Tirumala Diaries

Tirumala Diaries వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మండే నాస్
(1)

చిన్నశేష వాహనంపై యోగముద్రలో బద్రీనారాయణ అలంకారంలో శ్రీ మలయప్పMALAYAPPA AS BADRI NARAYANA BLESSES DEVOTEES          శ్రీవ...
16/10/2023

చిన్నశేష వాహనంపై యోగముద్రలో బద్రీనారాయణ అలంకారంలో శ్రీ మలయప్ప

MALAYAPPA AS BADRI NARAYANA BLESSES DEVOTEES

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు శంఖుచక్రాలతో యోగముద్రలో బద్రీనారాయణ అలంకారంలో ఐదు తలల చిన్న శేషవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

చిన్న‌శేష వాహనం - కుటుంబ శ్రేయస్సు

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

TIRUMALA Sri Malayappa Swamy as Badri Narayana blessed His devotees on Chinna Sesha Vahanam.

The bright Monday morning witnessed the procession of Chinna Sesha Vahanam on the second day morning as part of ongoing Navaratri Brahmotsavams in Tirumala.



ఘ‌నంగా శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంతిరుచ్చిపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప క‌టాక్షంSRI BHU SAMETA SRI MALAYAP...
15/10/2023

ఘ‌నంగా శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుచ్చిపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప క‌టాక్షం

SRI BHU SAMETA SRI MALAYAPPA BLESSES DEVOTEES ON TIRUCHI

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఉద‌యం బంగారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించారు.

TIRUMALA The processional deity of Sri Malayappa Swamy in all His divine grace blessed devotees along the four mada streets of Tirumala on Sunday along with His two consorts Sridevi and Bhudevi on the golden Tiruchi.

The grandeur of Navaratri brahmotsavams flagged off with the Golden Tiruchi on the bright Sunny day on the first day.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి స‌ర్వ‌భూపాల‌ వాహన...
22/09/2023

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి స‌ర్వ‌భూపాల‌ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.



చిన్నశేష వాహనంపై ద్వార‌క కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప       శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉద...
20/09/2023

చిన్నశేష వాహనంపై ద్వార‌క కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వార‌క కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

చిన్న‌శేష వాహనం - కుటుంబ శ్రేయస్సు

చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.


పెద్ద‌శేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప అభయం          శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్ల...
19/09/2023

పెద్ద‌శేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప అభయం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) వైకుంఠనాథుని అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.

ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు - 2023ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం           శ్...
18/09/2023

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు - 2023

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు సోమ‌వారం సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. రామ‌కృష్ణ దీక్షితులు కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.

ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

 #శ్రీవారిసాలకట్లబ్రహ్మోత్సవాలకుశాస్త్రోక్తంగాఅంకురార్పణRITUAL OF PRELUDE   OBSERVED       తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టె...
17/09/2023

#శ్రీవారిసాలకట్లబ్రహ్మోత్సవాలకుశాస్త్రోక్తంగాఅంకురార్పణ

RITUAL OF PRELUDE OBSERVED

తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

విశిష్టత..

వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.

సూర్యాస్తమయం తరువాతే..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.

అంకురార్పణ క్రమం..

విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.

అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.

ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.

Tirumala As the annual Brahmotsavams are scheduled from September 18 to 26 at Tirumala Srivari Temple, the festival of prelude, Ankurarpanam was held on Sunday evening.

As part of this, Sri Vishvaksenulavaru, who is the Commander in Chief of Srivaru, went on a procession in the four Mada streets and supervised the Brahmotsavam arrangements for the big event.

Later, special pujas were performed to Mother Earth in the Yagasala of the temple and new grains were sowed in mud pots. The sowing of seeds ceremony is the main episode in Ankurarpanam also known as Beejavapanam.


