Yemmiganur News

Yemmiganur News Yemmiganur, Kurnool Dist, Andhra Pradesh Telugu and Kannada are widely spoken languages in Yemmiganur. Now it is a Grade -I Municipality. It is a city at present.

Yemmiganur or Emmiganur is a city, mandal headquarters and a municipality in Kurnool district in the Indian state of Andhra Pradesh. Yemmiganur is one of the major towns in the Kurnool district. It was part of the Vijayanagar from the 14th century to the 16th century. From 1953 to 1956 it was an Andhra state, now in Andhra Pradesh. In 1965 the Panchayat of Yemiganur was upgraded to a Municipality.

( Yemmiganur Old Name Enumaluru )
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
About Yemmiganur : Yemmiganur is a City in Yemmiganur Mandal in Kurnool District of Andhra Pradesh State, India. It belongs to Rayalaseema region . It is located 71 KM towards west from District head quarters Kurnool. It is a Mandal head quarter. Yemmiganur Pin code is 518360 and postal head office is Yemmiganur

Venkatapuram ( 1 KM ) , Gudikal ( 2 KM ) , Mugathi ( 3 KM ) , (Hanumapuram ( 4 KM ) are the nearby Villages to Yemmiganur. Yemmiganur is surrounded by Nandavaram Mandal towards North , Peddakadabur Mandal towards west , Gonegandla Mandal towards East , Mantralayam Mandal towards North . Yemmiganur , Adoni , Raichur, Kodumur, Mantralayam, Kosigi, Manvi are the nearby Cities to Yemmiganur. (This Page Admin Mr.Wahab Prince)

10/12/2023
26/11/2023

• చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : జూనియర్‌ సివిల్‌ కోర్డు జడ్జి గురుఅరవింద్
----------------------
#ఎమ్మిగనూరు : చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జూనియర్‌ సివిల్‌ #కోర్డు #జడ్జి గురుఅరవింద్ అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని గీతామందిరం వద్ద గల ప్రభుత్వ బాలికల వసతి గృహంనందు ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవం మరియు #జాతీయన్యాయదినోత్సవం సందర్భంగా బాలికలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా #జడ్జి గురుఅరవింద్ మాట్లాడుతూ..చట్టం ముందు అందరూ సమానులేనని, కోర్టులో కేసులపై కొట్లాడలేని వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. చట్టాల గురించి తెలియపోవడం వల్లే ప్రజలు నేరాలకు పాల్పడుతున్నారని, క్రయ విక్రయాలు, లావాదేవీలలో మోసాలకు గురువుతున్నారని, వివాదాలలో ఇరుక్కుని ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. గృహహింస చట్టం, ఫ్రీ లిటిగేషన్ కేసులపై, జాతీయ లోక్ అదాలత్ ల పైన అవగాహన కలిగించారు. పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమని నిర్బంధ ప్రాథమిక విద్యపై అవగాహన కలిగించటమే కాకుండా పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, మురళీకృష్ణ, రంగనాథ్, లింగమూర్తి, ఏసేపు, సల్మాన్, రామకృష్ణనాయుడు, క్లర్క్ మహేశ్వరి టౌన్ ఎస్ఐ రమేష్ బాబు, కానిస్టేబుల్ రామాంజినేయులు కోర్టు సిబ్బంది, హాస్టల్ వార్డెన్ తో పాటు విద్యార్థినిలు పాల్గొన్నారు.

:



• •

25/11/2023

• నెల రోజుల పాటు జరిగే #ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠరాయ స్వామి #జాతర తేదీ ఖరారు. ( జనవరి 27 శనివారం )

:



• •

22/11/2023

★ Great Job Prince Wahab Bhai 👌🙏

★ 25 ఏళ్లుగా పేదలకు #సహాయం అంటే సామాన్యమైన విషయం కాదు.. Sir 🙏

★ అనాథ పిల్లలకు, అన్నార్థులకు, నిరుపేదలకు మరియు క్రీడాకారుల ప్రోత్సాహంలో మీ సహాయం అమోఘం సర్ 🙏

