BCN News

BCN News తెలుగు రాష్ట్రాల వేదిక,....క్షణక్షణం స? Television service provider
(1)

24/02/2018

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు 11వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ దర్జా జీవితం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు కనిపిస్తున్నాయి. మొన్ననే వంద కోట్ల విలువైన కార్లను సీజ్ చేసిన అధికారులు.. ఇప్పుడు వాచీలు చూసి షాక్ అయ్యారు. ఇంట్లోని రెండు గదుల్లో 10వేల విదేశీ వాచీలను గుర్తించారు. ఒక్కో వాచీ ఖరీదు లక్షల్లో ఉంటుంది. రోజుకో వాచీ పెట్టుకున్నా.. అన్నీ వాచీలు పెట్టుకోవటానికి 27 సంవత్సరాలు పడుతుంది.
60 ప్లాస్టిక్ కంటైయినర్లలో ఉన్న ఈ వాచీలు చూసి షాక్ అయ్యారు అధికారులు. ఈ 10వేల వాచీల మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. ఇవన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని.. ఇన్ని వాచీలను ఎందుకు తెచ్చారో విచారణలో తేలాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొన్ని వాచీలను ఇప్పటి వరకు ప్యాకింగ్ కూడా విప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వాచీలు ఉన్నాయి.

24/02/2018

నెల్లూరు :

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ఎస్సీ కాలనీల్లో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి నారాయణ

స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా దళితవాడల అభివృద్ధికి నోచుకోలేదు - మంత్రి నారాయణ

గత ప్రభుత్వాలు, కొన్ని జాతీయ పార్టీలు దళితుల్ని ఓటు బ్యాంకులుగా మాత్రమే చూశాయి - మంత్రి నారాయణ

గత మూడేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ సబ్ప్లాన్ కింద 19 వేల కోట్లు కేటాయించింది - మంత్రి నారాయణ

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం, ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యోన్నతి, అంబేద్కర్ స్మృతి వనం వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వం ఎస్టీల అభ్యున్నతికి పాటుపడుతోంది

- మంత్రి నారాయణ

24/02/2018

నాయుడుపేట లో కలకలం అగ్రహారపేట , గిండివారితోట ప్రాంతాలలో ఒక కారు,రెండు బైకులకు నిప్పు అంటించి తగులబెట్టిన దుండగులు ,కారు పాక్షికంగాను రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి

24/02/2018

*చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 24*

💐1810 : బ్రిటిష్ తత్వవేత్త మరియు శాస్త్రవేత్త హెన్రీ కేవిండిష్ మరణం (జ.1731).

🌷1911 : ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి వంటి పత్రికలకు సహాయ సంపాదకత్వం వహించిన నవలా రచయిత పిలకా గణపతిశాస్త్రి జననం (మ.1983).

🌹1948 : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జననం.

🌺1951 : ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు కట్టమంచి రామలింగారెడ్డి మరణం (జ.1880).

🌸1980 : ఆంధ్ర షెల్లీ గా పేరుబడ్డ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణం (జ.1897).

🌼1984 : బాలానందం రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు మరణం (జ.1905).

🌻1986 : ప్రముఖ కళాకారిణి రుక్మిణీదేవి అరండేల్ మరణం (జ.1904).

🎍2013 : ప్రముఖ క్లారినెట్ విద్వాంసుడు షేక్ సాంబయ్య మరణం (జ.1950).💐🎍🌹🌷🌻🌼🌸🌺🌿☘🍀🍃🍂🎄🍁🥀

24/02/2018

live.tirumala \❗/ tirupathi
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
🦑ఓం...నమో...వేంకటేశాయా...🦑
🔔 *శ్రీవారి దర్శనం* 🔔
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊

🚩ఈ రోజు రద్దీ: *పెరిగింది*

🌾ఈరోజు తేదీ *23.02.2018*
*శుక్రవారం* ఉదయం *5* గంటల
సమయానికి,

🌾సర్వదర్శనం కోసం *6*
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.

🌾కంపార్టమెంట్లలో భక్తులు
ఉదయం *10-12* గంటల మధ్య
సర్వదర్శనం పూర్తి చేసుకొని
ఆలయం వెలుపలికి రావచ్చు

🌾కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు

🌾స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.*
తరువాత
నేరుగా దివ్యదర్శనానికి
అనుమతిస్తారు

🌾ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులు ఉదయం
*9.30* గంటలకు దర్శనం పూర్తయి
ఆలయం వెలుపలికి రావచ్చును.

🌾నిన్న ఫిబ్రవరి *22* న
*60,113* మంది భక్తులకు
స్వామి వారి దర్శన భాగ్యం
లభించినది.

🌾నిన్న *25,968* మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

🌾నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
*నగదు కానుకలు ₹: 3.28* కోట్లు.

