Sree Sree Kankalamma Keteshwara swamy temple

Sree Sree  Kankalamma Keteshwara swamy temple Yoga with Sridhar

Temple  ఆవరణ లో  shuttle ఆట రోజు  ఉదయం  సాయంత్రం  టెంపుల్  అభివృద్ధి  కమిటీ  ఆధ్వర్యంలో  ఆడుతున్నారు
18/10/2021

Temple ఆవరణ లో shuttle ఆట రోజు ఉదయం సాయంత్రం టెంపుల్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆడుతున్నారు

07/09/2021
30/01/2021

_*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_

_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._

_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._

_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._

_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._

_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._

_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._

_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._

_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._

_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._

_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_.

30/01/2021

కరీంనగర్ : నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. గురువారం నగరంలోని యూనివర్సిటీ నుంచి చింతకుంట చౌరస్తా వరకు చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రేకుర్తిలో లక్ష్మీనృసింహస్వామి దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఆరేళ్లుగా గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం అష్యూరెన్స్‌ పథకం కింద రూ.350 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయన్నారు. జ్యోతినగర్‌ నుంచి ఈనాడు సిటీ చౌరస్తా వరకు స్మార్ట్‌ సిటీ రోడ్డు పనులు జరుగుతున్నాయని, చౌరస్తా నుంచి చింతకుంట చౌరస్తా వరకు రోడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రేకుర్తిలో మూడువేల సంవత్సరాల చరిత్ర కలిగిన లక్ష్మీనృసింహస్వామి దేవాలయం గుట్టకు రూ.3.50 కోట్లతో ఘాట్‌రోడ్డు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రి దేవాలయం తరహాలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

25/12/2020

*వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించవలసిన విధులు*



శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివెళ్లే సందర్భం- వైకుంఠ ఏకాదశి.

భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున ఆస్తికులు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు ఈ విధంగా చెబుతున్నారు.

వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని తోరణాలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, హరికి ప్రీతిపాత్రమైన తులసీదళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి.

ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలగడంతో... తమలాగానే వైకుంఠద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునేవారికి మోక్షం కలగాలని వారు కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి.. ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుని వేడుకోవడం ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది.

ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందంటారు. మనలో ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు... ఇలా మొత్తం కలిపి ఏకాదశ ఇంద్రియాలు ఉంటాయి.

ఈ ఏకాదశ ఇంద్రియాలనూ ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం.
ఇందుకోసం ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన పిదప భుజించాలి.

ఏకాదశి రోజు రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్నీ అదుపు చేసుకుని... వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం. అందుకనే లౌకికమైన ఆలోచనలు వేటికీ తావివ్వకుండా కేవలం హరినామస్మరణ మీదే మనసుని లగ్నం చేయాలని చెబుతారు.
ఇలా నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసినవారికి ఇహపర శాంతి లభిస్తుంది.

*హరినామ స్మరణం...*
*సమస్త పాప హరణం ....*

🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸

24/12/2020

*🙏జై శ్రీమన్నారాయణ🙏*
*24-12-2020, గురువారం*
శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత రుతువు; మార్గశిర మాసం;శుక్ల పక్షం దశమి: రా.11.34 తదుపరి ఏకాదశి అశ్విని: పూర్తి వర్జ్యం: తె.3.55 నుంచి 5.41 వరకు అమృత ఘడియలు: రా.12.23 నుంచి 2.09 వరకు దుర్ముహూర్తం: ఉ.10.10 నుంచి 10.53 వరకు తిరిగి మ.2.32 నుంచి 3.16 వరకు రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు సూర్యోదయం: ఉ.6-31 సూర్యాస్తమయం: సా.5-28

*ఈరోజు 09 వ పాశురము*

తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మాదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్

ఆండాళ్ తల్లి ఈరోజు నాలుగో గోపబాలికను లేపుతుంది. "తూ" పరిశుద్దమైన "మణి" మణులతో చేసిన "మాడత్తు" మేడ, "చ్చుత్తుం విళక్కెరియ" చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక, దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్ర్తాలు కావాలి. శాస్ర్తాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆరెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం, ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాణాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అణుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. ఈ గోపబాలిక వెలుతురుకోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటిచుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటిచుట్టూ దీపాలు వెలిగించింది. "దూపం కమళ" దూపం పరిమళిస్తుంది. "త్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్" నిద్రపుచ్చే అందమైన ఒక పడక పై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా. "మామాన్ మగళే!" ఓ మామగారి కూతురా! "మణి క్కదవం తాళ్ తిఱవాయ్" మణులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా. సంస్కృతంలో వివిద అంకెలకు గుర్తుగా, తొమ్మిది మణులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆధిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకూ భగవంతునికి ఉండే తొమ్మిదిరకాల సంబంధాలు తెలుసుకోవాలి.

