Drushyamonlineweeklymagzine

Drushyamonlineweeklymagzine Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Drushyamonlineweeklymagzine, Social Media Agency, H. NO 2-65, Zaheerabad.
(1)

FACEBOOK (Promotions) మీ వ్యాపార ప్రకటనల కోసం
మమ్మలిని సంప్రదించండి...
తక్కువధర లో ఎక్కువమందికి రీచ్ తో...
ఇట్లు
Santhish Kumar Bellapuram
WhatsApp : 9618886882

https://www.facebook.com/profile.php?id=61558384316037

 #లక్కీ భాస్కర్ ఫస్ట్ సాంగ్లక్కీ భాస్కర్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ ‘శ్రీమతి గారు’ పాటకు వింట...
16/12/2024

#లక్కీ భాస్కర్ ఫస్ట్ సాంగ్
లక్కీ భాస్కర్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ ‘శ్రీమతి గారు’ పాటకు వింటేజ్ మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు. తెలుగులో ఈ పాటను విశాల్ మిశ్రా, శ్వేత మోహన్ పాడారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. ఈ పాట మెలోడియస్‍గా మంచి లిరిక్స్‌తో ఆకట్టుకుంటోంది. అలిగిన భార్యను మెప్పించేందుకు భర్త పాడే పాటగా ఉంది. ఈ పాటలో దుల్కర్, మీనాక్షి కెమిస్ట్రీ అద్భుతంగా కనిపించింది. లిరిక్స్ ఇక్కడ చూసేయండి.

'శ్రీమతి గారు' పాట లిరిక్స్ ఇవే..
కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు
చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తూ ఉన్నా బావున్నారు
సరదాగా సాగే.. సమయంలోన మరిచిపోతే బాధ కబురు
వద్దు అంటూ ఆపేదెవరు
కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు

పలుకే నీది.. ఓ వెన్నె పూస
అలకే ఆపే మనసా

మౌనం తోటి మాట్లాడే భాష..
అంటే నీకే అలుసా

ఈ అలలా గట్టు.. ఆ పూల చెట్టు..
నిన్ను చల్లబడవే అంటున్నాయే

ఏం జరగనట్టు నీవ్వు కరిగినట్టు..
నే కరగనంటూ చెబుతున్నాలే

నీతో వాదులాడి.. గెలువలేనే వన్నెలాడి

సరసాలు చాలండి ఓ శ్రీవారు..
ఆఖరికి నెగ్గేది మీ మగవారు
హాయే పంచే ఈ చల్లగాలి.. మళ్లీ మళ్లీ రాదే

నీతో ఉంటే ఏ హాయికైనా.. నాకే లోటేం లేదే

అదుగో ఆ మాటే.. ఆంటోంది పూటే..
సంతోషమంటే మనమేనని

ఇదిగో ఈ ఆటే.. ఆడే అలవాటే మానేయవేంటో కావాలని
నువ్వే.. ఉంటే చాల్లే.. మరిచిపోనా ఓనమాలే

బావుంది.. బావుంది.. ఓ శ్రీవారు
గారాబం మెచ్చిందే శ్రీమతి గారు
#బుజ్జమ్మ

11/12/2024

Hello Friends,
We are looking for Anchor/News Presenters and Video Editors for our Youtube channels.

Interested candidates, plz contact: [email protected], Ph:9849010044 (Plz call after 2:00 PM only)

Job Vacancies: Anchor & Video Editor
Qualification: Freshers/Experienced with fluent Telugu language skills.
Location: Hyderabad- Kukatpally

Job Description:
We are seeking a dynamic and engaging Anchor/Video Presenter to join our Telugu YouTube channel team.
Required Skills:
· Host and present videos with confidence, enthusiasm, and professionalism.
· Well communicative and smart thinker.
· Good knowledge about Telugu state Politics and daily updates.
· Awareness of current trends and topics relevant to the target audience.
· Conduct interviews with guests, experts, and influencers.
· Engage with the audience through comments, polls, and social media.
· Proven experience as a video presenter or anchor, preferably on YouTube or other digital platforms.
· Familiarity with video production processes and equipment.
· Able to research and write the content.

Interested candidates, plz contact: [email protected], Ph:9849010044 (Plz call after 2:00 PM only)

06/12/2024

'పుష్ప 2' సినిమాలో 'గంగమ్మ తల్లి' జాతర స్టోరీ ఏంటో మీకు తెలుసా..?
అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది..

