Mana Srikakulam

Mana Srikakulam is an informational website, which gives you complete details about Srikakulam District which include srikakulam urban and rural, as well as we give you updated information about politics in srikakulam, Tourist places in srikakulam.

రైతుల రుణమాఫీ హామీ ఇచ్చి మాఫీ చెయ్యకుండా రైతులను మోసం చేసిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని పలాస వస్తున్నావ్.
15/04/2024

రైతుల రుణమాఫీ హామీ ఇచ్చి మాఫీ చెయ్యకుండా
రైతులను మోసం చేసిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని పలాస వస్తున్నావ్.

07/04/2024

మీ అందరి ఆశీస్సులతో మరోసారి మన పలాస నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను.. మీ అందరూ మరోసారి దీవించి ముందుకు నడిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ నియోజకవర్గం అభివృద్ధికి సహాయసహకారాలు అందించాలని కోరుతున్నాను..
అలాగే ఈరోజు నుంచి మన నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని జయప్రదం చేస్తారని హృదయపూర్వకంగా కోరుతున్నాను..
DrSeediri

అయోధ్య రాముడి దర్శనం... జై శ్రీరామ్..
22/01/2024

అయోధ్య రాముడి దర్శనం... జై శ్రీరామ్..

రాష్ట్రలో పలువురు ఐపిఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ అడ్మనిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ 12 పే మాట్రిక్స్ స్కేల్ కల్...
02/01/2024

రాష్ట్రలో పలువురు ఐపిఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ అడ్మనిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ 12 పే మాట్రిక్స్ స్కేల్ కల్పించగా, అందులో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక IPS., గారికి కూడా జూనియర్ అడ్మనిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ 12 పే మాట్రిక్స్ స్కేల్ ను కల్పించడం జరిగినది. ఈ సంద్భంగా పలువురు పోలీసు అధికారులు ఎస్పీగారికి అభినందలు తెలియజేసారు.
Andhra Pradesh Police
Srikakulam District Police

తమిళ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూత
28/12/2023

తమిళ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూత

*2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరో తేల్చేసిన లేటెస్ట్ సర్వే.***********************************ఏపీ..ఎన్నికల ఏ...
26/12/2023

*2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరో తేల్చేసిన లేటెస్ట్ సర్వే.*
**********************************

ఏపీ..ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో నాలుగు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఏప్రిల్/మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.
అటు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. వైఎస్ఆర్సీపీని గద్దె దించడమే లక్ష్యంగా పొత్తు ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జనసేన పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగబోతోంది. వైఎస్ఆర్సీపీ ఒకవంక- మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మరోవంక.. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరంలో పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోన్నారు. అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను మార్చివేస్తోన్నారు. జనాదరణ లేని ఎమ్మెల్యేలకు టికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య- తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్.. ఏపీ రాజకీయాలపై ఓ సర్వేను నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్ఠిస్తారనేది స్పష్టం చేసింది.

ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే- మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పడే ఓట్ల శాతం.. 49. 48.5 శాతం మేర ఓట్ల తేడాతో వైసీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది.
జనసేనతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లినప్పటికీ.. పెద్దగా ఉపయోగం ఉండబోదని అభిప్రాయపడింది. ఈ రెండు పార్టీలకు కలిపి 46.5 శాతం ఓట్లు పడొచ్చని అంచనా వేసింది. విడివిడిగా చూసుకుంటే టీడీపీ- 38.2, జనసేన- 8.2 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని వివరించింది. ఇతరులకు 5.1 శాతం ఓట్లు పడతాయని తెలిపింది.
56 శాతం జగన్ పరిపాలనను మెచ్చుకుంటోన్నారు. ఆయన పాలన బాగుందంటూ ప్రశంసిస్తోన్నారు. జగన్ పాలన అద్భుతంగా ఉందని ప్రశంసించే వారి శాతం.. 9గా నమోదైంది. 22 శాతం మంది జగన్ పాలన బాగోలేదని తేల్చి చెబుతున్నట్లు పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలిపింది. జగన్ ప్రభుత్వం అధ్వాన్నంగా పని చేస్తోందంటూ ఎనిమిది శాతం మంది, ఎటూ చెప్పలేమంటూ మరో మూడు శాతం మంది అభిప్రాయపడ్డారు.

