ఈ రోజు విచిత్రమైన సంఘటన జరిగింది.సాయంత్రం పని ఉండి గాంధీ రోడ్ కి వెళ్లాను పని ముగించుకొని వెళ్లి నా ఫేవరెట్ ప్లేస్ విశాలాంధ్ర బుక్ హౌస్ లోకి దూరాను. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎంతో ఆసక్తిగా పాత కొత్త పుస్తకాలని పరిశీలిస్తూ..చదువుతూ..నేనొక దివ్యమైన అనుభూతికి లోనవుతూ నిలబడిపోయాను.దాదాపు గంటున్నుర సమయం తన్మయత్వం తో పుస్తకాలు తో గడిపాను..కాసేపటికి తేరుకొని షాప్ బయటకి చూసాను వీధి లైట్స్ తో అన్ని షాపుల ముందు లైట్స్ తళతళలాడుతున్నాయి..నల్లటి తారు రోడ్ నీళ్లతో తడిసిపోయి వుంది.నేను ఆశ్చర్యపోయాను నేను షాప్ లో కి వచ్చేటప్పుడు సాయంసంధ్య వెలుగు ఉంది అది ఇప్పుడు లేదు.. చీకటి వచ్చేసింది.టైం చూసాను ఏడున్నర అయ్యింది..షాప్ శంకరయ్యని అడిగాను ' వర్షం పడిందా ? ' ' లేదు.. దేవుడు ఊరేగింపు ఉందేమో ట్యాంకర్లు తో నీటి తో తడిపారు అనుకుంటాను ' అని చెప్పాడు.విశాలాంధ్ర బుక్
నేను పిల్లలకి కథలు చెప్పాక తమ సంతోషాన్ని తప్పట్లు కొట్టి తెలియపరిచారు..నాకు చాలా సంతోషం కలిగింది.☺️❤️📚📙
గాంధీ రోడ్ లో వున్న విశాలాంధ్ర బుక్ హౌస్ కి బయలుదేరాను..దారి లో చిన్న ఆటంకం మళ్ళీ గాంధీ రోడ్ కి మొదలైయ్యాను అకస్మార్తు గా వర్షం కురిసింది..ఎందుకో ఏమిటో తెలియలేదు అటు వైపు వెళ్ళడానికి ప్రకృతి సహకరించలేదు మనస్సుకి కూడా ఎందుకో వద్దనిపించి అటు వైపుకి వెళ్లడం మానుకొని బండి ని కపిలతీర్థం రోడ్ వైపు కి తిప్పాను..నేను రోడ్ ఎగువున వెళ్తుంటే..మంగళ వాద్యాలతో కపిలతీర్థం నుంచి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి తన పరివారం తో ఎదురు వచ్చి దర్శనం కలిగించారు.ఇందుకోసమే నేను మరో వైపు నన్ను వెళ్లనీయకుండా స్వామి వారు కపిలతీర్థం రోడ్ వైపు రప్పించాడని స్వామి వారి ఆంతర్యం అర్థమైంది.స్వామి వారు అమ్మ వార్ల దివ్యమంగళ స్వరూపం దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది ఇందులో నాదేమీ లేదు స్వామి వారు కలిగించాడు.🙏🏽🙏🏽🙏🏽🙂
చాలా మంది కథాప్రపంచం చందమామ బాలసాహిత్యం సెట్ లో ఏం పుస్తకాలు ఉన్నాయని అడుగుతున్నారు వారికి కోసం ఈ చిన్న వీడియో ! 📚📙🙂❤️