Idi Sangathi - ఇదీ సంగతి

Idi Sangathi - ఇదీ సంగతి Hi Everyone!

05/04/2024

పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ గోడవలు అనగానే గుర్తుకు వచ్చే గ్రామాల్లో ఒకటి....పిన్నెల్లి. మండల కేంద్రం మాచవరానికి 5 కిలోమీటర్లు....పిడుగురాళ్ల పట్టణానికి 20 కిలోమీటర్ల సమీపంలో ఉన్న ఈ పల్లె....ప్రగతికి మాత్రం ఆమడ దూరంలో నిలిచిపోయింది. పరిసర గ్రామాలన్నీ అభివృద్ధిలో పరుగులు తీస్తుంటే...పిన్నెల్లి వాసులు మాత్రం పేదరికంతో సావాసం చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం...ఫ్యాక్షన్ గోడవలు...హత్యా రాజకీయలు. ఈ గ్రామంలో పారిన రక్తపుటేరుల వల్ల మనుషులు లేని ఇళ్లు చెదలు పట్టాయి....సిరులు పండించే భూములు బీళ్లుగా మారాయి. మరి, ఈ దారుణాలకు ఎవరు కారణం...? నాలుగేళ్ల తర్వాత వచ్చిన వీరంతా ఏం కోరుకుంటున్నారు...? వారి మాటల్లోనే విందాం

05/04/2024

నాగరికత నేర్చుకునే క్రమంలో మనిషి కనుగొన్న వాటిల్లో ఒకటి.... నిప్పు. మనుషుల జీవిత ప్రయాణంలో అనేక విధాలుగా ఉపయోగపడుతున్న ఈ నిప్పు.....ఏమరుపాటుగా ఉంటే ప్రాణాలను సైతం తీస్తుంది. అయితే ఈ ఏమరపాటు ఎక్కువైందో లేక అధికారుల నిర్లక్ష్యమో గాని తెలంగాణలో అగ్గి ప్రతి ఏటా వందల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ముఖ్యంగా పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. ప్రతి రెండు రోజులకు ఒకసారి కర్మాగారాల్లో ప్రమాదాలు జరగడం తెలంగాణలో పరిస్థితిని కళ్లకు కడుతోంది. సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం....ఈ ఘటనలపై మరోసారి చర్చకు తెర తీసింది. పరిశ్రమలు మాత్రమే కాదు గృహ, వ్యాపార సముదాయాల్లో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు మేలుకోవాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. మరి పరిస్థితి ఎందుకు ఈ స్థాయికి వచ్చింది. దీనికి ఎవరి నిర్లక్ష్యం కారణం. ఎండాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.

05/04/2024

మండిపోతున్న ఎండలు...రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు. ఇది ప్రతి ఏడాది ఉండేదే కదా...అంటారా..? కానీ, ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇంతితై అన్నట్లు ఎప్పుడూ లేనంతగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నా డు. ప్రస్తుత వేసవి కాలంలో ఇప్పటికే 43.5 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని భారత వాతావరణ శాఖ-IMD తెలిపింది. ఉదయం 10 గంటలు దాటితే చాలు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు..అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితిని తీసుకొచ్చాడు. ఫిబ్రవరిలోనే మండిపోయిన ఎండలు..మరో మూడు నెలల వరకూ అధిక స్థాయిలోనే ఉంటాయని IMD పేర్కొంది. మరోవైపు అధిక ఉష్టోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలు వడదెబ్బలకు గురవుతున్నారు. మరి దీనికి కారణాలేంటి.? ఉష్టోగ్రతలు పెరగడానికి మానవ తప్పిదాలే కారణమా.? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఎండతాకిడికి దూరంగా ఉండొచ్చు.? వడగాల్పుల భారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.

05/04/2024

కన్నవారిని...తల్లి లాంటి సొంతూరిని విడిచి....దూరంగా ఏళ్ల తరబడి జీవించడం అంటే అంతకు మించిన బాధ ఉండేదేమో. మరి, వాళ్లు జీవనోపాధికోసమో...పై చదువులకోసమో వెళ్లిన వారు కాదు. ఫ్యాక్షన్ గొడవలు, ఆధిపత్య పోరు, అధికార వైకాపా విధ్వంస దాడులు ... అక్రమ కేసులు తట్టుకోలేక... వలస పోయిన పల్నాడు ప్రాంత తెదేపా వర్గీయులు. పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా రాజకీయపరమైన ఘర్షణలు ఉన్నప్పటికీ...జగన్ అధికారంలోకి వచ్చాక... హింస తారస్థాయికి చేరింది. తెదేపా తరఫున క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలపై...వైకాపా హింసాత్మక దాడులకు దిగింది. ప్రత్యర్థుల ఇళ్లను ధ్వంసం చేసి, గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టించింది. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెట్టి...తెదేపా సానుభూతి పరులు... వారి కుటుంబాలతో సహా గ్రామాలు వదిలివెళ్లేలా చేసింది. అలా...నాలుగేళ్లుగా పుట్టి, పెరిగిన ప్రాంతాలకు దూరమైన వారు...ఎన్నికల సందర్భంగా తిరిగి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. మరి, ఆనాడు వారంతా గ్రామాలు విడిచి పోవడానికి కారణమేంటి..? ఇప్పుడు వారికి రక్షణ ఎవరు?

