Weekly Info

Weekly Info It Is About Latest Tirumala Updates
తిరుమల తాజా సమాచారం కోస?

శ్రీవారి గురువారం నిజరూప దర్శనం గురించి మీకు తెలుసా.............!!కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం వేకువజ...
20/04/2023

శ్రీవారి గురువారం నిజరూప దర్శనం గురించి మీకు తెలుసా.............!!

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తి ఎలాంటి అలంకారాలూ లేకుండా దర్శనమిస్తారు.

నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని (ఊర్ధ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు.

దీంతో ఆ రోజంతా శ్రీవారి నేత్రాలు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది.

ఆ రోజు ఆభరణాలకు బదులు పట్టుధోవతిని ధరింపజేస్తారు.

కిరీటాన్ని తీసి పట్టు వస్త్రాన్ని తలపాగాలా చుడతారు.

గురువారం ఆలయంలోనే కాదు,
తిరుమలలో కూడా చిన్న తప్పు చేయడానిక్కూడా సిబ్బంది భయపడతారు.

ఎందుకంటే పుణ్యకార్యాలు చేసినవారికి ఆ రోజు స్వామి కనిపిస్తారని విశ్వాసం.

గురువారం నాటి దర్శనాన్నే నేత్రదర్శనం అని కూడా అంటారు.


తిరుమలభక్తులకు టీటీడీ విజ్ఞప్తిభూదేవి కాంప్లెక్స్, అలిపిరి వద్ద, అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు నడిచే భక్తులకు మాత...
15/04/2023

తిరుమల

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

భూదేవి కాంప్లెక్స్, అలిపిరి వద్ద, అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు నడిచే భక్తులకు మాత్రమే దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయబడతాయి

దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు తప్పనిసరిగా అలిపిరిమెట్ల మార్గంలోని గాలిగోపురం (స్టెప్ నెం. 2083) వద్ద దర్శన టోకెన్‌ను స్కాన్ చేయాలి లేని పక్షంలో స్వామిని దర్శించుకోనివ్వరు

దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు అలిపిరి మెట్ల మీదుగా మాత్రమే తిరుమలకు చేరుకోవాలి. లేదంటే వేరే మార్గంలో తిరుమలకు వెళ్లినా దివ్యదర్శనం టికెట్ పనిచేయదు.

శ్రీవారి మెట్టు మార్గంలో యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు.

వాహనం ద్వారా తిరుమల చేరుకోవాలనుకునే వారి కోసం కింది ప్రదేశాలలో స్వామి దర్శనం కోసం SSD టోకెన్లు జారీ చేయబడతాయి.

01) శ్రీనివాసం, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా

02) విష్ణునివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా.

03) గోవిందరాజసత్రాలు, తిరుపతి రైల్వేస్టేషన్ వెనుక.

TirumalaTTD appeal to devoteesAt Bhudevi Complex, Alipiri, Divya Darshan Tokens will be issued only to devotees walking ...
15/04/2023

Tirumala

TTD appeal to devotees

At Bhudevi Complex, Alipiri, Divya Darshan Tokens will be issued only to devotees walking to Tirumala via the Alipiri Stairway.

* Devotees who have taken the Divya Darshan Token must get the Darshan Token scanned at the Galigopuram (Step No. 2083) on Alipirimetla Path. If not, they will not be allowed to visit the Lord.*

Devotees who have taken Divya Darshanam Tokens must reach Tirumala via Alipiri Stairs only. Otherwise, Divyadarshanam ticket will not work even if you go to Tirumala by any other route.

Tokens will be issued as usual on the Srivari Mettu route.

SSD Tokens will be issued for Swami Darshan at the following places for those who wish to reach Tirumala by vehicle.

01) Srinivasam, R.T.C. Opposite Bus Stand

02) Vishnunivasam, Opposite Railway Station.

03) Govindarajasatralu, Behind Tirupati Railway Station.














