Rayachoti Media

Rayachoti Media రాయచోటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్నమయ్య జిల్లా హెడ్ క్వాటర్స్..

రాయఛోటి, రాయచోటి పట్టణానికి చుట్టుపట్ల గల పల్లెప్రజలు ఇప్పటికీ రాసీడు అనే పలుకుతారు. రాచవీడు అనే పేరు క్రమంగా రాయచోటిగా మారింది.రాయచోటి అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు జిల్లా ప్రధాన కార్యాలయం. రాయచోటి రెవెన్యూ డివిజన్‌. రాయచోటి మున్సిపాలిటీ. ఇది ఆంధ్రాలోని పురాతన పట్టణాలలో ఒకటి.

*బరువుతో కాదు...బాధ్యతతో హెల్మెట్ ధరించి...సురక్షితంగా మీ గమ్యాలను చేరుకొండి.....**మీ కుటుంబానికి మీరే రక్ష...హెల్మెట్ మ...
19/12/2024

*బరువుతో కాదు...బాధ్యతతో హెల్మెట్ ధరించి...సురక్షితంగా మీ గమ్యాలను చేరుకొండి.....*

*మీ కుటుంబానికి మీరే రక్ష...హెల్మెట్ మీకు రక్ష...*

*అర్బన్ సి ఐ చంద్ర శేఖర్,ట్రాఫిక్ సి ఐ విశ్వనాధ రెడ్డి*

*రాయచోటి పట్టణంలో హెల్మెట్ వాడకం పై అవగాహనా ర్యాలి*

స్క్రిప్ట్: హెల్మెట్ ను బరువుతో కాకుండా బాధ్యతతో దరించి సురక్షితంగా ప్రయనించాలని వాహనదరులను కోరారు ట్రాఫిక్ సి ఐ విశ్వనాధ రెడ్డి,అర్బన్ సి ఐ చంద్ర శేఖర్ లు.అన్నమయ్య జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు మేరకు రాయచోటి డివిజన్ డిఎస్పి కృష్ణ మోహన్ నేతృత్వంలో రాయచోటి పట్టణంలో హెల్మెట్ వాడకం పై బైక్ ర్యాలి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ర్యాలీని అర్బన్ సి ఐ చంద్ర శేఖర్ జెండా ఉపి ప్రారంబించారు.స్థానిక శివాలయం నుండి ఎస్ యాన్ కాలని,నేతాజీ కూడలి,బస్టాండ్ సర్కిల్ ,నాలుగు రోడ్ల సర్కిల్ మీదగా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలిని కొనసాగించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రోడ్డు ద్విచక్రవహనం నడిపే ప్రతి ఒక్కరు కుడా హెల్మెట్ వాడకాన్ని అలవాటు చేసుకోవాలన్నారు.లక్షలాది రూపాయలు వ్యయం చేసి బైక్ లు కొన్నవారు హెల్మెట్ వాడక పోవడం చాల బాధాకరం అన్నారు. మొబైల్ వాడకం పట్ల ఉండే ప్రాదాన్యత ,మన ప్రాణానికి ఎందుకు ఇవ్వలేక్ పోతున్నారని వారు ప్రశ్నించారు.ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలలో హెల్మెట్ లేక పోవడం వల్లనే అధికంగా మృత్యువాత పడుతున్నారని విచారాన్ని వ్యక్తం చేశారు.హెల్మెట్ లేని ప్రయాణం సురక్షితం కాదని తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని లేని యెడల పొలిసు చర్యలు తప్పవని కూడా ఈ సందర్బంగా వారు హెచ్చరించారు.ఈ ర్యాలిలో లయన్స్ క్లబ్ అఫ్ రాయచోటి టౌన్ సభ్యులు,శ్రీ సాయి ఇంజేనేరింగ్ కలశాల యాజమాన్యం,విద్యార్థులు ప్రజలు,పొలిసు సిబ్బంది పాల్గొన్నారు.