04/04/2024

ప్రపంచం అంతా కాలుష్యం పెరుగుతోంది. వాహన, పారిశ్రామిక కాలుష్యంతో వాతావరణ మార్పులు తీవ్రమై.. ప్రకృతి పరంగా అనేక అనేక విపరిణామాలు సంభవిస్తున్నాయి. ఇంకోవైపు ముడి చమురు దిగుమతులు అన్ని దేశాలకు ఆర్థికంగా మోయలేని భారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచం అంతా జపిస్తున్న పేరు విద్యుత్ వాహనాలు. అలాంటి వాహనాల అమ్మకాలు భారత్ లో గణనీయంగా పెరుగుతున్నాయి. 2023-24ఆర్థిక సంవత్సరంలో ఇవి 41% శాతం పెరగడం వీటిపై ప్రజల మక్కువకు నిదర్శనంగా నిలుస్తోంది. మరి ఇంతటి మార్పునకు కారణమేంటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిశ్రమకు ఇస్తున్న ప్రోత్సాహమే అందుకు దోహద పడుతోందా? 2030 నాటికి కర్బన ఉద్గారాలను 45శాతం తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడంలో అమ్మకాల పెరుగుదల ఏమేరకు మేలు చేయనుంది?

04/04/2024

తెలంగాణ సిరిసంపదలను వర్ణిస్తూ... నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి మాటలు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. ఎటు చూసినా పచ్చని మాగాణితో కళకళలాడే పల్లెలను వర్ణిస్తూ ఇలాంటి ఎన్నో కవితలు రాశారు రచయితలు. ఏ పల్లె చూసినా గొలుసుకట్టు చెరువులు, ప్రధాన జలాశయాలు, గలగలపారే నదులతో ఎంతో సందండిగా ఉండేది. దీంతో తెలంగాణ రైతులు రెండు పంటలు పండించుకునేవారు. అయితే గత కొన్నిసంవత్సరాలుగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా...భూగర్భజలాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ యాసంగి మెుదటి నుంచి నీటి ఎద్దడి ఉన్నా..పంట చివరి దశకి వచ్చే సరికి పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి, ఈ సమస్య ఎందుకు వచ్చింది..? రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదికలు ఏం చెబుతున్నాయి..? కరవుపై క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి ఏంటి ..? ఈ కథనంలో తెలుసుకుందాం.

04/04/2024

దివ్యాంగులకు మీరేం చేశారని అడిగితే...గత ప్రభుత్వం ఏం చేసిందనే వాదన మన జగన్ మోహన్ రెడ్డిది. అందుకే కావొచ్చేమో గత ప్రభుత్వం కన్న తక్కువగా పింఛన్ల పెంపు, రుణ రాయితీల్లో కోత, కళ్యాణమస్తు లబ్ధిదారుల సంఖ్యకు కోతపెడుతూ.... 5 ఏళ్లలో వారికి రావాల్సిన ప్రయోజనాలను అన్నింటిని తగ్గించేశాడు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వారిని విస్మరించారు. మరి, గత ప్రభుత్వం దివ్యాంగులకు చేసిన సాయం ఏంటి..? జగన్ ప్రభుత్వం వచ్చాక జరిగిన నష్టమేంటి...? అసలు దివ్యాంగులు ఏమనుకుంటున్నారు...ఇప్పుడు చూద్దాం.దివ్యాంగులకు జగన్ చేసిన సాయం ఏంటి?

04/04/2024

పాదయాత్రలో జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మిన దివ్యాంగులు ఓ సారి అవకాశం ఇచ్చి చూద్దాం అని అనుకున్నారు. దివ్యాంగులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఏదో చేస్తానని చెబుతున్నాడు కదా ఐదేళ్లలో చేయకపోతాడా అని వారంతా భావించారు. కానీ, ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి మేలు చేయడం కాదు కదా వారు ఆర్థికంగా కుదేలు అవ్వడానికి కారణమయ్యాడు. విధి వంచించిన వారి పట్ల కూడా వివక్ష చూపిన వైకాపా ప్రభుత్వం...కనీసం వారికి దివ్యాంగులకు వాహనాలనూ అందించలేకపోయింది. పూట గడవడం కోసం కూలీనాలి చేసుకునే వారికీ కోతలు విధించి..ఉపాధీ కల్పించలేకపోయింది. ఆత్మసైర్యంతో స్వతహాగా రాణించాలనుకునే వారికీ అండగా నిలవలేక పోయింది వైకాపా సర్కార్. ఎన్ని బాధలు ఎదురైనా విద్యలో, క్రీడల్లో రాణించాలనుకునే దివ్యాంగులనూ విస్మరించిన సీఎం జగన్ రెడ్డి వారికీ భరోసా కల్పించలేక పోయాడు. మరెందుకిలా.? గొప్పలు చెప్పుకుంటూ ఐదేళ్లు పాలన సాగించిన ముఖ్యమంత్రికి ఈ దివ్యాంగులు ఏనాడు కనిపించలేదా.? కనిపించినా వీరేం చేస్తారులే అని అనుకున్నాడా ...? … .