శ్రీవారి ఆలయం చేరుకోవటానికి ఎన్ని నడకదారులు ఉన్నాయో తెలుసా ?ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో తి...
15/04/2023

శ్రీవారి ఆలయం చేరుకోవటానికి ఎన్ని నడకదారులు ఉన్నాయో తెలుసా ?

ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు భక్తులు. కొండ మీద ఉన్న శ్రీవారికి దర్శించుకొనేందుకు భక్తులు సాధారణంగా నడక మార్గాన, టాక్సీలలో, జీపులలో మరియు బస్సులలో వెళుతుంటారు. చాలా మందికి తెలిసిన దారి అలిపిరి. కానీ ఎంతమందికి తెలుసు అలిపిరి కాకుండా ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయని ??

తిరుమలలో ఏడు కొండలు ఉన్నాయని తెలుసుకదా ? ఈ ఏడు కొండలు నడకదారి గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు. ఇప్పుడు ఆ మార్గాల గురించే తెలుసుకుంటున్నాం ఇక్కడ. మీకు తాళ్ళపాక అన్నమాచార్యులు గురించి తెలుసు కదా ? ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు మరియు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి, మర్యాద, గౌరవం, ప్రేమ, వాత్సల్యం. ఆయన వ్రాసిన 32 వేల కీర్తనలలో వెవెంకటేశ్వరస్వామి కీర్తనలే ఎక్కువ. అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కిన మొట్టమొదటి భక్తుడు అన్నమాచార్యుల వారే.

అన్నమాచార్య
అలిపిరి నుండి అన్నమాచార్యులు వెళ్లిన దారే మొదటి నుండి గుర్తింపు పొందినది. శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ టైం పట్టే మార్గాలలో ఇది ఒకటి. ఈ దారే కాకుండా తిరుమల చేరుకోవటానికి అనేక దారులు ఉన్నాయి. అయితే సౌకర్యాలు అంతంత్రమాత్రమే.

మొదటి మెట్టు
శ్రీవారికి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి. అలిపిరి అంటే 'ఆదిపడి' అనగా మొదటిమెట్టు అని అర్థం.
అలిపిరి
అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి గంటన్న సమయం పడుతుంది. దూరం 11- 12 KM లు ఉంటుంది.

రెండవ దారి
తిరుపతి కి 10 KM ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. పట్టే సమయం గంట. చంద్రగిరి కోట నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది.
రెండవ దారి
చంద్రగిరి కి 8 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవారు.

రెండవ దారి
కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గం లో విడిది చేసి, ఈ మార్గం గుండా శ్రీనివాసుడిని ఏడు సార్లు దర్శించుకున్నాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ కొండ పైకి కూరగాయలు, పాలు, పెరుగు, పూలు వంటివి ఇదే దారిలో చేరుస్తారు. స్థానికులకు తప్ప ఈ దారి గురించి బాహ్య ప్రపంచానికి తెలీదు.

మూడవ దారి
మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యాన కలదు. దీనికి మించిన దారి మరొకటిలేదు అంటారు పూర్వీకులు. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు.

నాల్గవ దారి
తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాం ... దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది. రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ దారిగుండా వెళుతారు.

నాల్గవ దారి
డ్యాం వద్ద నుండి దారి గుండా 3 కిలోమీటర్లు ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య దూరం : 15 KM.

ఐదవ దారి
కడప బోర్డర్ లో చిత్తూర్ ఎంట్రెన్స్ వద్ద కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి తుంబురుతీర్థం --> పాపవినాశనం --> తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం, పాపవినాశనం మధ్య దూరం 12 KM.

ఆరవ దారి
అవ్వాచారి కొండ/ అవ్వాచారికోన దారి గుండా వెళితే కూడా తిరుమల కొండ చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో కడప - తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.

ఏనుగుల దారి
ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి. పూర్వం చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వాచారికోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు.

