07/10/2020
https://youtu.be/KLb_2ei1udg
రానున్న 30 సంవత్సరాల పాటు రైతులకు వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా ఉచితంగా కరెంటు అందించనుందని బుచ్చిరెడ్డిపాలెం మండలం తాసిల్దార్ షఫీ మాలిక్ అన్నారు. ఈ మేరకు ఆయన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ లోని స్థానిక పద్మావతి కళ్యాణ మండపం లో అగ్రికల్చర్ సిబ్బందితో, విద్యుత్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. వైయస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై ప్రజలలో ప్రతి ఒక్క అధికారి అవగాహన కల్పించాలని ఆయన వారిని కోరారు. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా ఏ ఒక్క రైతు కూడా ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పంపుసెట్లకు మీటర్లు పెట్టడం ద్వారా ఓల్టేజి హెచ్చు తగులు అంతరాయాలు తగ్గి సరైన విద్యుత్తును అందించేందుకు కరెంట్ మీటర్ ల ను ఏర్పాటు చేస్తున్నారని ఆయన అన్నారు. కరెంట్ మీటర్ ద్వారా మొత్తం మోటార్ల లోడును బట్టి ట్రాన్స్ఫార్మర్లు అలాగే రైతులకు సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేసేందుకు దోహదపడుతుందని ఆయన అన్నారు. మీ తలను బిగించేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. రైతులు వినియోగించిన కరెంటుకు చెల్లించాల్సిన బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేస్తోందని ఆయన అన్నారు. ఈ విషయంపై అగ్రికల్చర్ విద్యుత్ శాఖ అధికారులు ప్రజలలో మరింత అవగాహన పెంపొందించాలని ఆయన వారికి తెలిపారు.