స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్ పంపిణీ
సింగరాయకొండ కి చెందిన స్నేహ హస్తం ఫౌండేషన్ సభ్యులు శీలం రాము, చుక్క కిరణ్ మరియు మిత్రమండలి అలహారి విశాలాక్షి జ్ఞాపకార్థం ఈరోజు సింగరాయకొండ ఈదిగమిట్ట లోని ఇత్తడి శాంతకుమారి అనే వికలాంగులారికి 14,000 వేల విలువైన ట్రై సైకిల్ అందజేశారు.
రాబోయే రోజుల్లో తమ ఫౌండేషన్ తరపున మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Singarayakonda Updates
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates
34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసింది?
వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దు.
ఇప్పటికీ ముగ్గురు అయిపోయారు, నాలుగో వ్యక్తిని తీసుకొని వస్తున్నారు.
మాగుంట ఓటమి కోసం జిల్లా అంతా పర్యటిస్తా: ఎమ్మెల్యే అన్నా రాంబాబు.
Anna Rambabu
Magunta Sreenivasulu Reddy
Singarayakonda Updates
#సింగరాయకొండ #అప్డేట్స్ www.singarayakondaupdates.com www.instagram.com/singarayakondaupdates
బ్యాటింగ్ చేసిన CM జగన్
గుంటూరు జిల్లాలో 'ఆడుదాం ఆంధ్ర' ప్రోగ్రాంను ప్రారంభించిన సీఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడి అలరించారు.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా, సీఎం బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు.
అంతకుముందు ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు.
ప్లేయర్లను పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఓ మైలురాయి అని.. వ్యాయామం వల్ల బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటాయని చెప్పారు.
YSR Congress Party - YSRCP
Singarayakonda Updates
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates
ముక్కోటి ఏకాదశి ఆహ్వానం..!
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం పాత సింగరాయకొండ 23/12 /2023 శనివారం ఉదయం 06-00 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమగును.
కావున భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము.
ఇట్లు..!
పామర్తి మాధవరావు చైర్మన్ ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణాధికారి పి కృష్ణవేణి.
#సింగరాయకొండ #అప్డేట్స్
Singarayakonda Updates
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates
సింగరాయకొండకు పట్టణం నందు ఆదివారం కొండేపి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వామి గారు దామచర్ల ఆంజనేయులు కాలనీ మొదలుకొని పట్టాభి వారి వీధి, జీవీఆర్ రోడ్, మసీదు వీధి మరియు బైరాగి మాన్యం నందు ఇంటింటికి గడపగడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది.
ఈ ప్రచారం నందు ప్రజలు ఎమ్మెల్యే స్వామి గారి పట్ల తమకు ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని బాణాసంచాలతో మరియు పూలవర్షాన్ని కురిపించి తమ ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు మరియు మూడవసారి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి పదవి పొందాలని ప్రతి ఒక్కరూ దీవించారు.
Dr. DSBV Swamy Kondapi MLA -TDP
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates
సురేష్ నీ ఎర్రగొండపాలెం లోనే కొనసాగించాలి - ఎర్రగొండపాలెం వైసీపీ నాయకులు
ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థిగా తిరిగి మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురువారం పెద్దారవీడు వైసీపీ మండల నాయకులు రాజీనామ చేశారు.
రాజీనామా చేసిన వారిలో జడ్పీటీసీ ఏరువ చలమారెడ్డి, ఎంపీపీ బెజవాడ గురవయ్య, వైసీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు అలాగే జిల్లా జడ్పీ కోఆప్షన్ సభ్యులు సాబీర్ భాష కూడా రాజీనామ చేశారు.
Audimulapu Suresh
Dr. DSBV Swamy Kondapi MLA -TDP
Singarayakonda Updates
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates
సింగరాయకొండ - కలికివాయ ఎమర్జెన్సీ లాండింగ్ ను త్వరగతిన పూర్తి చేయాలి - పార్లమెంటులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు 2019 లో సింగరాయకొండ మరియు కలికివాయ మధ్యలో 3.6 కిలోమీటర్ల జాతీయ రహదారిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుకూల ప్రదేశంగా గుర్తించి పనులు మొదలుపెట్టి, 2021 లో ప్రధాన పనులు మొత్తం పూర్తి చేశారని కానీ అదే సంవత్సరం NHAI మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా పరిశీలించి కొన్ని వంకలు సరిచేయాల్సి ఉందని, దానికి ఇంకా 20 కోట్ల రూపాయలు మరియు భూమి సేకరణకు 6 కోట్ల వరకు అదనంగా అవసరం అవుతాయని కానీ దానికి సంబంధించిన నిధులు గత 11 నెలల నుంచి NHAI దగ్గర పెండింగ్ లో ఉన్నందున త్వరగతిన నిధులు వచ్చేందుకు కృషిచేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర రోడ్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీనీ కోరారు.
ఇప్పటివరకు ఈ ఎమర్జెన్సీ ల్యాండి
తుఫాన్ బాధితులకు ఆహారము పంపిణీ చేసిన సింగరాయకొండ అప్డేట్స్ టీమ్.
మిచాంగ్ తుఫాను కారణంగా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో సింగరాయకొండ పరిధిలో నిలువ నీడ లేక ఇక్కట్లు పడుచున్న నిరాశ్రయులకు,సంచార కుటుంబాల వారికి, బస్టాండ్ నందు, జాతీయ రహదారుల వెంబడి మరియు తాతయ్య గిరిజన కాలనీ వాసులకు సింగరాయకొండ అప్డేట్స్ యువత ఆహారము పంపిణీ చేశారు.