🌾నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు
భక్తులు అందించిన విరాళాలు

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 29.00 లక్షలు

ఆరోగ్యవరప్రసాదిని ట్రస్టు: ₹ 11.00 లక్షలు

వేదపరిరక్షణ ట్రస్టు: ₹ 1.20 లక్షలు

ప్రాణదాన ట్రస్టు: ₹ 1.00 కోట్లు
(కోటి రూపాయలు)

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

🌾శుక్రవారం ప్రత్యేక సేవ:
*అభిషేకం*

ఈ రోజు *23.02.2018 శుక్రవారం*

⛩ *ఆలయ నిత్య కార్యక్రమాలు* ⛩

ఉదయాత్పూర్వం *2.30 - 3.00*
సుప్రభాతం

ఉ.పూ *3.00 - 4.00*
*సల్లింపు*, శుద్ది,
నిత్యకట్ల కైంకర్యాలు,
వేకువ ఘంటారావం,
అభిషేకానికి ఏర్పాట్లు

ఉ. *4.30 - 6.00*
ప్రత్యేక సేవ: *అభిషేకం*
నిజపాదదర్శనం

ఉ. *6.00 - 7.00*
సమర్పణ

ఉ. *7.00 - 8.00*
తోమాల సేవ, అర్చన
(ఏకాంతం),

ఉ. *9.00 - రా. 8.00*
*సర్వదర్శనం*

మ. *12.00 - సా. 5.00*
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ

సా. *6.00 - 8.00*
సహస్రదీపాలంకరణ సేవ
(కొలిమి మండపం వద్ద),
తిరుమాడ వీధులలో ఊరేగింపు

రా. *8.00 - 9.00*
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం

రా. *9.00 - 10.00*
*సర్వదర్శనం*

రా. *10.00 - 10.30*
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు

రా. *10.30 ఏకాంతసేవ*

🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
_*🦑ఓం...నమో...వేంకటేశాయా...* 🦑_
🎊🙏🎊🙏🎊🙏🎊🙏🎊🙏

23/02/2018

మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 23-2-18 మన గూడూరు మండలంలోని చెన్నూరు Z.P.Boys, Z.P.Girls మరియు నెలటూర్, పాఠశాలలోని 123 మంది విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందించడం జరిగింది దాతలు ఆది నారాయణ(ఆది చికెన్ సెంటర్) మరియు గఫుర్ గారు, కార్యక్రంలో గఫుర్ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎం. ఎఫ్.ఏ అధ్యక్షులు రాహుల్, సభ్యులు చంద్రనీల్, కాలీమ్, కిరణ్, హర్ష, నంద, శ్రీను, శశి, నవీన్, సందీప్, సాదిక్, సాయ తదితరులు పలుగొన్నారు.

23/02/2018

🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
🦑ఓం...నమో...వేంకటేశాయా...🦑
🔔 *శ్రీవారి దర్శనం* 🔔
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊

🚩ఈ రోజు రద్దీ: *పెరిగింది*

🌾ఈరోజు తేదీ *23.02.2018*
*శుక్రవారం* ఉదయం *5* గంటల
సమయానికి,

🌾సర్వదర్శనం కోసం *6*
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.

🌾కంపార్టమెంట్లలో భక్తులు
ఉదయం *10-12* గంటల మధ్య
సర్వదర్శనం పూర్తి చేసుకొని
ఆలయం వెలుపలికి రావచ్చు

🌾కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు

🌾స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.*
తరువాత
నేరుగా దివ్యదర్శనానికి
అనుమతిస్తారు

🌾ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులు ఉదయం
*9.30* గంటలకు దర్శనం పూర్తయి
ఆలయం వెలుపలికి రావచ్చును.

🌾నిన్న ఫిబ్రవరి *22* న
*60,113* మంది భక్తులకు
స్వామి వారి దర్శన భాగ్యం
లభించినది.

🌾నిన్న *25,968* మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

🌾నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
*నగదు కానుకలు ₹: 3.28* కోట్లు.

🌾నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు
భక్తులు అందించిన విరాళాలు

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 29.00 లక్షలు

ఆరోగ్యవరప్రసాదిని ట్రస్టు: ₹ 11.00 లక్షలు

వేదపరిరక్షణ ట్రస్టు: ₹ 1.20 లక్షలు

ప్రాణదాన ట్రస్టు: ₹ 1.00 కోట్లు
(కోటి రూపాయలు)

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

🌾శుక్రవారం ప్రత్యేక సేవ:
*అభిషేకం*

ఈ రోజు *23.02.2018 శుక్రవారం*

⛩ *ఆలయ నిత్య కార్యక్రమాలు* ⛩

ఉదయాత్పూర్వం *2.30 - 3.00*
సుప్రభాతం

ఉ.పూ *3.00 - 4.00*
*సల్లింపు*, శుద్ది,
నిత్యకట్ల కైంకర్యాలు,
వేకువ ఘంటారావం,
అభిషేకానికి ఏర్పాట్లు

