Saudi arab news telugu

Saudi arab news telugu Saudiarab news telugu

jai hanuman
28/01/2024

jai hanuman

ఈ రోజు బంగారం ధరలు సౌదీ అరేబియాలో 28-01-2024
28/01/2024

ఈ రోజు బంగారం ధరలు సౌదీ అరేబియాలో
28-01-2024

City Flower
25/01/2024

City Flower

lulu mobile mania 25-01-2024 to 30-01-2024
25/01/2024

lulu mobile mania 25-01-2024 to 30-01-2024

25/01/2024

గుడ్ న్యూస్ : 70 ఏళ్ల తర్వాత సౌదీఅరేబియాలో ప్రారంభమైన మద్యం అమ్మకాలు

రియాద్ లో నాన్ ముస్లింలకు మద్యం దుకాణాన్ని ఏళ్ళ తర్వాత సౌదీ ప్రారంభించినట్లు బీబీసీ న్యూస్ వార్తను ప్రచురించింది. ప్రస్తుతానికి ఇది కేవలం దౌత్య సిబ్బందికి మాత్రమే అనుమతించినట్లు తెలిపింది

ఈ రోజు బంగారం ధరలు సౌదీఅరేబియాలో  25-01-2024
25/01/2024

ఈ రోజు బంగారం ధరలు సౌదీఅరేబియాలో 25-01-2024

24/01/2024

🎉🎉Offers 10-20-30 Riyal are back 🎉🎉in Nesto Hypermarket !! And this time the prices are ever before.!! Get ready for the most amazing offers this year🕺🏻🛍️🎉 Shop anything and pay only 10-20-30 Saudi, so what are you waiting for?
Now is the time to take advantage of this amazing deal 🤑
Make the most out of your shopping with your nearest Nesto store and save big!!
📅 Offer valid from 24 January to 30 January 2024
📌The offer is available in Nesto Hyper Azizia, Batha, Khout and Mail

🔴SHOW DETAILS🔴
nestooffers.com/offer-details?store_id=52&offer=4291&pdf=4286&page=1
supplies arabia prices discounts

24/01/2024

Famous Dance Master J***y Master joined in JanaSena Party✅

24/01/2024

Telugu Comedy Actor prudhivi raj joined in JanaSena Party✅

ఈ రోజు బంగారం ధరలు సౌదీఅరేబియా లో 24-01-2024
24/01/2024

ఈ రోజు బంగారం ధరలు సౌదీఅరేబియా లో 24-01-2024

ఈ రోజు బంగారం ధరలు సౌదీఅరేబియాలో  23-01-2024
23/01/2024

ఈ రోజు బంగారం ధరలు సౌదీఅరేబియాలో 23-01-2024

23/01/2024
ఈ రోజు బంగారం ధరలు సౌదీఅరేబియా లో 22-01-2024
22/01/2024

ఈ రోజు బంగారం ధరలు సౌదీఅరేబియా లో 22-01-2024

22/01/2024

Jai sriram ayodya
Live from ayodya

Offers in safari mall      22-01-24
22/01/2024

Offers in safari mall 22-01-24

Ram Mandir : ఫలించిన 500 ఏళ్ల నిరీక్షణ.. 10లక్షల దీపాలతో శ్రీరాములోరికి స్వాగతంRam Mandir : 500ఏళ్ల నిరీక్షణ తర్వాత నేడు...
22/01/2024

Ram Mandir : ఫలించిన 500 ఏళ్ల నిరీక్షణ.. 10లక్షల దీపాలతో శ్రీరాములోరికి స్వాగతం
Ram Mandir : 500ఏళ్ల నిరీక్షణ తర్వాత నేడు తన కొత్త, గొప్ప రాజభవనంలో నివసించబోతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్, సంత్ సమాజ్, వీవీఐపీల సమక్షంలో రాంలాలా శ్రీవిగ్రహానికి సంబంధించిన చారిత్రాత్మక ఆచారం జరగనుంది.

అయోధ్య నగరం మొత్తం వేల క్వింటాళ్ల పూలతో అలంకరించారు. రామాలయాన్ని మూడు వేల కిలోల పూలతో అలంకరించారు. అయోధ్యలోనే కాకుండా దేశంలోని ఇతర నగరాలతో పాటు విదేశాల్లో కూడా రాముడికి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశంలోని వందలాది దేవాలయాల్లో రామ్ చరిత్ మానస్ పారాయణం జరుగుతోంది. సోమవారం సాయంత్రం అయోధ్యలో వెలుగుల మహోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సాంస్కృతిక నృత్యం, సంగీతం ద్వారా, రాష్ట్రంతో పాటు దేశంలోని సంప్రదాయాలు, కళలు వివిధ ప్రదేశాలలో మిళితం చేయబడుతున్నాయి.