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది. అంతే కాదు సినిమాలో ఈ ఒక్క సీక్వెన్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారట. 'గంగమ్మ తల్లి' జాతర స్టోరీ ఏంటో తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2. నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటవిశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా 'గంగమ్మ తల్లి' జాతర సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. దీని కోసమే మళ్ళీ మళ్ళీ సినిమా చూడాలనిపించేలా చిత్రీకరించారు. అయితే ఈ సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ వెనుక పెద్ద స్టోరీనే ఉందంట. అంతే కాదు సినిమాలో ఈ ఒక్క సీక్వెన్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారట మేకర్స్.
జానపద కథలు, పురాణాల ప్రకారం.. గంగమ్మను తిరుపతి నగరంలోని శ్రీ తాతయ్యగుంట గ్రామదేవిగా చెబుతారు. చాలా కథలలో ఆమె వేంకటేశ్వర స్వామికి సోదరి అని కూడా చెప్పబడింది.

కొన్ని వందల సంవత్సరాల క్రితం తిరుపతి వాటి పరిసర ప్రాంతాలను పాలగొందులు పరిపాలించినప్పుడు మహిళలపై అకృత్యాలు తారాస్థాయికి చేరుకున్నాయట. ఆ పాలెగొందులు మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, ప్రాణాంతక దాడులకు పాల్పడ్డారట. అయితే ఆ సమయంలో గంగమ్మ దేవత అవిలాల అనే గ్రామంలో జన్మించిందట. కాగా, వయసు పెరిగేకొద్దీ ఆమె చాలా అందమైన మహిళగా తయారైంది. అప్పుడు పాలగొందులు గంగమ్మ దేవికి హాని కలిగించడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె తన శక్తులతో దాడులను ఎదుర్కున్నారట.

దీంతో ఆ పాలెగొందులు పారిపోయి దాక్కున్నారని అంటారు. వాళ్ళను తరిమి కొట్టేందుకు గంగమ్మ తల్లి 'గంగా జాతర' రూపంలో వారం రోజుల పాటు వింత వేషధారణలు తిరుగుతూ ఏడో రోజు పాలెగొందులు బయటకు రాగానే వారిని హత్య చేసిందట. ఈ సంఘటనను స్మరించుకుంటూ, గంగమ్మ దేవి పట్ల భక్తిని చాటుకోవడానికి ఈ పండుగను నేటికీ జరుపుకుంటారు అక్కడి వాసులు. ఇదే విధంగా అల్లు అర్జున్ 'పుష్ప2' లో అల్లు అర్జున్ గంగమ్మ తల్లి గెటప్ లో రౌడీలను పెట్టుకున్నారట.

ఈ పండుగలో పురుషులు స్త్రీల వేషం వేస్తారు. వారిలాగే చీరలు, మేకప్, నగలు, విగ్గులు కూడా ధరిస్తారు. ఈ విధంగా వారు గంగమ్మ దేవి ,స్త్రీ పట్ల తమకున్న గౌరవాన్ని తెలియజేస్తారు. ఎన్నో నియమాలున్న ఈ జాతరలో ఏడు రోజులపాటు వివిధ రకాల వేషధారణలతో జనం కనిపిస్తారు. 'పుష్ప 2' టీజర్ లో అల్లు అర్జున్ కనిపించే గెటప్ జాతర ఐదవ రోజున వేసే 'మాతంగి వేషం' అని నివేదికలు సూచిస్తున్నాయి.
టీజర్ లో అల్లు అర్జున్ బాడీ మొత్తం డార్క్ బ్లూ పెయింట్ వేసుకొని, చీర, నగలు ధరించి పవర్ ఫుల్ గా కనిపించారు. అయితే పుష్ప2 మూవీలో ఈ ఒక్క జాతర సీక్వెన్స్ షూట్ చేయడానికి భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారంట మేకర్స్. సినిమాలో కేవలం 6 నిమిషాల నిడివి గల ఈ జాతర సీక్వెన్స్ దాదాపు 30 రోజులు షూట్ చేశారని. ఈ ఒక్క సీక్వెన్స్‌ కోసం 60 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.... ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి... ఫ్రండ్స్ థాంక్స్ you for watch this video..

https://youtu.be/UBc2vMizrRk
03/09/2024

https://youtu.be/UBc2vMizrRk

నమస్కారం మిత్రులారా! నేను సంతీష్ కుమార్, దయచేసి మీ స్నేహితుల కు షేర్ చేయండి మరియు మన చానెల్ ని "SUBSCRIBE" చేయండి. "Welcome to Seaso...

https://www.youtube.com/watch?v=uq93gmP7p3U
29/06/2024

https://www.youtube.com/watch?v=uq93gmP7p3U

నమస్కారం మిత్రులారా! నేను సంతీష్ కుమార్, దయచేసి మీ స్నేహితుల కు షేర్ చేయండి మరియు మన చానెల్ ని "SUBSCRIBE" చేయండి. "Welcome to Seaso...