*ప్రశాంత వాతావరణంలో నీటి సంఘం ఎన్నికలు**ఏకగ్రీవంగా ఎన్నికైన నీటి సంఘం ఎన్నికల అభ్యర్థులు**రాయచోటి నియోజకవర్గం టిడిపి నాయ...
14/12/2024

*ప్రశాంత వాతావరణంలో నీటి సంఘం ఎన్నికలు*

*ఏకగ్రీవంగా ఎన్నికైన నీటి సంఘం ఎన్నికల అభ్యర్థులు*

*రాయచోటి నియోజకవర్గం టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు*

*గాలివీడు, డిసెంబర్ 14:-*

గాలివీడు మండలంలో నిర్వహించిన మూడు నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో శనివారం మూడు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికలలో గాలివీడు పెద్ద చెరువు నీటి సగం అధ్యక్షులుగా చెక్కా రామాంజనేయులు, ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.

ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా డిక్లరేషన్ ఫామ్ అందజేశారు.
ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గం టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.... శనివారం గాలివీడు మండలంలో జరిగిన నీటి సంఘం ఎన్నికలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు.
అన్నమయ్య జిల్లాలో జరిగే నీటి సంఘం ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
---------------/////--------------

*పందుల కోసం తీసిన విద్యుత్ వైర్లకు రైతుబలి....?**సుండుపల్లె న్యూస్*సుండుపల్లె మండల పరిధిలోని మాచిరెడ్డిగారిపల్లి గ్రామం ...
14/12/2024

*పందుల కోసం తీసిన విద్యుత్ వైర్లకు రైతుబలి....?*

*సుండుపల్లె న్యూస్*

సుండుపల్లె మండల పరిధిలోని మాచిరెడ్డిగారిపల్లి గ్రామం వావిలోడ్డుబిడికి సమీపంలో రెడ్డిచెరువు వద్ద పందుల కోసం పొలము చుట్టూ తీసిన విద్యుత్ వైర్లు రైతు మూడే వెంకటరమణ నాయక్(45)బలి తీసుకున్నాయి.గ్రామస్తుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే మాచిరెడ్డిగారిపల్లి గ్రామం వావిలొడ్డు బిడికి సమీపంలోని రెడ్డి చెరువు వద్ద చిన్నబిడికికి చెందిన అన్నమయ్య జిల్లా పారామెడికల్ అధికారి రవి నాయక్ కు సంబంధించిన పొలం ఉంది.ఆ పొలంలో వేరుశనగ పంటను సాగుచేసిన డాక్టర్ రవి నాయక్ అడవి పందులు కోసం పొలం చుట్టూ కరెంటు తీశాడు.ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయాల్సిన రవి నాయక్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విద్యుత్ వైర్లు పొలం చుట్టూ తీయడంతో ఈ విషయం తెలియని వావిలొడ్డు బిడికికి చెందిన మూడే వెంకటరమణ నాయక్ పించా నది నుండి కాలువలకు నీరు విడుదల చేయడంతో రెడ్డి చెరువులో రూ.4 లక్షల ఖర్చు చేసి చేప పిల్లలను వదిలి పెంచుకుంటున్న రైతు వెంకటరమణ నాయక్ కొత్తనీళ్లకు చెరువులో ఉన్న చేపలన్ని ప్రాజెక్టులోకి వెళ్ళిపోతాయన్న భయంతో ఆగమేగాలపైన పరిగెత్తుకుంటూ వెళ్లిన వెంకటరమణ నాయక్ అక్కడ మృత్యు రూపంలో ఉన్న విద్యుత్ వైర్లకు బలి అయ్యాడు.అయితే సంఘటన జరిగిన సమయంలో సమీపంలోనే పొలంలోనే ఉన్న పొలం యజమాని డాక్టర్ రవి నాయక్ ఏమీ తెలియనట్లుగా తాను ఊర్లో లేనట్లుగా నిరూపించుకోవడం కోసం ఆగమేఘాల పైన రాయచోటికి వెళ్లి తాను డ్యూటీలో ఉన్నట్లు తంబు వేసి గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గ్రామానికి సమీపంలో కులం వద్ద విద్యుత్ వైర్లు తీసే వ్యక్తి గ్రామంలోని పశువులు మనుషులు అక్కడ తిరుగుతుంటారు కాబట్టి సమాచారం ఇవ్వాల్సి ఉంది.ఒక చదువుకున్న వ్యక్తి అందులోనూ వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం పట్ల గ్రామస్తులు రవి నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విద్యుత్ వైర్లు తగిలి చనిపోయిన మూడే వెంకటరమణ నాయక్ కు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.కుటుంబ యజమాని విద్యుత్ వైర్లు తగిలి చనిపోవడంతో ఇక మాకు దిక్కెవరంటూ భార్యతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కాంట్రాక్టర్ మరియు YSRCP మైనారిటీ నాయకులు రియాజుర్ రహమాన్  గారికీ హృదయపూర్వక  #జన్మదిన...
11/12/2024