తలకోన
తలకోన నుండి కూడా తిరుమలకు దారి కలదు. జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే ... మీరు తిరుమలకు చేరుకున్నట్లే. నడక మార్గం 20 కిలోమీటర్లు
తిరుమల గురించి మరికొన్ని విషయాలు
తిరుమలలో క్రీ.శ.1387 లో మోకాళ్ళపర్వతం వద్ద మెట్లు నిర్మించారు. విజయనగర రాజులు అలిపిరి - గాలి గోపురం మార్గం 15 వ శతాబ్దంలో వేశారు.
గాలిగోపురం నుండి కిందకు చూస్తే ..
అలిపిరి మెట్లు ఎక్కగానే గోపురం, కుమ్మరి దాసుని సారె, గజేంద్రమొక్షం, గాలిగోపురం వస్తాయి. అలానే ఇంకాస్త ముందుకు వెళితే గాలిగోపురం కనిపిస్తుంది. గాలిగోపురం నుండి కిందకు చూస్తే గోవిందరాజస్వామి, అలివేలుమంగమ్మ దేవాలయాలు , తిరుపతి పరిసరాలు అందంగా కనిపిస్తాయి.ఆంజనేయస్వామి
గాలిగోపురం లోపలి వెళితే సీతారాముల ఆలయం, హనుమంతుని పెద్ద విగ్రహం, విష్ణుమూర్తి అవతారాలు తారసపడతాయి. దక్షిణంవైపు అడవిలోకి వెళితే ఘంటామండపం, నామాలగవి, అవ్వా చారి కోన కు వెళ్తుంటే అక్కగార్ల గుడి కనిపిస్తాయి. ఆతర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి మందిరం కలదు.

మోకాళ్ళ మిట్ట
మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక సారె పెట్టెలను గమనించవచ్చు. అది దాటితే లక్ష్మీనరసింహ ఆలయం వస్తుంది. అలానే ఇంకాస్త ముందుకు మండపాలను దాటుకుంటూ వెళితే శ్రీవారి ఆలయం కనిపిస్తుంది.

శ్రీవారి మెట్టు
శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం వద్ద కలదు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీవారు, ఆయన భార్య పద్మావతి ఇక్కడే వివాహం చేసుకొని శ్రీవారి మెట్టు దారిలో కొండ పైకి వెళ్ళి వెలిశారు.

శ్రీవారి మెట్టు
తిరుపతికి శ్రీవారి మెట్టు కు మధ్య దూరం 15 కి.మీ. శ్రీవారి మెట్టు నుండి ఆలయానికి మధ్య 2500 - 2800 మెట్లు ఉన్నాయి. ఇవి ఎక్కటానికి పట్టే సమయం 1-2 గంటలు. ప్రతి 50/100 మెట్లకు నీటి సదుపాయాలు కలవు.

కౌంటర్
శ్రీవారి మెట్టు గుండా వెళితే 1000 వ మెట్టు వద్ద దివ్య దర్శనం టికెట్లు ఇస్తుంటారు. వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నవి 2000 మెట్ల దగ్గర స్టాంప్ వేసుకుంటే చెల్లుతాయి. 1100 మెట్ల వద్ద శ్రీవారి పాదాలు ఉన్నాయి.
మెట్ల దారిన వెళ్తున్నప్పుడు గుర్తించుకోవాల్సినవి
1. తిరుపతి బస్ స్టాండ్ నుండి ఉచితబస్సు సౌకర్యం ఉంది. మీరు బస్సును అందుకోలేకపోతే జీప్/ కార్ మాట్లాడుకొని వెళ్ళవచ్చు
2. శ్రీవారి మెట్టు కు వెళ్ళే మార్గంలోనే అలిపిరి వస్తుంది. అలిపిరి వద్ద లాకర్ సౌకర్యం ఉంది. శ్రీవారి మెట్టు వద్ద ఆ సౌకర్యం లేదు.
3.మెట్లమార్గం లో తాగునీటి సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. కనుక బాటిల్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు. వీలైతే తినుబండారాలను తీసుకొని పోవచ్చు. కొండపైన, ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్ వస్తువులు నిషేధం.