నటులు:ప్రభాస్,అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొణె,దిశా పటానీదర్శకుడు: నాగ్ అశ్విన్సినిమా శైలి:Telugu, Sci-Fiవ్యవధి:...
27/06/2024

నటులు:ప్రభాస్,అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొణె,దిశా పటానీ
దర్శకుడు: నాగ్ అశ్విన్
సినిమా శైలి:Telugu, Sci-Fi
వ్యవధి:3 Hrs 1 Min
దృశ్యం రేటింగ్స్: 4.5 /5

కల్కి ఎవరు అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువైంది.
కనుక కల్కి ఎవరు?
********************************************************

మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది. వాటిలో పది అవతారాలను దశావతరాలుగా ఇప్పటికీ మనం పూజిస్తూనే ఉన్నాం. అలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన , పరుశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అవతారాలు.. ఇప్పటికే ముగిశాయి. ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి. అంటే శ్రీమహా విష్ణువు పదవ అవతారమే ఈ కల్కి అన్నమాట.

భాగవతం, కల్కి పురాణం సహా అనేక గ్రంథాలలో కల్కి గురించిన వర్ణన ఉంది. అధర్మమే అడుగడుగునా కనిపించే కలియుగంలో పాపాలు మరింత శ్రుతిమించినప్పుడు కల్కి అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన పురాణాల ప్రకారం నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అన్నమాట. వీటిలో మూడు యుగాలు ఇప్పటికే ముగిశాయి. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం.

ఈ కలియుగంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరం అయిన శంభలలో జన్మిస్తాడని కల్కి పురాణం చెబుతుంది. శంభలలో విష్ణు యశుడు- సుమతి అనే దంపతులుకి కల్కి జన్మిస్తాడని అంటారు. ఇక ప్రతి అవతారంలోనూ విష్ణువుకి భార్య అయిన లక్ష్మీ దేవి కూడా ఒక రూపంలో వస్తుంటారు. అలానే కల్కి పురాణం ప్రకారం సింహళ దేశం అంటే ఇప్పటి శ్రీలంకలో బృహద్రధ వంశానికి చెందిన ఓ కుటంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీ దేవి అవతరిస్తుందని కల్కి పురాణంలో రాసుంది. ఇక కల్కి పుట్టిన తర్వాత ఆయన్ను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆ ఆదిశక్తే రక్షకురాలిగా ఉంటుందని కూడా చెప్పారు. ఇక ఏడుగురు చిరంజీవుల్లో నలుగురు అయిన పరుశురాముడు, కృపాచార్య, అశ్వత్థామ, వ్యాస మహర్షి వీరంతా కల్కిని చూసేందుకు శంభలకి వస్తారని కల్కి పురాణం చెబుతుంది. వీరు నలుగురూ కల్కికి ధర్మసంస్థాపనలో సహాయం చేస్తారట. వారే పుట్టిన ఆ పిల్లాడికి కల్కి అని పేరు పెట్టి వెళ్తారని కూడా అంటారు. కలిని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని కల్కి ప్రారంభిస్తాడని పురాణం చెబుతుంది. సింపుల్‌గా ఇది కల్కి కథ.

