YGR News

YGR News YGR-NEWS is an official page and it will be updating the latest information about YGR that happens o Now it is a Grade -I Municipality. It is a city at present.

Yemmiganur or Emmiganur is a city, mandal headquarters and a municipality in Kurnool district in the Indian state of Andhra Pradesh. Telugu and Kannada are widely spoken languages in Yemmiganur.

is one of the major towns in the Kurnool district. It was part of the Vijayanagar from the 14th century to the 16th century. From 1953 to 1956 it was an Andhra state, now in Andhra Pradesh. In 1965 the Panchayat of Yemmiganur was upgraded to a Municipality.

• ఎమ్మిగనూరు నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు• అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన...
13/11/2024

• ఎమ్మిగనూరు నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు

• అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

• ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు.

• ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థను కాపాడుతానన్నారు. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు



• •

• పేదింటి బిడ్డ ఫుట్బాల్ ఆటలో మెరికల్• జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఈశ్వర్ ----------------- #ఎమ్మిగనూరు : పట్టణానికి చె...
13/11/2024

• పేదింటి బిడ్డ ఫుట్బాల్ ఆటలో మెరికల్
• జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఈశ్వర్
-----------------
#ఎమ్మిగనూరు : పట్టణానికి చెందిన ఇంద్రానగర్ వాసి పేదింటి బిడ్డ ఈశ్వర్ ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అండర్-19 ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్ షిప్ పోటీలో మెరికల్లాంటి ఆటను కనబరిచి సత్తా చాటాడు, దీంతో డిసెంబర్ మొదటి వారం మణిపూర్ లో జరిగే జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు, పట్టణంలోని దీక్షా కాలేజీలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ఈశ్వర్ ను విద్యార్థులు, సిబ్బంది, పట్టణ క్రీడాకారులు అభినందించారు, అయితే ఈశ్వర్ తల్లిదండ్రులు నాగరాజు-లక్ష్మి లు పొట్టకూటి కోసం కూలి నాలి చేసుకుని జీవనం సాగిస్తున్నారు, క్రీడాకారుడు ఈశ్వర్ మాట్లాడుతూ మాది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అయినా మా తల్లిదండ్రులు నన్ను చదివిస్తున్నారు క్రీడలను ప్రోత్సహిస్తున్నారన్నారు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడటం మానలేదన్నారు, నాకు వెన్నంటి ప్రోత్సహిస్తున్న కోచ్ మాబుసాబ్, పిఈటి నరసింహారాజు, వై ఎఫ్ సి సభ్యులు సర్తాజ్, సుభాన్ ల కఠోర శ్రమ, ఆటలోని మెలుకువలను నేర్పించారన్నారు,



• •

• జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన ఎమ్మిగనూరు క్రీడాకారుడు అభిరామ్ రాజ్• తండ్రి కోచింగ్ లో సత్తా చాటిన విద్యార్థి---...
12/11/2024

• జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన ఎమ్మిగనూరు క్రీడాకారుడు అభిరామ్ రాజ్
• తండ్రి కోచింగ్ లో సత్తా చాటిన విద్యార్థి
--------------
ఎమ్మిగనూరు : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వడ్డే అభి రామ్ రాజ్ ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ - 19 ఫుట్బాల్ పోటీలో సత్తాచాటి తన వ్యక్తిగత ఆటను కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు, ఈ పోటీలు డిసెంబర్ నెల మొదటి వారం మణిపూర్ రాష్ట్రం ఇంపాల్ నగరంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల పట్టణ ప్రజలు క్రీడాకారులు హర్షించారు, ఈసందర్భంగా క్రీడాకారుడు అభిరాంరాజ్ మాట్లాడుతూ తన విజయానికి తోడ్పాటు అందించిన కోచ్ మాబు సాబ్ తో పాటు నా తండ్రి నరసింహరాజు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, తన తండ్రి వద్ద ఫుట్బాల్ ఆటలో ఓనమాలు నేర్చుకున్నానని తన విజయానికి కారణాలను వెల్లడించాడు