14/08/2023

తిరుమల

టీటీడీ ముఖ్యమైన నిర్ణయాలు

చిన్నారులపై వన్యమృగాల దాడులు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇక నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో అనుమతించబడరు. రెండు ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. టీటీడీ అధికారులు తిరిగి నిర్ణయం తీసుకునే వరకం ఈ రెండు నిర్ణయాలు అమల్లో ఉంటాయి. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు యాత్రికులు సహకారం అందించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

----------------------------------------------------

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

తిరుమల శ్రీవారి ఆలయంలో 'పౌర్ణమి గరుడసేవ' ను పురస్కరించుకొని,సర్వాలంకార భూషితులైన శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడవీధుల్లో వ...
06/05/2023

తిరుమల శ్రీవారి ఆలయంలో 'పౌర్ణమి గరుడసేవ' ను పురస్కరించుకొని,సర్వాలంకార భూషితులైన శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడవీధుల్లో విహరిస్తూ ,భక్తకోటిని విశేషంగా అనుగ్రహించారు ...అద్భుతమైన స్వామివారి అలంకారం

శ్రీవారి 'వార్షిక వసంతోత్సవాల'లో మొదటిరోజు సాయంత్రం విశేష అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు
04/04/2023

శ్రీవారి 'వార్షిక వసంతోత్సవాల'లో మొదటిరోజు సాయంత్రం విశేష అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు

వైభ‌వంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారికి స్న‌ప‌న తిరుమంజ‌నం
30/03/2023

వైభ‌వంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారికి స్న‌ప‌న తిరుమంజ‌నం

21/03/2023

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి జూన్ నెల కోటాను మార్చి 23న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి.

అదేవిధంగా, జూన్ కు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్రక్రియ మార్చి 24న ఉదయం 11 గంట‌ల‌ నుండి మార్చి 26న ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

http://tirupatibalaji.ap.gov.in

The online quota of Srivari Arjita Seva tickets Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam, Sahasra Deepalankara Sevas for the month of jun 2023 (from 01.06.2023 to 31.06.2023) will be released on 23 march 2023 at 10 am.

A multilingual online services system that enables pilgrims to avail any Seva, Special entry darshan, Accommodation, Hundi, Kalyana vedika, Seva Electronic DIP and Diaries/ Calendars that is pertaining to Lord Venkateswara. An e-commerce service provider authorizing card or direct payment processing...

'అన్నమాచార్య వర్ధంతి' ని పురస్కరించుకొని విశేష అలంకారంలో ఉభయదేవేరులతో శ్రీ మలయప్పస్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ ,భక్త...
19/03/2023

'అన్నమాచార్య వర్ధంతి' ని పురస్కరించుకొని విశేష అలంకారంలో ఉభయదేవేరులతో శ్రీ మలయప్పస్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ ,భక్తులను పరిపూర్ణంగా అనుగ్రహించారు.

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభంమొద‌టిరోజు శ్రీ సీతారామలక్ష్మణులు తెప్పపై విహారం       తిరుమలలో శ్రీవారి సాలకట్ల...
03/03/2023

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

మొద‌టిరోజు శ్రీ సీతారామలక్ష్మణులు తెప్పపై విహారం

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.




మార్చి 3 నుండి 7వ తేదీ వరకు తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలుతిరుమల, 24 ఫిబ్రవరి 2023: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తె...
25/02/2023

మార్చి 3 నుండి 7వ తేదీ వరకు తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల, 24 ఫిబ్రవరి 2023: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3 నుండి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 3న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో మూడుసార్లు విహరిస్తారు.

ఇక మూడవరోజు మార్చి 5న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 6న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 7వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌ద...
14/02/2023

శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు కాళీయమర్ధనుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ముత్య‌పు పందిరి - స‌క‌ల సౌభాగ్య సిద్ధి

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీనివాసుడు మూడో రోజు రాత్రి ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్నిపెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు - రత్నాల వల్ల కలిగే వేడినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

ధ్వజారోహణంతో వైభవంగా   #శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారిబ్రహ్మోత్సవాలు ప్రారంభం  #శ్రీనివాసమంగాపురం  శ్రీ కల్యాణ వేంకటేశ్వ...
11/02/2023

ధ్వజారోహణంతో వైభవంగా #శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారిబ్రహ్మోత్సవాలు ప్రారంభం

#శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం ఉదయం 8.40 నుండి 9 గంటల మధ్య మీన‌లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

అంతకుముందు ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన‌ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.
18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. ఆల‌య ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : జెఈవో వీరబ్రహ్మం

జెఈవో శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 11 నుండి 19వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తర్వాత స్వామివారి వాహన సేవలు బయట జరుగుతున్నాయన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. శ్రీ‌నివాస‌మంగాపురంలో తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచిన‌ట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 15న గరుడసేవ, ఫిబ్రవరి 16న స్వర్ణరథోత్సవం, ఫిబ్రవరి 18న రథోత్సవం, ఫిబ్రవరి 19న చక్రస్నానం జరుగనున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.