👉 #దూదేకుల_వహాబ్ - అలియాస్ #ప్రిన్స్_వహాబ్ 🫶 💐 🫶



#సేవ #సామాజికసేవ #సేవకార్యక్రమం

◆ ◆

18/11/2023

• జాతీయ స్థాయి సైన్స్ అండ్ టెక్నాలజీ కాంపిటీషన్ లో విన్నర్ సాధించిన ఎమ్మిగనూరు విద్యార్థి
• భువిన్ ను అభినందించిన మోనెశ్రీరాములు పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్
--------------------
#ఎమ్మిగనూరు : మధ్యప్రదేశ్ లోని #భోపాల్ లో జరిగిన హ్యాక్థన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాంపిటీషన్ నందు డేటా అనలిటిక్స్ ఉపయోగించి "నేల లక్షణాలను" నిర్ణయించడంలో కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మిగనూరు పట్టణ వాసి బి.భువిన్ ఛాంపియన్ గా నిలిచి విజేత అయ్యారు. శనివారం పట్టణంలోని హెచ్.బి.ఎస్ కాలనీ గల విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో హైదరాబాద్ లోని వోగ్జెన్‌ యూనివర్సిటి లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న భువిన్ అనే విద్యార్థి ని మాజీ టౌన్ బ్యాంక్ ఛైర్మెన్ మోనెశ్రీరాములు, పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ లు కలిసి శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జ్ఞాపికను అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..దేశంలోని వందకు పైగా యూనివర్సిటిల నుండి జాతీయస్థాయిలో అనేక మంది విద్యార్థులు పాల్గొనగా హ్యాక్థన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాంపిటీషన్ నందు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన విద్యార్థి విన్నర్ అవ్వడం విశేషమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షిశించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్, వైస్ ప్రిన్సిపాల్ ఉషాపరిమళ, రేఖ, ఫమీన సతీష్, ముజీబ్, రఫిక్, కేశవ, తిమ్మప్ప, మెహబూబ్, రాము తదితరులు పాల్గొన్నారు.

: ✒️



• •

06/11/2023
31/10/2023

- స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌

- 4 వారాలు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

- చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్‌

- తదుపరి విచారణ నవంబర్‌ 28కి వాయిదా వేసిన కోర్టు

- 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు

- సెప్టెంబర్‌ 9న నంద్యాలలో అరెస్ట్‌ అయిన చంద్రబాబు

- రూ.లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలన్న కోర్టు

- నవంబర్‌ 10న చంద్రబాబు రెగ్యులర్‌ బెయిల్‌పై విచారణ

- షరతులతో కూడిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను హైకోర్ట్ ఇస్తూ... విధించిన షరతులు..

- ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన కూడదు...

- కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు...

- ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది...

- CBN తో ఇద్దరు DSPలు ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి..

- Z+ సెక్యూరిటీ విషయంలో... కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, CBN సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్య..




• •

20/10/2023

• సిఎం జగన్ ను కలిసిన హీరో మహేష్ ఫ్యాన్స్ అద్యక్షుడు ప్రిన్స్ వహబ్

• వెల్డన్ వహాబ్ అంటూ అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
---------------------
#ఎమ్మిగనూరు : హీరో కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అద్యక్షుడు #ప్రిన్స్_వహాబ్ పట్టణంలోని స్థానిక #హెలిప్యాడ్ గ్రౌండ్ వద్ద #ముఖ్యమంత్రి #వైఎస్_జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రితో ప్రిన్స్ వహాబ్ గతంలో #హీరోకృష్ణమహేష్ ఫ్యాన్స్ తరుపున తను ప్రచారం చేసిన విషయాలను #సిఎం కు వివరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ..నీ పేరు కూడా మహేష్ బాబే న..అంటుండుగా స్థానిక #వైసిపి సీనియర్ నాయకుడు #ఎర్రకోటజగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకొని వహాబ్ అంటూ ముఖ్యమంత్రికి చెప్పగా వెంటనే వైఎస్ జగన్ చిరునవ్వుతో ఓకె #వహాబ్ వెల్ డన్ అంటూ భుజం తట్టాడు. చేతిని పట్టుకొని అభినందించాడు. తీపి గుర్తుగా ఒక సెల్ఫీ అడగ్గానే తీసుకోండని చెప్పి సంతోష పరిచారు.

