ప్రజా టివి

ప్రజా టివి ప్రజా టివి

28/04/2023

ప్రజా సేవలో దూసుకుపోతున్న డా క్రిష్ణ కిషోర్ రెడ్డి ...

13/04/2023

తెలంగాణాలో మీరు ఉంటారో ఊడతారో తెలియదు మంత్రి హరీష్ రావు పై పేర్నినాని సెటైర్లు

13/04/2023

ఎమ్మెల్సీ గా యం వి రామచంద్ర రెడ్డి ప్రమాణస్వీకారం ...

 #ఆకాశాన్ని దాటేస్తున్నాం....అన్నం పెట్టిన వాడిని మరచిపోతున్నాం....
07/12/2020

#ఆకాశాన్ని దాటేస్తున్నాం....అన్నం పెట్టిన వాడిని మరచిపోతున్నాం....

Heavy Rains in Tirumala
26/11/2020

Heavy Rains in Tirumala

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖనివర్ తుపాను రాగల 6 గంటల్లో తీవ్రవాయుగుండం, ఆ తదుపరి 6 గంటల్లో వాయుగుండంగా బలహీ...
26/11/2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

నివర్ తుపాను రాగల 6 గంటల్లో తీవ్రవాయుగుండం, ఆ తదుపరి 6 గంటల్లో వాయుగుండంగా బలహీనపడనుంది.

తీరందాటిన ప్రభావం చూపనున్న నివర్

నివర్ ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు

చిత్తూరు , కర్నూలు ,ప్రకాశం , వైఎస్ఆర్ కడప జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు , అక్కడక్కడ అతి తీవ్రభారీ వర్షాలు

మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు

ప్రభావిత ప్రాంత ప్రజలు తప్పనిసరిగా వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి

నదులు , వాగులు దాటే ప్రయత్నం చేయరాదు

రైతులు అప్రమత్తంగా ఉండండి
కె.కన్నబాబు
కమిషనర్ , విపత్తుల శాఖ

శబరిమల అయ్యప్ప!కార్తీక మాసం ప్రారంభంతోనే, లక్షలాదిమంది భక్తులు, హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠిన...
25/11/2020

శబరిమల అయ్యప్ప!

కార్తీక మాసం ప్రారంభంతోనే, లక్షలాదిమంది భక్తులు, హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠినమైన నియమ నిష్ఠలతో, 41 రోజుల పాటు మండలదీక్ష చేయడంతో, మాలధారులు పునీతులవుతారు. ఆధ్యాత్మిక జీవనశైలి అలవడుతుంది. తెల్లవారుఝామున లేచి, బ్రహ్మముహూర్తంలో, చన్నీటి స్నానం చేయడం.. కటిక నేలపై నిద్రపోవడం.. నల్లని బట్టలు ధరించి, చందన ధారణతో, ప్రతి ఒక్కరినీ స్వామీ అని పిలవడం... ప్రతి ఒక్క మాలధారుడి జీవనశైలిని మార్చివేస్తుంది.
నియమాల తోరణం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి:https://www.youtube.com/watch?v=4XnCXOXGZbk ]

కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలోని పశ్చిమ కనుమల్లో, శబరిమల క్షేత్రం నెలకొనివుంది. స్వామిని ఏడాదిలో, కొన్ని రోజులు మాత్రమే, దర్శించుకోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా, మలయాళ వృశ్చికమాసం అయిన నవంబరు-డిసెంబరులో, మండల చిరప్పు ప్రారంభమవుతుంది. ఇందుకోసం, కార్తీకం ముందునుంచి, దీక్ష తీసుకుంటారు భక్తులు. నల్లని బట్టలు ధరించి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, ఏకభుక్తం ఉంటూ, వారు సాగించే దీక్షలోని నియమాలు, చాలా కష్టతరమైనవి. అలాగే, దీక్షా సమయంలో, అందరినీ 'స్వామి'గా భావించి, వ్యవహరించడం, అపురూప అనుభూతినిస్తుంది. మండలకాలం అంటే, 41 రోజుల పాటు, స్వామిదీక్షను పూర్తిచేసుకుని, ఇరుముడిని కట్టుకుని, శబరిమలకు వెళ్లాలి. నేతితో నిండిన కొబ్బరికాయలూ, పూజాద్రవ్యాలూ, బియ్యం, వస్త్రాలూ... తదితరాలతో నిండిన ఇరుముడి మూటను, గురుస్వామి, స్వాముల శిరస్సున ఉంచుతారు.