ఈ పకృతి విపత్తు సమయంలో ప్రజలు ముందుకు వచ్చి తమ వంతుగా తమ పరిసరాలలో ప్రాంతాలలో నిస్సహాయులకు తమకు తాముగా వీలైనంతమేర సహాయ సహకారాలు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు హరి చెన్నంశెట్టి, ఉమేష్ మరియు పంతగాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Singarayakonda Updates
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates
పాకలకు చేరుకున్న NDRF బృందం..
తుఫాన్ నేపథ్యంలో NDRF బృందాలు పాకలకు చేరుకున్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న NDRF బృందానికి సింగరాయకొండ సీఐ రంగనాథ్ పలు సూచనలు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వారిని ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు. ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
NDRF - National Disaster Response Force
Singarayakonda Updates
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates
ఒకే కులంలో ఉన్న సమస్యను మతాలమధ్య ఘర్షణకు దారి తీసే విధంగా చిత్రీకరించొద్దు - రావినూతల కోటి మాదిగ ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు.
సింగరాయకొండ మండలం , శానంపూడి గ్రామంలో మాతమ్మ తిరునాళ్ళ సందర్భంగా 400 కుటుంబాలకు రూ.3000/- చొప్పున చందా వేసుకొని కుల ఆచారం ప్రకారం తిరునాళ్ల చేయాలని నిర్ణయించారు. కుల నిర్ణయం ప్రకారం తాంబూలాలు కట్టనీ వారి కుటుంబాలు కట్టాలి అని అనేకసార్లు చెప్పినా కూడా కట్టక పోయేసరికి కుల పెద్దలు ఆ కుటుంబాలకు భయం ఉంటుందని కుల ఐక్యత కోసం సాటింపు వేయించడం జరిగింది. సాటింపు వేసిన తరువాత కుల తాంబూలం కట్టని కుటుంబాలు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు అధికారులు 12 మంది కుల పెద్దలపై కేసు నమోదు చేశారు.
కానీ మాదిగ కుల పెద్దలు అవగాహన రాహిత్యం వలన తాంబూలాలు కట్టనివారి కుటుంబాలు పక్కన పెట్టమని
దీపోత్సవం కోటి దీపోత్సవం.. దక్షిణ సింహచలంగా ప్రసిద్ధిగాంచిన పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, సింగరాయకొండ
ప్రకాశం జిల్లాలో తాటిపర్తి చంద్రశేఖర్ కి ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ చేసిన వైసీపీ అధిష్ఠానం..
జిల్లాలోనీ ఎస్సీ నియోజకవర్గాలైన యర్రగొండపాలెం, సంతనూతలపాడు మరియు కొండపి లో ఏదోక నియోజకవర్గo నుంచి పోటీ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర నాయకత్వం మరియు జిల్లా అధిష్ఠానం..
కొండపిలో గత రెండు సార్లు టీడీపీ నుంచి బాల వీరాంజనేయ స్వామి, సంతనూతలపాడులో గత రెండు సార్లు వైసీపీ నుండి ఆదిమూలపు సురేష్ మరియు టీజే సుధాకర్ బాబులు మరియు
యర్రగొండపాలెంలో గత రెండు సార్లు వైసీపీ నుండి పాలపర్తి డేవిడ్ రాజు మరియు ఆదిమూలపు సురేష్ గెలుపొందారు..
SC - Scheduled Castes
MLA - Member of Legislative Assembly
YSR Congress Party - YSRCP
Singarayakonda Updates
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates
ప్రపంచం లో మనం ఎవ్వరికి తక్కువ కాదు: Narendra Modi
ప్రధాని మోడీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యద్ధ విమానంలో విహరించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ను ఈరోజు ప్రధాని సందర్శించారు.
అక్కడ కొనసాగుతున్న కార్యకలాపాలను,తయారీ యూనిట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ట్విన్ సీటర్ తేజస్ లో ప్రయాణించారు.
ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ.తేజస్ ప్రయా ణాన్ని విజయవంతంగా ముగించానని చెప్పారు. ఇదొక గొప్ప అనుభవమని అన్నారు. మన స్వదేశీ సామర్థ్యంపై తన నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. మన శక్తి సామర్థ్యాల పట్ల గర్వంగా ఉందని, ప్రపంచంలో మనం ఎవరికీ తక్కువ కాదనే విషయాన్ని గర్వంగా చెప్పగలనని తెలిపారు.
భారత్ మాతా కి జై... జయహో భారత్...
Singarayakonda Updates
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates
రండి...పాల్గొనండి...తరించండి....🙏
బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా చిల్డ్రెన్స్ డే వేడుకలు..
భారత మొదటి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ కార్యక్రమాన్ని సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని కే మహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
బాలికలే యాంకర్లుగా వారే ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం ఎంతో ప్రత్యేకత. బాలికలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలికలు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రధానోపాధ్యాయిని కే మహాలక్ష్మి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికలందరూ చాచా నెహ్రూ గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఎంతో బాధ్యతాయుతంగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా వ
స్మశాన వాటిక కబ్జా పై తీవ్రంగా స్పందించిన యువనేస్థం సభ్యులు.
స్మశాన వాటికలో కూడా కబ్జా చేస్తున్నారు కాబట్టి మరొక సారి కరోనా వచ్చి ఇలాంటీ కబ్జా చేసిన నాయకులను తీసుకపోవాలనీ వారిని కూడా మా సభ్యులు మొస్తారని తీవ్ర స్ధాయిలో ధ్వజం.
Singarayakonda Updates
#సింగరాయకొండ #అప్డేట్స్
www.singarayakondaupdates.com
www.instagram.com/singarayakondaupdates