లోకంలో మనం ఎదో ఒక సంబంధం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంబంధాలు కల్గి, శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! "పితా రక్షకః శేషి భర్తా జ్ఞేయ స్వామి ఆధారః ఆత్మా భోక్తా" అష్టాక్షరీ మహా మంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నో సార్లు ఈ విషయం చెప్పాడు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆగోపిక వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ దూప పరిమలాల వంటిది.
అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా వాల్ల స్థానాన్ని తలచుకున్నా మనం తరించిపోతాం....

ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాళ్ తల్లి.'

14/12/2020

🍁 కార్తీక పురాణం - 28వ అధ్యాయము 🍁

*విష్ణు సుదర్శన చక్ర మహిమ*

జనక మహారాజా ! వింటివా దుర్వాసుని అవస్ధలు ! తాను ఎంతటి కోపవంతుడైనను , వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున , ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి *"అంబరీషా , ధర్మపాలకా ! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము , నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి , కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్దించితిని . ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"* మని అనేక విధాల ప్రార్ధించగా , అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి , *"ఓ సుదర్శన చక్రమా ! నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో , తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన , ఈతనిని చంపవలదు , ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని , ముందు నన్నుచంపి , తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి , నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు , దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా ! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు , నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.*

*నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును , శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము"* అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి *"ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా ! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు , మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు ఏకమైకూడ - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ! ఈ లోకములో దుష్టశిక్షణ , శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే , ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి , నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి , ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.*

*ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని , శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను , కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.*

*ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి , శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు"* మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి , *" నేను దేవ గో , బ్రాహ్మణాదులయుందును , స్త్రీలయందును , గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా అభిలాష. కాన , శరణుగోరిన ఈ దుర్వాసుని , నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు , కోట్ల కొలది సూర్య మండలములు ఏక మైననూ నీ శక్తీకి , తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై , లోకకంటకులపై , దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి , వారిని శిక్షించి , తన కుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన , నికివే నామనఃపూర్వక నమస్కృతులు"* అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి *"అంబరీషా ! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు ఎవరు పఠింతురో , ఎవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో , ఎవరు పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబట్టక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి , ఇహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన , నిన్నూ , దుర్వాసుని రక్షించుచున్నాను , నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు."* అని చెప్పి అతన్నీ ఆశీర్వదించి , అదృశ్యమయ్యెను.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.*

ఓం నమః శివాయ 🙏

09/12/2020

* ధర్మమువలన సుఖం, అధర్మమువలన దుఃఖము. మంచి పనులు చేసేవాళ్ళకి భగవంతుడు ఉత్సాహము, సంతోషము, తృప్తి ఇస్తాడు. చెడ్డ పనులు చేసేవాళ్ళకి లజ్జ, భయము కల్పిస్తాడు.

09/12/2020

శివయ్యా...

అణువు నుంచీ
అనంతం వరకూ నిండి ఉన్నది నీవే

ఎనుబది నాలుగు లక్షల
జీవరాసులందు
చైతన్యము నీవే

ప్రాణికోటి సృష్టి స్థితి లయ
కారకూడవు
నీవే

నా అంతరమున
బాహ్యమునా
సకల జీవులలో
నిలిచి ఉన్నది నీవే

మొదట ఊపిరి పోసేది
నడుమ ఊపిరి నిలిపేది
చివరి ఊపిరి తీసేదీ నీవే

నిన్ను ఎరిగిన జీవుడు ముక్తుడు
నిన్ను నమ్మిన జీవుడు ధన్యుడు
నిన్ను కొలిచిన జీవుడు కింకరుడు

నా పలుకులందు నీ నామము నిండనీ
నా తలపులందు నీ గుణములు మిగలనీ
నా హృదయ సింహాసనమున నీవు
స్థిరముగా కొలువై ఉండు మహదేవా

*పరమేశ్వరా శరణు..శరణు...✍️✍️✍️*

*🕉️🕉️ఓం నమః శివాయ.. ఓం నమః శివాయ...🕉️🕉️*

Blessed day with Kestheswara Swamy and Hanuman..
08/12/2020

Blessed day with Kestheswara Swamy and Hanuman..