"అశ్వత్థామ హతః కుంజరః" అనే డైలాగ్‌తో కురుక్షేత్ర యుద్ధభూమిలో 'కల్కి 2898 ఏడీ' సినిమా మొదలైంది. యుద్ధంలో తమ సకల సైన్యాన్ని కోల్పోయి.. నా అనుకున్న తన నాన్నని దూరం చేసుకొని తీరని ఆక్రోశంతో రణభూమిలో రగిలిపోతుంటాడు అశ్వత్థామ (అమితాబ్ ). తనవాళ్లు అందరినీ చంపేసిన పాండవులకి వారసుడే ఉండకూడదనే పగతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర (మాళవిక నాయర్) గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థామ. దీంతో ఉత్తర గర్భంలోని శిశువు మరణిస్తాడు. ఇది తెలిసి యుద్ధభూమిలోకి శ్రీకృష్ణ పరమాత్మ (ఫేస్ చూపించలేదు) వస్తాడు. "రా కృష్ణ.. ఇక మిగిలింది నేనే నన్ను కూడా అంతం చేస్తావా" అంటూ కృష్ణుడిపైనే దాడి చేయబోతాడు అశ్వత్థామ. వెంటనే పక్కకి తప్పుకొని "నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావ్ అశ్వత్థామ.. గర్భంలోని పిండంపైనే అస్త్రాన్ని సంధించావ్ కదా.. కనుక నీకు చావు అనేదే లేకుండా నేను శాపం ఇస్తున్నాను.. ఇది శాపం ఎలా అనుకుంటున్నావేమో.. కలియుగాంతం వరకూ నువ్వు కొండ కోనల్లో ఇలానే తిరుగుతావ్.. నీ శరీరం నుంచి చీము, రక్తం స్రవిస్తాయి.. అయినా సరే నీకు చావు దరిచేరదు" అంటూ అశ్వత్థామ నుదిటిపై ఉండే ప్రకాశవంతమైన మణిని తీసేసుకుంటాడు కృష్ణుడు.

దీంతో దీనికి ప్రాయశ్చిత్తమే లేదా అని అశ్వత్థామ ప్రాధేయపడతాడు. "సరే.. కలియుగాంతంలో పాపం మితిమీరిపోతుంది.. యాగాలు, యజ్ఞాలు కూడా ఆగిపోతాయి.. గంగానది చివరి బొట్టు కూడా ఎండిపోతుంది.. ఎక్కడ చూసినా అధర్మం తాండవం చేస్తుంది.. అప్పుడు నేను మరో అవతారం ఎత్తుతాను. కానీ నన్ను పుట్టకుండా ఆపే శక్తి కూడా కలికి ఉంటుంది. నాపైన ఇప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించినా నువ్వే ఆ రోజు తల్లి గర్భంలో ఉన్న నన్ను కలి నుంచి కాపాడాలి.. సమయం వచ్చినప్పుడు ఈ మణి తిరిగి నీ దగ్గరికి వస్తుంది." అంటూ కృష్ణుడు చెప్తాడు.

కట్ చేస్తే కురుక్షేత్రం జరిగిన 6 వేల సంవత్సరాల తర్వాత '2898 ఏడీ'లో ప్రపంచం ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్లు లేక తిండి లేక జనాలు అలమటిస్తూ ఉంటారు. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ భూమి నుంచి వనరులు అన్నీ లాగేసుకొని 'కాంప్లెక్స్' (నగరం) అనే ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్). కాశీ పట్టణంలో ఉన్న ప్రజలకి సుప్రీమ్ ఆర్మీ నరకం చూపిస్తూ ఉంటుంది. శరణార్థులను కాశీ నగరంలో పురుగుల్లా చూస్తుంటారు సుప్రీమ్ సైన్యం. అయితే సంతాన ఉత్పత్తి ఉన్న అమ్మాయిలను మాత్రం కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లి వారిపై ఓ ప్రయోగం చేస్తుంటారు సుప్రీమ్ ఆర్మీ. దాని పేరే ప్రాజెక్ట్ కే. సుప్రీమ్ యాస్కిన్ ఇచ్చిన ఫార్ములాను ఫెర్టిలిటీ ఉన్న అమ్మాయిల గర్భంలో ఇంజెక్ట్ చేస్తుంటారు. దాన్ని కనీసం 120 రోజులు మోయగలిగే అమ్మాయి గర్భం నుంచి సీరమ్‌ను కలెక్ట్ చేయాలనేది సుప్రీమ్ ఆదేశం. కానీ ఆ ఫార్ములాను 100 రోజులు కూడా ఏ అమ్మాయి మోయలేకపోతుంది. కానీ ఆ కాంప్లెక్స్‌లోనే పని చేసే సుమతి (దీపిక పదుకొణె) మాత్రం 150 రోజులు దాన్ని ఎవరికీ తెలీకుండా మోస్తూ జాగ్రత్తపడుతుంది.