ఉ. *4.30 - 6.00*
ప్రత్యేక సేవ: *అభిషేకం*
నిజపాదదర్శనం

ఉ. *6.00 - 7.00*
సమర్పణ

ఉ. *7.00 - 8.00*
తోమాల సేవ, అర్చన
(ఏకాంతం),

ఉ. *9.00 - రా. 8.00*
*సర్వదర్శనం*

మ. *12.00 - సా. 5.00*
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ

సా. *6.00 - 8.00*
సహస్రదీపాలంకరణ సేవ
(కొలిమి మండపం వద్ద),
తిరుమాడ వీధులలో ఊరేగింపు

రా. *8.00 - 9.00*
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం

రా. *9.00 - 10.00*
*సర్వదర్శనం*

రా. *10.00 - 10.30*
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు

రా. *10.30 ఏకాంతసేవ*

🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
_*🦑ఓం...నమో...వేంకటేశాయా...* 🦑_
🎊🙏🎊🙏🎊🙏🎊🙏🎊🙏

23/02/2018

రాష్ట్రంలో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి.

గురువారం కర్నూలులో 36.3, విశాఖపట్నం, అనంతపురంలలో 35 డిగ్రీలు నమోదయ్యాయి.

సముద్రం నుంచి గాలులు లేకపోవడంతో పగటి పూట ఎండలు పెరిగాయని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు.

అదే సమయంలో రాత్రి చలి వాతావరణం నెలకొంది.

ఆకాశం నిర్మలంగా వుండడంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

ఆరోగ్యవరంలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఇక నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు.

23/02/2018

*గుంటూరు నల్లపాడు పోలిస్ స్టేషన్లో ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన గుంటూరు తాలూకా సీఐ శ్రీనివాసరావు* .
వివరాలు లోకి వెళితే........
*సివిల్ పంచాయితీ విషయంలో 30.000 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సీఐ శ్రీనివాసరావు* .

*నర్సారావు పేట కె రాజశేఖర్ కేసులో న్యాయం చేయాలంటే 30.000 వేలు ఇవ్వలని శేషు అనే కానిస్టేబుల్ చే రాయభారాలు నడిపిన సీఐ శ్రీనివాసరావు*

*గత కొంతకాలంగా రాజశేఖర్ అనే వ్యక్తి ని పలు ఇబ్బందులకు గురిచేస్తు హింసిస్తున్న సీఐ శ్రీనివాసరావు*

*సీఐ హింసకు భరించలేక ఏసీబీ ని ఆశ్రయించిన నర్సారావు పేట కు చెందిన రాజశేఖర్ అనే బాధితుడు*

*బాధితుడి న్యాయం చేసే దిశగా సీఐ శ్రీనివాసరావు అడ్డంగా డబ్బులు తీసుకునేటప్పుడు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు*.....

*సీఐ శ్రీనివాసరావు సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలియజెసిన అధికారులు*....

23/02/2018

అసెంబ్లీ టైగర్ స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వర్ధంతి

23/02/2018

కోట మండలం లోని విద్యానగర్ మెయిన్ రోడ్డు లో శుక్రవారం ఉదయం చిల్లకూరు మండలం లోని పారిచర్ల వారి పాలెం గ్రామానికి చెందిన నిరంజన్ రెడ్డి(52) ఆయన స్వగ్రామం నుండి వాకాడు ఆర్టీసీ డిపోకు వెళుతూ ఉన్న గా బైక్ అదుపు తప్పి బోల్తాపడింది. నిరంజన్ రెడ్డి అక్కడక్కడకె మృతి చెందారు. ఈయన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పనిచేస్తున్నారు.విషయం తెలుసుకున్న కోట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ సంఘటన కోట ఎస్సై నారాయణ రెడ్డి కేసు నమోదు చేశారు. అనంతరం పార్ధీవ దేహాన్ని పంచనామా నిమిత్తం వాకాడు మండలం లోని బాలి రెడ్డి పాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

23/02/2018

కొడవలూరు మండలం దళిత తేజం తెలుగుదేశం కొడవలూరు మండలం: మిక్కిలింపేట దళితవాడ లో దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమం లో ముఖ్య అతిధులు కోవూరు శాసనసభ్యులు పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో ఏమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇంటి ఇంటి కి తిరిగి కరపత్రాలు అందించారు.రాష్ట్ర ప్రభుత్వము అలాగే ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు గారు మన దళితులకు కోసం చాల పథకాలు ప్రవేశపెట్టారు.ఆటే కాకుండా ప్రతి వీధి కి సీసీ రోడ్లు మరియు సైడు కాలవులు . ప్రతి ఇంటి కి మరుగుదొడ్లు నిర్మిoచారు అరుహుల కి పక్క ఇల్లు.మరి పింఛనలు మంజూరు చేసారు.అని ఏమ్మెల్యే అన్నారు. దళిత తేజం ద్వారా దళితుల కుటుంబం లో విద్యార్థి కి కంటి ఆపరేషన్ కి సీఎం రీలీఫ్ ఫాండ్స్ .నుంచి విద్యార్థి తాత జగదీశ్ కి 60000 వేలు రూపాయిలు ఎమ్మెల్యే అందించారు. అనంతరం అయన ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొన్నారు ఆ సమస్యలు ని తొందర్లో చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమం లో మండలం sc సెల్ అధుక్షులు తువర ప్రవీణ్ . దారా విజయబాబు .కోడూరు బుజ్జిరెడ్డి .కోడూరు సుదకర్ రెడ్డి. గోపి .రమణయ్య .టీడీపీ నాయుకులు .తదితరులు పాల్గొన్నారు.