జీవిత పవిత్రం కోసం, రామ మందిరం ప్రాంగణం సహా అయోధ్య మొత్తం పూలతో అలంకరించబడింది. జన్మభూమి ప్రదేశాన్ని వివిధ రకాల స్వదేశీ, విదేశీ పూలతో అలంకరించారు. జన్మభూమి మార్గం, రామ్‌పథం, ధరమ్‌ పథ్‌, లతా చౌక్‌లలో కూడా అందమైన పూల అలంకరణలు చేశారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలను ఏర్పాటు చేశారు. లతా చౌక్‌లో ఏర్పాటు చేసిన వీణను కూడా లైటింగ్, పూలతో అలంకరించారు. భగవాన్ శ్రీరాముని జీవిత చరిత్రకు సంబంధించిన వివిధ అధ్యాయాలు అయోధ్య నగరం మొత్తం మ్యూరల్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్ ద్వారా చిత్రీకరించబడ్డాయి.

Gold Price Today : గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షోల ద్వారా ప్రజల్లో మతపరమైన ఉత్సుకతను రేకెత్తిస్తున్నారు. అయోధ్య ధామ్‌లోని ప్రతి ప్రదేశం దేదీప్యమానంగా ఉంటుంది. అయోధ్యకు వెళ్లే వివిధ రహదారులను కూడా పువ్వులు, దీపాలతో అలంకరించారు. అంతేకాకుండా సోమవారం సూర్యాస్తమయం తర్వాత 10 లక్షల దీపాలతో వెలుగుల పండుగకు కూడా సన్నాహాలు చేశారు. సూర్యాస్తమయం తర్వాత ఐదు దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ, సీఎం యోగి దేశ ప్రజలను కోరారు.

అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అభిజీత్ ముహూర్తంలో నిర్వహిస్తారు. దీని కోసం ప్రధాని మోడీ ఉదయం 10.25 గంటలకు అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధాని మోడీ ఉదయం 10.45 గంటలకు అయోధ్య హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం నేరుగా రామజన్మభూమికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.05 నుంచి 12.55 వరకు ప్రాణ్-ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. దేశం మొత్తాన్ని ఉద్దేశించిన ఆయన ఎక్కడ ప్రసంగించనున్నారు.

Ayodhya Ram Mandir | జగమంతా రామమయం.. 50కిపైగా దేశాల్లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారంప్రపంచవ్యాప్తంగ...
22/01/2024

Ayodhya Ram Mandir | జగమంతా రామమయం.. 50కిపైగా దేశాల్లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారం
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా వేడుకలు..
అమెరికాలో పండుగ వాతావరణం
వివిధ నగరాల్లో కారు ర్యాలీలు, టెస్లా లైట్‌ షో
Ayodhya Ram Mandir | న్యూఢిల్లీ, జనవరి 21: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం కోసం ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.

బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను వీక్షించేందుకు 50కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు. రథయాత్రలు, కారు, ఆటో ర్యాలీలు, హిందూ ఆలయాల్లో దీపాల వేడుక వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.

అమెరికాలో కార్లతో పరేడ్‌
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్కేర్‌ సహా అమెరికాలోని 300 ప్రముఖ ప్రదేశాల్లో ఏర్పాట్లు జరిగాయి. వివిధ నగరాల్లో ఆటో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 10 రాష్ర్టాల్లో 40కిపైగా బిల్‌బోర్డులను విశ్వహిందూ పరిషత్‌ విభాగం ఏర్పాటు చేసింది. ఇక దేవాలయాల్లో గత వారం రోజులుగా పండుగ వాతావరణం నెలకొన్నది. కాషాయ జెండాలు చేతబూని, కాలిఫోర్నియాలో 1100 మంది కార్ల ర్యాలీని చేపట్టారు. న్యూజెర్సీలో 350 కార్లతో పరేడ్‌ నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్‌ డీసీలో జరగనున్న మ్యూజికల్‌ షోలో 100కుపైగా టెస్లా కార్లు పాల్గొంటున్నాయి. 21 నగరాల్లో టెస్లా కారు ర్యాలీలు జరగనున్నాయి.