మరోవైపు ఏదైనా భౌంటీ (చేసే పనిని అలా పిలుస్తారు) వస్తే దానిని పూర్తి చేసి యూనిట్స్ (పనికి ఇచ్చే డబ్బు) దాచుకుంటూ ఉంటాడు భైరవ (ప్రభాస్). ఎవరు ఎక్కువ యూనిట్స్ ఇస్తానంటే వారి వైపు పని చేసే నిజాయతీ లేని యోధుడు భైరవ. ఎలాగైనా 1 మిలియన్ యూనిట్స్ సాధించి కాంప్లెక్స్‌లో సెటిలైపోవాలనేది భైరవ కోరిక. దీనికి తన కారు 'బుజ్జి' సాయం చేస్తూ ఉంటుంది. అయితే ఇంకోవైపు రేపటి మంచి కోసం కాంప్లెక్స్‌ను ఎదిరించి 'శంభల' అనే రహస్యమైన నగరంలో కొంతమంది పోరాటం చేస్తుంటారు. ఎప్పటికైనా భగవంతుడ్ని కనే అమ్మ అక్కడికి వస్తుందని వాళ్ల నమ్మకం. ఇక ఒకరోజు సుమతి 150 రోజుల పాటు గర్భాన్ని మోసిందనే విషయం తెలుసుకున్న కాంప్లెక్స్ సైన్యం ఆమె నుంచి సీరమ్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అక్కడి నుంచి తెలివిగా తప్పించుకున్న సుమతిని శంభల మనుషులు కాపాడి వాళ్ల నగరానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆమెను తిరిగి తీసుకువస్తే ఊహించనంత యూనిట్స్ ఇస్తామని కాంప్లెక్స్ సుమతిపై భౌంటీ పెడుతుంది. దీంతో ఆమెను తిరిగి కాంప్లెక్స్‌కి తీసుకురావడానికి అందరిలానే ఆశపడి భైరవ కూడా బయలుదేరతాడు.

అయితే భగవంతుడ్ని కడుపున మోస్తున్న తల్లిని కాపాడేందుకు సమయం ఆసన్నమైందని అశ్వత్థామకి సూచన వస్తుంది. సరిగ్గా అదే సమయంలో తన మణి కూడా తనకి చేరుతుంది. దీంతో సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ రంగంలోకి దిగుతాడు. మరి కాంప్లెక్స్ సైన్యం నుంచి అశ్వత్థామ ఒక్కడూ సుమతిని రక్షించాడా? సుమతిని తిరిగి కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లి యూనిట్స్ సాధిద్దామన్న భైరవ కల నెరవేరిందా? సుమతిని ఎతుకెళ్లడానికి వచ్చిన భైరవ-అశ్వత్థామ మధ్య ఎలాంటి పోరాటం జరిగింది? అసలు ఈ భైరవ ఎవరు? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? సుమతి భగవంతుడ్ని ప్రసవించిందా? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

నాగ్ అశ్విన్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే...
భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ఓ ఊహ. దాన్ని మనకి నచ్చినట్లుగా ఊహించుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని.. పురాణాల్లో రాసున్నదానిపై పరిశోధన చేసి.. చాలా కష్టపడి మూడు సరికొత్త ప్రపంచాలను నాగ్ అశ్విన్ సృష్టించారు. కాంప్లెక్స్, కాశీ, శంభల ఇలా మూడు మూడు రకాలుగా ఉంటాయి. అయితే కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్‌కి పరిచయం చేసేందుకు నాగ్ అశ్విన్ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నారు. ఫస్టాఫ్ మొత్తం దాదాపు పాత్రల పరిచయానికి, ఆ నగరాలు, అందులో జనాల కష్టాలు.. వీటి గురించే చూపించారు. అక్కడక్కడా కాస్త సరదా సంభాషణలతో ఫస్టాఫ్ సాగుతుంది. అయితే ఇంటర్వెల్ ముందు ఓవైపు భైరవ.. మరోవైపు అశ్వత్థామ మరో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారనే సంకేతాన్ని ఆడియన్స్‌కి ఇస్తూ ఓ హై సీన్ అయితే పడింది. దీంతో ఆడియన్స్‌ను సెకండాఫ్‌లో భారీ యాక్షన్ చూసేందుకు నాగ్ అశ్విన్ ముందే రెడీ చేశారు.

