01/01/2024
సత్తెనపల్లి పట్టణంలోని శ్రీవిద్య హాస్పటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించిన హాస్పిటల్ యాజమాన్యం..
ఈ మెగా మెడికల్ క్యాంపులో ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించి.. ఎముకలు, కీళ్లు, మెడ వెన్నుముక సమస్యలు, నరముల సమస్య, కీళ్లవాతం, విరిగిన ఎముకలు, స్పోర్ట్స్ ఇంజురీస్, జనరల్ మెడిసిన్ కు సంబంధించి.. బిపి, షుగర్,థైరాయిడ్, నెమ్ము ఉబ్బసం, ఆయాసం, విష జ్వరాలు,గ్యాస్,లివర్ వ్యాధులు, గుండె దడ,కాళ్ళ వాపులు, చర్మ వ్యాధులు మొదలగు సమస్యలకు ఈ మెడికల్ క్యాంపులో రక్త పరీక్షలు,ఎక్సరేలు, ఎముకల సాంద్రత( అరుగుదల) పరీక్షలు మొదలగు పరీక్షలు చేసి ఆయా వ్యాధులకు సంబంధించి ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ మెడికల్ క్యాంపు నందు శ్రీవిద్య హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్" కాట్రాజు చిరంజీవి..M. S.ORTHO (RANGARAYA MEDICAL COLLEGE)CPCR (REHMATALOGY),FLJR ఎముకలు, కీళ్లు, వెన్నుపూస నరముల వైద్య నిపుణులు,డాక్టర్" తడవర్తి నాగ శ్రీవిద్య..DNB FAMILY MEDICINE (FELLO IN Diyabetology), క్రిటికల్ కేర్, షుగరు,బిపి,థైరాయిడ్, మరియు జనరల్ వైద్యునిపుణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్" కాట్రాజు చిరంజీవి మాట్లాడుతూ..
సత్తనపల్లి,పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సత్తనపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురు శ్రీవిద్య హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాలకు సంబంధించి,అవగాహన కొరకు ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు 500 మంది సత్తెనపల్లి,పెదకూరపాడు, ఫిరంగిపురం మండలాలకు చెందిన ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, వారికి మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం. 24 గంటలు హాస్పిటల్లో అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించబడునన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్" శ్రీవిద్య మాట్లాడుతూ..
బీపీ,షుగర్, థైరాయిడ్, క్రిటికల్ కేర్ కేసులు అన్నివేళలా చూడబడునని, ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందన్నారు. 24 గంటలు ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.