Mana TV Official page For ManaTV (USA) Telugu Channel and for promoting on this page, pl email to [email protected] and reach 160,000 + in USA.

02/18/2025

Why Bangladesh is Burning || Special Debate WIth Silveri Srisailam Excutive Editor || MANA TV LIVE

02/16/2025

11th Bhadrachala Ramadasu Jayanthi MANA TV LIVE

02/15/2025

Modi’s Successful Trip to the USA: Indian Diaspora’s Expectations and Perspectives || MANA TV Live

భారత్కు ఎఫ్-35 ఫైటర్ జెట్స్: ట్రంప్భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్తో స...
02/14/2025

భారత్కు ఎఫ్-35 ఫైటర్ జెట్స్: ట్రంప్

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్తో సంబంధాలపై ట్రంప్ సానుకూలంగా స్పందించారు. రానున్న రోజుల్లో ఇండియాతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని ప్రకటించారు. అలాగే భారత్ కు ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ని విక్రయించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహావుర్ రాణాని ఇండియాకు పంపుతామని ట్రంప్ ప్రకటించారు.

పవన్ సనాతన ధర్మ టూర్ 12వ తేదీ నుంచి !జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ పర్యటనకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఈ...
02/11/2025

పవన్ సనాతన ధర్మ టూర్ 12వ తేదీ నుంచి !

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ పర్యటనకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. 4 రోజులు పాటు వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. మొదటగా కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్యజీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకుంటారు.

పవన్ పర్యటన తమిళనాడులోనే ఎక్కువగా జరగనుంది. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఈ విషయంలో తమిళనాడులోనూ రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ తమిళనాడులో ఆలయాల సందర్శనకు వెళ్తున్నారు. ఖచ్చితంగా అక్కడి రాజకీయాల్లో పవన్ పర్యటన రాజకీయంగా ఓ టాపిక్ అవుతుంది. తమిళంలో అనర్గళంగా మాట్లాడగలిగే పవన్ కల్యాణ్ ఎం మాట్లాడినా అది ఖచ్చితంగా రాజకీయం అవుతుంది. అందుకే పవన్ పర్యటన రాజకీయంగానూ పెను సంచలనం అయ్యే చాన్స్ ఉంది.

తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతుంది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు పూర్తి వ్యతిరేకత దశలో ఉండే పార్టీ బీజేపీ మాత్రమే. అయితే ఆ పార్టీ తన భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతోంది . దానికి అనేక కారణాలు ఉన్నాయి. పవన్ పర్యటనతో జరిగే చర్చలతో కొంత అయినా మార్పు వస్తే.. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మిగతా సంగతి చూసుకుంటారని బీజేపీ పెద్దలు భావించే అవకాశం ఉంది.

02/09/2025

కబ్జా ముగుస్తుందా? || Specail Interview WIth Former CBI Director Sri.Mannem Nageshwar Rao || MANA TV

02/07/2025

Modi and Trump: A Historic Meet || Mana Tv LIVE

మధ్యప్రదేశ్‌లోని శివపురి సమీపంలో భారత వైమానిక దళం మిరాజ్ 2000 ప్రమాదం పైలట్ సురక్షితంగా బయట పడ్డారు.
02/06/2025

మధ్యప్రదేశ్‌లోని శివపురి సమీపంలో భారత వైమానిక దళం మిరాజ్ 2000 ప్రమాదం
పైలట్ సురక్షితంగా బయట పడ్డారు.

*అది ఇక ముంతాజ్ కాదు.. ట్రైడెంట్ హోటల్ !*తిరుమల శ్రీవారి పాదాల చెంత నిర్మితమవుతున్న ముంతాజ్ హోటల్ వివాదాస్పదమయిది. ఆ పేర...
02/06/2025

*అది ఇక ముంతాజ్ కాదు.. ట్రైడెంట్ హోటల్ !*

తిరుమల శ్రీవారి పాదాల చెంత నిర్మితమవుతున్న ముంతాజ్ హోటల్ వివాదాస్పదమయిది. ఆ పేరు అన్యమతానికి చెందినది కావడంతో ఆ హోటల్ నిర్మాణంపై విమర్శలు వచ్చాయి. జగన్ రెడ్డి హయాంలో ఆ భూమి కేటాయించారు. అక్కడ క్విడ్ ప్రో కో జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇచ్చిన భూమికి తగ్గట్లుగా పెట్టుబడి పెట్టి .. ఉపాధి కల్పించకుండా ఒప్పందం రద్దు చేయాలన్న ఆలోచనకు వచ్చారు. టీటీడీ కూడా కొండ కింద నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ ను ఆపేసి.. ఆ స్థలాన్ని గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుకు అప్పగించాలని కోరింది.