• •

• ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ• మానవసేవయే మాధవసేవ : నాగేంద్ర కుమార్--------------ఎమ్మిగనూరు/నందవ...
12/11/2024

• ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ
• మానవసేవయే మాధవసేవ : నాగేంద్ర కుమార్
--------------
ఎమ్మిగనూరు/నందవరం : మండలం లోని కనకవీరుడు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కొరకు దాదాపు 35 వేల రూపాయలు విలువచేసే 400 స్టీల్ ప్లేట్లను అదే పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగేంద్ర కుమార్ విద్యార్థుల కొరకు ఉచితంగా అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గౌరమ్మ చేతుల మీదుగా స్టీల్ ప్లేట్లను పాఠశాలకు అందజేశారు, అనంతరం ఆమె మాట్లాడుతూ దానగుణం చాలా గొప్పదని డబ్బులు ఉండగానే సరిపోదు అని సేవ చేసే మనసు ఉండాలని నాగేంద్ర కుమార్ సేవలను కొనియాడారు ఈ సందర్భంగా గణితం ఉపాధ్యాయుడు నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ దృక్పథంతో పేద విద్యార్థులకు సేవ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ప్రకాష్,శివశంకర్,రామాంజినేయులు,వెంకటేష్,రామ్,నాగరాజు, మీనాక్షి, ఈరన్న,రాజశేఖర్, దవళేశ్వరి తదితరులు పాల్గొన్నారు

• •

ప్రిన్స్ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు, సోషల్ మీడియా ద్వారా వార్తలను అందిస్తున్న వైజిఆర్ న్యూస్ అడ్మిన్ అయిన దూదేకుల వహ...
15/09/2024

ప్రిన్స్ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు, సోషల్ మీడియా ద్వారా వార్తలను అందిస్తున్న వైజిఆర్ న్యూస్ అడ్మిన్ అయిన దూదేకుల వహాబ్ అలియాస్ ప్రిన్స్ వహాబ్ గత 26 సంవత్సరాలుగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాల గూర్చి స్పెషల్ ఎడిషన్ నందు ప్రచురించారు

మానవతావాది మదర్ థెరిస్సా మరియు హీరో మహేష్ బాబు ను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికే అనాధలకు, పేదలకు, క్రీడాకారులకు తమ వంతు సహాయం చేశారు

భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆ అల్లా ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నాము 🙏

Good Job Brother


#సేవ #సేవాకార్యక్రమం #స్వచ్ఛందసేవాసమితి #ఎమ్మిగనూరు

• •

02/08/2024

• శ్రీశైలం డ్యాం లేటెస్ట్ డ్రోన్ విజువల్స్.. వాటి వివరాలు

♦శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులు*

♦ ఔట్‌ ఫ్లో 4.91 లక్షల క్యూసెక్కులు

♦ జలాశయం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

♦ శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు

♦ ప్రస్తుత నీటిమట్టం 883.8 అడుగులు

♦ గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలు

♦ ప్రస్తుత నీటినిల్వ 208.7 టీఎంసీలు

✒️:



• •

• హోమియోపతి పరీక్షల్లో సత్తా చాటిన ఎమ్మిగనూరు సర్ల కావ్యశ్రీ • అభినందించిన తల్లిదండ్రులు స్థానికులు---------------- #ఎమ్...
01/08/2024