04/04/2024

వారంతా దివ్యాంగులు ఒకరి సాయం లేకుండా బయటకు వెళ్లలేరు. వారి పనులు వారు సొంతగా చేసుకోలేరు. అలాంటి వారికి 5ఏళ్లలో సీఎం జగన్ ఏం చేశాడు? పెన్షన్లలో పెంపు లేదు. రుణాల్లో రాయితీ లేదు. పైగా కళ్యాణమస్తు లబ్ధిదారుల సంఖ్యలోనూ కోత. ఇలా చెబుతూ పోతే అదనపు ఆదాయం అందించాల్సిన వారికి చుక్కలు చూపించి జగన్ తన ప్రేమ, అప్యాయతల్లో నిజం ఎంతో చాటుకున్నారు. అంతేనా, ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ అని చెప్పి ఆ ఊసే మరిచారు. మరి, ఏటా దివ్యాంగుల అనర్హుల జాబితా ఎందుకు పెరిగిపోతుంది? దానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలేంటి? మెుత్తంగా ఈ 5ఏళ్లలో వైకాపా ప్రభుత్వం దివ్యాంగులకు చేసిన మోసం ఏంటి? ఇప్పుడు చూద్దాం.

03/04/2024

అధికార దాహంతో ఐదేళ్ల కింద ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చుకుంటూ పోయిన జగన్ రెడ్డి.. తాను సీఎం ఐతే.. పేదలకు ఏ కష్టం ఉండందన్నట్లు ప్రగల్భాలు పలికాడు. ఆ రంగం.. ఈ రంగం అనే తేడా లేకుండా అన్నింటా హామీల వర్షం కురిపించాడు...అధికారంలోకి వచ్చాకా అన్నింటినీ మరిచాడు. అక్కడక్కడా ఏమైనా అమలు చేసినా...వాటికీ అనేక కొర్రీలు పెడుతూ పాలన సాగించాడు జగన్ రెడ్డి. ఇందులో ప్రధానమైంది చేనేతరంగం. తాను సీఎం అయ్యాకా.. చేనేతల బతుకులు మారిపోతాయనేంతలా నమ్మించాడు....అధికారంలోకి వచ్చాకా..వారందరినీ వంచించాడు. నేతన్ననేస్తం మొదలు..వడ్డి లేని రుణాలు, వైఎస్సార్ బీమా, నూలుపోగుపై సబ్సిడీ, ఇళ్లు లేని చేనేతలకు ఇళ్లు, షెడ్డు నిర్మాణం, చేనేత కార్పొరేషన్ సాయం అందిస్తాం అని ఎన్నో చెప్పాడు. వాటన్నింటి నీ నమ్మి ఓట్లేసిన ఆ చేనేత కార్మికులు నేడు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. జగన్ ఏలుబడిలో చేనేత రంగం వృద్ధి చెందడం కాదు..కదా..మరింత కుదేలైంది. మగ్గాల సంఖ్య సగానికి కంటే ఎక్కువే తగ్గిపోయింది. ఒకవేళ జగన్ ఆ హామీలన్నీ అమలు చేస్తే చేనేత రంగం ఎందుకు కుదేలైంది.? చేనేత కార్మికులు ఇతర రంగాలకు ఎందుకు మళ్లుతారు.? ఈ విషయం సీఎం జగన్ రెడ్డి అర్థం కావడం లేదా..?

03/04/2024

ప్రపంచానికి రక్తహీనత సమస్య పెను ప్రమాదంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 174 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు గ్లోబల్ న్యూట్రిషన్ సర్వే గతేడాది నిర్వహిచింన సర్వే తేల్చింది. భారత్ లోనూ ఈ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో దాదాపు 68% మందిని ఎనిమియా పీడిస్తోంది. ఐదేళ్లలోనే దీని బాధితుల సంఖ్య దాదాపు 10% పెరిగింది. పునరుత్పత్తి వయసులో ఉన్న సగానికి పైగా మహిళలూ రక్తహీనత బాధితులుగా మారుతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో జాతీయ సగటుతో పోలిస్తే అధికంగా చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారు. గిరిజన ప్రాంత చిన్నారులు, మహిళల్లో మరింత ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది. ఎనిమియా ముక్త భారత్ అంటూ ప్రభుత్వాలు పథకాలు చేపడుతున్నా ఫలితం మాత్రం శూన్యమే.

