ఉపాధి హామీలో తెలంగాణాకు అవార్డుల పంట
పారదర్శకత, జవాబుదారీతనంలో రాష్ట్రానిదే అగ్రస్థానం
జూన్ 19 న విజ్ఞానభవన్‌లో అవార్డుల ప్రధానం
ఉపాధి హామీ సిబ్బందిని, ప్రజాప్రతినిధులను అభినందించిన మంత్రి జూపల్లి
ఇదే స్పూర్థితో మరింత ఉత్సాహంగా ముందుకు పోవాలని పిలుపు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుతో తెలంగాణా రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరం లో తొలిసారిగా ఒక్క రూపాయి కూడా ఉపాధి నిధులను వృధా కాకుండా ఖర్చు చేసిన తెలంగాణా రాష్ట్రం... ఇప్పుడు ఏకంగా ఐదు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్దవంతంగా అమలు చేస్తున్నందుకు గాను 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణాకు అయిదు జాతీయ అవార్డులు దక్కాయి.
ఉపాధి పథకం అమలులో పారదర్శకత మరియు జవాబుదారీతనం కనబర్చడంలో దేశములోనే అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణాకు అరుదైన గౌరవం దక్కింది. అలాగే ఇప్పటి వరకు పథకం ద్వారా ఏర్పడ్డ ఆస్తులను ఆన్ లైన్లో భువన్ సాఫ్ట్ వేర్ ద్వారా నిక్షిప్తం చేసినందుకు జియో MGNREGA అవార్డును కూడా తెలంగాణా రాష్ట్రం కైవసం చేసుకుంది. ఇక అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా గా వరంగల్ (పాత) జిల్లా ఎంపిక కాగా... ఉత్తమ గ్రామ పంచాయతీ కేటగిరి క్రింద నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ గ్రామ పంచాయతీ ఎంపికైంది. ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించిన గ్రామంగా జాతీయ స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. ఉపాధి కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు చెల్లినందుకు పోస్టల్ డిపార్ట్ మెంట్ తరపున నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి బ్రాంచ్ పోస్టు మాస్టర్ అబ్దుల్ సత్తార్ కు అవార్డు దక్కింది. జూన్ 19న విజ్ఞాన భవన్లో జరిగే కార్యక్రమంలో అవార్డుల ప్రదానం జరుగనుంది.
ఉపాధి హామీ పథకం అమలులో ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయని... జాతీయ స్థాయిలో వచ్చిన ఈ అవార్డులు మరింత ఉత్సాహాన్నిస్తాయన్నారు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. గ్రామ స్థాయిలో పనిచేసే క్షేత్రసహాయకుని నుండి రాష్ట్రస్థాయి అధికారి వరకు.. అలాగే స్థానిక ప్రజా ప్రతినిధుల నుండి రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులందరి సమష్టి కృషి వల్లే ఉపాధి హామీలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇదే ఉత్సాహంతో పనిచేసి ప్రతి ఉపాధ
గ్రామాల్లో అన్ని రకాల పౌర సేవలను ఆన్లైన్లో అందించేందుకు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఆన్ లైన్ విధానాలను పరిశీలించాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఇప్పటికే 5 వేలకు పైగా పంచాయతీ క్లస్టర్లలో కంప్యూటర్లు ఉన్నాయని... ప్రింటర్లు, ఇంటర్నెట్ డాంగిల్స్ కొనుగోలు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నాటికి జనన, మరణ దృవీకరణ పత్రాలు, పన్నుల చెల్లింపు లాంటి అన్ని సేవలను ఆన్లైన్ ద్వారా అందించేందుకు సిద్దం కావాలని మంత్రి ఆదేశించారు.
*సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాకల్‌లో రూర్బన్ పథకానికి శ్రీకారం చుట్టిన పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు*
పట్టణ వసతులను పల్లెల్లో కల్పించడమే రూర్బన్ లక్ష్యం
గ్రామీణ రూపురేఖలనే మార్చేందుకు రూర్బన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నాం
రాష్ట్రంలో 4 క్లస్టర్స్‌ను రూర్బన్ పథకంలో తీసుకున్నాం, ఇందులో ర్యాకల్ క్లస్టర్ ఒకటి
అవసరాల కోసం పట్టణాలకు వెళ్లకుండా పల్లెల్లోనే రూర్బన్ ద్వారా అన్ని మౌళిక సౌకర్యాలు కల్పిస్తాం
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరవేయడంతో పాటు... సాగునీరు, తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం
పారిశుద్ధ్యం, 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం యుద్దప్రాతిపదికన చేపడుతున్నాం
*మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు*
Minister press conference on tdp & congress leaders comments
At parajkadavu block Panchayat, kerala
ఉద్యమంలా సాగుతున్న హై వే హరిత హారం
హైదరాబాద్ లోని దర్గా నుంచి ఆలంపూర్ వరకు 180 కి.మీ.మేర సాగుతున్న హైవే హరిత హారం
బెంగళూరు హై వే హరిత హారం కార్యక్రమం లో పాల్గొంటున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న, లక్ష్మా రెడ్డి, ప్రజా ప్రతినిధులు
11 మండలాలు, 59 గ్రామాలలో మూడు వరుస లలో లక్షకు పైగా మొక్కలను నాటేందుకు కార్యాచరణ
రేపు, ఎల్లుండి కూడా కొనసాగ నున్న హై వే హరిత హారం
భారీగా తరలి వచ్చి హైవే హరిత హారం లో పాల్గొంటున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు
సి యం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణను హరిత తెలంగాణగా మార్చేందుకు అందరు కృషి చెయ్యాలని పిలుపు
Welcome to krishna pushkaralu...