04/02/2024
1థెస్సలొనికయులకు 5:23
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.
1థెస్సలొనికయులకు 5:24
మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.
📌1.విశ్వాసం ,ప్రేమ, నిరీక్షణ
(1థెస్సలొనికయులకు5:1-9)
*1.విశ్వాసం*
➡️1థెస్సలొనికయులకు 5:8
మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.
📎విశ్వాసం కానిది పాపం ,క్రియలు లేని విశ్వాసం మృతం.
1థెస్సలొనికయులకు 5:9
ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.
📎ప్రభు రాకడ సమీపించే లోపు మనలో *విశ్వాసంను* పెంపొందించుకోవాలి.
➡️లూకా 18:7
దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?
లూకా 18:8
ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని(లేక ఆలస్యము చేయుచున్నాడు) మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద(ఆ విశ్వాసము) విశ్వాసము కనుగొనునా?
*2.ప్రేమ*
➡️మత్తయి 24:12
అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.
📎అంత్య దినములలో ప్రేమ ఏమి ఉండదు.
📎🤳ఫోన్ వల్ల కుంటుంబాలు మధ్య ప్రేమలు ఉండటం లేదు .సెల్ ఫోన్ తోనే టైం సరిపోతుంది..
3.*నిరీక్షణ*
📎ప్రభు రాకడ కోసం నిరీక్షణ తో వేచి చూడాలి.
📌2. *మీకుపైవారైయుండి(సేవకులకు) మీకు బుద్ధిచెప్పువారికి లోబడి ఉండాలి.*
➡️1థెస్సలొనికయులకు 5:12
మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధిచెప్పువారిని మన్ననచేసి
➡️1థెస్సలొనికయులకు 5:13
వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి.
➡️మార్కు 6:1
ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి.
మార్కు 6:2
విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడిఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతులవలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి?
మార్కు 6:3
ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతోనున్నారు కారా? అని చెప్పు కొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.
మార్కు 6:4
అందుకు యేసుప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్పమరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను.
మార్కు 6:5
అందువలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను.
మార్కు 6:6
ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను.
➡️1థెస్సలొనికయులకు 5:14
సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.
📎అందరితో సమాధానం 🤝కలిగి ఉండాలి.
📌3.*శుద్ధీకరణ*
➡️1థెస్సలొనికయులకు 5:15
ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి(మేలైన దానిని వెంటాడుడి).
➡️1థెస్సలొనికయులకు 5:23
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.
➡️లూకా 21:11
అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచనలును పుట్టును.
ప్రభు రాకడ సమీపంలో ఉంది కాబట్టి ఎవ్వరికి కీడు చెయ్యకూడదు.
📌4. *ఎల్లప్పుడు.*
📎1.సంతోషంగా ఉండాలి
2.ప్రార్థనచేయుడి
3.కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
➡️1థెస్సలొనికయులకు 5:16
ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;
1థెస్సలొనికయులకు 5:17
యెడతెగక ప్రార్థనచేయుడి;
1థెస్సలొనికయులకు 5:18
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
5.📌 *పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి*
➡️1థెస్సలొనికయులకు 5:19
ఆత్మను ఆర్పకుడి.
1థెస్సలొనికయులకు 5:23
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.
📎ప్రతి సమయంలో పరిశుద్ధాత్మ స్వరని వినాలి.
➡️ఆదికాండము 22:1
ఆఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రా హామా, అని పిలువగా అతడుచిత్తము ప్రభువా అనెను.
ఆదికాండము 22:2
అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను.
➡️ఆదికాండము 22:10-12
📎ఆత్మ నడిపింపు వుండాలి.
📌 *6.సేవకుల కొరకు ప్రార్ధన చెయ్యాలి.*
➡️1థెస్సలొనికయులకు 5:25
సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.
1థెస్సలొనికయులకు 5:26
పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
1థెస్సలొనికయులకు 5:27
సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను.
➡️ఎఫెసీయులకు 6:20
దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
📎సేవకులందరికి కోసం ప్రార్ధన చెయ్యాలి.
➡️మత్తయి 26:31
అప్పుడు యేసు వారిని చూచిఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగాగొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా.
➡️లూకా 22:32
నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.
➡️కీర్తనలు 37:24
యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.
➡️సామెతలు 24:16
నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.
📌7. *కృప*
1థెస్సలొనికయులకు 5:28
➡️మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.
➡️2తిమోతికి 2:1
నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.....
Feb 4.
sunday worship message.
John wesley anna
Hosanna mandhir.rjy