వసతి
వసతి ససౌకర్యాలకు తిరుమల లో కొదువలేదు. ఉత్సవాలు, పండుగలు తప్పనిచ్చి మిగితా అన్ని దినాలలో బస దొరుకుతుంది. టిటిడి విశ్రాంతి గదులు, గెస్ట్ హౌస్ లు, సత్రాలు, హోటళ్ళు, లాడ్జీలు లాంటి ఎన్నో వసతులు ఇక్కడ ఉన్నాయి.
గైడ్ తప్పనిసరి
ఈసారి తిరుమలకు వెళ్ళే యాత్రికులు పైన పేర్కొన్న దారుల గుండా వెళ్ళటానికి ప్రయత్నించండి.

copied post














       #
15/04/2023

#

ఓం నమో వేంకటేశాయ 🙏తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైటు :-👉 https://www.tirumala.org/టిటిడి వసతి, 300రూ దర్శన్, అంగప్రదక్షిన...
15/04/2023

ఓం నమో వేంకటేశాయ 🙏

తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైటు :-
👉 https://www.tirumala.org/

టిటిడి వసతి, 300రూ దర్శన్, అంగప్రదక్షినం, సీనియర్ సిటిజన్ దర్శనాలు మొబైల్ నెంబర్ లాగిన్ తో బుకింగ్ చేసుకునే న్యూ వెబ్సైటు:-
👉 https://online.tirupatibalaji.ap.gov.in/home/dashboard

ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అర్జితసేవలు, లక్కీ డిప్ అర్జితసేవలు, లోకల్ టెంపుల్ అర్జితసేవలు, (500రూ)వర్చువల్ సేవలు +సేవ దర్శన్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్స్,ఇతర ట్రస్ట్ /స్కీమ్స్ డొనేషన్ , పబ్లికేషన్స్, కళ్యాణ మండపం, కళ్యాణ వేదిక, పాంచజన్య ప్రొడక్ట్స్ యూసర్ ఐడి లాగిన్ తో బుకింగ్ చేసుకునే వెబ్సైటు:-
👉 https://tirupatibalaji.ap.gov.in/ #/userLogin

శ్రీవారి వాలంటీర్ సేవ, నవనీత సేవ, పరకామణి సేవలు బుక్ చేసుకునే వెబ్సైటు:-
👉 https://srivariseva.tirumala.org/ #/

------------------

👉 ePUBLICATIONS website :- https://ebooks.tirumala.org/

👉 TTD News website:- https://news.tirumala.org/

👉 Satamanambhavati wishes Website:- http://www.svbcttd.com/wishes.html

👉 TTD Svbc Website:- http://www.svbcttd.com/

















ఓం నమో వేంకటేశాయ 🙏తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైటు :-👉 https://www.tirumala.org/టిటిడి వసతి, 300రూ దర్శన్, అంగప్రదక్షిన...
15/04/2023

ఓం నమో వేంకటేశాయ 🙏

తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైటు :-
👉 https://www.tirumala.org/

టిటిడి వసతి, 300రూ దర్శన్, అంగప్రదక్షినం, సీనియర్ సిటిజన్ దర్శనాలు మొబైల్ నెంబర్ లాగిన్ తో బుకింగ్ చేసుకునే న్యూ వెబ్సైటు:-
👉 https://online.tirupatibalaji.ap.gov.in/home/dashboard

ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అర్జితసేవలు, లక్కీ డిప్ అర్జితసేవలు, లోకల్ టెంపుల్ అర్జితసేవలు, (500రూ)వర్చువల్ సేవలు +సేవ దర్శన్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్స్,ఇతర ట్రస్ట్ /స్కీమ్స్ డొనేషన్ , పబ్లికేషన్స్, కళ్యాణ మండపం, కళ్యాణ వేదిక, పాంచజన్య ప్రొడక్ట్స్ యూసర్ ఐడి లాగిన్ తో బుకింగ్ చేసుకునే వెబ్సైటు:-
👉 https://tirupatibalaji.ap.gov.in/ #/userLogin

శ్రీవారి వాలంటీర్ సేవ, నవనీత సేవ, పరకామణి సేవలు బుక్ చేసుకునే వెబ్సైటు:-
👉 https://srivariseva.tirumala.org/ #/

