25/07/2016
ప్లేస్ ఎక్కడైనా..పోటీ ఎవరితోనైనా గెలుపు మాత్రం ఆమెదే...!!
జీవితంలో ఏదైనా సాధించాలని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, పది మందిలో గుర్తింపు పొందాలని, తన ప్రతిభను ప్రపంచానికి చాటాలని, వారి జీవితాలను చరితాత్మకం చేసుకోవాలనే కోరిక అందరికీ ఉన్నా... విజయం మాత్రం నిరంతర కృషి, పట్టుదల, ఏకాగ్రతతో పనిచేసే వారికి మాత్రమే లభిస్తుంది. తోటి వారంతా విమర్శలను సందిస్తున్నా ఆ విమర్శలనే ఆదర్శంగా తీసుకొని సోపానాలుగా మలచుకొని విజయ బావుటా ఎగరవేసే మహనీయులకు వందనం.. అభివందనం.
అ అమ్మాయి పేరు కుమారి మహంకాళి ప్రకృతి. పేరుకు తగ్గట్టే ప్రకృతి ఎంత సుందరమైనదో, ఎంత విశాలమైనదో ఆమే ఆలోచనా విధానం కూడా అంతే విశాలమైనది. ప్రకృతే పరవశించి పోయే ప్రతిభ ఆమె సొంతం. ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలం, ఆత్మకూరు గ్రామం. తనకు చిన్నప్ప్పటి నుంచి స్విమ్మింగ్ అంటే అమిత ఆసక్తి. సరదాగా తన అన్నయ్యతో కలిసి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసి దానినే తన లక్ష్యంగా మార్చుకుంది. పుట్టింది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో నైనా చిన్న వయస్సులోనే రాష్ట్ర స్థాయిలో విజయాలు సాధించి ఔరా...! అనిపించుకుంది. నిరంతరం ప్రోత్సాహాన్ని అందిచే తల్లి దండ్రులు, తను ఒక ఛాంపియన్ గా మారడానికి మొదటి గురువుగా మారిన తన అన్నయ్య అండదండలు. ప్రజల ఆదరాభిమానాలు ఇవన్నీ కలగలిపి ఆమెను రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్ గా మార్చాయి.
క్రీడా విమర్శకులు సైతం ఆమే పట్ల ప్రశంసల వర్షం కురిపించేలా చేసే ఆమే ప్రతిభా పాఠవాలు అత్యద్భుతం. అలుపెరుగని కృషి, ఆత్మ విశ్వాసాలానే ఆయుధాలుగా మార్చుకొని రాష్ట్ర స్థాయిలో పతకాల పరంపర ను కొనసాగిస్తోంది ఈ ప్రకృతి. ఇప్పటి వరకు తన వయస్సుకు మించిన పతకాలను సాధించి తెలుగు రాష్ట్రాలకు అరుదైన గౌరవాన్ని తెచ్చిపట్టింది ఈ ప్రకృతి. 2005 విశాఖపట్నం లో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 3 కాంస్య పతకాలు దక్కించుకుంది. 2005 విజయవాడ సౌత్ జోన్ మీట్లో పాల్గొని 4 బంగారు పథకాలను సాధించింది. 2006 విశాఖ స్టేట్ మీట్ లో 4 బంగారు పథకాలతో పాటు వ్యక్తిగత ఛాంపియన్ షిప్ దక్కించుకుంది. 2006 సౌత్ జోన్ పోటీల్లో గచ్చిబౌలి లో పాల్గొంది. 2006 చెన్నై జాతీయ పోటీల్లో ఒక సిల్వర్, మూడు కాంస్య పథకాలు సాధించింది. 2006 త్రివేండ్రం నేషనల్స్ లో సిల్వర్ మెడల్, 2007 సికింద్రాబాద్ సీనియర్ మీట్లో 5 సిల్వర్ మెడల్స్. చెన్నై, బెంగళూరు, కేరళ, నాసిక్, భోపాల్ లో జరిగిన జాతీయ పోటీల్లో అత్యద్భుతంగా రాణించింది. 50.100,200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 100, 200 మీటర్ల ఫ్రీ స్టెల్ పోటీల్లో ఈ ప్రకృతి దిట్ట.
పైగా. తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ నుంచి స్థానం సంపాదించిన ఏకైక మహిళ ఈ ప్రకృతి. 2019 లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలపడానికి సమరానికి సై అంటూ తన ప్రాక్టీస్ ను మరింతగా సానబెడుతుంది ఈ పతకాలఅరంపర. తాను అంచలు అంచలుగా రాణిస్తూ, నేషనల్ ఛాంపియన్ గా నిలవడానికి కృషి చేస్తానని, అంతేకాక తనతో పాటు తన లాంటి మెరికలకు నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తూ, తన ప్రతిభా పాఠవాలను ప్రపంచానికి చాటి చెప్పేలా నిరంతర కృషిని కొనసాగిస్తానని చెబుతోంది ఈ ప్రకృతి. మనమందరం కూడా ఒక సారి ప్రకృతికి "ఆల్ ది బెస్ట్" చెప్పి మరింత ప్రోత్సాహాన్ని అందిద్దాం.