YS Jagan Mohan Reddy

◆ ◆

19/10/2023

◆ జగనన్న చేదోడు కార్యక్రమం 3.25 లక్షల మందికి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం

◆ చేతివృత్తుల వారి కళ్ళలో ఆనందం నింపిన వైఎస్ జగన్
౼౼౼౼౼౼౼౼౼౼౼
#ఎమ్మిగనూరు : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంక్షేమ పథకాల్లో ఒకటి #జగనన్నచేదోడు. ఇప్పటికే మూడు విడతలుగా ఈ పథకం కింద నిధులను విడుదల చేస్తూ వచ్చింది. గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో జగనన్న చేదోడు పథకం కార్యక్రమాన్ని వర్చువల్ గా నాలుగో విడత కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ బటన్ నొక్కి వారి అకౌంట్లో నేరుగా జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 25 వేల మంది లబ్ధిదారులకు లంచాలకు వివక్షకు తావు లేకుండా ఆర్థిక సహాయం అందించారు. ఇలా అర్హులైన చేతివృత్తుల వారైన రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు 10 వేల రూపాయలు చొప్పున బటన్ నొక్కి జమ చేశారు. దాదాపు ₹325 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో #ముఖ్యమంత్రి జమచేసి వారి కళ్ళల్లో ఆనందం నింపారు.

YS Jagan Mohan Reddy

• •

19/10/2023

Helipad Entry Scene in 💥🔥

19/10/2023

బ్రేకింగ్ న్యూస్

• కర్నూలు నుంచి హెలి ప్యాడ్ ద్వారా బయలుదేరిన సీఎం వైయస్ జగన్*

• సీఎం వైయస్ జగన్ తో పాటు కలెక్టర్ సృజన మరియు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాక

• మరి కాసేపట్లో ( 15 మినిట్స్ ) ఎమ్మిగనూరుకు చేరనున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్

YS Jagan Mohan Reddy

• •

18/10/2023

• ముఖ్యమంత్రి సభ సర్వం సిద్దం..రేపే ఎమ్మిగనూరుకు వైఎస్ జగన్ రాక

• జగన్ రాకకోసం పేద బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎదురుచూపులు

• లక్ష మందికి పైగా జనాభా వస్తారని అంచనా
--------------------
#ఎమ్మిగనూరు : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు అనగా గురువారం 19వ తేదీ తాడేపల్లిగూడెం #ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి #కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చేరుకోనున్నారు. ఉదయం 8:30 గంటలకు హెలిప్యాడ్ ప్రాంతంలో చేరుకొని తన కాన్వాయ్ బస్ ద్వారా ప్రజలకు అభివాదం తెలుపుతూ 10 గంటలకు సభ ప్రాంగణంకు చేరుకుంటారు. అనంతరం సభా వేదికపై #జగనన్నచేదోడు చేతివృత్తుల కార్యక్రమంపై ప్రసంగిస్తారు. సభ, సభా ప్రాంగణం చుట్టూ జిల్లా అధికారాలుతో పాటు #ఎమ్మెల్యే చెన్నకేషవరెడ్డి లు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ వైయస్ జగన్ అభిమానులతో పాటు ఎమ్మిగనూరు మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల నుంచి దాదాపు లక్ష మందికి పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను వీక్షించడానికి పెద్ద ఎత్తున చేరుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



