02/09/2022
ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను కాబట్టి.. శారీరకంగా దృఢంగా ఉన్నాను. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడటమే నా లక్ష్యం..
హైటెక్ సిటీని కట్టక ముందు కోకాపేటలో ఎకరా రూ.20-50 వేలు ఉండేది. ఇప్పుడు రూ. 60-70 కోట్లు. అదీ సంపద.. దీన్ని ఎవరైనా ఊహించగలిగారా?
అమరావతిలో రైతులే స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. మన అవసరాలకు వినియోగించుకుని రైతులకు తిరిగి ఇచ్చాక కూడా 10 వేల ఎకరాలు మిగిలింది. జగన్ సీఎం కాక ముందు ఎకరా రూ.10 కోట్లు ఉంది. ఈ 10 వేల ఎకరాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సంపద. అంటే రాష్ట్రంలోని ఐదున్నర కోట్ల మంది ప్రజల సంపద ఇది.
అమరావతితో పాటు రాష్ట్రమంతా భూముల రేట్లు పెరిగాయి. కియా మోటార్స్, తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్‌తో పాటు పరిశ్రమ పెట్టిన చోటల్లా చుట్టుపక్కల భూముల విలువలు పెరిగాయి. విశాఖలో నోడ్స్ తర్వాత విలువ పెరిగింది. అభివృద్ధి, రహదారులు ఉంటే భూమికి విలువ వస్తుంది.
సాఫ్ట్‌వేర్ అంటే గతంలో నన్ను ఎగతాళి చేశారు. అప్పుట్లో నవ్విన వాళ్ల పిల్లలు ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు దేశ, విదేశాల్లో పలు పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
మొన్న కుప్పంలో మా పార్టీ వాళ్లపై దాడులు చేసి.. మళ్లీ మా వాళ్లపైనే కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఇప్పుడు వాళ్లలో వాళ్లే కొట్టుకున్నారు. వ్యవస్థలు ఛిద్రమైతే ఎవరికీ రక్షణ ఉండదు.
ఎంటర్‌ప్రెన్యూర్లు, ఇన్వెస్టర్లు AP కంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయని.. ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బాగా చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ బయటి రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించాల్సిన చారిత్రక బాధ్యత మనందరి పైన ఉంది. అమరావతి ఒక్కటే కాదు.. విశాఖ, కర్నూలు, తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళం అన్ని నగరాలనూ అభివృద్ధి చేయాలి.
అంతా బాగున్నప్పుడు డెవలప్‌మెంట్ సునాయసంగా చేయవచ్చు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో మరింత కష్టపడాలి.
-చంద్రబాబు (తొలిసారి ముఖ్యమంత్రి అయి 27 ఏళ్లు అయిన సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలు)
(దురదృష్టం ఏంటంటే.. చాలా మందికి అభివృద్ధి అంటే ఏమిటి? సంపద అంటే ఏమిటి? శాంతి భద్రతలు అంటే ఏమిటి? అన్నది సరిగా అర్థం కావడం లేదు.
ఉద్యోగాలు రావడం లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. జీవితం కష్టమైపోతోంది. రోడ్లు లేవు. ఎప్పుడు ఎవడు రౌడీయిజం చేస్తాడో తెలియడం లేదు. బయటికి వెళ్లిన మహిళలు భద్రంగా ఇంటికి తిరిగిస్తారా అన్న భయంగా ఉందని మాత్రం చాలా మంది చెబుతున్నారు.
ఈ భయానక పరిస్థితులు తొలగాలంటే.. శాంతి భద్రతలు బాగుండాలి, కంపెనీలు, రీసెర్చ్ సంస్థలు, విద్యాసంస్థలు భారీగా రావాలి, రోడ్లతో పాలు మౌలిక సదుపాయాలు కల్పించాలి. అప్పుడే కావాల్సినన్ని ఉద్యోగ, ఉపాధి అవాకాశాలు వస్తాయి. సంపద సృష్టి ఆటోమేటిగ్గా జరుగుతుంది)