లోకేష్ సవాల్ కు మంత్రి సీదిరి ప్రతిసవాల్... ఏ సెంటర్ అయినా చర్చకు నేను రెఢీ... చంద్రబాబు లోకేష్ చర్చకు సిద్ధమా...?DrSeed...
26/12/2023

లోకేష్ సవాల్ కు మంత్రి సీదిరి ప్రతిసవాల్... ఏ సెంటర్ అయినా చర్చకు నేను రెఢీ... చంద్రబాబు లోకేష్ చర్చకు సిద్ధమా...?
DrSeediri

దూర ప్రాంతం వారు అరసవల్లిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ,కళ్యాణమండపము ,దక్షిణ సన్నాయి మేళం ,పంతులు ,భోజన ఏర్పాట్లు కోస...
20/10/2023

దూర ప్రాంతం వారు అరసవల్లిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ,కళ్యాణమండపము ,దక్షిణ సన్నాయి మేళం ,పంతులు ,భోజన ఏర్పాట్లు కోసం తిరుగుతున్నారా ,ఇంకా మీకు తిరగాల్సిన అవసరం లేదు క్రింద నంబర్లను సంప్రదించండి
వడ్డి ఉదయ్ 7036359999
మా సర్వీసులు
•కళ్యాణమండపం.
•దక్షిణ సన్నాయిమేళం.
•పంతులు గారు .
•ఫుడ్ కేటరింగ్.
•డెకరేషన్.

•అతి తక్కువ ధరలకు మ్యారేజ్ కి కావాల్సినవి ఆరెంజ్మెంట్ చేయబడును.

ఈ పెన్ ఎంత మందికి గుర్తుకు ఉంది..?
22/09/2023

ఈ పెన్ ఎంత మందికి గుర్తుకు ఉంది..?

"దేశ భాషలందు తెలుగు లెస్స" తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి గారి జయంతి సంద‌ర్భంగా తెలుగువారు అందరికి "త...
29/08/2023

"దేశ భాషలందు తెలుగు లెస్స" తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి గారి జయంతి సంద‌ర్భంగా తెలుగువారు అందరికి "తెలుగు భాషా దినోత్సవ” శుభాకాంక్షలు.

ఉద్ధానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిన జగనన్న ప్రభుత్వం. పలాసలో ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డ...
21/07/2023

ఉద్ధానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిన జగనన్న ప్రభుత్వం. పలాసలో ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న 200 పడకల కిడ్నీ రిసెర్చ్ సెంటర్ మరియు ఆసుపత్రి.

మన శ్రీకాకుళం జిల్లా, ఒప్పంగి గ్రామానికి చెందిన మన ఆడపడుచు  #చల్లా_కల్యాణి గారికి సివిల్స్ లో 285వ ర్యాంకు సాధించిన సందర...
24/05/2023

మన శ్రీకాకుళం జిల్లా, ఒప్పంగి గ్రామానికి చెందిన మన ఆడపడుచు #చల్లా_కల్యాణి గారికి సివిల్స్ లో 285వ ర్యాంకు సాధించిన సందర్భంగా హృదయ పూర్వక అభినందనలు.

చెట్ల ప్రాముఖ్యత....
22/05/2023

చెట్ల ప్రాముఖ్యత....

మన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస లో పుట్టి భారత సినిమా రంగంలో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి, ప్రజల మన్నలను పొందిన శ్రీ ...
22/05/2023

మన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస లో పుట్టి భారత సినిమా రంగంలో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి, ప్రజల మన్నలను పొందిన శ్రీ శరత్ బాబు గారి మరణం సినీ కళామ్మ తల్లికి తీరని లోటు. ఆయన అభిమానులకు మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..