• హోమియోపతి పరీక్షల్లో సత్తా చాటిన ఎమ్మిగనూరు సర్ల కావ్యశ్రీ
• అభినందించిన తల్లిదండ్రులు స్థానికులు
----------------
#ఎమ్మిగనూరు : ఇటీవల జరిగిన ఆల్ ఇండియా పీజీ ఆయుష్ హోమియోపతి పీజీ పరీక్షల్లో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన సర్ల కావ్యశ్రీ సత్తా చాటడంతో తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజలు హర్షించారు. గురువారం పట్టణంలోని హెచ్.బి.ఎస్ కాలనీలో గల విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోమియోపతి పీజీ పరీక్షల్లో సత్తా చాటి ఆల్ ఇండియా స్థాయిలో 119 ర్యాంకును సాధించి ఏపీ స్టేట్ లో టాపర్ గా నిలవడంతో కావ్యశ్రీ ని తల్లితండ్రులు మోహన్, ఉషాపరిమళ తో పాటు కుటుంబ సభ్యులు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కావ్యశ్రీ టెన్త్ ఇంటర్లో టాపర్ గా నిలవడమే కాకుండా నీట్ [UG] ద్వార బయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విభాగంలో శంషాబాద్ జిమ్స్ యూనివర్సిటీలో టాపర్ గా నిలిచిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ ఎదగాలని కోరారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సూర్యబాబు, రాధ, తదితరులు పాల్గొన్నారు.

• •

• పియిటి, పిడి ల ప్రెసిడెంట్ గా బజారప్ప కార్యదర్శిగా రవీంద్ర లు ఎన్నిక• రాష్ట్ర జిల్లా నాయకులు ఎపి.రెడ్డి, శ్రీనాథ్, పుల...
29/07/2024

• పియిటి, పిడి ల ప్రెసిడెంట్ గా బజారప్ప కార్యదర్శిగా రవీంద్ర లు ఎన్నిక
• రాష్ట్ర జిల్లా నాయకులు ఎపి.రెడ్డి, శ్రీనాథ్, పుల్లన్న, రాజారాంమోహన్ ఆధ్వర్యంలో ఎన్నిక
• ఎన్నికైన పియిటి లకు ఘన సన్మానం
--------------
#ఎమ్మిగనూరు : ఏపి స్కూల్ అసిస్టెంట్ ఎమ్మిగనూరు జోన్ పిఈటి అసోసియేషన్ ను పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీవర్స్ కాలనీ నందు ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర పియిటి ల సంఘం నాయకులు అబ్జర్వర్ గా వ్యవహరించిన ఎం.రాజారాంమ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభలో ప్రెసిడెంట్ గా ఎన్నికైన వీవర్స్ కాలనీ పాఠశాలకు చెందిన పిడి బజారప్ప, జనరల్ సెక్రటరీగా సూగురు జిల్లా పరిషత్ హైస్కూల్ చెందిన పిడి రవీంద్ర, ఉపాధ్యాక్షులు గా దైవందిన్నె జిల్లా పరిషత్ హైస్కూల్ కు చెందిన పిడి రామన్న, జాయింట్ సెక్రటరీ గా కోటేకల్ ఉమాపతి, ట్రెజరర్ గా కనకవీడు ఈ.ఈరన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా వర్కూర్ కృష్ణ లను ఎన్నుకున్నారు. అనంతరం వీరిని రాష్ట్ర నాయకులచే శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పిఈటి ల సంఘానికి మంచి పేరు సంపాదించి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు సంపాదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పిడి లు లతీఫ్, రాజశేఖర్, బసవరాజు, బబ్లూ, మహిళా పిఈటి లు శిరీష, నాగేశ్వరి, రాజేశ్వరి, ప్రశాంతి, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

• •

• స్వర్గీయ మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు మహిళలకు వృద్ధులకు పాల...
27/07/2024

• స్వర్గీయ మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు మహిళలకు వృద్ధులకు పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు.

• ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..అభివృద్ధి అంటే మాచాని సోమప్ప తర్వాత గుర్తుకొచ్చే పేరు స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారేనని కొనియాడారు. ఆయన ఎమ్మిగనూరు కు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు.



