జ్ఞాపకాలు: అమ్మా నేనే , నాన్నా నేనే.
Episode: 10 - అమ్మా నేనే , నాన్నా నేనే
అమ్మానాన్నలకి దూరంగా ఉంటున్న వాళ్ళకి, చదువుకుంటున్న వాళ్ళకి, ఉండబోతున్న వాళ్ళకి , ఉద్యోగులకి అంకితం
ఎప్పుడో ఒకప్పుడు
ఎక్కడో ఒక చోట
మనందరం
అమ్మానాన్నలకు దూరంగా
అమ్మా మనమై , నాన్నా మనమై
ముందుకు సాగుంటాం
సాగుదాం
We are sure everyone shall relate to this podcast.
An episode that reminds you of your Bachelor's life. And hence we would like to dedicate this one to all the Bachelors out there.
ఆనందాల కిటికీ: Podcast Episode - 9: తొంగిచూడు: Peek in on Something
మనతో మన స్నేహమే ఆనందానికి దారి. You need heart. Heart needs you. Be your own Friend.
ఆనందాల కిటికీ: Episode - 8: ఈ సమయం
చేతిలో పుస్తకం
నలుగురితో స్నేహం
నాలుగు మాటలు
ఓ చిరునవ్వు
ఎడబాట్లను
ఎద పాట్లను
తరిమి
ఒంటరితనానికి ఓదార్పు నిచ్చి
నీలో ఉన్న నీతో
నిన్ను కలుపుతుంది
నలుగురికి దెగ్గర చేస్తుంది
అదేగా ఆనందం
అదేగా జీవితం
ఆనందానికి దారి కాదు
ఆనందమే దారి ఆ దారిలో
ఎన్నో దాగుడు మూతలుంటాయి
వాటన్నింటిని ఆనందంగా కనుక్కుంటూ
వెళ్లిపోవడమే , ఆ దారిలో
జయించడం గొప్పేం కాదు
ఓడిపోవడంలో తప్పేం లేదు
ఆ దారిలో ఎదురైనా ఒంటరితనం
ముందుకు నడిపించాలి గాని
మట్టిలోపలికి కాదు
కర్మ అంటే ఏం లేదు
నీ ముందు తరం వాళ్ళు రాసిన
నీ తరం వాళ్ళు రాస్తున్న
ఇది జీవితం, ఇదే జీవితం అన్న
జీవిత సూత్రాలని బ్రేక్ చేసి
వాళ్లలో స్ఫూర్తిని తీసుకొని
నీ Life Rulesని నువ్వు రాసుకోవడం
అప్పుడే నీ కర్మకి నువ్వు
భాధ్యుడివి, భాంధవుడివి, భవిష్యత్తువి
తారల్ని తాకే నీ ఊహలకి
ఊపిరూది ఉత్సాహాన్ని ఇవ్వు
మిగతాదంతా ఆ ఉత్సాహమే
Happy Father's Day
A Father never censures his child's mistake but rather says "Design Your Own Life"