03/04/2024

అడుగుకో గొయ్యి.. గజానికో గుంత.. కనుచూపు మేర కంకరతేలిన దారి.. దుమ్ము, ధూళితో కన్పించని రోడ్లు.. ఇదీ కృష్ణజిల్లాలోని రహదారుల దుస్ధితి. అధ్వానంగా మారిన రోడ్లపై ఒక్క కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే చాలు ఒళ్లు హూనమవ్వడం ఖాయం. అంతేనా, వర్షాకాలం వచ్చిందంటే చెరువులను తలపించే రోడ్లతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే. అప్పుడు గుంత ఎక్కుడుందో...దారి ఎక్కడుందో...కనుక్కోవాల్సిన పరిస్థితి. నూతన రోడ్ల సంగతి దేవుడెరుగు కనీసం పాడైపోయిన రోడ్లను మరమ్మత్తులు చేయాల్సిన ప్రభుత్వం...నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంటే ఇక ప్రజల ప్రాణాలకు దిక్కెవరని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. తాము పన్నుల రూపంలో చెల్లించిన కనీస డబ్బులతోనైనా కనీసం 2ఏళ్ల కొసారైనా మరమ్మతులు, కొత్త రోడ్లు వేస్తే బాగుండని అంటున్నారు. మరి, జగన్ 5ఏళ్ల పాలనలో ఉమ్మడి కృష్ణజిల్లా రోడ్ల దుస్థితి ఎలా ఉంది..? ఇప్పుడు చూద్దాం.

03/04/2024

నిగ నిగలాడే యాపిల్ .. బంగారు వర్ణంలో మెరిసిపోయే మామిడి.. అందమైన అరటి...ఈ పండ్లు చూస్తే వెంటనే తినాలనిపిస్తాయి. ఎందుకంటే వాటి రంగు, ఆకారం అంతకు మించి వాటితో లభించే పోషకాలు. మీరు కూడా రోజు తింటారు కదా. కానీ, జరభద్రం.. వాటితో హాని కూడా ఉంటుంది. అంటే మేం చెప్పింది పండ్లు తిట్టే కాదు. వాటిని త్వరగా అమ్మాలి, మంచి రంగు రావాలి అని విషపూరిత, నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా పక్వానికి వచ్చేలా చేస్తారు. వీటితోనే మహా డేంజర్ . మార్కెట్లో దొరికే చాలా రకాల పండ్లు...ఇలాంటివే కావడం భయాందోళన కలిగిస్తుంది. వీటితో అనారోగ్య సమస్యల పాలు కూడా చేస్తోంది. అసలే వేసవి బయట ఎండకు కాస్తా ఉపశమనం పొందే విషయంలో ప్రజలు పండ్లను ఎంచుకుంటారు. అయితే కొనుగోలు చేసే ముందు తస్మాత్ జాగ్రత్త అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి, పండ్లను పక్వానికి వచ్చేలా చేసే ఆ రసాయనాలేంటి...? ఏయే పండ్ల కోసం వీటిని వినియోగిస్తారు...? ఇవి తింటే జరిగే నష్టమేంటి..? ఇప్పుడు చూద్దాం..

02/04/2024

సంక్షేమ పథకాల గురించి గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్... ఈ ఐదేళ్ల కాలంలో సాగునీటి పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రైతులకు మేలు జరిగే ఒక్క ప్రాజెక్టుకూ నిధులు కేటాయించలేదు. కనీసం తన సొంత జిల్లాకు నీటిని ఇచ్చే జలాశయాన్ని సైతం గాలికి వదిలేశారు. కేవలం 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉంటే... రెండు జిల్లాలకు ఎంతో మేలు జరిగేది. అలాంటిది ఎంతో ప్రాధాన్యత ఉన్న అలగనూరు ప్రాజెక్టును పట్టించుకున్న వారేలేరు. ఫలితంగా ఉమ్మడి కడప, కర్నూల్ జిల్లాలోని రైతులు తాగు, సాగునీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అసలే ఎండకాలం మరోవైపు కరవు...వెరసి అన్నదాతలు ఉక్కిరిబిక్కరి అయ్యే పరిస్థితి నెలకొంది. మరి, అలగనూరు జలాశాయానికి ఈ దుస్థితి ఎందుకు.....? పాలకుల వైఖరే కారణమా...? ప్రజలేమంటున్నారు...ఇప్పుడు చూద్దాం..