------------------

👉 ePUBLICATIONS website :- https://ebooks.tirumala.org/

👉 TTD News website:- https://news.tirumala.org/

👉 Satamanambhavati wishes Website:- http://www.svbcttd.com/wishes.html

👉 TTD Svbc Website:- http://www.svbcttd.com/
















ఓం నమో వేంకటేశాయసేవ ఎలక్ట్రానిక్ డిప్      1) సుప్రభాతం   సేవ జరిగే సమయం      3:00am - 4:00am Report time: 2:00am Ticket...
15/04/2023

ఓం నమో వేంకటేశాయ

సేవ ఎలక్ట్రానిక్ డిప్


1) సుప్రభాతం

సేవ జరిగే సమయం
3:00am - 4:00am

Report time: 2:00am

Ticket cost:-120/ ఒక్కరికి

జూన్-23 month కు అందుబాటు లో ఉన్న టిక్కెట్స్ :- 8017

సేవ జరిగే రోజు:- ప్రతి రోజు

No. Of tickets available:-
250-270/ ప్రతి రోజు.

2) తోమాల
సేవ జరిగే సమయం.
3:30am - 4:30am

Report time:-3:00am

Ticket cost:-220/ఒక్కరికి
జూన్ -23 కు అందుబాటు లో ఉన్న టిక్కెట్స్:- 130

సేవ జరిగే రోజు:-
ప్రతి మంగళ, బుధ,గురు
No. Of tickets available :-
10/ ప్రతి రోజు

3) అర్చన
సేవ జరిగే సమయం
4:00am -5:30am

Report time:-4am

టిక్కెట్ cost :-220/ ఒక్కరికి
జూన్ -23కు అందుబాటు లో ఉన్న టిక్కెట్స్:- 130

సేవ జరిగే రోజు :-
ప్రతి మంగళ, బుధ,గురు
No. Of tickets available:-
10/ ప్రతి రోజు

4) అష్టదళ పాదపద్మారాధనం.

సేవ జరిగే సమయం
9:30am - 10:30am

Report time:-8:30

టిక్కెట్ cost:-1250/ ఒక్కరికి
జూన్ -23 కు అందుబాటు లో ఉన్న టిక్కెట్స్:- 240

సేవ జరిగే రోజు:
ప్రతి మంగళ వారం
No. Of tickets available:- 60.

అన్నప్రసాదాల తయారీకి మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే ఆలోచన-డయల్‌ యువర్‌ ఈవోలో ఎవి.ధర్మారెడ్డితిరుమలలోని మాతృశ్రీ  వెంగమాం...
08/04/2023

అన్నప్రసాదాల తయారీకి మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే ఆలోచన

-డయల్‌ యువర్‌ ఈవోలో ఎవి.ధర్మారెడ్డి

తిరుమలలోని మాతృశ్రీ వెంగమాంబ భవనంలో భక్తులకు అందించే అన్నప్రసాదాల నాణ్యత మరింత పెంచడానికి గతంలో లాగే మిల్లర్ల నుంచి బియ్యం సేకరించాలని ఆలోచిస్తున్నామని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ప్రస్తుతం టెండర్ల ద్వారా బియ్యం సేకరిస్తున్నామని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులతోను, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవి.

తిరుమలలో వేసవి ఏర్పాట్లు :

- వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాం.
- ఏప్రిల్‌ 15 నుండి జూలై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300/` దర్శన టికెట్లను టిటిడి బోర్డు తగ్గించింది. సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది.
- తిరుమలలో దాదాపు 7400 గదులు, 4 పిఏసిలు ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నాం.
- తిరుమలలో ఆన్‌లైన్‌లో గదులు బుక్‌ చేసుకున్న వారు స్వయంగా వచ్చి ఏఆర్‌పి కౌంటర్‌లో స్కానింగ్‌ చేసుకోవాలి. వారికి గది కేటాయించినట్టుగా మెసేజ్‌ వచ్చిన తర్వాత సంబంధిత సబ్‌ ఆఫీసుకు వెళ్లి గదులు పొందాలి. ఇతరులు ఎవరు వచ్చినా గదులు పొందలేరు.
- నిర్ణీత సమయం(రెండు గంటల) లోపు సంబంధిత భక్తుడు గది తీసుకోకపోతే కాలపరిమితి ముగుస్తుంది. గదికి చెల్లించిన అద్దె తిరిగి ఇవ్వబడదు. కాషన్‌ డిపాజిట్‌ మాత్రమే తిరిగి చెల్లించడం జరుగుతుంది.
- గదుల కేటాయింపులో జరుగుతున్న అవకతవకలను దృష్టిలో ఉంచుకుని, మధ్యవర్తులను, దళారీలను కట్టడి చేసి భక్తులకు గదులు అందుబాటులో ఉంచేందుకు వీలుగా ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ప్రవేశపెట్టడం జరిగింది.
- భక్తులు గదులు పొందే సమయంలో వారి ఫొటోను పొందుపరుచుకొని, తిరిగి గది ఖాళీ చేసే సమయంలో ఆ ఫొటోను సరిచూసుకొని మాత్రమే కాషన్‌ డిపాజిట్‌ ఇవ్వడం జరుగుతుంది.
- ఈ విధానం వల్ల గదులు త్వరగా ఖాళీ అవడమే గాక, భక్తులకు గతంలో కంటే మరిన్ని ఎక్కువ గదులు కేటాయించే అవకాశం కలుగుతోంది.
- క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నాం.

- ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు వేశాం. నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేశాం.
- మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్‌తో పాటు ఇతర ముఖ్య ప్రాంతాల్లో అన్నప్రసాదాలు ఏర్పాటు చేస్తాం.
- అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచుతాం. మరింత మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తున్నాం.
- ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా భక్తులకు సేవలందించేందుకు ఏర్పాట్లు చేశాం.
- భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ చేసేందుకు చర్యలు తీసుకున్నాం.
- టిటిడి విజిలెన్స్‌, పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించడంతో పాటు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు చేపట్టాం.
- భక్తుల రద్దీ నేపథ్యంలో వారికి సేవలందించేందుకు దాదాపు 2,500 మంది శ్రీవారి సేవకుల సేవలను వినియోగిస్తున్నాం.
- కరోనా కారణంగా 3 సంవత్సరాల తరువాత భక్తుల కోరిక మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా అలిపిరి మార్గంలో గాలి గోపురం వద్ద 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 1250వ మెట్టు వద్ద 5 వేల దివ్యదర్శనం టోకెన్లు కేటాయిస్తున్నాం. భక్తులు తమ ఆధార్‌ కార్డుతో హాజరైతేనే టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది.
- తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉచితంగా రవాణా చేసేందుకు దాత ద్వారా 10 నూతన విద్యుత్‌ ధర్మరథాలను మార్చి 27వ తేదీన తీసుకున్నాం. ఏప్రిల్‌ 15వ తేదీ తరువాత డీజిల్‌ బస్సుల స్థానంలో ఈ బస్సులు భక్తులకు అందుబాటులోకి వస్తాయి.
- తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో ఏప్రిల్‌ 29 నుండి మే 1వ తేదీ వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం.

అగరబత్తులు :
- టిటిడి ఆలయాల్లో వినియోగించిన పూలతో తయారుచేస్తున్న అగరబత్తీలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రోజుకు 15 వేల ప్యాకెట్లు తయారవుతుండగా, భక్తుల డిమాండ్‌కు ఇవి సరిపోవడం లేదు. దీంతో రెండవ యూనిట్‌ ఏర్పాటుచేసి మార్చి 31న ప్రారంభించాం. దీనివల్ల రోజుకు 30 వేల ప్యాకెట్లు తయారుచేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నాం.

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు :
- మార్చి 31వ తేదీ ప్రారంభమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
- ఏప్రిల్‌ 5వ తేదీన శ్రీకోదండరామస్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించాం.

