Begumpet.in

Begumpet.in Well come to Telangana News Portal Rasoolpura.com / Gangaputra.in / Telangana News Portal

06/12/2023
26/07/2023
రాష్ట్రంలో వి.ఆర్.ఏ, వీఏవో ల సర్దుబాటు, విలేజ్ సెక్రటరీల రెగ్యులరైజేషన్, సచివాలయంలో దేవస్థానం, మసీదు, చర్చ్ ల ప్రారంభోత్...
11/07/2023

రాష్ట్రంలో వి.ఆర్.ఏ, వీఏవో ల సర్దుబాటు, విలేజ్ సెక్రటరీల రెగ్యులరైజేషన్, సచివాలయంలో దేవస్థానం, మసీదు, చర్చ్ ల ప్రారంభోత్సవాల తేదీల ఖరారు, తదితర అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Chief Secretary Santhi Kumari said that the state has set up an anti narcotics bureau with a vision to make Telangana a ...
05/07/2023

Chief Secretary Santhi Kumari said that the state has set up an anti narcotics bureau with a vision to make Telangana a drug free state and to combat the menace of drug trafficking comprehensively. Presiding over the state level meeting of narco coordination centre today, she underlined the need for a coordinated effort of all the departments to evolve a proper line of action to reduce the usage of drugs in the best possible manner. She stressed the need for having a proper policy by the union government for deportation of foreigners who are over staying in the country. The enforcement agencies were asked to associate with the health, education and other departments to evolve a multi pronged strategy to curtail the drug menace.
During the meeting it was felt that monitoring of surface web and dark web was required. Focus should be on preventing abuse of psychotropic substances and diversion of precursor chemicals. It was also decided to increase monitoring of pharma production units and chemical laboratories. The health department informed that de-addiction and rehabilitation centres are working in all district hospitals. The education department was told to set up anti drug clubs in vulnerable colleges and take up awareness programmes on harmful effects of drugs.
NCB zonal director Aravindan gave a brief overview of the drug scenario in the country. He informed the meeting that during the year 2021, 2022, and 2023 the NCB Hyderabad had busted clandestine laboratories involving seizure of substantial quantity of Alprazolam. There have been instances where chemical experts have been hired for such illicit projects.
DGP Anjani Kumar, Commissioner of Police C V Anand, Rachakonda CP D S Chowhan, Principal Secretary Home Jitender, Principal Secretary Revenue Navin Mittal, Secretary Health Rizvi, Secretary school Education Karuna, Secretary SCD Rahul Bojja and other officials attended the meeting.

04/07/2023
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతనే ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పా...
01/07/2023

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతనే ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం అంబర్ పేట లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద జులై 16 వ తేదీన నిర్వహించే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి బోనాల ఉత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా బోనాలను ప్రజలు గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతో వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసిందని వివరించారు. దేశంలో ప్రైవేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఈ నెల 22 వ తేదీన గోల్కొండ లో బోనాలు ప్రారంభమైనాయని, వచ్చే నెల 9 వ తేదీన సికింద్రాబాద్ మహంకాళి బోనాలు నిర్వహించడం జరుగుతుందని, 16 వ తేదీన హైదరాబాద్ బోనాలు జరుగుతాయని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలకు వారం ముందే ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వచ్చే నెల 10, 11 తేదీలలో 16 వ తేదీన బోనాల ఉత్సవాలు నిర్వహించే ఆలయాలకు ఆర్ధిక సహాయం చెక్కులను అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎంతో గొప్పగా నిర్వహించే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో వైభవంగా బోనాలను నిర్వహించేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, ఆలయాల వద్ద భారికేడ్ లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. భక్తులు, వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాపిక్ పోలీసులు వాహనాలను దారిమళ్లించే విధంగా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయాల పరిసరాలలో, బోనాలను తీసుకొచ్చే రహదారులలో ఎక్కడా సీవరేజ్ లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులకు త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహంకాళి ఆలయం ముందున్న ప్రధాన రోడ్డు నిర్మాణం చేపట్టి భక్తులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆలయాల పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసేందుకు అదనంగా పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా పరిసరాలలో అవసరమైన చోట్ల అంతర్గత రహదారుల అభివృద్ధి పనులు కూడా చేపట్టాలని అన్నారు. అభివృద్ధి పనులను బోనాలకు ఉత్సవాల నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో MLA కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ లు పద్మ, విజయ్ కుమార్ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, DC వేణుగోపాల్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, కాచిగూడ ACP శ్రీనివాస్, GHMC EE రాజు, స్ట్రీట్ లైట్ EE సంతోష్, AMOH జ్యోతిబాయి, తహసిల్దార్ లలిత, వాటర్ వర్క్స్ GM రామకృష్ణ, ట్రాన్స్ కో ADE శ్రీనయ్య, కల్చరల్ డిపార్ట్మెంట్ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Police Department
01/07/2023