02/04/2024

బియ్యం..దేశంలో నిత్యం ఎక్కువ మంది తీసుకునే ఆహారపదార్థాలో ప్రధానమైనది. అలాగే బియ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పండించే వారిలో భారత్ రెండు స్థానంలో ఉంది. అయినా పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు చుక్కలు చూస్తున్నారు. మెున్నటి వరకు కూరగాయల రేట్లతో అల్లాడిన జనం..ఇప్పుడు బియ్యం ధరల పెరుగుదలతో సతమతం అవుతున్నా రు. మునుపెన్నడూ లేనివిధంగా బియ్యం రేట్లు పెరిగాయి. మరి, ఈ రేట్లు నిజంగానే కొరత ఉండి పెరిగాయా..? లేక వ్యాపారులు దాళారులుగా మారి సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెరుతున్నారా..? కేంద్రం ధరల నియంత్రణకి కట్టడి చేసిన ఎందుకీ పరిస్థితి..? అసలేంటి ఈ ధరల పెరుగుదలకు కారణం.? ఈ కథనంలో చూద్దాం.

02/04/2024

ప్రజా రవాణా సంస్థ...ప్రగతి రథ చక్రాలకు జగన్ మోహన్ రెడ్డి కళ్లెం వేశారు. 5 ఏళ్ల పాలనలో RTCని ఎంత నిర్వీర్యం చేయాలో అంతా చేశారు. ప్రభుత్వంలో విలీనం చేయడం దగ్గర్నుంచి... కొత్త బస్సులు, ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు...ఇలా సమస్య అనేదే లేకుండా చేస్తానని ప్రతిపక్షంలో ఉండగా జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి...నేనేంటో నిరూపిస్తా అని చెప్పారు. కానీ, పూర్తిగా నట్టేట ముంచారు. విలీనం పేరిట ఆర్టీసీ బస్సుల కొనుగోలు ఆపేశారు. ప్రైవేటు పరంను వేగవంతం చేశారు. వైకాపా నేతలకు ఆర్టీసీకి చెందిన వేల కోట్ల ఆస్తులు లీజుకు అప్పగించారు. కొత్త బస్సుల కోసం ఎదురు చూసిన ప్రయాణికులకు డొక్కు బస్సులే గతయ్యాయి. ఆ బస్సుల చక్రాలు ఊడటం, ప్రమాదాల బారిన పడుతుండటం.... ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోడం... ఇలా ఈ 5 ఏళ్లలో RTC కి ఎంతచేయాలో... అంతా చేశారు...జగన్ మోహన్ రెడ్డి. మరి ఆ చిట్టా ఏంటో మీరూ చూడండి..

02/04/2024

ఈ నెలలో మా అక్క కూతురు పెళ్లి ఉంది వదిన...15తులాల బంగారం పెట్టేందుకు ఒప్పుకు న్నారు. అవునా...వదినా.... మా అన్న కూతురు వివాహానికి కూడా 10 తులాల పసిడి పెట్టాలని నిర్ణయించారు. నేను కూడా కానుకగా ఎంతో కొంత బంగారం పెట్టాలని అనుకుంటున్నాను. అవును అక్కా... మీ కూతురు పెళ్లికి బంగారం కొన్నప్పుడు ఎంత ధర ఉంది. హా....అప్పుడు 50 వేలు రూపాయలు ఉండేది. కానీ, నిన్నటి ధర ప్రకారం తులం బంగారం 70వేలు రూపాయలు దాటిందంటా. ఏంటి అంత ధరనా...అంత రేటు ఉంటే అసలు బంగారం కొనగలమా అక్క. అవున వును ఇప్పుడున్న ధరలతో కొనడటం కంటే ఊరుకుందే నయం. కొన్నా ఏ ఒక్క గ్రామో...రెండు గ్రాములతో సరిపెట్టుకోవాలి. ఇదీ ఓ ముగ్గురు మహిళలు బంగారంపై చర్చిస్తున్న తీరు. కానీ, భవిష్యత్ లో ఇలాంటి చర్చలు బహుషా ఉండవేమో. కారణం పట్టపగ్గాలు లేకుండా పెరుగుతోన్న బంగారం ధరలు. సోమవారం ఆల్ టైం రికార్డుగా నమోదైన బంగారం ధర..70వేల 300 రూపాయ లకు చేరింది. దీంతో కొనుగోళ్లు కూడా తగ్గాయి. ఇదిలా ఉంటే పెళ్లిళ్ల సీజన్ లో పెరిగిన బంగారం ధరలు..సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరెందుకిలా.? ధరలు పెరుగుదలకు కారణం ఏంటి.? రాబోయే కాలంలో ఈ ధరలు ఇంకా పెరుగుతాయా.?లేక ధరలు తగ్గే అవకాశం ఉందా..?