31/12/2022

శ్రీవారి ఆలయంలో మార్చి నుండి 6 నెలలపాటు స్వామివారి దర్శనం నిలుపుదల ప్రచారం అవాస్తవం

– భక్తులు నమ్మవద్దని టిటిడి విజ్ఞప్తి

– యధావిధిగా మూలమూర్తి దర్శనం : శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు

తిరుమల, 30 డిసెంబరు 2022: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదు.

ఈ అంశానికి సంబంధించిన వాస్తవ వివరాలను శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు తెలియజేశారు. టిటిడి ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023, మార్చి1న తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహిస్తారు. ఇందులోభాగంగా గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు(కొయ్య) శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతారు. ఇందుకోసం పట్టే ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యధావిధిగా దర్శించుకోవచ్చు. బాలాలయంలోని దారు విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. గర్భాలయంలో మూలమూర్తికి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. గర్భాలయంలో మూలమూర్తికి, బాలాలయంలోని దారు విగ్రహానికి ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలన్నీ యధావిధిగా జరుగుతాయి.

1957-58వ సంవత్సరంలో ఆనంద నిలయానికి బంగారు తాపడం జరిగిన సందర్భంలో, 2018వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో బాలాలయం నిర్వహించిన సందర్భంలో ఉన్న రికార్డుల ప్రకారం భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం, ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలు నిర్వహించడం జరిగింది.

వాస్తవం ఇలా ఉండగా, కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో 6 నెలల పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఉండదని జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 7.30 నుండి 8 గంటల మధ్య బ్రేక్ దర్శనం ప్రారంభిస్తాం. ఒక నెలపాటు ప్రయ...
02/12/2022

డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 7.30 నుండి 8 గంటల మధ్య బ్రేక్ దర్శనం ప్రారంభిస్తాం. ఒక నెలపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాం. తిరుపతి లోని మాధవంలో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు, గదులు కేటాయించడం జరుగుతుంది.

– జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి గతంలో అనుసరించిన విధానాన్ని కొనసాగిస్తాం. పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం. ఇందుకోసం రోజుకు 25 వేలు చొప్పున 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేస్తాం. అదేవిధంగా రోజుకు 50,000 చొప్పున 5 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు తిరుపతిలో కౌంటర్ల ద్వారా మంజూరు చేస్తాం. దర్శన టికెట్ ఉన్నవారిని మాత్రమే ఆలయంలో దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. దర్శన టికెట్ లేనివారు తిరుమలకు రావచ్చుగానీ దర్శనానికి అనుమతించబడరు.

Source: TTD

సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్యనారాయణ స్వామి అలంకారంలో శ్రీ పద్మావతి         తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ...
26/11/2022

సూర్యప్రభ వాహనంపై
శ్రీ సూర్యనారాయణ స్వామి అలంకారంలో శ్రీ పద్మావతి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం అమ్మవారు
శ్రీ సూర్యనారాయణ స్వామివారి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.

సింహ వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో లోకమాత         తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మ...
23/11/2022

సింహ వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో లోకమాత

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం రాత్రి సింహ వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు .

సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తారు.

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి   కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలం...
22/11/2022

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి

కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు , కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ''హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ'' అని ఆ తల్లిని ఆరాధిస్తారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై శ్రీ వైక...
21/11/2022

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం            తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి...
20/11/2022

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నులపండువగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 9.45 గంటలకు మిథున లగ్నంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు.

గజపట ప్రతిష్ఠ :

ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్ఠలో భాగంగా గజధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వళ్లించి అపరాధ క్షమాపణం కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయా స్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణప్రతిష్ట హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు. కంకణభట్టార్‌ శ్రీ మణికంఠ బట్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

సకలదేవతలకు ఆహ్వానం :

ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపునీటిని తొమ్మిది కలశాల్లో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు.
భూలోకం, సువర్ణ లోకం, పాతాళ లోకాల నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయడంతో ధ్వజారోహణ పర్వం ఘనంగా ముగిసింది.