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కాంట్రాక్టర్ మరియు YSRCP మైనారిటీ నాయకులు రియాజుర్ రహమాన్ గారికీ హృదయపూర్వక #జన్మదిన_శుభాకాంక్షలు
మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో ఆయుర్ ఆరోగ్యాలతో, సుఖసంతోషాలతో, జరుపుకోవాలనీ మనస్పూర్తీగా కోరుకుంటున్నాను💐💐💐💐

05/12/2024

రాయచోటి కొత్తపేట రోడ్డులోని రైతు మిత్ర షాప్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు దుస్థితి వర్షం పడితే ఒక చెరువు లాగా తలపిస్తుంది కానీ రాయచోటి మున్సిపాలిటీ అధికారులు ఏమాత్రం కూడా దీనిపైన చర్యలు తీసుకోలేదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు పాఠశాల విద్యార్థులు ఉద్యోగులు పాదచారులు దుస్థితి అగమకోచరం కావున అధికారుల వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు

అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం.....స్వామియే..శరణం అయ్యప్ప శరణం అంటూ మర్మోగిన పురవిధులు....ఆకట్టుకున్న సాంస్కృ...
05/12/2024

అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం.....

స్వామియే..శరణం అయ్యప్ప శరణం అంటూ మర్మోగిన పురవిధులు....

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు....

ప్రత్యేక పూజలు గావించి గ్రామోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి నేత మడితాటి శ్రీనివాసులురెడ్డి, ప్రతిభ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ మానవతా సంస్థ చైర్మన్, ఆలయ పర్యవేక్షకులు అరమటి శివగంగి రెడ్డి, లైన్స్ క్లబ్ ఆప్ రాయచోటి టౌన్ వ్యవస్థాపకులు హరినాథ్ రెడ్డి లు...

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం శివాలయం చెక్ పోస్ట్ దగ్గర వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి స్వామి అమ్మవార్లకు ప్రతేక అలాంకరణ గావించి ప్రధానార్చకులు నటరాజస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు గావించారు.అదే విధంగా హర హర సుతునికి అభిషేకం నిర్వహించి పూజలు నిర్వహించారు.ప్రతి ఏటా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.అందులో భాగంగా శివ పార్వతుల తో పాటు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పుష్పాలంకరణతో గ్రామోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ గ్రామోత్సవ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు నటరాజస్వామి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి టిడిపి నేత మడితాటి శ్రీనివాసులురెడ్డి, ఆలయ పర్యవేక్షకులు అరమాటి శివగంగి రెడ్డి, తో పాటు లైన్స్ క్లబ్ ఆప్ రాయచోటి టౌన్ వ్యవస్థాపకులు హరినాథ్ రెడ్డి లు ప్రారంభించారు. స్వామివారిని దర్శించుకునేందుకు అయ్యప్ప స్వాములుతో పాటు మహిళా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని స్వామివారి దర్శించుకుని మోక్కులు చెల్లించుకున్నారు. ఈ గ్రామోత్సవం కార్యక్రమం శివాలయం నుండి ఎస్ఎన్ కాలనీ, నేతాజీ కూడలి , బస్టాండ్ మీదగా కొత్తపేట, మదనపల్లి రోడ్డు వరకు కొనసాగింది. అయ్యప్ప స్వామి గ్రామోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ సి ఐ విశ్వనాధ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా అరమాటి శివగంగ రెడ్డి మాట్లాడుతూ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవం ప్రతి ఏడాది డిసెంబర్ 5న నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం కూడా అదే రోజున అయ్యప్ప స్వాములతో కలిసి ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అయ్యప్ప స్వామికి ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని వేడుకుంటున్నట్లు వారు తెలిపారు. గ్రామోత్సవానంతరం స్వాములకు అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.