23/02/2018

*మహా టి.వి పై జరిగిన దాడిని ఖండిస్తూ, నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ లో, కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టి, దాడికి పాల్పడ్డ వారిని శిక్షించాలని డిమాండ్ చేసిన జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులు. ఈ కార్యక్రమంలో జాప్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు గోపినాథ్, ఇతర సంఘాల నాయకులు.*

23/02/2018

కోటలోని బాలయోగి గురుకులం SC-బాలుర హాస్టల్ ను గురువారం రాత్రి సందర్శించి,
విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకొని.,అనంతరం విద్యార్థులతో కలిసి బస చేసిన గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ గారు.

23/02/2018

*నెల్లూరు జిల్లా:*

*సంగం*

*బెల్ట్ షాప్ లపై బుచ్చిరెడ్డిపాలెం ఎక్సైజ్ పోలీసులు దాడులు.*

*చెన్నవారప్పడు 12 మద్యం సీసాలు స్వాధీనం.*

*చిన్నమ్మ అనే మహిళ అరెస్ట్*

*జంగల కండ్రిగ లో 14 మద్యం సీసాలు స్వాధీనం.*

*రత్నమ్మ అనే మహిళ అరెస్ట్.*

22/02/2018

కృష్ణ :

ఇచ్చిన ప్రతి హామీని టీడీపీ ప్రభుత్వం నెరవేరుస్తూ వచ్చింది

- రూ.24వేలకోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ

- 2014 ముందు 24 గంటల కరెంట్ ఉండేదా?

- సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన వంద రోజుల్లోనే 24గంటల కరెంట్ సరఫరా ఇస్తున్నాం

- డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.6వేలు ఇచ్చాం. మార్చి 2 నాటికి మరో రూ..2వేలు ఇస్తాం

- చాలీచాలని రూ.200 రూపాయల పింఛన్లను రూ.1000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబుది

- గతంలో కాంగ్రెస్ కార్యకర్తలు దెయ్యాలు మాదిరిగా పింఛన్లు తీసుకునేవారు

- ప్రతిపేదవాడికి పక్కా ఇల్లు ఇవ్వాలని చంద్రబాబు శ్రీకారం చుట్టారు

- షీయర్ వాల్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం

- ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ఈ టెక్నాలజీతో కట్టలేదు

- నేను గ్రామీణాభివృద్ధి మంత్రి అయ్యాక ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేశాం

- గన్నవరం తెలుగుదేశం కంచుకోట

- ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తున్నారు

- అమరావతి ప్రమాణం అంతా గన్నవరం నుంచే ప్రారంభిస్తారు

- ఖాలీగా ఉన్నా మేధా టవర్స్ నిండిపోయింది

- ఐదు లక్షల చదరపు అడుగుల్లో మరో భవనం నిర్మిస్తున్నాం

- దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ హెచ్ సీఎల్ ను గన్నవరం తీసుకొచ్చాం

- హైదరాబాద్ విమానాశ్రయం శంషాబాద్ లో ఉంటే సాఫ్ట్ వేర్ సంస్థలు గచ్చిబౌలిలో ఉన్నాయి

- అమరావతిలో విమానాశ్రయం, సాఫ్ట్ వేర్ సంస్థలు రెండూ ఒకే చోట ఉన్నాయి

- విభజనకు ముందు గన్నవరానికి కేవలం 3 విమానాలు మాత్రమే వచ్చేవి

- ఇప్పుడు దాదాపు 50 విమానాలు గన్నవరం నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి

- రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాం

- అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాం

- నూతన పంచాయతీ, అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్న ఘనత మన ప్రభుత్వానిది

- వంద శాతం మరుగుదొడ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వానిది, వాడే బాధ్యత మీదే :

మంత్రి నారా లోకేశ్

22/02/2018

న్యూఢిల్లీ:

ఆనంద్ కుమార్ తివారి ఐపీఎస్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తివారి 1994 బ్యాచ్‌కు చెందిన అస్సాం - మేగాలయ కేడర్ ఆఫీసర్.