హాట్సాఫ్ మంత్రి DrAppalaraju Seediri కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో జగనన్న ప్రభుత్వం నిర్మిస్తున్న 200 పడక...
15/05/2023

హాట్సాఫ్ మంత్రి DrAppalaraju Seediri
కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో జగనన్న ప్రభుత్వం నిర్మిస్తున్న 200 పడకల #సూపర్ #స్పెషాలిటీ #హాస్పిటల్, & #కిడ్నీ #రీసర్చ్ #సెంటర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి ! ✅ DrSeediri

23/04/2023

చంద్రబాబు స్టిక్కర్ పై ఉచ్చ పోసిన కుక్క పై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్.. శ్రీకాకుళం జిల్లా, మందసలో పోలీసులకు ఫిర్యాదు...

మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కణితి విశ్వనాధం గారికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి.
17/04/2023

మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కణితి విశ్వనాధం గారికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి.

శ్రీకాకుళం మాజీ పార్లమెంట్ సభ్యులు, పెద్దలు *డాక్టర్ కణితి విశ్వనాథం గారు* స్వర్గస్తులయ్యారని తెలియజేయుటకు మిక్కిలి చింత...
15/04/2023

శ్రీకాకుళం మాజీ పార్లమెంట్ సభ్యులు, పెద్దలు *డాక్టర్ కణితి విశ్వనాథం గారు* స్వర్గస్తులయ్యారని తెలియజేయుటకు మిక్కిలి చింతిస్తున్నాము, వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ... క‌న్నీటి నివాళి.🙏🙏🙏🙏

1998 డీఎస్సీ కు ఎంపికైన జబర్దస్త్ నటుడు గణపతి.సీఎం జగన్ గారి నిర్ణయంతో ఉపాధ్యాయుడిగా మారిన జబర్దస్త్ కమెడియన్.Congratula...
15/04/2023

1998 డీఎస్సీ కు ఎంపికైన జబర్దస్త్ నటుడు గణపతి.
సీఎం జగన్ గారి నిర్ణయంతో ఉపాధ్యాయుడిగా మారిన జబర్దస్త్ కమెడియన్.
Congratulations Ganapati Brother 💐💐💐

15/04/2023

ప్రపంచంలో మనుషలను పోలిన మనుషలు ఏడుగురు ఉంటారనంటారు అలాగే డాక్టర్, బి,అర్ అంబేద్కర్ పోలిన మనిషి మన శ్రీకాకుళం జిల్లా మందస మండలం బెల్లిపటియా గ్రామంలో ఉన్నారు, ఈయన పేరు మట్టా దనారాజు గారు.

06/04/2023

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ఎంత వరకు క్షేమకరం?

' బలగం సినిమా లో కాకి అనే ఒక పక్షిని తెలంగాణా ఆచారంలో భాగంగా చూపించారు...అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ ...
04/04/2023

' బలగం సినిమా లో కాకి అనే ఒక పక్షిని తెలంగాణా ఆచారంలో భాగంగా చూపించారు...అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ గౌరవం దక్కింది..ఎందుకంటే

----------------------------------------కాకి - కాలజ్ఞాని' అంటారు...

®️వేకువ జామునే '(బ్రహ్మ ముహూర్తంలో)' మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి.

®️'కావు కావు' అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు.. ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ 'కావు కావు' అని అందరికీ గుర్తు చేస్తూ 'బోధిస్తూ'.. అందరినీ తట్టి లేపేది కాకి.

®️ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న 'అన్ని కాకులకు' సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి.

®️శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి 'సంఘటితంగా పోరాటం' చేపట్టేవి కాకులు.

®️ఆడ కాకి - మగ కాకి కలవడం కూడా 'పరుల కంట' పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం.

®️ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికిచేరే మంచి ఆచరణ కాకులదే.

®️సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే.

®️అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా.

®️కాకులు లేని ప్రదేశం లేదు ఈ భువిపై. కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే 'కాకులు దూరని కారడవి' అంటారు.

®️కాకులు అరుస్తోంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు.

®️అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి.

®️సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు.

®️దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు.

®️భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు.

®️మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఉండే పక్షి కాకి.

®️ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు.!

®️కూజాలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి...!!

®️భారతీయుల సనాతన ధర్మం - విశిష్టత, ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే. సంఘజీవనం.., సేవాతత్పరత.., మంచి స్నేహభావాలతో., ఈర్ష్యా ద్వేషాలు లేకుండా., కలసి మెలసి అన్యోన్యంగా., అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో., నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము.
------------------------------
ఇది చదివాక, కాకి జీవనంలో ఇంత తాత్వికత, ఇంత లోతైన అర్థం ఉందా!!!!! అనిపించింది. వీలైనంతమందికి పంచితే మంచిదేమో !...
ఒక మిత్రుడు నన్ను అడిగాడు.... నేను సేకరించిన సమాచారం కొంతవరకు ఉపయోగపడుతుంది అని పోస్ట్ చేస్తున్నాను... సర్వేజనా సుఖినోభవంతు🙏🙏🙏

పలాసలో అంగరంగ వైభంగా ముగిసిన జామి ఎల్లమ్మ తల్లి జాతర. జాత‌ర విజ‌య‌వంతం అయ్యేందుకు స‌హ‌క‌రించిన భ‌క్తులకు, పోలీసుశాఖ వారి...
02/03/2023

పలాసలో అంగరంగ వైభంగా ముగిసిన జామి ఎల్లమ్మ తల్లి జాతర. జాత‌ర విజ‌య‌వంతం అయ్యేందుకు స‌హ‌క‌రించిన భ‌క్తులకు, పోలీసుశాఖ వారికి ప్రత్యేక కృత‌జ్ఞత‌లు. జాత‌ర‌ను బ్రహ్మండంగా నిర్వహించిన మంత్రి సీదిరి అప్పలరాజు గారికి, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు గారికి ధన్యవాదాలు.

26/02/2023

శ్రీకాకుళం జిల్లా బహడపల్లి గ్రామంలో ఎలుగుబంటి పిల్ల హాల్ చల్.

కిడ్నీ వ్యాధి ప్రాంతం అయిన పలాసలో ఇంటింటికి మంచి నీటి కుళాయిలను ఏర్పాటు చేసి ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్విత పరిష్కారం ...
17/02/2023

కిడ్నీ వ్యాధి ప్రాంతం అయిన పలాసలో ఇంటింటికి మంచి నీటి కుళాయిలను ఏర్పాటు చేసి ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్విత పరిష్కారం చూపుతున్న ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మంత్రి సీదిరి అప్పలరాజు గారికి పలాస నియోజకవర్గం ప్రజల తరపున ధన్యవాదాలు.
DrSeediri

పలాస నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలకు స్ట్రాంగ్  వార్నింగ్. పార్టీ నుండి తొలగించాలని మున్సిపల్ చైర్...
13/02/2023

పలాస నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్. పార్టీ నుండి తొలగించాలని మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన పార్టీ అధిష్టానానికి తీర్మాన లేఖ.

పలాస నియోజకవర్గం వైసీపీ అసమ్మతి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్. పార్టీ నుండి తొలగించాలని మున్సిపల్ చైర్మన్ బల్ల గ....

బ్యాడ్మింటన్ లో దూసుకుపోతున్న మన సిక్కోలు యువ కెరటం.   #మనశ్రీకాకుళం
02/01/2023

బ్యాడ్మింటన్ లో దూసుకుపోతున్న మన సిక్కోలు యువ కెరటం.
#మనశ్రీకాకుళం

ఇచ్చాపురం నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు,  వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శ్రీ పిరియా సాయిరాజ్ గారికి హృదయ...
22/12/2022

ఇచ్చాపురం నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శ్రీ పిరియా సాయిరాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#పిరియా_సాయిరాజ్ #మనశ్రీకాకుళం

15/12/2022



గౌరవనీయులైన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి పాద పద్మములకు నమస్కారం

మీరు ఆంధ్రుల అడపడుచుల అన్నగా అందరి అభిమానం పొందుతున్నారు. నేను శ్రీకాకుళం జిల్లా పలాస కి చెందిన డోకి జగదీష్ కుమార్తె కావ్యని నాకు పార్వతీపురం కి చెందిన శాంక మల్లిఖార్జున రావు కుమారుడు అవినాష్ తో వివాహం జరిగింది. కట్న కనుకలుగా 40 తులాల బంగారం,3 కేజీల వెండి ఇచ్చారు. తర్వాత అదనపు కట్నం కోసం నాకు నా భర్త,అత్త మామలు, ఆడపడుచులు తీవ్రంగా శారీరకంగా మానసికంగా వేధించారు. నా భర్త ఉద్యోగ రీత్యా దుబాయ్ వెళ్లిపోయాం. అక్కడ నా భర్త ప్రతి రోజు దెబ్బలు కొట్టేవాడు. చివరకు నా తండ్రి పలాస ఒక ఇంటి స్థలం అదనపు కట్నంగా ఇచ్చారు. నా తొలి గర్భం 3వ నెల ఉండగా నా పొట్ట మీద కాలు తో తన్నడంతో అబార్షన్ అయ్యింది. తరువాత నాకు 2వ సంతానం గా ఆడ పిల్ల పుట్టింది. ఆడ పిల్ల పుట్టినందుకు నన్ను తిరిగి దుబాయ్ తీసుకొని వెళ్లకుండా పలాస లో వదిలేసాడు. తర్వాత కూడా ఆడపిల్ల పుట్టినందుకు నాకు ఆత్మహత్య చేసుకోమని వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేక పోలీసు స్టేషన్ లో పిర్యాదు చెసాను. చివరకు పెద్ద మనుషుల సమక్షంలో రాజీ జరిగి నన్ను దుబాయ్ తీసుకొని వెళ్ళాడు. అక్కడ ప్రతి రోజు ఆత్మహత్య చేసుకోమని కొట్టేవాడు. చాలా సార్లు మా ఇద్దరికీ అర్ధరాత్రి ఇంటి బయట ఉంచి చాలసేపటి తర్వాత తలుపులు తీసేవాడు. ప్రతి రోజు చితక్కొట్టేవాడు. ఈ బాధలు పడలేక మా తల్లిదండ్రులు దుబాయ్ వచ్చి నన్ను పలాస తీసుకొని వెళ్లాలని వచ్చారు. ఇంతలో మా పాప మీద ట్రావెల్ బ్యాన్ పెట్టించి airport లో ఆపించాడు. నేను, నా పాప దుబాయి లో చిక్కుకు పోయాం. మా తల్లిదండ్రులు లను దుబాయ్ లో ఇంటికి రానివ్వకుండా అడ్డుకోవడంతో వారు వేరే చోట తల దాచుకొంటున్నారు. ప్రస్తుతం నన్ను,నా పాపని ఇంట్లో ఉంచి వేధిస్తూ,కొడుతూ, ఆత్మహత్య కి ప్రేరేపిస్తున్నాడు. దయచేసి జగన్ అన్న నన్ను,నా పాప ని ఇండియా కి రప్పించే సహాయం చెయ్యకపోతే వీడి చేతులలో మా ప్రాణాలు పోవచ్చు. నన్ను రక్షించు అన్న 🙏🙏🙏

ఎవరికైనా కనిపిస్తే దయచేసి ఆ కింద ఇచ్చిన ఫోన్ నెంబర్ కి తెలియజేయగలరు
15/12/2022

ఎవరికైనా కనిపిస్తే దయచేసి ఆ కింద ఇచ్చిన ఫోన్ నెంబర్ కి తెలియజేయగలరు

Address

Srikakulam
532222

Alerts

Be the first to know and let us send you an email when Mana Srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana Srikakulam:

Videos

Share


Other News & Media Websites in Srikakulam

Show All