• •

• మదరసా పిల్లలకు అన్నదానం• ఘనంగా మాజీ మునిసిపల్ వైస్ ఛైర్మెన్ బషీర్ అహమ్మద్ నాలుగవ వర్ధంతి-------------------------- #ఎమ...
24/07/2024

• మదరసా పిల్లలకు అన్నదానం
• ఘనంగా మాజీ మునిసిపల్ వైస్ ఛైర్మెన్ బషీర్ అహమ్మద్ నాలుగవ వర్ధంతి
--------------------------
#ఎమ్మిగనూరు : పట్టణంలోని స్థానిక లారీ అసోసియేషన్ కాంప్లెక్స్ వద్ద ఎమ్మిగనూరు కు చెందిన మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ ముస్లిం మైనారిటీ నాయకుడు కీర్తిశేషులు బషీర్ అహమ్మద్ గారి నాలుగవ వర్ధంతి వేడుకలను ఆయన కుటుంబ సభ్యులు బంధు మిత్రుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. ఆయన జ్ఞాపకార్థంగా సుమారు 100 మంది మదరసా పిల్లలకు అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన కుమారుడు ప్రస్తుత మునిసిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ మాట్లాడుతూ..బషీర్ అహమ్మద్ తన పదవి ద్వారా ప్రజలకు రాజకీయంగా ఒక ప్రజా ప్రతినిధిగా ఎనలేని సేవలు అందించారని వివరించారు. అటువంటి వ్యక్తి మరణించడం ఎంతో బాధాకరమని అతను చనిపోయి నాలుగు సంవత్సరాలు గడిచిపోయిన్నప్పటికీ ఇంకా అందరితో బషీర్ అహమ్మద్ కలిసి ఉన్నాడనే భావన ఉంటుందని పేర్కొన్నారు. బషీర్ అహమ్మద్ మిత్రులు రియాజ్, భీమరెడ్డి, ప్రకాష్ జైన్, పక్కీర్ సాహెబ్, తెలుగురాముడు లు మాట్లాడుతూ..బషీర్ అహమ్మద్ రెండు సార్లు హజ్ యాత్రకు వెళ్ళారు. పలు మసీదులకు వెళ్తూనే నిత్యం ముస్లింలకు అందుబాటులో వుండి వారికి సహరించేవారని గుర్తు చేశారు. ఆయనవలె తన కుమారులు ఎదగాలని కోరారు. కార్యక్రమానికి నివాళులు అర్పించిన వారిలో వైసిపి సీనియర్ నాయకులు రియాజ్ అహమ్మద్, హాజీ వహబ్, కొమ్మురాజు, షబ్బీర్, శాబుద్దీన్, వాహీద్, గడ్డంనారాయణరెడ్డి, సన్నిహితులు తెలుగురాముడు, పక్కీర్ సాహెబ్, ప్రకాష్ జైన్, కుమారుడు ఇర్ఫాన్, సోదరులు చాంద్ పీరా, రాజాచాంద్, మేనల్లుడు ప్రిన్స్ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు వహాబ్, వెంకటేష్, లుక్మాన్ మిత్రులు పెయింటర్ శ్రీను, గురవయ్య, రసూల్, కృష్ణ, మస్తాన్, సైఫుల్లా, పాత్రికేయులు గిప్సన్, రెహమాన్, స్నేహ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



• •

◆ సైనికుడి సన్మానం దేశానికి చేసినట్టు◆ ఎమ్మిగనూరు లో ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం౼౼౼౼౼౼౼౼౼౼ #ఎమ్మిగనూరు : కర్నూలు జిల్లా ఎమ...
15/07/2024