అయితే ఆ హోటల్ దేశంలోనే ప్రసిద్ది చెందిన ట్రైడెంట్ గ్రూపునకు చెందినది. వారు పెట్టిన సబ్సిడరీ కంపెనీ పేరు ముంతాజ్ హోటల్స్. ఆ కంపెనీ పేరు మీద నిర్మిస్తున్నందున ఆ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పేరు తీసేసి.. ట్రైడెంట్ హోటల్స్ అనే పేరుతో హోటల్ నిర్మిస్తున్నారు. ఆ పేరే పెట్టారు. రాయలసీమకు ఆ హోటల్ తొలి సెషన్ స్టార్ హోటల్ అవుతుంది. అత్యంత లగ్జరీ సౌకర్యాలో పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే హోటల్ కావడంతో ప్రభుత్వం.. వారి విజ్ఞుప్తికి సానుకూలంగా స్పందించింది. రూ. 300 కోట్లు పెట్టుబడి పెడతామని.. పూర్తి స్థాయిలో స్థానికులకు ఉద్యోగాలిస్తామని భరోసా ఇచ్చింది.

పెట్టుబడిదారుల నమ్మకాన్ని కోల్పోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. జగన్ హయాంలో వచ్చిన పెట్టుబడులు అయినా.. తీవ్రమైన తప్పిదం ఉంటే తప్ప.. పెట్టుబడిదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలోసెవన్ స్టార్ హోటల్ కు గ్రీన్ సిగ్నల్ పడింది. రెండేళ్లలో హోటల్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్ అహంకారంతో INDIAకు ఓటములు:SPఇండియా కూటమిలో మళ్లీ ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లే ఓటములు ఎదురవుత...
02/06/2025

కాంగ్రెస్ అహంకారంతో INDIAకు ఓటములు:

SP
ఇండియా కూటమిలో మళ్లీ ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లే ఓటములు ఎదురవుతున్నాయని SP స్పష్టంచేసింది. ఢిల్లీలో Exitpolls ఆప్ ఓటమిని అంచనా వేయడంతో రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ అక్కడ బీజేపీ B టీమ్లా పనిచేసిందని SP MP రామ్ గోపాల్ అన్నారు. రాహుల్, ఖర్గే, వాద్రా BJP భాషలో మాట్లాడారని, ఆప్ పతనానికి ప్రయత్నించారని విమర్శించారు. అహంకారం వల్లే HAR, MHలో ఓడిపోయారన్నారు.

BREAKING: ఫిరాయింపుల ఎమ్మెల్యేల కీలక నిర్ణయంTG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారినఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు....
02/06/2025

BREAKING: ఫిరాయింపుల ఎమ్మెల్యేల కీలక నిర్ణయం

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన

ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ అధ్యక్షతన జరిగే సీఎల్పీ సమావేశానికి హాజరుకావొద్దని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇదే విషయమై అసెంబ్లీ సెక్రటరీ ఈ ఎమ్మెల్యేలకు నోటిసులు జారీ చేశారు.

02/06/2025

“PM Modi to Meet Trump” || Special Debate With MANA TV Editor In Chief Silveri Srisailam || MANA TV

✨ Mana TV International & TV5 USA are proud to cover the International Women's Day 2025 Celebrations! ✨Join the grand ce...
02/06/2025

✨ Mana TV International & TV5 USA are proud to cover the International Women's Day 2025 Celebrations! ✨

Join the grand celebration of women’s strength, courage, and achievements in New Jersey!

📅 Date: Friday, March 7, 2025
⏰ Time: 6:00 PM onwards
📍 Venue: Royal Albert Palace, Edison, NJ

🌟 An Evening of Elegance, Inspiration & Entertainment! 🌟
🎭 Cultural Performances & Singing
👗 Fashion Show featuring stunning styles
🎶 DJ Music & Energetic Dances
💬 Inspirational Talks by Influential Women
🛍 Women’s Shopping Mela – Shop, Celebrate & Shine!
🎁 Exciting Games, Surprise Gifts & Raffle Prizes!

🎟 Tickets Selling Fast!
✨ $25 per ticket
✨ Group Offer: 10 tickets for $200! (Valid until Feb 15!)

🔗 Book Now:
📌 Zelle: Scan the QR code on the flyer
📌 PayPal: [https://www.paypal.biz/ushachinta]
📌 Sulekha: [https://events.sulekha.com/international-women-s-day-celebrations_event-in_edison-nj_383641]

📞 For more info, contact:
📲 (732) 692 0362 | (571) 224 6523 | (732) 874 3997

🎥 Mana TV International & TV5 USA will be covering this spectacular event! Stay tuned for exclusive highlights, interviews, and behind-the-scenes moments.

💜 Let’s honor, empower, and uplift women together! 💜

02/04/2025

సాంస్కృతిక సారధి || Special Interview WIth Dr.Thotakura Prasad || Silveri Srisailam, Editor | MANA TV LIVE

*_రాష్ట్రంలో మొదలైన ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..!!_* తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి వాతావరణం మొదలై...
02/03/2025

*_రాష్ట్రంలో మొదలైన ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..!!_*

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి వాతావరణం మొదలైంది. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు, ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది.