అసమర్థ పనితనం వలన ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించకూడదో తెలపాలంటూ తివారికి నోటీసులు జారీ చేసింది.

నోటీసులు తీసుకునేందుకు తివారి నిరాకరించడంతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అతనిపై కమిటీని వేసింది.

ఆనంద్‌కుమార్ తివారి తప్పని సరిగా వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకోవాలని కమిటీ తేల్చి చెప్పింది.

దానికి తివారి వినకపోవడంతో సర్వీసు నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

గత రెండేళ్లలో సర్వీసు నుంచి తొలగించబడిన ఆరో ఐసీఎస్ ఆఫీసర్‌గా తివారి నిలిచారు.

22/02/2018

విజయవాడలో విద్యార్థుల ఘర్షణ ఉద్రిక్తం

పెనమలూరు: విజయవాడ సమీపంలోని పెనమలూరులో వసతి గృహం నిర్వాహకులకు ఇంజనీరింగ్‌ విద్యార్థికి మధ్య బకాయిల వ్యవహారం పరస్పర దాడులకు దారితీసింది.

విద్యార్థులు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో పెనమలూరు మండలం కానూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

దీంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు.

దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానూరులోని సాయిచలపతి వసతి గృహాంలో పీవీపీ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన సూర్యవంశీ అనే ఇంజనీరింగ్‌ మూడో సంవత్సర విద్యార్థి అద్దెకు ఉంటున్నాడు.
అతను రూ.1400 హాస్టల్‌కు బకాయి ఉన్నాడు.

దీనిపై వసతి గృహం నిర్వాకురాలు శ్రీలత, సూర్యవంశీకి మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది.

ఈ వివాదం ముదరడంతో సూర్యవంశీపై శ్రీలత, ఆమె భర్త సాయిప్రసాద్‌తో పాటు మరో ఆరుగురు దాడిచేశారు.

ఈ దాడిపై పరస్పర కేసులు నమోదయ్యాయి. గురువారం ఈ వివాదంపై ప్రశ్నించడానికి ఓ టీవీ ఛానల్‌ ప్రతినిధులు సాయిచలపతి వసతిగృహానికి వెళ్లగా.. శ్రీలత, ఆమె భర్త సాయిప్రసాద్‌తో పాటు మరికొందరు కెమెరామెన్‌, రిపోర్టర్‌పై దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనపై ఛానల్‌ ప్రతినిధులు ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

22/02/2018

న్యూఢిల్లీ :

చిన్న పిల్లల అశ్లీల చిత్రాలను వాట్సాప్‌లో పోస్ట్ చేస్తున్న గ్రూపులను ఇవాళ సీబీఐ పట్టుకున్నది.

వివిధ దేశాల నుంచి సుమారు 119 మంది ఈ గ్రూపులను నిర్వహిస్తున్నారు.

దీంట్లో గ్రూప్ అడ్మిన్లు అయిన అయిదుగురిపై కేసు నమోదు చేశారు.

ఢిల్లీతో పాటు యూపీ, మహారాష్ట్రల్లోనూ ఇవాళ అనేక ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.

యూపీలోని కన్నాజూలో గ్రూప్ అడ్మిన్ నిఖిల్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన అతన్ని తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తీసుకురానున్నారు.

ముంబైకి చెందిన సత్యేంద్ర చౌహాన్, ఢిల్లీకి చెందిన నఫీస్ రాజా, జహీద్, నోయిడాకు చెందిన ఆదర్శ్‌లు.. ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఇతర అడ్మిన్లుగా ఉన్నారు.

కిడ్స్ ట్రిబులెక్స్ అనే పేరుతో ఈ గ్రూపులో చిన్న పిల్లల అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేశారు.

శ్రీలంక, పాక్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, మెక్సికో, న్యూజిలాండ్, చైనా, నైజీరియా, బ్రేజిల్,కెన్యా దేశాలకు చెందిన చైల్డ్ పోర్న్ మెటీరియల్ ఆ గ్రూపుల్లో పోస్ట్ చేశారు.

22/02/2018

చిత్తూరు లో రఘువీరా రెడ్డి

హోదా ఇవ్వాలని డిమాండ్‌తో మార్చి 2న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్భందం..

6,7,8వ తేదీల్లో పార్లమెంటు ముట్టడి చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

22/02/2018

ఈ రోజు తిరుపతి సురక్షిత నగరము కార్యక్రమం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్న రహదారి భద్రతా చర్యలో భాగంగా

తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ అభిషేక్ మహంతి ఐ.పి.యస్ గారు ఉత్తర్వుల మేరకు, తిరుపతి ప్రజల సౌకర్యార్థం మరియు భద్రతా దృష్ట్యా

తిరుపతి ముత్యాలరేడ్డి పల్లి కూడలి నందు మరియు తిరుచానూర్ సింధు సర్కిల్ నందు నూతనుముగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సింగ్నల్స్ ను

తిరుపతి ట్రాఫిక్ డి.యస్.పి శ్రీమతి కే.సుకుమారి గారు ప్రారంబించారు.