◆ సైనికుడి సన్మానం దేశానికి చేసినట్టు
◆ ఎమ్మిగనూరు లో ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం
౼౼౼౼౼౼౼౼౼౼
#ఎమ్మిగనూరు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన బండా సత్యనారాయణ ఇండియన్ ఆర్మీ లో సేవలందించి పదవి విరమణ పొంది ఎమ్మిగనూరు కు రావడంతో సోమవారం ఆయనకు ప్రిన్స్ స్వచ్చంద సేవా సమితి సభ్యులు, ఉపాధ్యాయులు,క్రీడాకారులు,మిత్రులు వారి కుటుంబ సభ్యులతో కలిసి బిఎస్ఎఫ్ జవాన్ ను ఘన స్వాగతం పలికారు. దేశం కోసం కుటుంబాన్ని వదిలి 22 సంవత్సరాల పాటు సేవాలందించి తిరిగి రావడంతో పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేదికలో తెదేపా నాయకులు రామకృష్ణనాయుడు, రంగస్వామిగౌడ్, వైసిపి నాయకులు పాల శ్రీనివాసరెడ్డి, విశ్వనాథ్ రమేష్, ప్రిన్స్ సేవా సమితి అధ్యక్షుడు వహాబ్, విజేత నాగరాజు, ప్రధానోపాధ్యాయుడు లచ్చప్ప, డిప్యూటీ తహశీల్దార్ విజయ్, లు కలిసి దుస్సాలువలు పూలమాలలతో జ్ఞాపిక ను అందించి ఘనంగా సత్కరించారు.అనంతరం సోమప్ప సర్కిల్, వైఎస్ సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించి బాణసంచా పేల్చి వీవర్స్ కాలనీ తన ఇంటికి చేర్చారు. కార్యక్రమంను ఉద్దేశించి వారు మాట్లాడుతూ..సైనికుడి కి సన్మానం దేశానికి చేసినట్టేనన్నారు.దేశ సరిహద్దుల్లో ఎన్నో సవాళ్లతో కూడుకుని వున్న ఆర్మీ ఉద్యోగం చేసి పదవి విరమణ పొందడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుమార్,శ్రీధర్,వెంకటేష్,రెహ్మాన్,శ్రీనివాసులు,పెద్దఈరన్న,శ్రీరామ్,సిజి.ఈరన్న,చాంద్,ఓంకార్,కర్ణ,చంద్రమోహన్,వీరశేఖర్,మాదన్న,అశోక్,సర్తాజ్, కృష్ణ,రాజు తదితరులు పాల్గొన్నారు.



• •

◆ ఫుట్ బాల్ కోచ్ మాబుసాబ్ కు లక్ష ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం◆ మానవత్వం చాటుకున్న ఎమ్మినూరు క్రీడాకారులు౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ #...
12/06/2024

◆ ఫుట్ బాల్ కోచ్ మాబుసాబ్ కు లక్ష ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం
◆ మానవత్వం చాటుకున్న ఎమ్మినూరు క్రీడాకారులు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#ఎమ్మిగనూరు : ఫుట్ బాల్ కోచ్ మాబుసాబ్ ఆరోగ్య పరిస్థితిపై చలించిపోయారు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన క్రీడాకారులు. గత నెల రోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న మాబుసాబ్ కు మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మిగనూరు ఫుట్ బాల్ క్లబ్ (YFC ) సభ్యులు కలిసి వైద్యం ఖర్చుల కోసం రూ.లక్ష ఐదు వేల నగదును ఆర్థిక సహాయంగా అందించి మానవత్వం చాటుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా బాధిత కుటుంబానికి వై.ఎఫ్.ఎ క్రీడా సభ్యులు అండగా ఉంటామని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యలు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో వై.ఎఫ్.సి క్రీడా సభ్యులు విక్రమ్, పెద్దఈరన్న, ప్రసాద్, వీరేష్, ముని, శ్రీనివాసరెడ్డి, నాగరాజు, హనీఫ్, కర్ణకార్ రెడ్డి, శ్రీరాములు, సిజి ఈరన్న, విజయ్, చాంద్, లతీఫ్, నరసింహారాజు లు పాల్గొన్నారు.



• •

👉 మే 13న ఎవరికి బటన్ నొక్కలనుకుంటున్నారు.కూటమికా - జగన్ కా ..? •   •
06/05/2024

👉 మే 13న ఎవరికి బటన్ నొక్కలనుకుంటున్నారు.

కూటమికా - జగన్ కా ..?