01/04/2024

ప్రకృతి వైపర్యీతాలు...అన్నదాతలతో దోబూచులాడుతుంటాయి. దీంతో విత్తనం మొదలుకు ని పంట చేతికందే వరకు భరోసా ఉండదు. ఆరుగాలం అనేక కష్టనష్టాలకు ఓర్చి.. రెక్కలు ముక్కలు చేసుకునే రైతన్నకు దక్కే ఫలితం నామమాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా పథకం ఒకటి. 2016లో దీన్ని ప్రవేశ పెట్టగా అప్పటి భారాస ప్రభుత్వం 2020 వరకు రైతులను భాగస్వాములను చేసింది. తర్వాత విరమించుకుంది. కాగా తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వానాకాలం నుంచి ఈ పథకంలో చేరేందుకు అంగీకరించింది. దీంతో తెలంగాణ రైతాంగం హర్షిస్తుంది.ఈ నేపథ్యంలో అసలేంటి ఈ పథకం.?ఎలా దరఖాస్తు చేస్తుకోవాలి ..? ఫసల్ భీమా పథకం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలేంటి.?.

01/04/2024

మెగా DSC...జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన మరో అంశం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23వేల ఖాళీలను భర్తీ చేస్తామని...నిరుద్యోగ యువతను మోసం చేయడానికి సానుభూతి మంత్రం జపించిన జగన్ . అధికారంలోకి రాగానే దగా చేశారు. కనీసం ఆశించిన స్థాయిలో కూడా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయకుండా తీవ్ర నిరాశ పరిచారు. ప్రభుత్వం మెగా DSCని విడుదల చేస్తుందన్న ఆశతో ఏళ్ల తరబడి కోచింగ్ లు తీసుకుంటున్న...అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరి, ఇలా ఎందుకు చేశారు..? ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కూడా ఎందుకు ఇప్పుడు విడుదల చేశారు..? అని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది..?

01/04/2024

గ్రూప్స్ , డీఎస్సీ..ఇవే కాదు రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ పరిస్థితి కూడా ఇంతే. ఏళ్లు గడుస్తున్న ఒక చిన్న నోటిఫికేషన్ ను కూడా జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. అంతేనా, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్ చెప్పే మాటలు....కోటలు దాటాయి. కానీ, శిక్షణే అటకెక్కింది. పోనీ శిక్షణ ఇచ్చినా...ఉద్యోగాలు లేవు...కంపెనీలు రావు. ఇది రాష్ట్రంలో నెలకొన్న దుస్థితి. వైకాపా నేతల ఆగడాలను తట్టుకోలేక కొన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి పారిపోగా కొత్త కంపెనీలు అసలు ముందుకే రాలేదు. మన నిరుద్యోగులు, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి యువతకు తప్పడం లేదు. మరి, ఎన్నాళ్లు ఇలా...? నైపుణ్యాభివృద్ధి ఏమైంది...? నిరుద్యోగ యువతకు ఇంటర్న్ షిప్ లు ఏమయ్యాయి...? అసలు ఈ 5ఏళ్లలో ఏం చేశారు..?

01/04/2024

రాష్ట్రంలో, దేశంలో విద్యుత్ డిమాండ్ అంతాఇంతా కాదు. పరిస్థితులకు అనుగుణంగా..ఎప్పటి అవసరాలను అప్పుడు తీర్చేలా..సాగే విద్యుత్ సరఫరా నిత్యం సవాళ్లతో కూడుకున్నదే. ప్రజావస రాలను తీర్చడంలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన విద్యుదుత్పత్తికి ఎప్పటికప్పుడు నూతన మార్గాలు అన్వేషించాల్సిందే. ఈ క్రమంలో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. సౌర, జల విద్యుత్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సర్కారు..ఆ దిశగా చర్యలు తీసుకు నేందుకు నూతన విద్యుత్ విధానం తీసుకురావాలని యోచిస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణ విద్యు త్ అవసరాలను తీర్చేలా N.T.P.C నిర్మించదలచిన 2వేల 4వందల మెగావాట్ల ప్లాంట్ నుంచి కరెంటు కొనుగోలుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. థర్మల్ విద్యుత్ తో అధిక భారం పడుతుందని భావించిన సర్కారు..ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చేలా మరో మార్గాన్ని అన్వేషిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర విభజన ప్రకారం N.T.P.C నిర్మించాలనుకున్న ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయకపోతే భవిష్యత్ లో సమస్య లు తలెత్తే అవకాశం ఉందా.? నూతన విద్యుత్ విధానంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుం టుంది.? సర్కారు భావిస్తున్నట్లు సంప్రదాయేతర ఇంధన వనరులు భవిష్యత్ అవసరాలను తీర్చగలవా..