ఈ సందర్భంగా ఈవో ఎ వి ధర్మారెడ్డి మాట్లాడుతూ , కరోనా కారణంగా రెండు సంవత్సరాల తర్వాత అమ్మవారి వాహన సేవలు బయట నిర్వహిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం, సాయంత్రం వాహన సేవలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

నాగులచవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శనివారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేషవాహనంపై...
29/10/2022

నాగులచవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శనివారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేషవాహనంపై భ‌క్తులను క‌టాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ స్వామి, అమ్మ‌వార్లు తిరుమాడ వీధుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చారు.

అక్టోబ‌రు 29న పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌ ద‌ర్శ‌నంఅక్టోబ‌రు 29వ తేదీన‌ నాగులచవితి ప‌ర్వ‌దినం సందర్భంగా తిరుమలలో శ్ర...
26/10/2022

అక్టోబ‌రు 29న పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌ ద‌ర్శ‌నం

అక్టోబ‌రు 29వ తేదీన‌ నాగులచవితి ప‌ర్వ‌దినం సందర్భంగా తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు ఉభ‌య‌దేవేరుల‌తో క‌లిసి తిరుమాడ వీధులలో పెద్దశేషవాహనంపై భక్తులకు ద‌ర్శ‌మిస్తారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించారు.

కాగా, రాత్రి 7 నుండి 9 గంటల నడుమ పెద్దశేష వాహన సేవ జ‌రుగ‌నుంది.

19/10/2022

13/10/2022

అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం

- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత

- అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు - స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి

- గ్ర‌హ‌ణ స‌మ‌యంలో అన్న‌ప్ర‌సాద వితరణ ఉండదు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూసివేస్తారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. అనంత‌రం స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

అదేవిధంగా న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొల‌గిపోయే వరకు వంట చేయరు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో కూడా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉండ‌దు.
కావున‌ భ‌క్తులు ఈ విషయాన్ని గమనించి, అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు వీలుగా త‌మ తిరుమల యాత్రను రూపొందించుకోవాల‌ని టిటిడి మ‌రోసారి విజ్ఞప్తి చేస్తోంది.

SURYA GRAHANAM ON OCTOBER 25 AND CHANDRA GRAHANAM ON NOVEMBER 8

TIRUMALA TEMPLE DOORS TO BE CLOSED FOR 12 HOURS ON EACH DAY

TTD CANCELS ALL DARSHANS – ONLY SARVA DARSHAN IS ALLOWED

TTD ANNAPRASADAM COMPLEX ALSO REMAINS CLOSED ON THESE TWO DAYS

Tirumala In connection with Surya Grahanam [Solar Eclipse] on October 25 and Chandra Grahanam [Lunar Eclipse] on November 8, the Tirumala temple doors will remain closed for almost 12 hours on each of these days.

The Surya Grahanam occurs on October 25 between 5:11 PM to 6:27PM and the temple doors will remain closed by 8:11 AM and will be re-opened after carrying out Suddhi rituals by 7:30 PM.

Similarly, on the day of Chandra Grahanam on November 8, which is scheduled between 2:39 PM to 6:19 PM, the temple doors will be closed by 8:40 AM and re-opened by 7:20 PM.

TTD has cancelled, VIP Break Darshan, SRIVANI Trust, Rs.300/- SED and also the Arjitha Sevas such as Kalyanotsavam, Unjal Seva, Brahmotsavam and Sahasra Deepalankara Sevas on these two days. All the privileged darshans including Senior citizens, Physically Handicapped, and parents with infants, NRIs, Defence Personnel etc. also remains cancelled.

Only Sarva Darshan pilgrims are allowed for darshan after the re-opening of temple doors, through VQC-II on these two days.

Usually during Grahanam days, cooking will not be done till the eclipse is released. The Annaprasada Bhavan will also remain closed till the completion of eclipse.

TTD has appealed to devotees from across the country as well overseas to make a note of these things on the two eclipse days occurring in October 25 and November 8 and plan their pilgrimage accordingly to Tirumala to avoid inconvenience.

2022 శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు  అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు        శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవా...
04/10/2022

2022 శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ మలయప్పస్వామివారు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహ‌నంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలుభక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడువేడుకగా రథోత్సవం, భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగి...
04/10/2022

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

వేడుకగా రథోత్సవం, భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.

అనాదికాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉన్నది.

తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ''రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే'' అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.

రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో - స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.

Address

Tirumala
517504

Website

Alerts

Be the first to know and let us send you an email when Tirumala Diaries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies