20/11/2024
*వేములవాడ సభలో గల్ఫ్ ఎక్స్ గ్రేషియా పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి*
◉ రూ.5 లక్షల గల్ఫ్ ఎక్స్ గ్రేషియా చెల్లింపు దేశ చరిత్రలోనే ప్రథమం
◉ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం రూ.85 లక్షలు కేటాయించిన ప్రభుత్వం
◉ గల్ఫ్ మృతుల వారసులకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రూ.100 కోట్లు బాకీ ఉన్నారు.
గల్ఫ్ కార్మికులు ఆయురారోగ్యాలతో క్షేమంగా, సురక్షితంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ఆకాంక్షించారు. దురదృష్టవశాత్తు కానరాని దేశంలో కన్ను మూసిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఆదుకోవడానికి రూ.5 లక్షల మృతధన సహాయం పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఈనెల 20న వేములవాడలో జరుగనున్న సభలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 17 మంది గల్ఫ్ మృతుల వారసులకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు (ప్రొసీడింగ్స్) ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.85 లక్షలు కేటాయించింది. ట్రెజరీ ద్వారా సొమ్ము వారి బ్యాంకు ఖాతాలలోకి నేరుగా బదిలీ అవుతుంది. గల్ఫ్ దేశాలలో చనిపోయిన ప్రవాసి కార్మికులకు ఒక రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల మృతధన సహాయం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం.
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా... కాంగ్రేస్ ఎన్నికల మేనిఫెస్టో 'అభయ హస్తం' లో 'గల్ఫ్ కార్మికుల సంక్షేమం మరియు ఎన్నారైల సంక్షేమం' కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో సెప్టెంబర్ 16న జీవో నెంబర్ 205 జారీచేసిన కాంగ్రేస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నదని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ అన్నారు.
గల్ఫ్ గ్యారంటీల అమలుకు కృషి చేసిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి తదితర నాయకులకు కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
*గల్ఫ్ మృతుల వారసులకు కేసీఆర్ రూ.100 కోట్లు బాకీ*
టీఆర్ఎస్ , బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలనా కాలంలో గల్ఫ్ దేశాలలో తెలంగాణ కార్మికులు సుమారు రెండు వేల మంది చనిపోయారు. పలు సందర్భాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రస్తావించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున లెక్క వేస్తే వంద కోట్లు అవుతుంది. ఈ లెక్కన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.100 కోట్ల మేర బాకీ ఉన్నారని టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి అన్నారు.
*రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గల్ఫ్ మృతుల వివరాలు:*
1. గంగిపెల్లి తిరుపతి, దుబాయి, యూఏఈ (బూరుగుపల్లి, బోయిన్ పల్లి)
2. దాసరి బాబు, ఓమాన్ (బోయిన్ పల్లి)
3. కైర నాగయ్య, సౌదీ అరేబియా (చందుర్తి)
4. పోతుగంటి భూమయ్య, సౌదీ అరేబియా (చందుర్తి)
5. బైరి వెంకటేశం, ఇరాక్ (ఓబులాపూర్, ఇల్లంతకుంట)
6. ఏనుగుల భాస్కర్, దుబాయి, యూఏఈ (ఓబులాపూర్, ఇల్లంతకుంట)
7. బోయిని గణేష్, దుబాయి, యూఏఈ (వంతడుపుల, ఇల్లంతకుంట)
8. కారవాని దేవయ్య, దుబాయి, యూఏఈ (గంభీరావుపేట)
9. ఇకృతి యెల్లం గౌడ్, దుబాయి, యూఏఈ (నిమ్మపెల్లి, కొనరావుపేట)
10. పిట్ల మహేష్, సౌదీ అరేబియా (వెంకటయ్య కుంట, ముస్తాబాద్)
11. గెరిగంటి అంజయ్య, దుబాయి, యూఏఈ (మల్లారెడ్డిపేట, ముస్తాబాద్)
12. సిలివేరి నాంపెల్లి, ఓమాన్ (రామన్నపల్లి, తంగళ్లపల్లి)
13. దురిశెట్టి కొండయ్య, దుబాయి, యూఏఈ (బాలానగర్, వేములవాడ)
14. పెండ్యాల చంద్రకాంత్, దుబాయి, యూఏఈ (నూకలమర్రి, వేములవాడ రూరల్)
15. మాదాసు విజయ్, ఓమాన్ (ఆచన్నపల్లి, వేములవాడ రూరల్)
16. పల్లి అంజయ్య, బహరేన్ (అక్కపల్లి, ఎల్లారెడ్డిపేట)
17. నిమ్మల రాజు, బహరేన్ (రాచర్ల బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట)