14/11/2024
పవన్ ని జగన్ ఫాలో అవ్వబోతున్నాడా?
పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్స్ లో రెండుచోట్లా ఓడిపోయాక అధికార పక్షాన్ని మీడియా ద్వారానే ఎండగట్టేవాడు. నన్ను మీరు రెండు చోట్లా ఓడించారు, నేను అసెంబ్లీకి వెళ్లలేను కాబట్టి మీడియా ముందే నా గొంతు వినిపిస్తా అన్నాడు అలాగే చేసాడు. ఓడించినమాట నిజమే కాబ్బట్టి ప్రజలు నుండి సింపతీ ఏర్పడింది. తనకున్న విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ కూడా కలిసి వచ్చింది. TRP రేటింగ్స్ బాగుండటం తో మీడియా కూడా బాగానే కవర్ చేసింది. వైస్సార్సీపీ తప్పిదాలను ప్రజలకు చుపించడం లోపవన్ సక్సెస్ అయ్యాడు. ఫలితం గా 2024 లో పోటీచేసిన 21 చోట్లా గెలుపు సాధ్యమైయింది.
జగన్ మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ కి వెళ్లకుండా మీడియా ద్వారా తన గళాన్ని విప్పాలనుకుంటున్నాడు. జగన్ పరిస్థితి వేరు. తనకి ప్రజలు 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు.
కేవలం అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా ఇవ్వనందు వల్లే అసెంబ్లీ కి వెళ్ళను అనటం ప్రజలు అంగీకరిస్తారా అంటే డౌటే. వైస్సార్సీపీ కార్యకర్తలు మాత్రం జగన్ అసెంబ్లీ కి వెళ్ళవద్దని అనుకుంటారు దానికి కారణం జగన్ అవమానాలు పడాల్సి వస్తుంది కాబ్బట్టి. కానీ ప్రజల ఉద్దేశం అలా ఉండదు.గెలిపించాం కాబట్టి వెళ్ళాసిందే, అసెంబ్లీ లో తన గళం విప్పాలనుకుంటారు. అసెంబ్లీ కి వేళ్ళని వాళ్ళు రాజీనామా చెయ్యండి అని అంటున్న జగన్ మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల వ్యాఖ్యలు కూడా ప్రజలకు నిజమే అనిపిస్తుంది. జగన్ కి మీడియా సపోర్ట్ కూడా అంతంతమాత్రమే. వైస్సార్సీపీ సోషల్ మీడియా సైతం ప్రస్తుతం డల్ గానే ఉంది. ఈ పరిస్థితిల్లో జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.