ఇందులో బాగంగా ట్రాఫిక్ సి.ఐ లు పార్థసారధి గారు, అమర్నాథ్ రెడ్డి గారు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు

22/02/2018

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడుతో తనకు ఉన్న ఆత్మీయ బంధాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం ట్రుడు, ఆయన కుటుంబ సభ్యులు భారతదేశంలో పర్యటిస్తున్న నేపథ్యంలో వారంతా చాలా ఆనందంగా గడుపుతున్నట్లు భావిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.

ముఖ్యంగా తాను ట్రుడు పిల్లలు జేవియర్, ఎల్లా గ్రేస్, హడ్రియేన్‌లను కలవడం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తాను 2015లో కెనడాలో పర్యటించినపుడు ట్రుడు, ఎల్లా గ్రేస్‌లతో కలిసి తీయించుకున్న ఫొటోను ట్వీట్ చేశారు.

ట్రుడు మన దేశంలో వారం రోజుల పర్యటనకు వచ్చారు. ఆయన సతీమణి సోఫీ కూడా విచ్చేశారు.

కెనడా, భారత దేశం ప్రధాన మంత్రులు ట్రుడు, మోదీ శుక్రవారం సమావేశమవుతారు.

22/02/2018

పత్రికా ప్రకటన తిరుమల, 2018 ఫిబ్రవరి 22


ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి వి రాళం
టిటిడి శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం ఉదయం రూ. కోటి విరాళంగా అందింది.

మలేసియాకు చెందిన ప్రవాస భారతీయుడు శ్రీ కెవిన్‌ సుగుమారన్‌ విరాళం చెక్కును తిరుపతిలోని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు నివాసగృహంలో ఆయనకు అందజేశారు.

22/02/2018

నెల్లూరు

కోవూరు మండలం సర్వసభ్య సమావేశం.

కోవూరు మండలాఅధ్యక్షరాలు ధారా గీత గారి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కోవూరు శాసన సభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు.

కోవూరు త్రాగునీటి కి చెందిన రక్షిత మంచినీటి పైలెట్ ప్రాజెక్టు ను వెంటనే అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేసి రాబోయే వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండ చూడాలి

పెన్నా నది పరీవాహం లో ఇస్తున్న అక్రమ విద్యుత్ కనెక్షన్లు ను వెంటనే తొలిగించాలి

రైతు కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలని రైతులు ను కోరారు.

పెన్నా నదిలో ఉన్న ఆక్రమణలను వెంటనే తొలిగించాలి ఎం.ర్.ఓ.గారికి ఆదేశాలు

ఈ కార్యక్రమంలో కోవూరు జడ్.పి.టి.సి. చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు,ఎం.పి.డి.ఓ గారు,ఎం.ర్.ఓ.గారు ఇతర అధికారులు పాల్గొన్నారు.

22/02/2018

అనంతపురం
చంద్రబాబు కామెంట్స్.

కియా మోటార్స్ ప్రేమ్
ఇన్ స్థలేషన్ విభాగాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.

కియా మోటార్స్ కోసం త్వరితగతిన హాంద్రీనీవా ద్వారా నీటిని సరఫరా చేస్తాం.

ప్రపంచంలో నే వాహన తయారీ రంగంలో కొరియా రెండో అతిపెద్ద దేశం.

ప్రపంచంలో ని అన్ని ప్లాంట్ల కంటే అనంతపురం ప్లాంటే అధికంగా ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నా.

అనంతపురం కియా ప్లాంట్ కు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

చెన్నై - కృష్ణ పట్నం కారిడార్ అందుబాటులో ఉంది.

APIICC అధికారులు, కలెక్టర్లు, మంత్రులు విస్తృతంగా పర్యటించారు.

కియా ప్రతినిధులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అధికారులు పని చేస్తున్నారు.

ఏడాదికి 10 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నా.

వ్యాపార అనుకూల ప్రాంతాల్లో AP ముందుంది.

రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక మంది ముందుకొస్తున్నారు.

ఆటో మొబైల్ హబ్ గా AP ను తీర్చిదిద్దుతున్నాం

మూడున్నరేళ్ల వ్యవధిలో 1946 MOU లు కుదుర్చుకున్నాం.

32 లక్షల మందికి ఉపాధి లభించనుంది.

విశాఖ లో మూడో సారి భాగస్వామ్య సదస్సు నిర్వహించబోతున్నాం.

రైతులు చూపిన చొరవతోనే
కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు వచ్చింది.

ఆనాడు రాజధాని నిర్మాణానికి భూములు,
ఈనాడు అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ కు రైతులు భూములు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయుతనిస్తున్నారు.