మారిషస్‌లో రెండు గంటల బ్రేక్‌
మారిషస్‌ జనాభాలో 48 శాతం హిందువులే. నేడు ఆ దేశంలోని ప్రభుత్వం, హిందూ ప్రభుత్వ అధికారులకు రెండు గంటల స్పెషల్‌ బ్రేక్‌ (విరామం)ప్రకటించింది. 'బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన భారత్‌కు మాత్రమే కాదు, మారిషస్‌ ప్రజలకు కూడా అత్యంత ముఖ్యమైన కార్యక్రమం' అని ఆ దేశ హై కమిషనర్‌ డిల్లుమ్‌ అన్నారు. అక్కడి హిందూ దేవాలయాల్లో పెద్ద ఎత్తున దీపాలు వెలిగించేందుకు భక్తులు సిద్ధమయ్యారు.

ఫ్రాన్స్‌లో గ్రాండ్‌ రథయాత్ర
ఇక ఫ్రాన్స్‌లో భారతీయులు 'గ్రాండ్‌ రథయాత్ర'ను చేపట్టారు. పారిస్‌లోని డీ లాచాపెల్‌ వద్ద గణేశ్‌ ఆలయం నుంచి యాత్ర ప్రారంభమై, నగరంలోని ప్రముఖ ప్రదేశాల గుండా కొనసాగనున్నది. అయోధ్య వేడుకపై ఈఫిల్‌ టవర్‌ వద్ద ప్రత్యక్ష ప్రసారాలు చేపట్టారు. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, మారిషస్‌.. మొదలైన దేశాల్లో 'విగ్రహ ప్రతిష్ట' కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Celebs At Ayodhya | అయోధ్యకు చేరుకుంటున్న సెలబ్రెటీలు.. హనుమాన్‌ ఆలయంలో అనుపమ్‌ఖేర్‌ ప్రత్యేక పూజలుముంబై: అయోధ్య (Ayodhy...
22/01/2024

Celebs At Ayodhya | అయోధ్యకు చేరుకుంటున్న సెలబ్రెటీలు.. హనుమాన్‌ ఆలయంలో అనుపమ్‌ఖేర్‌ ప్రత్యేక పూజలు
ముంబై: అయోధ్య (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కన్నులపండువగా జరుగనుంది. మధ్యాహ్నం 12.05 నుంచి ఒంటి గంట ప్రధాని మోదీ చేతుల మీదుగా రామయ్య కొలువుదీరనున్నాడు.

ప్రాణప్రతిష్ఠ వేడుకకు 7వేల మంది ప్రముఖులను అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు అందించింది. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు రామజన్మభూమికి (Celebrities) క్యూకడుతున్నారు.

సోమవారం ఉదయం ముంబై విమానాశ్రయం నుంచి సచిన్‌ టెండుల్కర్‌, బాలీవుడ్‌ స్టార్‌లు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, మాధురి దీక్షిత్‌ దంపతులు, రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌, కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌, జాకి ష్రాఫ్‌, రణ్‌దీప్‌ హుడా-లిన్‌ లైశర్మ దంపతులు, రణ్‌దీప్‌ హుడా అయోధ్యకు బయల్దేరారు. ఇక హైదరాబాద్‌లోని బేగంపే విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి, రామ్‌చరణ్‌ రామజన్మభూమికి వెళ్లారు.

ఇక బాలీవుడ్‌ నటులు కంగనా రనౌత్‌, అనుపమ్‌ ఖేర్‌, సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌, దనుష్‌ ఆదివారమే అయోధ్యకు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున అయోధ్యలోని హనుమాన్‌ గర్హీ ఆలయంలో అనుపమ్‌ ఖేర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం జై శ్రీరామ్‌ నామస్మరణతో మారుమ్రోగింది. అనంతరం ఆయన మాట్టాడుతూ రామ మందిరానికి వెళ్లేకంటే ముందు హనుమంతున్ని దర్శించుకోవడం ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం అయోధ్య మోత్తం భక్తిపారవశ్యంలో మునిపోయిందన్నారు. ప్రతిచోట జై శ్రీరామ్‌ నినాదమే వినిపిస్తున్నదని తెలిపారు. దీపావళి మరోసారి వచ్చిందని, ఇదే అలసైన దీపావళి అన్నారు.

Jai Shri Ram on Eiffel Tower: ఈఫిల్ టవర్ దగ్గర జై శ్రీరామ్ నినాదాలుఅయోధ్యలో రామ మందిరలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ...
22/01/2024

Jai Shri Ram on Eiffel Tower: ఈఫిల్ టవర్ దగ్గర జై శ్రీరామ్ నినాదాలు
అయోధ్యలో రామ మందిరలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుండగా ఈ చారిత్రాత్మక సందర్భంగా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ రామ నామ జపం కొనసాగుతుంది.