Police Department

పత్రికాప్రకటన 30.06.2023వచ్చే నెల 16 వ తేదీన బోనాల ఉత్సవాలు నిర్వహించే ఆలయాలకు జులై 10 వ తేదీన ప్రభుత్వం అందించే ఆర్ధిక ...
01/07/2023

పత్రికాప్రకటన
30.06.2023

వచ్చే నెల 16 వ తేదీన బోనాల ఉత్సవాలు నిర్వహించే ఆలయాలకు జులై 10 వ తేదీన ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం చెక్కులను అందజేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శుక్రవారం కార్వాన్ లోని శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద వచ్చే నెల 16 వ తేదీన నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బోనాల ఉత్సవాల సందర్బంగా వచ్చే భక్తులు, మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తొట్టెల ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు నిర్వహించే రహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని, దారి పొడవునా విద్యుత్ లైట్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్ ఫార్మర్ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. సున్నిత ప్రాంతాలలో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ పరిసరాలు, రహదారులపై ఎక్కడా సీవరేజ్ లీకేజీ లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీ సిల్టింగ్ ను తొలగించే వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసు, ట్రాపిక్, దేవాలయ కమిటీ ల సమన్వయంతో భారికేడ్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ఊరేగింపు నిర్వహించే ప్రాంతాలలో ట్రాపిక్ మళ్లింపు కు చర్యలు తీసుకోవాలని చెప్పారు. బోనాల ఉత్సవాల ఏర్పాట్ల విషయంలో అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దర్బార్ మైసమ్మ, సబ్జి మండి, జియాగూడ ప్రాంతాలలో బోనాల ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారని, ఇక్కడకు వచ్చే లక్షలాది మంది భక్తులకు దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు. సబ్జి మండి ఆలయానికి అమ్మవారి ఊరేగింపు కు ఏనుగును ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అదేవిధంగా దర్బార్ మైసమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తూ వస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా వైభవంగా బోనాల ఉత్సవాలను నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలను విడుదల చేసిందని అన్నారు. ఈ సంవత్సరం వారం రోజుల ముందుగానే ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా జులై 16 వ తేదీన బోనాల ఉత్సవాలు నిర్వహించే ఆలయాలకు 10 వ తేదీన ఆర్ధిక సహాయం చెక్కులను అందజేస్తామని తెలిపారు. ఇంకా దరఖాస్తు చేయని ఆలయాలకు చెందిన కమిటీ సభ్యులు వెంటనే దరఖాస్తులను అందజేయాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బోనాల ఉత్సవాలకు అరకొర ఏర్పాట్లు జరిగేవని, ఏర్పాట్లకు సంబంధించిన సమస్యలను ఎవరికి చెప్పాలో ప్రజలకు అర్ధంకాక ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలను గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామక్రిష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, సౌత్ వెస్ట్ జోన్ DCP కిరణ్ ఖేర్, ACP సతీష్, EE వెంకట శేషయ్య, టౌన్ ప్లానింగ్ ACP సయిదుద్దిన్, ట్రాన్స్ కో DE నెహ్రూ నాయక్, ADE గణేష్, అగ్నిమాపక శాఖ అధికారి దత్తు, SPHO డాక్టర్ మల్లేశ్వరి, దర్బార్ మైసమ్మ ఆలయ చైర్మన్ అమర్ సింగ్, నందకిషోర్, మాజీ కార్పొరేటర్ లు బంగారి ప్రకాష్, మిత్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Begumpet.in posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Begumpet.in:

Videos

Share