ఇతర ఆలయాల్లో...
- మే 2 నుండి 5వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం.
వ మార్చి 17వ తేదీ చెన్నై నగరంలో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించి, భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం.

విద్యాసంస్థలు

- తిరుపతి ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కాలేజికి తొలి ప్రయత్నంలోనే న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ లభించింది.
- ఏడాది కాలంలోనే టీటీడీలోని అన్ని కళాశాలలకు న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ రావడానికి కృషి చేసిన జేఈవో శ్రీమతి సదా భార్గవి, డిఈవో, కళాశాలల ప్రిన్సిపాళ్ళు, సిబ్బందిని అభినందిస్తున్నాను.

మార్చి నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :
- శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య- 20.57 లక్షలు.
హుండీ :
- హుండీ కానుకలు - రూ.120.29 కోట్లు.
లడ్డూలు :
- విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య - 1.02 కోట్లు.
అన్నప్రసాదం :
- అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య - 38.17 లక్షలు.
కల్యాణకట్ట :
- తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య - 8.25 లక్షలు.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు పోటె...
08/04/2023

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టమెంట్లు నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనంతో పాటు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు తాగునీరు అందించేందుకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నాయి.

వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో శనివారం మధ్యాహ్నానికి దాదాపు 79వేల మందికి అన్నప్రసాదం అందించగా.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 80వేల మందికి పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్నప్రసాదాలు అందించారు. పిల్లలకు ఎప్పటికప్పుడు పాలు అందిస్తున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు. శనివారం సాయంత్రం 5గంటల వరకు దాదాపు 50వేల మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ఎస్ఓ టోకెన్లు, దివ్య దర్శన టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని తితిదే విజ్ఞప్తి చేసింది. జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలు, క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ - టోకెన్ రహిత దర్శనానికి 40 గంటలు - తిరుమలలో అన్ని ప్రాంతాల్లో కిక్కిరిసిన యాత్రికు...
08/04/2023

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
- టోకెన్ రహిత దర్శనానికి 40 గంటలు
- తిరుమలలో అన్ని ప్రాంతాల్లో కిక్కిరిసిన యాత్రికులు
- వరుస సెలవులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ

వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు   గత మూడురోజులుగా తిరుమలలోని వసంతోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడు...
06/04/2023

వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
గత మూడురోజులుగా తిరుమలలోని వసంతోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్న సాలకట్ల వసంతోత్సవాలు బుధవారంనాడు కన్నుల పండుగగా ముగిశాయి.
తొలిరోజు, రెండవరోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కూడి వసంతోత్సవంలో పాల్గొన్నారు. చివరిరోజున శ్రీ భూ సమేత మలయప్పస్వామితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది.
కాగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవరులను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు.

అంగరంగ వైభవంగా  శ్రీ కోదండ‌రామయ్య  క‌ల్యాణం-  వేలాదిగా హాజరైన భక్తులు- భ‌క్తులంద‌రికి ముత్యంతో కూడిన త‌లంబ్రాల పంపిణీ   ...
06/04/2023

అంగరంగ వైభవంగా
శ్రీ కోదండ‌రామయ్య క‌ల్యాణం
- వేలాదిగా హాజరైన భక్తులు
- భ‌క్తులంద‌రికి ముత్యంతో కూడిన త‌లంబ్రాల పంపిణీ
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జ‌రిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి క‌ల్యాణోత్స‌వాన్ని తన్మయత్వంతో తిల‌కించారు.
రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని రాత్రి 7 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. 8 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్‌ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేప‌ట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్త‌యింది.
వైభవంగా శ్రీ సీతారాముల ఉత్సవర్ల శోభాయాత్ర
స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర ఆలయం నుండి కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
భ‌క్తులంద‌రికి ముత్యంతో కూడిన త‌లంబ్రాల పంపిణీ
కల్యాణవేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని తిలకించేందుకు
విచ్చేసిన భ‌క్తులంద‌రికి శ్రీ‌వారి సేవ‌కులు ముత్యంతో కూడిన త‌లంబ్రాల‌ను పంపిణీ చేశారు.
#రాజంపేట #మనరాజంపేట