తాజాగా, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ దగ్గర కొందరు రామ భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో పలువురు కార్లతో భారీ ర్యాలీలు తీశారు.

ఇక, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఇలాంటి స్పందనలు వస్తున్నాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని విదేశాల్లో నివసిస్తున్న హిందూ సమాజానికి చెందిన వారు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, శ్రీ రాముడు తన నగరమైన అయోధ్యలోకి వచ్చిన తర్వాత తన భక్తులకు త్వరలో దర్శనమిస్తారు. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాంలాలా విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు.

మోదీ వ్యూహం, అసలు కర్త యోగీ - బీజేపీ మిషన్ అయోధ్య..!!దేశ మొత్తం ఇప్పుడు అయోధ్య వైపు చూస్తోంది. ప్రముఖులు అయోధ్యకు చేరుకు...
22/01/2024

మోదీ వ్యూహం, అసలు కర్త యోగీ - బీజేపీ మిషన్ అయోధ్య..!!
దేశ మొత్తం ఇప్పుడు అయోధ్య వైపు చూస్తోంది. ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. శతాబ్దాల కల ఇప్పుడు సాకారమైంది. రామ మందిరం ప్రారంభోత్సవంలో ప్రధాన కర్తగా ప్రధాని మోదీ పాల్గొంటున్నారు.

కానీ, సుప్రీం తీర్పు వచ్చిన నాటి నుంచి నేటి వరకు మోదీ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. మోదీ వ్యూహాలు రచిస్తే..వాటిని పక్కాగా అమలు చేయటంలో యూపీ సీఎం యోగీ సక్సెస్ అయ్యారు. రామాలయం భూమి పూజ చేసిన నాటి నుంచి నేటి ప్రారంభోత్సవం వరకు యోగీదే కీలకపాత్ర.

బీజేపీ - అయోధ్య: రామజన్మభూమి అంశం బీజేపీకి రాజకీయంగా ఎదగటంలో సహకరించింది. ఇక, దశబ్దాల కల అయిన రామ మందిరం నిర్మాణంలో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. 1984 ఎన్నికల్లో బీజేపీ తొలిగా గెలిచింది 2 స్థానాలు. ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 414 సీట్లను గెలుచుకుంది.

1989లో పాలంపూర్ లో అయోధ్య రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉంటామని బీజేపీ ప్రకటించింది. దీంతో అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 85 స్థానాలు దక్కించుకుంది. 1990లో అద్వానీ సోమ్ నాధ్ ఆలయం నుంచి రధయాత్ర ప్రారంభించారు. బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఈ యాత్ర ఒక కీలక మలుపు. 1991లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 121 సీట్లను కైవసం చేసుకుంది.

శ్రీరామ నామంతో మారుమోగిపోతున్న ముఖేష్ అంబానీ నివాసంశ్రీరామ నామంతో మారుమోగిపోతున్న ముఖేష్ అంబానీ నివాసందేశం వ్యాప్తంగా ఇప...
22/01/2024

శ్రీరామ నామంతో మారుమోగిపోతున్న ముఖేష్ అంబానీ నివాసం
శ్రీరామ నామంతో మారుమోగిపోతున్న ముఖేష్ అంబానీ నివాసం
దేశం వ్యాప్తంగా ఇప్పుడు వినిపించే పదం జై శ్రీరామ్..జై శ్రీరామ్. ఏనోట విన్న..ఎక్కడ చూసిన అంత రామస్మరణ తో మారుమోగిపోతుంది. మరికాసేపట్లో అయోధ్య లో రామ మందిరం ప్రారంభం కాబోతుండడం తో దేశ వ్యాప్తంగా ప్రజలు , భక్తులే కాదు అనేక రంగాల వారు శ్రీరామ నామం జపం చేస్తూ..పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇల్లు 'యాంటిలియా'కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీరాముని ప్రతిష్ఠాపనకు ముందు 'యాంటిలియా' పెళ్లికూతురులా అలంకరించబడిందని చూడవచ్చు. రామనామంతో 'యాంటిలియా' అలంకరించబడింది. అలంకరణలు చూస్తుంటే దీపావళి పండగలా అనిపిస్తోంది.