22/02/2018

నెల్లూరు జిల్లా

గూడూరు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో. ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి గారి.168.వర్ధంతి సందర్భంగా..రక్తదాన.కార్యక్రమంజరిగింది.

ఈ.కార్యక్రమంలోభాగంగా100.మంది. రెడ్డి. సోదరులు పాల్గొన్నారు..

ఈకార్యక్రమంలోడాక్టర్లు. జనార్దన్ రెడ్డి. రోహిణి. గార్లు.మరియు.డాక్టర్లు. ఉమ.రవి.బాబు.సిబ్బంది పాల్గొన్నారు. మదురెడ్డి..బాబురెడ్డి.చెంచారెడ్డి.ప్రసాద్.రెడ్డి. రాజారెడ్డి. నారాయణ రెడ్డివిష్ణు వర్దంరెడ్డి.ఉదయకుమార్ రెడ్డి సతీష్.రెడ్డి పాల్గొన్నారు

22/02/2018

గన్నవరం నియోజకవర్గం లో
మంత్రి నారా లోకేష్ పర్యటన...

ఉంగుటూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల
ప్రాంగణంలో 1 కోటి 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్.

22/02/2018

కృష్ణ జిల్లా

వీరులపాడు మండలం పెద్దాపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం న్ని తప్పించుకుని ప్రయత్నం లో కూలీ లతో వెళుతున్న ఆటో బోల్తా

ఘటన లో 10 మంది కి గాయాలయ్యాయి

వెంటనే స్పందించిన వీరులపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆటో నుండి బయట తిసి త్వరితగతిన హాస్పిటల్ కు తరలించారు.

22/02/2018

హైదరాబాద్:

ఇళ్ల నుంచి చెత్తను రవాణా చేసేందుకు ఉపయోగించే స్వచ్ఛ ఆటోలను లబ్ధిదారులకు అందజేశారు.

నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

నగరంలో ఇప్పటికే రెండు వేల స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేయగా తాజాగా మరో 150 ఆటోలను నేడు పంపిణీ చేశారు.

త్వరలోనే మరో 350 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

22/02/2018

గుంటూరు ః

జిల్లా టిడిపి కార్యాలయం లో జిల్లా పార్టీ సమన్వయ కమిటి సమావేశం.

హజరైన ఇన్ చార్జ్ మంత్రి అయ్యనపాత్రుడు , మంత్రి నక్కా ఆనంద బాబు, జిల్లా టిడిపి అధ్యక్షుడు జి. వి.ఆంజనేయులు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, పలువురు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, ఇతర ప్రజా ప్రతినిధులు.

22/02/2018

హృదయ విదారకం:

కూతురు కళ్లెదుటే దంపతుల ఆత్మహత్య, ‘అమ్మ కావాలంటూ’

మెదక్: జిల్లాలోని తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్‌ దగ్గర గురువారం ఉదయం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పది నెలల కుమార్తె కళ్లెదుటే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నారిని రైల్వే ఫ్లాట్ ఫాంపై కూర్చోబెట్టి వీరు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

చిన్నారి ముందే..

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న దంపతులు తమ పది నెలల చిన్నారిని రైల్వే ఫ్లాట్ ఫాంపై కూర్చోబెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆధార్ ఆధారంగా గుర్తింపు

స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డుల ఆధారంగా వారిని ఒంటెద్దు కాశీరాం దంపతులుగా గుర్తించారు. వీరు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ వాసులని తెలిపారు.

అమ్మ కావాలి అంటూ చిన్నారి

కాగా, తల్లిదండ్రులు చనిపోవడంతో ఏం జరిగిందో తెలియని చిన్నారి ‘అమ్మ' కావాలి అంటూ తీవ్రంగా ఏడుస్తోంది. ఈ దృశ్యం అక్కడున్న వారి హృదయాలను కలిచివేస్తోంది.

చిన్నారి అప్పగింత కోసం..

దంపతుల మృతదేహాలను కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఆ చిన్నారిని తెలిసిన వారికి అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతుల బంధువులు ఎవరైనా చిన్నారి కోసం తమను సంప్రదించాలని కోరుతున్నారు.

22/02/2018

గుంటూరుః పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి పుల్లారావు వీడియో కాన్ఫరెన్స్

పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్, యం.డి రాంగోపాల్ , ఇన్ చార్జ్ కలెక్టర్ యం వెంకటేశ్వరరావ్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

కలెక్టరెట్ నుంచి 13 జిల్లాల జేసీలు, డి.ఎస్.ఓలు, డి.యంలు, ఎ.ఎస్.ఓ లతో మంత్రి పుల్లారావు వీడియో కాన్ఫరెన్స్

రేషన్ షాపుల పనితీరు, చంద్రన్న విలేజ్ మాల్స్, హైకోర్టులో ఉన్న కేసులు, పద్దుల తనిఖీల నిర్వహణ, ఈ-పోస్ విధానం, ఖాళీగా ఉన్న రేషన్ షాపుల నోటిఫికేషన్, అన్న క్యాంటీన్లపై చర్చిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

22/02/2018

బెంగళూరు:

ఇన్నోవేటివ్‌ ఫిల్మ్‌సిటీలోని బిగ్‌బాస్‌ స్టూడియోలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.