*రాయచోటి సబ్ పోస్టాఫీసులో పోస్టు కార్డులే లేవంటా!**పోస్టాఫీసు ఉద్యోగులకు పని వేళలు ఇక్కడ వర్తించవేమో!!**పొస్టల్ ఉన్నతాధి...
05/12/2024

*రాయచోటి సబ్ పోస్టాఫీసులో పోస్టు కార్డులే లేవంటా!*

*పోస్టాఫీసు ఉద్యోగులకు పని వేళలు ఇక్కడ వర్తించవేమో!!*

*పొస్టల్ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి*

*పోస్టాఫీసులో 4 రిజిస్టర్ పోస్టులకు రూ160 లు ఖర్చుచేస్తే సరిపోయేది, ఆదే కొరియర్ సర్వీస్ కు రూ280 లు ఖర్చైపోయింది*

*అన్ని జిల్లా కేంద్రాల్లోలాగే అన్నమయ్య జిల్లా కేంద్రం, రాయచోటిలో కూడా పని వేళలు పాటించాలి, అన్ని సేవలు అందించాలి*

*రాజంపేట పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాయచోటి ప్రజలకు న్యాయం చేయాలి*

*రాయచోటి లీగల్ సర్వీసెస్ కమిటీ మాజీ సభ్యులు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి విజ్ఞప్తి*

రాయచోటి (అన్నమయ్య జిల్లా)04-12-2024:-
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని బోగస్ నగర్ నందు ఉన్న సబ్ పోస్టాఫీసు లో రిజిస్టర్ పోస్టు విత్ అక్నలాడ్జమెంట్ చేద్దామంటే ఆ కార్డులే కాదు, పోస్టు కార్డులు కూడా లేవంటా అని రాయచోటి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మాజీ సభ్యులు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి బుధవారం ఒక ప్రకటన ద్వారా ఆవేధన వ్యక్తం చేశారు.
*రాయచోటి సబ్ పోస్టాఫీసులో
ఉద్యోగులకు పని వేళలు ఇక్కడ వర్తించవన్నట్లు వ్యవహరిస్తూన్నారని, సమయపాలన పాటించడం లేదని విచారం వ్యక్తం చేశారు.ఈ చిన్న విషయాల్లో ఇంత నిర్లక్ష్యం ఉంటే, ఇంకా పెద్ద విషయాల్లో ఎలా ఉంటారో తెలుసు కోవడానికి,ఇక్కడ పరిస్థితులపై పొస్టల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి నిశితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ రోజు అదే పోస్టాఫీసులో 4 రిజిస్టర్ పోస్టు విత్ అక్నలాడ్జమెంట్ కార్డు పోస్ట్ చేయడానికి రూ160 లు మాత్రమే ఖర్చు చేస్తే సరిపోయేదానికి, అత్యవసరమైనందునకొరియర్ సర్వీస్ కు అశ్రయించడంతో రూ280లు ఖర్చయైందని, పోస్టాఫీసు సిబ్బంది కారణం మరో రూ120 లు ఆదనపు బారం మోయాల్సి వచ్చిందని బాధను వ్యక్తం చేశారు.
దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోలాగే అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కూడా పని వేళలు పాటించాలని అన్ని రకాల సేవలు అందించాలని ఆయన కోరారు.అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాయచోటి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

🌧️🌧️ 🚨🚨🚨🚨🚨🚨🚨 *URGENT MESSAGE*  🌧️🌧️ఈరోజు (03.12.2024) మధ్యాహ్నం పైన పించా డ్యాం నుండి సుమారు 1500 క్యూసెక్కుల నీటిని దిగ...
03/12/2024