ఇక సెకండాఫ్‌లో భైరవ-అశ్వత్థామ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు, యాక్షన్ ఆడియన్స్‌కి మంచి హై ఇచ్చింది. చావు అనేదే లేని చిరంజీవి అయిన అశ్వత్థామను మోడ్రన్ టెక్నాలజీ, ఆయుధాలు ఉపయోగించి నియంత్రించాలని భైరవ చేసే పోరాటాలు ఆకట్టుకున్నాయి. ఇలా సుమతిని తిరిగి కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లేందుకు భైరవ చేసే ప్రతి ఎత్తును చిత్తు చేస్తూ అశ్వత్థామ చేసే యాక్షన్ కూడా వేరే లెవల్లో ఉంది. ఇక క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని మరోస్థాయి ట్విస్ట్‌ను అయితే నాగ్ అశ్విన్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాకి ప్రధాన బలం చివరి 15 నిమిషాల క్లైమాక్స్‌‌యే. థియేటర్లో సంతోష్ నారాయణన్ ఇచ్చిన బీజీఎంతో ఆ సన్నివేశాలు చూసినప్పుడు గూస్‌బంప్స్ వస్తాయి. ఇక క్లైమాక్స్‌లో పార్ట్ 2 గురించి హింట్ ఇస్తారని అంతా ముందే ఊహించారు. కానీ పార్ట్ 2 మాత్రమే కాదు ఏకంగా 'కల్కి సినిమాటిక్ యూనివర్స్‌'యే ఉంటుందంటూ అందరికీ డైరెక్టర్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

https://www.youtube.com/watch?v=RPuPzxDvs0o
21/06/2024

https://www.youtube.com/watch?v=RPuPzxDvs0o

నమస్కారం మిత్రులారా! నేను సంతీష్ కుమార్, దయచేసి మీ స్నేహితుల కు షేర్ చేయండి మరియు మన చానెల్ ని "SUBSCRIBE" చేయండి. Rich Dad Poor Dad...

Full Lyrics Video on Our Seasonal Studio7
02/06/2024

Full Lyrics Video on Our Seasonal Studio7

https://youtu.be/BZdtLgzizkE కొంతమంది చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్లాల్సిన గమ్యానికి వెళ్లకుండా పక్కకు తప్పుకొంటారు. సర...
01/06/2024

https://youtu.be/BZdtLgzizkE

కొంతమంది చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్లాల్సిన గమ్యానికి వెళ్లకుండా పక్కకు తప్పుకొంటారు. సరే అదేమైనా పెద్ద కారణాలతోనా అంటే.. చిన్న విషయాలకే. కలలు గొప్పగా ఉంటాయి.. కానీ ప్రయత్నాలే.. మెుదలుకావు. కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు. సరే ప్రయత్నం చేసి ఓడిపోతే.. అది ఒక పద్ధతి.. కానీ ప్రయత్నమే మెుదలుకాకుండా.. ఓడిపోయామని ఇంట్లోనే కూర్చొంటారు. ఇలా చేసి ఉంటే బాగుండు.. అలా చేసుంటే ఇంకా బాగుండే.. అంటూ.. ఇతరులకు సూక్తులు చెప్తారు. కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే.. కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తి అయినా మిగులుతుంది కదా...
మిత్రమా...!! ఈ విషయంలో ముందుగా ఓ చిన్న కథ తెలుసుకో..
"గద్ద చెప్పే జీవిత పాాఠం"

Soon Video..... on Our Channel Seasonal Studio7
29/05/2024

Soon Video..... on Our Channel
Seasonal Studio7

https://youtu.be/8NtmsMK-eOE అమ్మపాడే జోల పాట అమృతాన్ని కన్న తియ్యనంట......అమ్మపాడే లాలి పాట తేనెలోరే పరే యేరులంట......న...
28/05/2024

https://youtu.be/8NtmsMK-eOE

అమ్మపాడే జోల పాట అమృతాన్ని కన్న తియ్యనంట......
అమ్మపాడే లాలి పాట తేనెలోరే పరే
యేరులంట......
నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లిసి...
నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి....
ఉగ్గును పట్టి ఉయ్యాలలుపే అమ్మా లాలన....
ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెన ....

Full Lyrics Kosam Video Link ni Click Cheyandi
Thank you for valuable time friends 🙏

Amma Paata 2024 Full Song | Mittapalli Surender | Amma Songs Telugu | Mittapalli Studio Label & Channel ...