08/12/2020

*08-12-2020, మంగళవారం*
శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం; శరదృతువు; కార్తిక మాసం;బహుళ పక్షం; అష్టమి: మ.1-33 తదుపరి నవమి; పుబ్బ: ఉ.11-00 తదుపరి ఉత్తర; వర్జ్యం: సా.5-50 నుంచి 7-21 వరకు; అమృత ఘడియలు: ఉ.6-22 వరకు తిరిగి తె.2-59 నుంచి 4-07 వరకు; దుర్ముహూర్తం: ఉ.8-34 నుంచి 9-18 వరకు తిరిగి రా.10-34 నుంచి 11-26 వరకు; రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.6-22 సూర్యాస్తమయం: సా.5-22
*”ధర్మం”* అంటే ఏమిటి?
🌹🙏🌹
*• ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం:
* వివాహ ధర్మం!*

*• తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం:
*భార్య ధర్మం!*

*• నమ్మిన మిత్రునికి అపకారం
చేయకుండటం :
*మిత్ర ధర్మం!*

*• సోమరితనం లేకుండటం:
* పురుష ధర్మం!*

*• విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం:
*గురుధర్మం!*

*• భయభక్తులతో విద్యను నేర్చుకోవటం:
*శిష్యధర్మం!*

*• న్యాయమార్గంగా సంపాదించి
సంసారాన్ని పోషించటం:
*యజమాని ధర్మం!*

*• భర్త సంపాదనను సక్రమంగా పెట్టి
గృహాన్నీ నడపటం:
*ఇల్లాలి ధర్మం!*

*• సైనికుడుగా వుండి దేశాన్ని,ప్రజలను
కాపాడటం:
* సైనిక ధర్మం!*

*• వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి
పోషించటం:
*బిడ్డల ధర్మం!*

*• తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని
చేయటం :
*తండ్రి ధర్మం!*

*• తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరు
ప్రతిష్ఠలు తేవటం:
* బిడ్డలందరి ధర్మం!*

*• తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని
గౌరవించటం :
*ప్రతివాని ధర్మం!*

*• తాను సంపాదించినదాన్ని తనవారితో
పంచుకొని తినటం :
*సంసార ధర్మం!*

*• అసహాయులను కాపాడటం:
*మానవతా ధర్మం!*

• చెప్పిన మాటను నిలుపుకోవటం :
*సత్య ధర్మం*
🌹🙏🌹

08/12/2020

అలానే
నా శిరమున నీ చేతిని ఉంచు

అలానే
నీ పదముల నన్ను కట్టి ఉంచు

అలానే
నీ సన్నిధిన జీవుని పట్టి ఉంచు

నాకు ఎరుకనే
అదే భాగ్యములందు మహా భాగ్యమని
భోగాములన్నీటిన మహాభోగమని
వరములందు మహా గొప్ప వరమని
జీవునకు అత్యున్నత స్థానమని

శివయ్య
మాయ నన్ను
ఆవరించి ఇన్ని జన్మలు ఎత్తించినది కానీ
లేకున్న నీ పదసన్నిధి వదిలి
క్షణమైనా ఈ కింకరునికి
అస్థిత్వము ఎందులకు?
ఈ మాయా జగమున
నేను పొందు సంతోషమేది
అనందమేది?

పరమేశ్వరా శరణు..శరణు...✍️✍️✍️

🕉️🕉️ఓం నమః శివాయ.. ఓం నమః శివాయ...🕉️🕉️

05/12/2020

Welcome to this page

Address

Hyderabad
500090

Telephone

+919573349020

Website

Alerts

Be the first to know and let us send you an email when Sree Sree Kankalamma Keteshwara swamy temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Nearby media companies


Other Digital creator in Hyderabad

Show All