ఈ క్రమంలోనే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. నామినేషన్ల స్వీకారానికి ఈ నెల 10 తుది గడువుగా నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారు.

అనంతరం ఈ నెల 11వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 13వ తేదీని నామినేషన్ల ఉపసంహరణ కు అవకాశం ఉంటుంది. ఇదే నెల 27న పోలింగ్ నిర్వహించి, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. తెలంగాణలో మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, అదే స్థానంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి, అలాగే వరంగల్- ఖమ్మం- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పటిష్ట ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను గుర్తించి, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలని చెప్పారు. అంతేగాక నిర్వహణ కోసం పోలింగ్ కోసం రిటర్నింగ్ అధికారులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే ఈ నామినేషన్లను మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలకు కరీంనగర్ కలెక్టరేట్ లో, వరంగల్- ఖమ్మం- నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి నల్గొండ కలెక్టరేట్ లో స్వీకరించాలని తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్నీ ఏర్పాట్లను చేసి సన్నద్ధంగా ఉండాలని అన్నారు. పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేని మారుమూల ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని, ఎన్నికలు విధులు నిర్వహించే సిబ్బందికి సర్టిఫికెట్లు జారీ చేసి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.

02/01/2025

ట్రంప్ టాక్స్ | Interview WIth AGFinTax Ceo Anil Grandhi || Silveri Srisailam Editor In Chief | MANA

02/01/2025




,
.

*కేంద్ర బడ్జెట్ పై మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పందన* 2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ...
02/01/2025

*కేంద్ర బడ్జెట్ పై మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పందన*

2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు.

కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా అని పునర్ సమీక్షించుకోవాలని కోరుతున్నాం.

ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదు.

దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్ గారూ, దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరం.

మొదటి నుంచి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం.

2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్,
2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు.
2026 యూపీ బడ్జెట్,
2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా?
యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు?

బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా?
ఇది కేంద్ర బడ్జెట్ లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉంది.
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు?
తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించింది.

కేంద్ర జీడీపీకి 5.1శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోస పోయింది.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరం.
తెలంగాణకు నిధులు రాబట్టుకోవడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది.

తీరిగ్గా తేరుకొని, బడ్జెట్ కు పది రోజుల ముందు 40వేల కోట్లు కావాలని తూతూ మంత్రంగా లేఖ రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు.
కేంద్రం బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు.

ఏడాది కాలంలో 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు. ఏం సాధించారో ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.

బిజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది.
నిధుల కేటాయింపు సంగతి దేవుడెరుగు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేకపోయింది.

సంకీర్ణ యుగంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్థానిక పార్టీల మద్ధతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్పేవారు.
కేంద్రానికి మద్ధతు పలికిన జనతాదళ్ (యూ) బీహార్‌లో వివిధ అభివృద్ధి పనులకు గతేడాది రూ. 26,000 కోట్ల సాయం, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, గయాలో పారిశ్రామిక కారిడార్, నూతన విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలకు సాయం తదితరాలు పొందింది.

ఎన్నికలు దగ్గర ఉన్నాయని ఇప్పటి బడ్జెట్ లో బిహార్ కు మరిన్ని వరాల జల్లు కురిపించారు.
బిహార్ లో మఖాన బోర్డు ఏర్పాటు,
మిథిలాంచల్ లో వెస్టర్న్ కోసి కెనాల్,
ఐఐటీ పాట్నా విస్తరణ,
బిహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు,
ఫడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

కానీ, నమ్మి 16 సీట్లలో కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి ఇచ్చారు.

8 మంది బిజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్రానికి ప్రత్యేకంగా 8 రూపాయలు కూడా అధికంగా సాధించిన దాఖలాలు లేవు.

కేంద్రం ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు చేయడం సంతోషం, ఇందులో మాకు ఎలాంటి బాధ లేదు. కానీ తెలంగాణ పరిస్థితి ఏమిటో కాంగ్రెస్, బిజేపీ ఎంపీలు చెప్పాలి.

తెలంగాణలో ప్రాజెక్టుల సంగతి ఏమిటి? పునర్విభజన చట్టం హామీల పరిస్థితి ఏమిటి?
ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, బిజేపీ ఎంపీలు మౌనం దాల్చారు. కేంద్రం మెప్పు కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.

తెలంగాణకు ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎప్పటికైనా పోరాడేది బిఆర్ఎస్ పార్టీయేనని మరోసారి రుజువైంది.
తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు వైఫల్యం చెందుతున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.

Address

Piscataway, NJ
08854

Alerts

Be the first to know and let us send you an email when Mana TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana TV:

Videos

Share

Category