10/05/2024

నల్లగొండ పార్లమెంట్ MP స్వతంత్ర అభ్యర్థి గా btech నిరుద్యోగి
కిన్నెర యాదయ్య స్టూల్ గుర్తు తో మీ ముందుకు వస్తున్నారు. EVM లో
సీరియల్ nO 9 కి ఓటు వేసి గెలిపించండి.
నల్లగొండ లోని ప్రధాన సమస్య నిరుద్యోగం : ప్రభుత్వ ఉద్యోగాల ఊసేలేదు. కనీసం ప్రయివేటు రంగంలో IT జాబ్స్ చేద్దాం అనుకుంటే, నేర్చుకోడానికి సాఫ్ట్వేర్ IT హబ్ లేవు కానీ ఎక్కడో నార్త్ నుంచు వచ్చి అమీర్పేట్ లో ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ కొడుతున్నారు. మీ కోసం కిన్నెర యాదయ్య నడుం బిగించారు. సెంట్రల్ లో గళం ఎత్తితేనే స్టేట్ లో పనులు అవుతాయని. IT రంగం లో పని చేస్తున్న తన మిత్రుడు చాలిక చంద్ర శేఖర్ నల్గొండ, వరంగల్ & ఖమ్మం నుండి MLC గా మరియు సికింద్రాబాద్ ఎంపీ గా పోటీచేస్తున్నారు.
చంద్ర శేఖర్ గారి సహకారం తో నల్గొండ లో IT హబ్ నెలకొల్పి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తా అంటున్నారు. మహిళాలు మరియు ఇంటి దగ్గరే ఉండి బిజినెస్ చేసే వారికీ డిజిటల్ ప్రమోషన్ అంటే పేస్ బుక్, ఇస్టాగ్రమ్, యూట్యూబ్ Social Media ద్వారా మీ బిజినెస్ అభివృద్ధి కి సహాయ పాడుతారు. ఫ్రీలాన్స్ జాబ్స్ కల్పించగలరు.
ముక్యంగా దేవరకొండ ప్రాంతం లో వెనుకబడిన గిరిజన బిడ్డలకు IT శిక్షణ తో పటు ఉపాధి కలిపంచడానికి మేము సిద్ధం.

వార్డు సభ్యలకు గౌరవ వేతనం ప్రకటించేటట్లు చూస్తా అంటున్నారు.
సర్పంచులకు, వార్డు సభ్యలకు స్థానిక MLC లో ఓటు హక్కు కల్పించేలా చేస్తానంటున్నారు
ఇదంతా జరగాలంటే మీరు మీ ఓటు తో
కిన్నెర యాదయ్య గారిని గెలిపించండి.
సీరియల్ nO 9 స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.
ఓట్ ఫర్ స్టూల్ !!
ఓట్ ఫర్ జాబ్స్ !!

నల్లగొండ పార్లమెంట్ MP స్వతంత్ర అభ్యర్థి గా btech నిరుద్యోగి కిన్నెర యాదయ్య స్టూల్ గుర్తు తో మీ ముందుకు వస్తున్నారు. EVM...
10/05/2024

నల్లగొండ పార్లమెంట్ MP స్వతంత్ర అభ్యర్థి గా btech నిరుద్యోగి
కిన్నెర యాదయ్య స్టూల్ గుర్తు తో మీ ముందుకు వస్తున్నారు. EVM లో
సీరియల్ nO 9 కి ఓటు వేసి గెలిపించండి.
నల్లగొండ లోని ప్రధాన సమస్య నిరుద్యోగం : ప్రభుత్వ ఉద్యోగాల ఊసేలేదు. కనీసం ప్రయివేటు రంగంలో IT జాబ్స్ చేద్దాం అనుకుంటే, నేర్చుకోడానికి సాఫ్ట్వేర్ IT హబ్ లేవు కానీ ఎక్కడో నార్త్ నుంచు వచ్చి అమీర్పేట్ లో ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ కొడుతున్నారు. మీ కోసం కిన్నెర యాదయ్య నడుం బిగించారు. సెంట్రల్ లో గళం ఎత్తితేనే స్టేట్ లో పనులు అవుతాయని. IT రంగం లో పని చేస్తున్న తన మిత్రుడు చాలిక చంద్ర శేఖర్ నల్గొండ, వరంగల్ & ఖమ్మం నుండి MLC గా మరియు సికింద్రాబాద్ ఎంపీ గా పోటీచేస్తున్నారు.
చంద్ర శేఖర్ గారి సహకారం తో నల్గొండ లో IT హబ్ నెలకొల్పి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తా అంటున్నారు. మహిళాలు మరియు ఇంటి దగ్గరే ఉండి బిజినెస్ చేసే వారికీ డిజిటల్ ప్రమోషన్ అంటే పేస్ బుక్, ఇస్టాగ్రమ్, యూట్యూబ్ Social Media ద్వారా మీ బిజినెస్ అభివృద్ధి కి సహాయ పాడుతారు. ఫ్రీలాన్స్ జాబ్స్ కల్పించగలరు.
ముక్యంగా దేవరకొండ ప్రాంతం లో వెనుకబడిన గిరిజన బిడ్డలకు IT శిక్షణ తో పటు ఉపాధి కలిపంచడానికి మేము సిద్ధం.