అయోధ్యకి ఆహ్వానం అందలేదు.. అయినా అప్పుడు వెళ్తాం..!అయోధ్యలో సోమవారం జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ‘ప్రాణ ప్రతిష్ట’...
21/01/2024

అయోధ్యకి ఆహ్వానం అందలేదు.. అయినా అప్పుడు వెళ్తాం..!
అయోధ్యలో సోమవారం జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత రాష్ట్ర సమితికి అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఆదివారం వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు బీజేపీ చేస్తున్న వాదనలపై కవిత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు బీఆర్ఎస్ కి అధికారిక ఆహ్వానం అందలేదు. అయితే శ్రీరాముడు ఒక పార్టీకో, సంస్థకో చెందినవాడు కాదు రాముడు అందరివాడు’ అని ఆమె గుర్తు చేశారు. అయితే ప్రతిఒక్కరు దేవస్థానాల్ని సందర్శిస్తారని.. ఇప్పుడు వెళ్లకున్నా మేము త్వరలో అయోధ్యని సందర్శిస్తానని అన్నారు కవిత.

Share

అమెరికాపై విరుచుకుపడ్డ ఇరాన్: ఎయిర్‌బేస్‌పై మిస్సైళ్లతో దాడి: ఏం జరుగుతోంది?Joe Biden: మధ్య ఆసియా దేశాల్లో యుద్ధ మేఘాలు ...
21/01/2024

అమెరికాపై విరుచుకుపడ్డ ఇరాన్: ఎయిర్‌బేస్‌పై మిస్సైళ్లతో దాడి: ఏం జరుగుతోంది?
Joe Biden: మధ్య ఆసియా దేశాల్లో యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఇప్పటికే యెమెన్‌పై దాడికి దిగింది అగ్రరాజ్యం అమెరికా. హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.

బ్రిటన్ సహా వివిధ దేశాల సహకారంతో ఈ దాడులకు పూనుకుంది. సముద్ర మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న హౌతి రెబెల్స్‌పై ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది.

ఈ క్రమంలో అమెరికాపై దాడులకు సిద్ధపడింది ఇరాన్. ఇరాక్‌లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయ భవనంపై బాలిస్టిక్స్ మిస్సైళ్లను సంధించింది. ఇరాక్ ఉత్తరప్రాంతంలోని ఎర్బిల్ సిటీలో ఉంటుంది యూఎస్ కాన్సులేట్. దీన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దాడులకు తామే కారణమని ఇరానియన్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. దాడి చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది. ఎర్బిల్‌లోని అమెరికన్ కాన్సులేట్.. గూఢచర్య కార్యకలాపాలకు కేంద్రబిందువుగా మారిందని ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల మద్దతును అమెరికా కూడగట్టుకుంటోందని పేర్కొంది.

దీనకి ప్రతీకార దాడికి దిగారు ఇరాన్ మిలిటెంట్లు. ఇరాక్‌లోని అమెరికా ఎయిర్ బేస్‌పై ఏకంగా బాలిస్టిక్స్ మిస్సైళ్లను సంధించారు. ఈ ఘటనలో అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని అమెరికా రక్షణ విభాగం ప్రధాన కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. సైనికులు గాయపడినట్లు అధికారికంగా వెల్లడించింది.

ఇరాక్ పశ్చిమ ప్రాంతంలోని అల్- అసద్‌లో ఉంటుంది అమెరికన్ ఎయిర్ బేస్. ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ఈ దాడి చోటు చేసుకుంది. ఇరాన్ మిలిటెంట్లు తమ ఎయిర్ బేస్‌పై మిస్సైళ్లను సంధించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్‌కామ్ తెలిపింది. ఈ దాడి వెనుక ఇరాన్ మిలిటెంట్ గ్రూపులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది.

ఈ దాడి తీవ్రత ఎంత అనే విషయంపై ఆరా తీస్తోన్నట్లు సెంట్‌కామ్ పేర్కొంది. నష్టాన్ని అంచనా వేస్తోన్నట్లు వివరించింది. పలువరు సైనికులకు ట్రామిక్ బ్రెయిన్ ఇంజ్యురీ అయిందని స్పష్టం చేసింది. ఓ ఇరాక్ ఉద్యోగి గాయపడినట్లు తెలిపింది. ఈ ఘటనపై వైట్ హౌస్ స్పందించాల్సి ఉంది.

Address

Exit 4
Riyadh
11142

Website

Alerts

Be the first to know and let us send you an email when Saudi arab news telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies


Other Riyadh media companies

Show All