28/03/2022
గురుకులాల్లో 5 వ తరగతికి అడ్మిషన్లు
- జిల్లా కన్వీనర్ జల్లు లక్ష్మణమూర్తి
శ్రీకాకుళం, మార్చి 28 : మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు మహాత్మా జ్యోతి బాపూలే విద్యాలయాల సంస్థ జిల్లా కన్వీనర్ జల్లు లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు.మహాత్మా జ్యోతిబాపూలే విద్యాలయాల సంస్థ జిల్లాలో నడుపుతున్న ఐదు బాలికల పాఠశాలలు అయినటువంటి టెక్కలి, శ్రీకాకుళం, పలాస, పాతపట్నం,ఆముదాలవలసలలోనూ మరియు బాలురు పాఠశాలలు అయిన అంపోలు, అక్కుపల్లి, నిమ్మాడ at కోటబొమ్మాలి, నరసన్నపేట వెరశి మొత్తం 9 పాఠశాలల్లో 2022-23 విద్యా సం.రంకు గాను ఇంగ్లీషు మీడియంలో అడ్మిషన్లు కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలల జిల్లా కన్వీనర్ ఆ ప్రకటనలో కోరారు. విద్యార్థులను కార్యదర్శుల వారి కార్యాలయంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కావున అర్హులైన విద్యార్థులు ఈ నెల 28 నుండి ఏప్రిల్ 27వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం http www.mjpapbcwr.in వెబ్ సైట్ ను పరిశీలించుకోవచ్చని ఆయన అన్నారు. ప్రవేశం కోసం OC/BC విద్యార్థులు 2011 సెప్టెంబర్ 9 నుండి 2013 ఆగస్టు 31మధ్య, SC/ST విద్యార్థులు అయితే 2009 సెప్టెంబర్ 9 నుండి 2013 ఆగస్ట్ 31 మధ్య జన్మించినవారై ఉండాలని తెలిపారు. సంబంధిత జిల్లాలో 2021-22 విద్యా సం.రంల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3-4 తరగతులు చదివి ఉండాలని,అభ్యర్థి తల్లి, తండ్రి లేదా సంరక్షుకుల సంవత్సరాదాయం (2022-23) లక్ష రూపాయలకు మించరాదని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో వివరించారు.
The Backward Classes Welfare Department, established a new Society MAHATMA JYOTIBA PHULE ANDHRA PRADESH BACKWARD CLASSES WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY (MJPAPBCWREIS) in the year 2012 with a view to bring the Backward Classes educationally on par with other developed communitie...