• •

• ఎమ్మిగనూరు లో ఘనంగా నూర్ భాష దూదేకుల సింహగర్జన• భారీ మెజారిటీ తో గెలిపించండి : బుట్టారేణుక------------------ #ఎమ్మిగనూ...
01/05/2024

• ఎమ్మిగనూరు లో ఘనంగా నూర్ భాష దూదేకుల సింహగర్జన
• భారీ మెజారిటీ తో గెలిపించండి : బుట్టారేణుక
------------------
#ఎమ్మిగనూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్‌ బాషా (దూదేకుల) ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సయ్యద్ బాజీ ఎమ్మిగనూరు పట్టణ మునిసిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ ఆధ్వర్యంలో స్థానిక బాబు ఫంక్షన్ హాల్ నందు బుదవారం నూర్ బాష దూదేకులస్థుల సింహగర్జన కార్యక్రమం భారీగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక హాజరై మాట్లాడారు. సామాజిక వర్గానికి చెందిన నూర్‌ బాషా దూదేకులస్తుల కొరకు ఓ కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. దూదేకుల కులాన్ని కులం పేరుతో ఎవరైనా విమర్శించినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా జీవో తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కొనియాడారు. మే 13 న జరిగే ఓటింగ్ కు బటన్ నొక్కి ఎమ్మెల్యే గా భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. సంక్షేమం అభివృద్ధి రెండు సమపాళ్లలో జరగాలంటే జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో దూదేకుల సంఘం నాయకులు మన్సూర్ అహమ్మద్, రాజాచాంద్, చైతన్య ఖాసిం, టెలిఫోన్ నబిరసూల్, సిరాలదొడ్డి ఖాజ, మాబుహుస్సేన్, ఇర్ఫాన్, వలి, సికిందర్, బద్రుల్, మధు, డిష్ మాబు, గఫూర్, మస్తాన్, మండలాల్లోని గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.



• •

● ఎమ్మిగనూరు ఎన్డీయే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బివి జయనాగేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు● భారీగా పాల్గొన్న కార్యకర్తలు, అభ...
18/04/2024

● ఎమ్మిగనూరు ఎన్డీయే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బివి జయనాగేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు

● భారీగా పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు
౼౼౼౼౼౼౼౼౼
ఎమ్మిగనూరు : నియోజకవర్గ టిడిపి+బిజెపి+జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బివి జయనాగేశ్వరరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మాచాని సోమనాథ్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

● ●

• ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గా నామినేషన్ దాఖలు చేసిన శ్రీమతి బుట్టారేణుక• హాజరైన ఎమ్మెల్యే ఎర్రక...
18/04/2024

• ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గా నామినేషన్ దాఖలు చేసిన శ్రీమతి బుట్టారేణుక
• హాజరైన ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, జిల్లా వైసిపి ఎంపి అభ్యర్థి బీవై రామయ్య
---------------
#ఎమ్మిగనూరు : అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి బుట్టారేణుకతో పాటు పార్టీ శ్రేణులు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ జన నీరాజనం పలికారు. గురువారం పట్టణంలోని స్థానిక వైసిపి కార్యాలయం నుంచి వైఎస్సార్ సర్కిల్ మీదుగా వేలాది మంది కార్యకర్తలతో బైక్‌ ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, కర్నూలు జిల్లా వైసిపి ఎంపి అభ్యర్థి బీవై రామయ్య, వీరశైవ లింగాయత్ అధ్యక్షులు రుద్రగౌడ్, వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ తో పాటు ఇతర సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

• •

31/03/2024

• హెలికాఫ్టర్ ద్వారా #ఎమ్మిగనూరు చేరుకున్న #తెదేపా అగ్రనేత నారా చంద్రబాబునాయుడు..వాటి సన్నివేశాలు మీకోసం



• •

Address

Yemmiganur

Telephone

+919985993726

Website

Alerts

Be the first to know and let us send you an email when YGR News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to YGR News:

Videos

Share