• •

17/10/2023

◆ సిఎం జగన్ భారీ స్టేజ్.. స్టేజ్ ప్రాంగణం చూసి ఆవాక్కయిన ప్రజలు

• ఈనెల 19న ఎమ్మిగనూరు రాక

◆ కళ కళ లాడుతున్న జగనన్న ఫ్లెక్సీలు

◆ వేలాది సంఖ్యలో ప్రజలు అభిమానులు తరలిరావాలని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పిలుపు
-----------------------
#ఎమ్మిగనూరు : రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు అవసరమైన చేతి పనిముట్లు, వారికి పెట్టుబడి కోసం #జగనన్నచేదోడుపథకం కింద లబ్దిదారులకు ప్రతి సంవత్సరం రూ.10 వేల సహాయం ఆర్థిక సహాయం నాలుగో విడత ఈనెల 19న #కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ సభలో #ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి అందించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లను జిల్లా అధికారులతో పాటు స్థానిక #ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ప్రజాప్రతినిధులు శరవేగంగా ముస్తాబుకు సిద్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు హెలిప్యాడ్ ప్రాంతం దగ్గర నుంచి సభ స్థలం వరకు..రోడ్డుకు ఇరువైపుల భారీ ఫ్లెక్సీ లతో అలంకరించారు. సభ స్థలం వద్ద భారీ కట్ ఔట్ లను ఏర్పాటు చేయనున్నారు. స్నిఫ్ఫర్ డాగ్ ద్వారా #పోలీస్ టీం వారు హెలిప్యాడ్ ప్రాంతం, సభా ప్రాంగణంను తనిఖీ చేసి పరిశీలించారు.

: ✍️



◆ ◆

16/10/2023

• చరిత్రలో నిలిచిపోయేలా సిఎం జగన్ సభ వుంటుంది : ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి

• ఎమ్మిగనూరులో సిఎం జగన్ సభకు ఏర్పాట్లు చక చక

• సభ వేదికతో పాటు, ప్రజల గ్యాలరీ, పార్కింగ్, బందోబస్తు, వివిధ ఏర్పాట్లపై అధికారులతో చర్చలు
-------------------------

#ఎమ్మిగనూరు చరిత్రలో నిలిచిపోయేలా సిఎం సభ వుంటుందని కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పార్టీ నేతలకు, అధికారులకు సూచించారు. సభకు వేలాది ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. బుధవారం సాయంత్రంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇటీవలే జిల్లా అధికారులు సభాస్థలంతో పాటు హెలిప్యాడ్ ప్రాంగణంను పరిశీలించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సభా ప్రాంగణ ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక వీవర్స్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో #జగనన్నచేదోడుపథకం నాలుగో విడత ఆర్థిక సహాయం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ఉపన్యాసం వుంటుంది.



• •

A Kind Person 🙏🫶💐Great Job Sir   🙏
28/08/2023

A Kind Person 🙏🫶💐

Great Job Sir 🙏

• #మదర్_థెరిస్సా లోని మానవత్వం..హీరో #సూపర్_స్టార్ #మహేష్_బాబు ల దయాగుణం..వారి స్ఫూర్తి తోనే సేవా కార్యక్రమాలు అంటున్న ఎమ్మిగనూరు ప్రిన్స్ వహాబ్

• వృత్తి వ్యాపారం..ప్రవృత్తి ప్రజాసేవ..!

• సొంత డబ్బులతోనే సేవా కార్యక్రమాలు..విరాళాల సేకరణకు..అవార్డులకు దూరం..!

• హంగు ఆర్భాటాలకు దూరం

• మన పేజీ ఎడిటర్ అడ్మిన్ అయిన #ప్రిన్స్_వహాబ్ గారు గత 25 సంవత్సరాలుగా చేసిన సేవా కార్యక్రమాలను వర్ణిస్తూ..43 సంవత్సరాల #ప్రజాశక్తి నేటి పత్రికలో ఫుల్ పేజీని పబ్లిష్ చేసిన #కర్నూలు జిల్లా ప్రజాశక్తి మేనేజ్మెంట్ వారికి, #ఎమ్మిగనూరు ఇంచార్జ్ విలేఖరి గారికి నా ప్రత్యేక ధన్యవాదములు 🙏🫶

🙏 Mahesh Babu Trivikram Srinivas Haarika & Hassine Creations

#సేవాకార్యక్రమాలు
#సేవ #మానవత్వం



•. •

Address

H. No: 1/1332-8 , HBS-Colony
Yemmiganur
518360

Telephone

+919985993726

Website

Alerts

Be the first to know and let us send you an email when Yemmiganur News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies


Other Media/News Companies in Yemmiganur

Show All