01/04/2024

నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్

31/03/2024

విద్యుత్ ...నేటి సమాజంలో అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటి. ఇది లేకుండా ఒక రోజు ఉండగలమా..? అంటే కష్టమేనని చెప్పుకోవాలి. కాలంతో సంబంధం లేకుండా ఎండలు మండిపోతున్నాయి. అందువల్ల కూలర్ లు, ఏసీలు, ఫ్యాన్ లు నిరంతరం తిరగాల్సిందే. వంటింట్లోనూ విద్యుత్తు తప్పని సరైంది. దాంతో విద్యుత్తు వినియోగం గత పదేళ్లలో రెట్టింపైంది. ఇలాంటి పరిస్థితిల్లో ప్రతి నెలా వచ్చే విద్యుత్ బిల్లు చూస్తే....ఎవ్వరికైనా సరే షాక్ కొట్టాల్సిందే. కానీ, ఆ గ్రామంలో మాత్రం అలాంటి సమస్యే లేదు. ప్రతి నెలా ఉచితంగా విద్యుత్ వినియోగించుకుంటూ …. మిగిలిన విద్యుత్తును అమ్ముకుంటు ఆదాయం సంపాదించుకుంటున్నారు. అలాగే భవిష్యత్తు విద్యుత్ సమస్యకు పరిష్కారాన్ని చూపుతున్నారు. మరి, ఆ గ్రామం ఎక్కడుంది..? దానికి ఎందుకంత ప్రత్యేకత...ఇప్పుడు చూద్దాం.

31/03/2024

రాష్ట్రంలో తీరప్రాంతం ఎక్కువగా ఉండటంతో దాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని సంపద సృష్టిస్తారు ఏ సీఎం ఐనా. గత ముఖ్యమంత్రులు కూడా పోర్టుల ద్వారా ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు చేశారు. కానీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆదాయాన్ని పెంచడం కాదు కదా ఆదాయాన్ని తగ్గిస్తూ పోర్టుల పరిస్థితే ప్రశ్నార్థకం చేశాడు. అందులో ప్రధానమైంది కృష్ణపట్నం పోర్టు. ఒకప్పుడు ఎగుమతులు, దిగుమతులతో ఓ వెలుగు వెలిగిన కృష్ణపట్నం పోర్టు సీఎం జగన్ రెడ్డి పాలనలో కనుమరగయ్యే స్థితికి చేరింది. 2014-2019 కి ముందు ఏటా 6 లక్ష మిలియన్ టన్నుల సరుకు రవాణా నేడు లక్ష టన్నులకు అంతకంటే తక్కువకే పరిమితమైంది. దీంతో పోర్టుపై ఆధారపడి జీవించే వేల కుటుంబాల మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. దీనికితోడు పోర్టు వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని..బతుకులు బాగుపడతాయని భావించి భూములు ఇచ్చిన వారు సైతం వైకాపా ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కంటైనర్ పోర్టుగా ఉండే కృష్ణపట్నం పోర్టును డర్టీ పోర్టుగా మార్చాడమే దీనికంతటకీ కారణమని విపక్షాలు గళమెత్తుతున్నాయి. ఐనా దీనిపై సీఎం జగన్ రెడ్డి నోరు మెదపడం లేదు. మరెందుకిలా.? పరిశ్రమలు తీసుకురాలేని సీఎంకు.. ఉన్న వాటిని కాపాడుకోవడం తెలియదా.? లేక కావాలనే కృష్ణపట్నం పోర్టును కనుమరుగు చేస్తున్నారా..? అని ఉద్యోగులు, నిర్వాసితులు, విపక్ష పార్టీల నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు .

31/03/2024

వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు.. పెట్టిన పెట్టుబడులు చేతికందక, చేసిన అప్పులు తీర్చలేక...సాగు భారమని పొలం బాట వదిలి...పట్టణాలకు పయనమవుతుంటారు. ఇలాంటి వారిని మనం చూస్తూనే ఉంటాం. దీనికి కారణం...ఒకే పంటను సాగు చేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని....అవగాహన లోపంతో ఒకే రకమైన పంటలు, పండ్లతోటలను సాగు చేస్తున్నారు. దీని వల్ల ఒక ఏడాది పెట్టుబడులు వస్తే మరో ఏడాది నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. కానీ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు ఇందుకు భిన్నం. వాతావరణమార్పులు, మార్కెట్ పరిస్థితులపై అవగాహన పెంచుకోని...అంతర పంటలపై మళ్లారు. అలా పలు రకాల పంటలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. సుమారుగా 40 రకాల అంతర పంటలు పండిస్తూ అధిక దిగుబడులు పొందుతున్నారు. మరి, ఇది ఏలా సాధ్యమవుతుంది...? ఇక్కడి రైతులు ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు....ఇప్పుడు చూద్దాం....

31/03/2024

రాష్ట్రం దేవుడెరుగు సొంత జిల్లాకు ఏం చేశారు..?

