24/07/2023
నేనొక రియాక్టర్ ను
వలస కార్మికుల సామాజిక రక్షణ అనే అంశంపై ఈరోజు (24.07.2023) మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న బహుళ దేశాల ప్రాంతీయ సమావేశం సెషన్-2 లో రియాక్టర్ (విషయంపై పరిజ్ఞానం కలిగి చర్చపై ప్రతిస్పందించే వ్యక్తి) గా పాల్గొనే అవకాశ వచ్చింది.
ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఏసియా అనే సంస్థ, మలేషియా కేంద్రంగా పనిచేసే అవర్ జర్నీ అనే సంస్థ కలిసి ఆగ్నేయ ఆసియా, దక్షిణ ఆసియా, గల్ఫ్ మధ్యప్రాచ్య దేశాల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించింది.
వలస కార్మికులకు సామాజిక రక్షణ (సోషల్ ప్రొటెక్షన్), సామాజిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) అనే ఈ రెండు పదాలు ఒకేలా అనిపించినా... సిద్ధాంత పరంగా కొంత తేడా ఉంటుంది. అది ఏమిటో తెలుసుకుందాం.
సామాజిక రక్షణ (సోషల్ ప్రొటెక్షన్):
ఐక్యరాజ్య సమితి సాంఘిక అభివృద్ధి పరిశోధన విభాగం నిర్వచనం ప్రకారం... 'సామాజిక రక్షణ' అనేది ప్రజల శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేసే పరిస్థితులను నివారించడం, నిర్వహించడం, అధిగమించడం. సామాజిక రక్షణ అనేది సమర్థవంతమైన లేబర్ మార్కెట్‌లను ప్రోత్సహించడం ద్వారా పేదరికం, దుర్బలత్వాన్ని తగ్గించడానికి రూపొందించబడిన విధానాలు, కార్యక్రమాలను కలిగి ఉంటుంది. ప్రజలు నష్టాలకు గురికావడాన్ని తగ్గించడం. నిరుద్యోగం, మినహాయింపు, అనారోగ్యం, వైకల్యం, వృద్ధాప్యం వంటి ఆర్థిక సామాజిక నష్టాలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచడం. సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఇది ఒకటి. ప్రభుత్వాలు విధాన పరంగా ఈ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
సామాజిక భద్రత (సోషల్ సెక్యూరిటీ):
అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్ఓ) నిర్వచనం ప్రకారం ఒక వ్యక్తి ఆదాయ నష్టం, తగ్గింపు గురించి పట్టించుకోవడం. సామాజిక భద్రత అనేది కొన్ని జీవిత ప్రమాదాలు, సామాజిక అవసరాల రక్షణ కోసం అవసరానికి ప్రతిస్పందించే మానవ హక్కు.
Session-2: Getting the Concepts Right: The What and the Why of Social Protection, Social Security, and Universal Social Protection Floors.
The session will give clarity to the following concepts:
1. Social Protection
2. Social Security, and
3. Universal Social Protection Floors
Resource Speaker: Lea Bou Later, ILO Regional Office of the Arab States
Reactors:
1. Bheem Reddy Mandha, President, Emigrants Welfare Forum, India
2. Dr. Renu Adhikara, WOREC, Nepal
3. Fish Ip, International Domestic Workers Federation