ఎరుమేలితో ఆరంభం..
ఇరుముడి తలదాల్చిన భక్తబృందం, ఎరుమేలి నుంచి యాత్రను ప్రారంభిస్తారు. భక్తులు మొదటగా, ఎరుమేలిలో ఉన్న వావర్‌ మసీదును దర్శించుకుని, ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అక్కడే రంగులు జల్లుకుని, వాద్యబృందాలతో 'పేటతుల్లాల్‌' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తరువాత ఎరుమేలిలోని ధర్మశాస్తకు పూజలు చేస్తారు. ఇక్కడి నుంచి, శబరిగిరికి చేరుకోవడానికి, రెండు మార్గాలున్నాయి. అవి పెద్దపాదం, చిన్నపాదం. ఎరుమేలి నుంచి పంపాతీరం వరకూ వాహనాల్లో ప్రయాణించి, అక్కడ స్నానం చేసి, నీలిమలను అధిరోహిస్తారు. అది చిన్నపాదం. ఇక పెద్దపాదం అంటే, ఎరుమేలి నుండి దాదాపు 80 కిలోమీటర్లు నడుస్తూ, కొండను చేరుకుంటారు. ఈ వనయాత్ర చేసే భక్తులు, మొదట 'పెరుర్‌తోడు'కు వెళ్లి, స్నానాదికాలు ముగించి, అక్కడ దేవుణ్ని పూజిస్తారు. తరవాత కాలైకట్టి అనే ప్రాంతానికి వెళ్తారు. అక్కడి నుండి అళుదా నదీ తీరానికి వెళ్లి, పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ నదీ ప్రవాహానికి కారణం, అయ్యప్ప చంపిన మహిషి కార్చిన కన్నీరని, కొత్తగా వచ్చిన కన్నెస్వాములకు, ఈ నది గాధను వివరిస్తారు గురుస్వాములు. అళుదా నదిలోని చిన్నరాయిని తీసుకుని, అళుదామేడు దాటి, ఇంజిపరైకోటై చేరుకొంటారు. అక్కడ కళిడం కుండ్రు అనే ప్రదేశంలో, నది నుండి తెచ్చిన రాయిని పడేస్తారు. దాంతో కరిమల యాత్ర ప్రారంభమవుతుంది. పెరియనపట్టం, చెరియనపట్టం మీదుగా పంపకు చేరుకుంటారు. పంపనే పంబ అని కూడా పిలుస్తారు. ఈ పెద్ద పాదం వనయాత్రలో, కొందరు భక్తులు, శక్తిపూజ చేసి, అన్నదానం చేస్తుంటారు.

కనులార దర్శించేవేళ..
పంపానదిలో స్నానం చేసి, అక్కడి గణపతికి ఇరుముడిని చూపిస్తారు. తరవాత మరో 5 కిలోమీటర్ల ఎత్తున్న నీలిమలను అధిరోహిస్తారు. అనంతరం శరంగుత్తిని చేరుకుంటారు. ఈ ప్రదేశంలోనే, తొలిసారిగా మాలను ధరించిన కన్నెస్వాములు, ఎరుమేలి నుంచి తీసుకువచ్చిన బాణాలను గుచ్చుతారు. తరువాత సన్నిధానంలోకి అడుగుపెడుతారు. అప్పటి వరకు కొండలూ, కోనలూ దాటుకొంటూ వచ్చిన భక్తులు, స్వామివారి ఆలయాన్ని చూడగానే, ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఆలయానికి ద్వారపాలకులైన కడుత్తస్వామీ, కరుప్పస్వామిలకూ కొబ్బరికాయలు కొడతారు. ఇరుముడి దాల్చిన స్వాములు, పవిత్రమైన పదునెట్టాంబడి మీదుగా, అంటే 18 మెట్ల మీదుగా, దేవాలయాన్ని చేరుకుంటారు. మెట్లను ఎక్కి, స్వామి సన్నిధికి ప్రదక్షిణ చేసి, ఇరుముడిని అయ్యప్పకు చూపించి, ఆలయం నుంచి కిందికి దిగుతారు. దాంతో యాత్రలోని ప్రధానభాగం పూర్తవుతుంది.

నేతి అభిషేకం
చిన్నపాదం, పెద్దపాదం.., ఏదైనా, యాత్ర ఆద్యంతం స్వామి నామసర్మణతో, శరణుఘోషతో సాగుతుంది. వేలాదిమంది భక్తులతో కోలాహలంగా వుండే ఈ ప్రాంతం, అనునిత్యం స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే అయ్యప్పో.. లాంటి ఆధ్యాత్మిక నినాదాలతో, అక్కడి కొండలు ప్రతిధ్వనిస్తాయి. మండల చిరప్పు, మకర విలక్కు సమయాల్లో, ప్రతిరోజూ ఉదయం నుంచి, మధ్యాహ్నం వరకూ, స్వామికి నేతితో అభిషేకాలు జరుగుతుంటాయి. తరువాత భక్తులు మాలికాపురత్తమ్మ ఆలయాన్నీ, నాగరాజా, నాగాయక్షి ఆలయాలను దర్శించుకొంటారు. మాలికాపురత్తమ్మ ఆలయంలో కొబ్బరికాయను కొట్టరు. గుడి చుట్టూ తిప్పి వదిలేస్తారు. అదే అక్కడి ఆచారం. ఎరుమేలి నుంచి శబరిమల వరకూ సాగే యాత్ర, మకరసంక్రాంతి రోజున, తుది ఘట్టానికి చేరుతుంది. లక్షల సంఖ్యలో భక్తులు శబరికొండ నుంచి, నీలకల్‌ ప్రాంతం వరకూ వుంటారు.

ఎలా చేరుకోవాలి? దేశంలోని అన్నీ ప్రాంతాలనుంచి రవాణాసౌకర్యం ఉంది. రైలులో వెళ్లే భక్తులు, చెంగనూర్‌ లేదా కొట్టాయం రైల్వేస్టేషన్లలో దిగి, కారు లేదా బస్సుల ద్వారా, పంప చేరుకోవచ్చు. విమానాల ద్వారా వచ్చే భక్తులు, కొచ్చి లేదా తిరువనంతపురం విమానాశ్రయాలను చేరుకోవాలి. అక్కడ నుంచి వాహనాల ద్వారా పంప చేరుకోవాలి. పంప నుండి ఎవ్వరైనా కాలినడకనే స్వామి వారి దర్శనం చేసుకోవాలి.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణఓం నమో వ...
15/10/2020

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

ఓం నమో వేంకటేశాయ

18/09/2020

పెండ్లిమర్రి మండలం దగ్గర వెయ్యినూతలకోన...వాటర్ ఫాల్స్.....

లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం

17/09/2020

కడప దగ్గర పాలకొండలు వాటర్ ఫాల్స్ 👌👌👌

15/08/2020
08/05/2020

ప్రజా రక్షణ మా బాధ్యత కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ - కడప
Short Film by SP K.K.N ANBURAJAN IPS



కరోనా నియంత్రణకు యుద్దం చేసే ప్రతి ఒక్కరికీ ఈ లఘు చిత్రం అంకితం..

తప్పక చూడండి..కరోనా నిర్మూలనకు మీ విలువైన సూచనలు వీడియో కింద కామెంట్ చెయ్యండి.. "SH Creations" యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..Ur.s Hema Reddy Director(+917013698225)
Video link : https://youtu.be/vjsU6og6n_w

06/05/2020

Salute Kadapa District Police and Kadapa DSP Surya Narayana garu.. nice msg 🙏🙏🙏
Source : Kadapa Times

కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ✊🏻
01/05/2020

కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ✊🏻

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when ప్రజా టివి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies