13/01/2020
మున్నూరు కాపు న్యూస్ (వరంగల్ అర్బన్ జిల్లా) మున్నూరు కాపు మాస పత్రిక 7వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని తార గార్డెన్స్ యందు మున్నూరు కాపు మాసపత్రిక వ్యవస్థాపకులు కోల జనార్దన్ అధ్యక్షతన వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిధి గా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు ..అనంతరం ప్రతి ఏటా అందజేస్తున్న మున్నూరు కాపు అంతర్జాతీయ అవార్డులకు ఎంపికైన 1,కైలాష్ మోహన్ రావు ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ విభాగం (హైదరాబాద్) 2,మాదాసు నాగేశ్వరరావు ఇంజనీరింగ్ విభాగం( హైదరాబాద్)3, డాక్టర్ బొల్లం వెంకటేశ్వర్లు ఉద్యోగ సేవారంగం వరంగల్ జిల్లా 4,మంగలారపు లక్ష్మణ్ జర్నలిజం సేవారంగం( ఉమ్మడి కరీంనగర్ జిల్లా) 5,శ్రీ సంఘావెని రవీంద్ర గారు సాహిత్యరంగం (జగిత్యాల జిల్లా) 6,శ్రీ మల్లం రమేష్ మిమిక్రీ కళారంగం (ఖమ్మం జిల్లా) 7,మాదాసు సంగమేశ్వర్ ఆర్టిస్ట్ కళారంగం ( సంగారెడ్డి జిల్లా) 8,నేతి రఘుపతి న్యాయ సేవా సంఘం (నల్గొండ జిల్లా )9,శ్రీ విష్ణు జగతి ఆధ్యాత్మిక సేవా రంగం (హైదరాబాద్ జిల్లా) 10,శ్రీ పట్టాల అమర్ నాధ్ రైతు పరిశ్రమ (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ) డాక్టర్ తిరుమలగిరి వరుణ్ రాజ్ వైద్యరంగం (నల్గొండ జిల్లా) నుండి ఎంపికైన మున్నూరు కాపు ప్రముఖులకు అవార్డులను అందజేశారు. అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ మున్నూరు కాపు మాసపత్రిక ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపులను పరస్పరం పరిచయం చేస్తూ అభివృద్ధి సాధించడం అభినందనీయమన్నారు.. మరొక ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ మున్నూరు కాపు డైరెక్టరీ 2020 డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు .ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ మున్నూరుకాపు మాసపత్రిక ద్వారా కోల జనార్ధన్ చేస్తున్న సేవలు గొప్ప విషయమన్నారు.. మున్నూరు కాపులకు ఈ డైరెక్టరీ కరదీపికగా ఉపయోగపడుతుందని మున్నూరు కాపులకు ఒక సాఫ్ట్ వేర్ గా కొల జనార్దన్ ఉపయోగపడు చున్నాడని అన్నారు .. అనంతరం మున్నూరు కాపు వధూవరుల వివాహ పరిచయ కార్యక్రమం నిర్వహించారు.. సాంస్కృతిక కార్యక్రమాలు సైతం అందర్నీ అలరించాయి.. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా అతిధులు మొక్కలు నాటారు.. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన తెలంగాణ మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు మాట్లాడుతూ మున్నూరు కాపు మాసపత్రిక ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు అవార్డు కమిటీ చైర్మన్ ఆకుల రవీందర్ రావు, ఆకుల స్వామి వివేక్ పటేల్, తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం బాద్యులు కొత్త లక్ష్మణ్, మున్నూరుకాపు మహాసభ సెక్రెటరీ జనరల్ మంగళరపు లక్ష్మణ్, వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షులుగైనేని రాజన్, జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య ఇ.వి శ్రీనివాస రావు, గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్ మిడిదొడ్డి స్వప్న మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల స్వామి వివేక్ పటేల్, ఆకుల గాంధీ, కురిసేటి నరసయ్య,( ఖమ్మం )నాయక౦ మల్లయ్య గాండ్ల భగవాన్( సిద్దిపేట) దామోదర్ శెట్టి ఉత్తరయ్య,ఎనబోతుల సూర్యప్రకాష్ రావు (వరంగల్ రూరల్ జిల్లా) ధీటి అంజయ్య పటేల్, బండారి రాజుకుమార్ (జగిత్యాల) గొర్రె వెంకటేశ్వర్లు, తోట నవీన్ కుమార్ (మేడ్చల్ జిల్లా,)సక్కు నరేందర్ ,బండ మహేష్ (మెదక్),లక్కాకుల రమేష్ కుమార్( హైదరాబాద్) రాజు కార్తీక్ పటేల్ (పేద్దపల్లి) చాట్ల పురుషోత్తం, వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకులు కనుకుంట్ల రవి కుమార్, బక్కి యాదగిరి, తోట రవిందర్, , వoఛనగిరి సమ్మయ్య, మీరుపల్లి కమలాకర్, భాస్కర్, జూలూరి గంగాధర్,ముష్కమల్ల సుధాకర్ ,సుంకరనేని చంద్రశేఖర్,ఈనుముల అశోక్ కుమార్, మూల రంగయ్య,బూర రవి,కూస శ్రీనివాస్ ,వాడుక నాగరాజు,జారతి కేదారి గౌతం,, కొల సురేష్, డాక్టర్ ఓడితల రాము,కిరణ్,తెల్ల కృష్ణ,కొల సమ్మయ్య లతోపాటు మున్నూరు కాపు సంఘాల నాయకులు మాసపత్రిక జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు