*

*అసెంబ్లీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను 26వ తేదీ శుక్రవారం సాయంత్రం వరకూ పరిశీలిస్తారు. సరైన నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల పేర్లు అదే రోజు ప్రకటిస్తారు. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఏదైన అనివార్య కారణాలతో తమ నామినేషన్‌ ఉపసంహరించుకునేందుకు ఈనెల 29 సాయంత్రం వరకూ గడువు ఉంటుంది. ఇక మే నెల 13వ తేదీ సోమవారం పోలింగ్‌ ఉంటుంది. ఉదయం 7 గంటల నుండి క్యూలో ఉన్న ఓటర్లు మొత్తం ఓటు వేసే వరకూ సమయం ఉంటుంది. అంతకు ముందు రోజు ఆర్ట్స్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే అధికారులు పోలింగ్‌ సామగ్రిని ప్రత్యేక బందోబస్తు మధ్య బస్సుల్లో తరలిస్తామన్నారు. జూన్‌ 4వ తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తానికి జూన్‌ 6వ తేదీ నాటికి ఎన్నికల కోడ్‌ ముగుస్తుంది అన్నారు.18 నుంచి 25 వరకూ నామినేషన్ల పర్వం 29 సాయంత్రం వరకూ విత్‌డ్రాకు గడువు ఉంటుందన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులు పై చూపిన ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.*

*అభ్యర్థులు నామినేషన్లు వేసే రోజు కార్యాలయం రెండు వందల మీటర్లు దూరంలోనే వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు. 100 మీటర్ల వరకు మూడు వాహనాలు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. నామినేషన్ వేయడానికి అభ్యర్థితోపాటు నలుగురు మాత్రమే లోపటికి అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నామినేషన్లకు అనాహారతగా వేటు వేటుపడే అవకాశం ఉంటుందన్నారు. కావున ఎన్నికల నిబంధనలు పాటించి ఎన్నికల ప్రక్రియ విజయవంతంకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు.*

*ఈ కార్యక్రమానికి డి.ఎస్.పి శివ నారాయణస్వామి, ట్రైన్ డిఎస్పి ధీరజ్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, ఎన్నికల ఉప తాసిల్దార్ రామేశ్వర్ రెడ్డి, డి ఎల్ పి ఓ కార్యాలయపు పరిపాలన అధికారి వీరభద్రప్ప, ఆయా రాజకీయ పార్టీలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.*

13/04/2024

BRIKING NEWS ||సీఎం జగన్ పై జరిగిన దాడిపై స్పందించిన ప్రధాని మోడీ జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ మోడీ ట్విట్..

13/04/2024

కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి టికెట్లు ఇవ్వాలి..

13/04/2024

ఆదోని బైపాస్ కుంభకోణం పై కీలక వ్యాఖలు !! డాక్టర్ పార్థసారధి...

12/04/2024

ఆదోనిలో కూటమి నాయకుల దూకుడు..!

బిజెపి జనసేన టిడిపి ఉమ్మడి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం...

బిజెపి జనసేన టిడిపి ఉమ్మడి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం...
12/04/2024

బిజెపి జనసేన టిడిపి ఉమ్మడి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం...

  కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఒక లైక్😍😍🙏
12/04/2024

కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఒక లైక్😍😍🙏

మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి... 👍
12/04/2024

మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి... 👍

12/04/2024

రికషన్ క్లబ్ కన్స్ట్రక్షన్ వర్క్ వ్యూ

ఆదోనిలోనే ఉంటా ఎమ్మెల్యేగా గెలిచి  ఆదోని అభివృద్ధి చేసి చూపిస్తా : డాక్టర్ పార్థసారధి..
12/04/2024

ఆదోనిలోనే ఉంటా ఎమ్మెల్యేగా గెలిచి ఆదోని అభివృద్ధి చేసి చూపిస్తా : డాక్టర్ పార్థసారధి..

  👍👍
11/04/2024

👍👍

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు  యువనేత జయం మనోజ్ రెడ్డి కు ఈద్ ముబారక్ తెలిపారు...
11/04/2024

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు యువనేత జయం మనోజ్ రెడ్డి కు ఈద్ ముబారక్ తెలిపారు...

పూలే ఆశయ సాధనకు కృషి చేస్తాం.సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కొరకు భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తూనే ఉ...
11/04/2024

పూలే ఆశయ సాధనకు కృషి చేస్తాం.

సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కొరకు భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని బిజెపి జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మలేకర్ శ్రీనివాసులు ఆదోని అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ లు అన్నారు. గురువారం పూలే జయంతి సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు సాయికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 19వ శతాబ్దంలో సామాజిక రుగ్మతుల రూపుమాపడానికి పూలే గారు ఎంతో కృషి చేశారన్నారు. విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి మహిళల విద్యాభ్యాసం చేసే దిశగా ప్రోత్సహించి మహిళల కొరకే ప్రత్యేకమైన పాఠశాలలను ప్రారంభించిన ఘనత పూలే గారిది అన్నారు. పూలే గారు అంటరాని నిర్మూలన కొరకు ప్రత్యేక పోరాటం చేసి అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతి కొరకు ఎంతో కృషి చేశారన్నారు. ఆయన కలల సహకారం కోసం భారతీయ జనతా పార్టీ అనునిత్యము పనిచేస్తూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగార్జున, అంజి కుమార్, ఉరుకుందు గౌడ్, కోసిగ్గయ్య, లక్ష్మీకాంత్, శ్రీకాంత్, రాహుల్ చౌహన్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా ఆదోని షా హి జామియా మజీద్ లో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు...
11/04/2024

కర్నూలు జిల్లా ఆదోని షా హి జామియా మజీద్ లో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు...

11/04/2024

ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధతో ఘనంగా జరుపుకొని ప్రత్యేక ప్రార్థనలు...

Address

Adoni
Adoni

Alerts

Be the first to know and let us send you an email when Awaz adn news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Awaz adn news:

Videos

Share

Category