🌧️🌧️ 🚨🚨🚨🚨🚨🚨🚨 *URGENT MESSAGE* 🌧️🌧️

ఈరోజు (03.12.2024) మధ్యాహ్నం పైన పించా డ్యాం నుండి సుమారు 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది

కావున దిగువ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలపడం జరిగింది

30/11/2024
సంబేపల్లి మండలమ దూద్యాల గ్రామము లోని శ్రీ శ్రీ శ్రీ కొత్తపురమ్మ దేవాలయ నిర్మాణంమునకు పెద్ద కొడివాండ్ల పల్లి చెందిన  s v ...
24/11/2024

సంబేపల్లి మండలమ దూద్యాల గ్రామము లోని శ్రీ శ్రీ శ్రీ కొత్తపురమ్మ దేవాలయ నిర్మాణంమునకు పెద్ద కొడివాండ్ల పల్లి చెందిన s v రమణయ్య గుడికి 5116/- చందా ఇచ్చారు

జిల్లా రవాణా అధికారి, రాయచోటి ఆదేశాల మేరకు 21.11.2024న రాయచోటిలోని చిత్తూరు రోడ్డులోని డిగ్రీ కళాశాలలో కళాశాల విద్యార్థు...
21/11/2024

జిల్లా రవాణా అధికారి, రాయచోటి ఆదేశాల మేరకు 21.11.2024న రాయచోటిలోని చిత్తూరు రోడ్డులోని డిగ్రీ కళాశాలలో కళాశాల విద్యార్థులు మరియు సిబ్బందికి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి. హర్షలత మరియు ఉపన్యాసకులు శ్రీ. గుర్రప్ప, శ్రీ. కిరణ్‌కుమార్‌ హాజరయ్యారు. శ్రీ.బి.సుబ్బరాయుడు, మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్, శ్రీ.ఎం.అజయ్ కుమార్, అసిస్టెంట్ మోటారు వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ మరియు ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు.

డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ప్రాముఖ్యత, డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానం, భద్రత డ్రైవింగ్ నైపుణ్యాలు, రోడ్ల రకాలు, రోడ్ సిగ్నల్స్, హైవేస్‌లో డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్ సిగ్నేజ్‌ల వాడకం, హెల్మెట్ వాడకం, సీటు బెల్ట్ ధరించడం మరియు మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలు, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్ ప్యాసింజర్లు, డ్రంకెన్ డ్రైవింగ్ వంటి వాటిపై డిగ్రీ కళాశాల విద్యార్థులకు సవివరంగా వివరించారు. రోడ్ సేఫ్టీ ఫాంప్లేట్‌లు పాల్గొనే వారందరికీ పంపిణీ చేయబడతాయి.

విజయవాడ.(21-11-2024). *రాయచోటి లో NCC  unit  ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి..మంత్రి రాంప్రసాద్ రెడ్డి*  *యువతలో నైప...
21/11/2024

విజయవాడ.
(21-11-2024).

*రాయచోటి లో NCC unit ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి..మంత్రి రాంప్రసాద్ రెడ్డి*

*యువతలో నైపుణ్యం పెండచానికి NCC తోడ్పడుతుంది.*

*రాయలసీమలో NCC వృద్ధి కోసం కావలసిన విభాగపరమైన సహాయ సహకారం అందిస్తాము.*

*రాష్ట్ర రవాణా యువజన క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కాకినాడ బెటాలియన్ NCC అధికారులు సమావేశం*

*విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారితో కల్నల్ మోహన్ అగర్వాల్,
లెఫ్టినెంట్ కల్నల్ అనిల్ కుమార్ మెహ్రా సమావేశమయ్యారు.*

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం తిరుపతి నాయుడు కాలనీలో అంబలం పూజకు ముస్తమవుతున్న అయ్యప్ప స్వామి మందిరాలు రాయచోటి ప్రాంతంల...
20/11/2024

అన్నమయ్య జిల్లా

రాయచోటి పట్టణం తిరుపతి నాయుడు కాలనీలో అంబలం పూజకు ముస్తమవుతున్న అయ్యప్ప స్వామి మందిరాలు రాయచోటి ప్రాంతంలో ఉన్న అయ్యప్ప స్వాములు అందరూ సాయంకాలం ఏడు గంటలకు పడిపూజకు హాజరుకావాలని కోరారు. అశోక్ కుమార్ నాయుడు స్వామి, తిరుపతి నాయుడు కాలనీ, రాయచోటి.

