09/05/2021
సీఎం కేసీఆర్ ను అభినందించిన ప్రధాని మోదీ.
తెలంగాణలో కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్
సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తికి కారణమవుతున్న
వారిని గుర్తించి.. వారికి కరోనా టీకాలు వేస్తే బాగుంటుందని
సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు,
గ్యాస్ డెలివరీ బాయ్స్, వీధి వ్యాపారులు, కార్మికులను
గుర్తించి వారికి కరోనా టీకా ఇవ్వాలన్నారు. అనంతరం కేంద్ర
మంత్రి హర్షవర్ధన్ తో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు.
కరోనా నియంత్రణకు కొన్ని సూచనలు చేశారు. సీఎం కేసీఆర్
సూచనలపై హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారు. ప్రధానితో
మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.
సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో ఫోన్ లో
మాట్లాడారు. కేసీఆర్ సూచనలు బాగున్నాయని, కేంద్ర
మంత్రి హర్షవర్ధన్ తనకు వివరించారని మోదీ తెలిపారు.
వాటిని ఆచరణలో పెడతామని అన్నారు. మంచి సూచలను
చేసినందుకు కేసీఆర్ ను అభినందించారు. ఈ సందర్భంగా
తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఔషధాల
సరఫరాను పెంచాలని సీఎం విజ్ఞప్తి చేశారు.