మంటల ధాటికి బిగ్‌బాస్‌ స్టూడియో పూర్తిగా దగ్ధమైంది. బిగ్‌బాస్ భారీ సెట్టింగులు అగ్నికి ఆహుతయ్యాయి.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.

కాగా షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

22/02/2018

రాంగోపాల్‌వర్మ జీఎస్టీ ట్రైలర్‌ను యూట్యూబ్‌ అధికారికంగా తొలగించింది.

జీఎస్టీ టైటిల్‌, ఆర్ట్‌ వర్క్‌ తనదేనంటూ యూట్యూబ్‌కు గత నెలలో సినీ రచయిత జైకుమార్‌ ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో జైకుమార్‌ ఫిర్యాదుతో యూట్యూబ్‌ నుంచి జీఎస్టీ ట్రైలర్‌‌ను తొలగించినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే, రాంగోపాల్ వర్మ మహిళలపై అభ్యంతరకర కామెంట్స్ చేశారని ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.

22/02/2018

వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి 95వ రోజు పాదయాత్రను ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు.

గురువారం ఉదయం పీసీపల్లి మండలం అలవలపాడు నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది.

రామాపురం, గుడెవారిపాలె మీదుగా సాగిన పాదయాత్ర హజీజ్‌పురం వద్ద ముగిసింది.

అక్కడి నుంచి రేపు సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు జగన్ హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఇప్పటి వరకు జగన్‌ 1275.9 కిలో మీటర్లు నడిచారు.

22/02/2018

ఆయుష్ వైద్య శాలలను తిరిగి ప్రారంభించి తమ ఉద్యోగాలను కొనసాగించాలని కోరుతూ పారామెడికల్ సిబ్బంది గురువారం రవాణా శాఖ మంత్రి అచ్చనాయుడును విజయవాడ లోని ఆయన క్యామ్ప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

2008 పనిచేస్తున్న తమను వైద్యాధికారులు లేని కారణం చూపి విధులనుండి తమను తొలగించారని వారు గోడు వెళ్లబోసుకున్నారు. 851 మంది రోడ్డున పడ్డామన్నారు.

22/02/2018

తెలుగు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ తరపు సాక్షి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగనున్నది.

గత డిసెంబర్‌లో ప్రారంభమైన క్రాస్ ఎగ్జామినేషన్ తరువాత జనవరి 31కి వాయిదా పడింది.

తన భార్య అనారోగ్య కారణంగా తాను ఆరోజు విచారణకు హాజరు కాలేనని ఏపీ సాక్షి కేవీ సుబ్బారావు వాయిదా కోరడంతో బ్రిజేశ్ అప్పుడు అందుకు అంగీకరించారు.

ఈ నెల 22న జరిగే విచారణకు కూడా తాను రాలేనని సుబ్బారావు తెలియజేశారు.

దాంతో ఆయనకు బదులుగా ఏపీ తరపున వ్యవసాయ రంగంపై మరో సాక్షి సత్యనారాయణ క్రాస్ ఎగ్జామినేషన్‌ను కొనసాగిస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.

రెండురోజులపాటు జరిగే విచారణ కోసం తెలంగాణ నీటిపారుదలశాఖ (ఇంటర్‌స్టేట్ విభాగం) చీఫ్ ఇంజినీర్ నర్సింగరావు, ఇతర అధికారులు బుధవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

22/02/2018

నెల్లూరు జిల్లా :::గూడూరులో దేవాదాయ శాఖ నిర్వాకం,విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో అంధకారంలో పలు దేవాలయాలు .స్పందించని దేవాదాయ శాఖ అధికారులు .

22/02/2018

విజయవాడ...
పిబ్రవరి 23 ..:రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రదాని మోడి సియం చంద్రబాబు నాటకాలు ఆడుతు రాష్ట్ర ప్రయోజనాలను దరబ్బతీస్తున్నారని ప్రజా నాట్య మండలి కళాకారులు తనదైన శైలిలో ప్రజలకు వివరిస్తు నిరసన తెలుపుతున్నారు.. విజయవాడ లెనిన్ సెంటర్లో సిపిఐ నేతలు ప్రజానాట్యమండలి కళాకారు మోడి చంద్రబాబు యంపి ల వేషాలు వేసి ప్రజలకు కళ్ళకు కట్టినట్లు తమ నటన ద్వారా తెలిపారు...

Address

Cross Road
Kota
524411

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 1pm

Telephone

9989803640

Alerts

Be the first to know and let us send you an email when BCN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to BCN News:

Videos

Share