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దూద్యాల లో వేసిన శ్రీ కొత్తపురమ్మ తల్లి దేవాలయమునకు నూతన గుడి   నిర్మాణం జరుగుతున్నది.. ...
20/11/2024

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దూద్యాల లో వేసిన శ్రీ కొత్తపురమ్మ తల్లి దేవాలయమునకు నూతన గుడి నిర్మాణం జరుగుతున్నది.. దాతలు ఎవరైనా ఇంటే గుడి నిర్మాణములో పాల్గొన్నాగలరు...మరిన్ని వివరాలకు సంప్రదిచండి ఫోన్ నెంబర్ :9177701297

శ్రీ శ్రీ శ్రీ కొత్తపురమ్మ తల్లి ఆలయం పునః నిర్మాణము..

ఈ గుడి సుమారు 400 సంవత్సరాల పూర్వం చోళుల కాలంలో వెలిసిందని పూర్వీకులు చెప్పేవారు. గ్రామ ప్రజల సహకారంతో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు మరియు తిరునాళ్ళ ఆచారం కొనసాగిస్తూ వచ్చారు.

ఆకాలంలో గ్రామస్తులు మరియు అమ్మవారి భక్తులు శ్రీ శ్రీ శ్రీ కొత్తపురమ్మ ను కోరిన కోర్కెలు తీర్చేతల్లిగా పూజించేవారు. పిల్లలు పుట్టని వారు మరియు జబ్బున పడ్డ రోగ గ్రస్తులు అమ్మవారి బండారు పెట్టుకుంటే నయమవుతుందని నమ్మేవారు. అంతేకాదు ముఖ్యముగా అమ్మ గుడిని తొమ్మిది మార్లు ప్రదక్షిణ చేసి మనసులోని కోరికలు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరాయని శ్రీ శ్రీ శ్రీ కొత్త పురమ్మను తల్లిని నమ్మికొలిచిన వారు ఎంతోమంది చెప్పిన వాస్తవాలు. ఈ అమ్మవారి తిరునాళ్ళు రాయచోటి తాలూకాలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. అమ్మవారి తిరునాళ్ళకు రాయచోటి నుంచే కాక ఇతర ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేవారు.

ఇంత ప్రాశస్త్యం గల గుడి కాల క్రమేనా శిథిలావస్థకు చేరుకుంటూవున్నది. అందువలన అమ్మవారిభక్తులు మరియు గ్రామ ప్రజలు నూతనంగా గుడిని నిర్మించాలని కోరుకుంటున్నారు. కొత్తగా నిర్మించే ఈ శ్రీ శ్రీ శ్రీ కొత్త పురమ్మ గుడిలో భాగస్వాములు అయ్యే భాగ్యం దొరికింది, విరాళాలు, చందాలు రూపంలో చెల్లించి గుడి నిర్మాణానికి అందరు సహకరించి మనమంతా అమ్మవారి ఆశీర్వాదానికి పాత్రులమవుదాము.

ఇట్లు ఆలయ నిర్మాణ కమిటీ.

ఆలయ బ్యాంక్ వివరాలు:

Name :SRI KOTHAPURAMMA DEVI TEMPLE COMMITTEE

ఖాతా నెం: 110169525833

బ్రాంచ్ సిబ్యాలా, కెనరా బ్యాంక్

IFSC కోడ్: CNRB0013214

Address

Kothapeta Main Road , Rayachoty
Rayachoti
516269

Alerts

Be the first to know and let us send you an email when Rayachoti Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rayachoti Media:

Videos

Share

Category