29/03/2024

ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను ఇంటి పన్నుఖాళీ స్థలాలపై పన్నుఇవన్నీ వైకాపా సర్కార్ కు ఆదాయం తెచ్చిపెట్టిన అంగడి సరకులు. 5 ఏళ్ల పాలనలో అద్భుతాలు సృష్టించాం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాం అని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కార్ ఖర్చు వెనుకున్న మహిమ ఇది. ఎక్కడ పొగుట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలన్న నానుడి గుర్తుంది కదా అందుకే ప్రజలకు ఇలా ఇచ్చిన సంక్షేమ పథకాల సాయాన్ని అలా లాక్కోవడాని కి పన్నులను మించి మరొకటి కన్పించలేదు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రజలపై మూడేళ్ల వ్యవధిలోనే సుమారు 328కోట్ల రూపాయల భారం మోపి తిరుగులేని రికార్డ్ సృష్టించింది జగన్ ప్రభుత్వం. ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా తర్వాత ఓట్లు వేసిన ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ప్రజలు ఈ పన్ను పోటు మాకొద్దు మహాప్రభో అంటూ వైకాపాను ఇంటికి సాగనంపడానికి సిద్ధమయ్యారు...? మరి, విజయవాడ ప్రజల ఆగ్రహానికి గురైన ఆ పన్నుపోటులేంటో...ఇప్పుడు చూద్దాం.

29/03/2024

ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. దానికి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే తేడాలేవి ఉండవు. కానీ, వైకాపా పాలనలో ఇలాంటి పప్పులేమి ఉడకవు. గత ప్రభుత్వం చేసిందా అయితే, మేం ఆపేస్తాం. ఇది జగన్ సర్కార్ పాలనలో అభివృద్ధికి పట్టిన గ్రహణం. ముఖ్యంగా విజయనగరం వ్యాప్తంగా గత ప్రభుత్వం అనేక సమస్యలపై ప్రణాళికలు రచించి నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చి వాటిని తుంగలో తొక్కింది. కనీసం ఇవి ప్రజలకు అవసరం కదా అన్న ఆలోచన కూడా లేకుండా ఆపేసింది. పైగా వీటి వల్ల నష్టమే కానీ లాభం లేదని చెప్పింది. ఈ ఐదేళ్లలో కనీసం అడుగు కూడా ముందుకు పడలేదు. సగం పూర్తయిన పనులు ఎక్కడెసిన గొంగడి అక్కడే చందంగా ఉన్నాయి. ఇలా ఏమని ఎన్నని చెప్పను అన్నట్లు ఉంది వైకాపా పాలన. మరి, విజయనగరం జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వం మెుదలు పెట్టిన ఆ పనులేంటి..? వాటి ప్రస్తుత పరిస్థితేంటి..? ఇప్పుడు చూద్దాం.

29/03/2024

ఆరుగాలం శ్రమించి...దుక్కి దున్ని...నారు పోసి...నీరు పెట్టి...కోత కోసి...కుప్పలూడ్చి...వరి ధాన్యం అమ్మకానికి ఎదురుచూసే రైతన్నకు...ఎప్పటిలాగే ప్రభుత్వం ధాన్యం కోనుగోళ్లకు పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ జిల్లాల వారీగా కొనుగోలు లక్ష్యాలు నిర్దేశించింది. యాసంగి సీజన్ లో 75.40లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని...పౌరసరఫరా ల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఇప్పటికే నిజామాబాద్ , నల్గొండ జిల్లాల్లో కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభం కాగా...మరో 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. రైతన్నలకు ఇది...సానుకూల అంశమే ఐనా...ధాన్యం కోనుగోళ్లు సజావుగా సాగుతాయా అనేదే అసలైన ప్రశ్న. తేమశాతం ఆధారంగా ధాన్యం కోనుగోళ్లు చేసే అధికారులు...రైతులను ఇబ్బందులు పెట్టిన సందర్భాలు అనేకం. అలాంటి పరిస్థితులు ఇప్పుడూ తలెత్తే అవకాశం ఉందా..? దీనికితోడు ధాన్యానికి మద్దతుధర లభిస్తుందా అనేదీ...అర్థం కాని పరిస్థితి. మద్దతు ధర లభించినా సమయానికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావనే ఆరోపణ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉంటాయనే దానిపై...రైతుల్లో ఆసక్తి నెలకొంది.

29/03/2024

దుక్కి దున్ని.. విత్తు నాటుతారు. నీరు పెట్టి ఎదురుచూస్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. మొలకరాదు, వచ్చినా.. బలం ఉండదు. చీడపీడలను తట్టుకోలేదు. దీనంతటికీ కారణం...నకిలీ విత్తనాలు.అధిగ దిగుబడి వస్తుందంటూ నమ్మబలికి వ్యాపారులు...నకిలీ విత్తనాలను అంటగట్టి రైతులను నిలువునా ముంచుతున్నారు. పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం వృథా అయ్యేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ విత్తన వ్యాపారుల ఆగడాలకు కళ్లెం వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం...విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పుల దిశగా సంకేతాలు ఇచ్చింది. మరి...నకిలీ విత్తన వ్యాపారులు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏమిటి... లైసెన్సింగ్ విధానంలో మార్పు సత్ఫలితాలు ఇస్తుందా..

Address

Hyderabad

Telephone

+918415246555

Alerts

Be the first to know and let us send you an email when Idi Sangathi - ఇదీ సంగతి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Idi Sangathi - ఇదీ సంగతి:

Videos

Share


Other Media/News Companies in Hyderabad

Show All