వార్డు సభ్యలకు గౌరవ వేతనం ప్రకటించేటట్లు చూస్తా అంటున్నారు.
సర్పంచులకు, వార్డు సభ్యలకు స్థానిక MLC లో ఓటు హక్కు కల్పించేలా చేస్తానంటున్నారు
ఇదంతా జరగాలంటే మీరు మీ ఓటు తో
కిన్నెర యాదయ్య గారిని గెలిపించండి.
సీరియల్ nO 9 స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.
ఓట్ ఫర్ స్టూల్ !!
ఓట్ ఫర్ జాబ్స్ !!

Yesterday Results 276/- Spent on FB Ads 48000 Reach
03/05/2024

Yesterday Results
276/- Spent on FB Ads
48000 Reach

02/05/2024

నల్లగొండ పార్లమెంట్ MP స్వతంత్ర అభ్యర్థి
కిన్నెర యాదయ్య
SL. NO-09
స్టూల్ గుర్తు
నా హామీలు:-
1. వార్డు సభ్యలకు గౌరవ వేతనం ప్రకటిస్తాము
2. సర్పంచులకు, వార్డు సభ్యలకు స్థానిక MLC లో ఓటు హక్కు కల్పిస్తాము.
3. గ్రాడ్యుయేట్లందరికీ IT కంప్యూటర్ ఉద్యోగాలు మరియు అండర్ గ్రాడ్యుయేట్‌లకు ఇతర ఉద్యోగాలు అందించడానికి నేను సిద్ధం..!!

నల్లగొండ పార్లమెంట్ MP స్వతంత్ర అభ్యర్థికిన్నెర యాదయ్యSL. NO-09స్టూల్ గుర్తునా హామీలు:-1. వార్డు సభ్యలకు గౌరవ వేతనం ప్రక...
02/05/2024

నల్లగొండ పార్లమెంట్ MP స్వతంత్ర అభ్యర్థి
కిన్నెర యాదయ్య
SL. NO-09
స్టూల్ గుర్తు

నా హామీలు:-
1. వార్డు సభ్యలకు గౌరవ వేతనం ప్రకటిస్తాము
2. సర్పంచులకు, వార్డు సభ్యలకు స్థానిక MLC లో ఓటు హక్కు కల్పిస్తాము.
3. గ్రాడ్యుయేట్లందరికీ IT కంప్యూటర్ ఉద్యోగాలు మరియు అండర్ గ్రాడ్యుయేట్‌లకు ఇతర ఉద్యోగాలు అందించడానికి నేను సిద్ధం..!!

చీరాల స్వతంత్ర అభ్యర్థి పోలిశెట్టి శ్రీనివాస రావుగాజు గ్లాసు గుర్తు కే మన ఓటుVote for Glass TumblerSL No. 15Free SAP & O...
02/05/2024

చీరాల స్వతంత్ర అభ్యర్థి పోలిశెట్టి శ్రీనివాస రావు
గాజు గ్లాసు గుర్తు కే మన ఓటు
Vote for Glass Tumbler
SL No. 15

Free SAP & Other Master Class ZERO Coding Jobs in SAP
అందరికీ, SAP మరియు IT కంప్యూటర్ శిక్షణ తో పాటు జాబ్స్ అందించగలను.

వర్చువల్ ఆఫీస్ ద్వారా రియల్ టైం ప్రాజెక్ట్ లో ట్రైనింగ్ ఇవ్వబడును
Fee: Only Referral Votes

చీరాల స్వతంత్ర అభ్యర్థి పోలిశెట్టి శ్రీనివాస రావుగాజు గ్లాసు గుర్తు కే మన ఓటుVote for Glass TumblerSL No. 15Free SAP & O...
02/05/2024

చీరాల స్వతంత్ర అభ్యర్థి పోలిశెట్టి శ్రీనివాస రావు
గాజు గ్లాసు గుర్తు కే మన ఓటు
Vote for Glass Tumbler
SL No. 15

Free SAP & Other Master Class ZERO Coding Jobs in SAP
అందరికీ, SAP మరియు IT కంప్యూటర్ శిక్షణ తో పాటు జాబ్స్ అందించగలను.

వర్చువల్ ఆఫీస్ ద్వారా రియల్ టైం ప్రాజెక్ట్ లో ట్రైనింగ్ ఇవ్వబడును
Fee: Only Referral Votes

Address

H. NO 2-65
Zaheerabad
502220

Telephone

+9618886882

Website

Alerts

Be the first to know and let us send you an email when Drushyamonlineweeklymagzine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share