తుంబురు తీర్థ ముక్కోటిలో 36 వేల మందికి పైగా పాల్గొన్న భక్తులు      తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతు...
06/04/2023

తుంబురు తీర్థ ముక్కోటిలో
36 వేల మందికి పైగా పాల్గొన్న భక్తులు
తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థముక్కోటిలో 36,200 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 5న మొత్తం 23 వేలమంది, ఏప్రిల్ 6న 13,200 మంది భక్తులు ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన తీర్థ స్నానం ఆచరించారు.
టిటిడి విస్తృత ఏర్పాట్లు
టిటిడి ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తుంబురు తీర్థానికి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 6 గంట‌ల నుండి నిరంత‌రాయంగా ఉద‌యం, సాయంత్రం పొంగలి, ఉప్మా, పాలు, మజ్జిగ అందించారు. అదేవిధంగా మధ్యాహ్నం, రాత్రి సాంబరు అన్నం, పెరుగన్నం, టమోటఅన్నం, పులిహోరాను భక్తులకు శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు.
ఇంజినీంగ్‌ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, త్రాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా, స్థూల కాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని తీర్థానికి అనుమతించలేదు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే అనుమతించారు. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్ళే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఆధ్వర్యంలో తరచూ ప్రకటనలు చేశారు.
ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం, పాపావినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు అంబులెన్స్‌లను, పారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. మరోవైపు టిటిడి భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
టిటిడి కల్పించిన అన్నప్రసాదాలు, తాగునీరు, ఇతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

RAMACHANDRA MURTY ON TEPPA( తెప్పపై శ్రీరామచంద్రమూర్తి అభయం )As part of ongoing Teppotsavams in Sri Ramachandra Pushkari...
06/04/2023

RAMACHANDRA MURTY ON TEPPA
( తెప్పపై శ్రీరామచంద్రమూర్తి అభయం )
As part of ongoing Teppotsavams in Sri Ramachandra Pushkarini, Sri Sita Lakshmana sameta Sri Ramachandra Swamy took out celestial ride on finely decked Teppa.

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ        తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైం...
06/04/2023

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఉగాది సందర్భంగా తిరుమల
25/03/2023

ఉగాది సందర్భంగా తిరుమల




తిరుమల  సాలకట్ల వసంతోత్సవం సేవ 03.04.2023 నుండి 05.04.2023 వరకు బుకింగ్ కోసం w.e.f.27.03.2023 10:00 Am కి అందుబాటులో ఉంట...
25/03/2023

తిరుమల సాలకట్ల వసంతోత్సవం సేవ 03.04.2023 నుండి 05.04.2023 వరకు బుకింగ్ కోసం w.e.f.27.03.2023 10:00 Am కి అందుబాటులో ఉంటుంది.
Periodical: Salakatla Vasanthotsavam Seva in Tirumala quota from 03.04.2023 to 05.04.2023 will be available for booking w.e.f.27.03.2023 10:00 Am













07/10/2022

తిరుమలలో కన్నుల పండుగగా ”బ్యాక్ స‌వారి ”తిరుమల, 2022 అక్టోబరు 06: శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహ...
07/10/2022

తిరుమలలో కన్నుల పండుగగా ”బ్యాక్ స‌వారి ”
తిరుమల, 2022 అక్టోబరు 06: శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన ”బాగ్ స‌వారి ” ఉత్సవం గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”బాగ్ స‌వారి ” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి దేవేరి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలోకి ప్రవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలిని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తుని భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షిణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”బాగ్ స‌వారి ” ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో తిరుమల చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ పేష్కర్ శ్రీ శ్రీహరి, పారుపత్తేదార్ శ్రీ తులసి ప్రసాద్ ఇతర ఆలయ అధికారులు, అనంతాళ్వారు వంశీకులు, భక్తులు పాల్గొన్నారు.

Address

Tirumala
Tirupati
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when Weekly Info posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other Media/News Companies in Tirupati

Show All